కేంద్ర మంత్రి శ్రీనివాస్‌వర్మతో కరచాలనం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ఢిల్లీలో పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్, శ్రావ్య దంపతుల కుమారుడు శివాన్ బారసాల వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారిని ఆశీర్వదించారు. సీఎం వెంట కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి, కేంద్ర పథకాల సమన్వయకర్త గౌరవ్ ఉప్పల్ తదితరులు ఉన్నారు.
కాగా, డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం శనివారం ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్.. తన రెండు రోజుల పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వెళ్లారు. కేంద్రమంత్రి నివాసంలో జరిగిన బారసాల వేడుకకు కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి శ్రీనివాస వర్మ, ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు హాజరై శివాన్‌ను ఆశీర్వదించారు.


