హైదరాబాద్: పబ్‌లకు వచ్చే ఒంటరి యువతులను వలలో వేసుకుని మోసగిస్తున్న నిందితుడిని ఫిలింనగర్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. శంషాబాద్‌లోని సదమ్ మెగా టౌన్‌షిప్‌లో నివసించే రియల్ ఎస్టేట్ వ్యాపారి కంభంబెట్టు రాణాప్రతాప్‌రెడ్డి.. పబ్‌లకు అలవాటుపడి డబ్బుల కోసం యువతులను టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాడు. ఇటీవల అమెరికా నుంచి వచ్చిన ఓ యువతి తాను సంపాదించుకున్న డబ్బులతో హైదరాబాద్‌లో వ్యాపారం పెట్టుకోవడానికి సిద్ధమవుతున్న సమయంలో రాణాప్రతాప్‌రెడ్డి పరిచయమయ్యాడు.
మాయ మాటలతో ఆమెను నమ్మించాడు. వ్యాపారంలో పెట్టుబడి పెడితే లాభాలు ఇప్పిస్తానని రూ.75 లక్షలు తీసుకున్నాడు. ప్రేమిస్తున్నట్టు నటించాడు. పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశాడు. ఏడాది పాటు ఆమెతో కలిసి తిరిగాడు. ఈ నేపథ్యంలో రాణాప్రతాప్ అసలు స్వరూపం బాధిత యువతికి తెలియడంతో అతడిని నిలదీసింది. దీంతో నిందితుడు రాణాప్రతాప్ తన అసలు స్వరూపం చూపించాడు.
పెళ్లికి నిరాకరించాడు. తీసుకున్న డబ్బులు ఇచ్చేది లేదంటూ తేల్చిచెప్పాడు. దీంతో బాధితురాలు ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇప్పటికే నిందితుడు చాలామంది యువతులకు వల వేసి ప్రేమ పేరుతో లోబర్చుకుని పబ్‌ల్లో, క్లబ్‌ల్లో తన కోరికలు తీర్చుకుంటూ వారిని బ్లాక్‌మెయిల్ చేస్తూ లక్షలాది రూపాయలు దండుకున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


