breaking news
real estate businessman
-
హత్య చేసినా రిమాండ్ లేదు!
సోషల్ మీడియాలో పోస్టులపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి 41 ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకుని విడిచిపెట్టాలి..! ఇదీ చట్టం! కానీ.. సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వారిని అక్రమంగా అరెస్టు చేస్తూ ఏకంగా వ్యవస్థీకృత నేరాల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించి జైలు పాలు చేస్తున్నారు. హక్కుల ఉల్లంఘనపై ప్రశ్నిస్తే.. చంద్రబాబు రెడ్‌బుక్ పాలనలో అంతే అంటున్నారు!! హత్యలకు పాల్పడే నిందితులను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరు పరచి రిమాండ్‌కు తరలించాలి.. ఇదీ చట్టం...! ఓ వ్యక్తిని కుట్రపూరితంగా హతమార్చి నేరాన్ని అంగీకరించిన నిందితులను మన రాష్ట్ర పోలీసులు 41 ఏ నోటీసు ఇచ్చి సాగనంపడం విస్మయం కలిగిస్తోంది. దేశ పోలీసు చరిత్రలో ఎక్కడాలేనిరీతిలో అన్నమయ్య జిల్లా పోలీసులు వ్యవహరించిన తీరు ఇదిగో ఇలా ఉంది..!! హత్య చేశారని వెల్లడించిందీ ఎస్పీనే... నిందితులను రిమాండ్‌కు పంపకుండా విడిచిపెట్టారు - సాక్షి, అమరావతిఅన్నమయ్య జిల్లా మదనపల్లెలో రియల్ ఎస్టేట్ వ్యాపారి గంగాధరను ఆయన భార్య వనితతోపాటు కేవీ పల్లె మండలానికి చెందిన సోదంరెడ్డి రాము, మదనపల్లెకు చెందిన ఆటోడ్రైవర్ గంజి మహేశ్‌బాబు కలసి మట్టుబెట్టారు. కుప్పం డిప్యూటీ డీఎంహెచ్‌వో గంగాదేవి వీరికి సహకరించారు. ఆమె ఇచ్చిన మత్తు మాత్రలను నీటిలో కలిపి తాగించడంతో మత్తులోకి జారుకున్న గంగాధర్‌ను నిందితులు బండ రాళ్లతో మోది అంతమొందించారు. గంగాదేవి పరీక్షించి మరీ ఆయన చనిపోయినట్లు నిర్ధారించారు. వ్యక్తిగత కారణాలతో ఈ హత్యకు పాల్పడినట్లు అన్నమయ్య జిల్లా పోలీసుల దర్యాప్తులో తేలడంతో మొత్తం నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఈ కేసులో వనిత, రెడ్డి రాము, గంజి మహేశ్ బాబులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రకటించారు. ముగ్గురు నిందితులను మాత్రమే మీడియా సమావేశంలో హాజరు పరిచారు. కుప్పం డిప్యూటీ డీఎంహెచ్‌వోను అరెస్టు చేసినట్లు చెప్పకపోవటంపై పోలీసు వర్గాల్లోనే తీవ్ర విస్మయం వ్యక్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో ఆమె డిప్యూటీ డీఎంహెచ్‌వో కావడంతో ఉన్నతస్థాయి నుంచి ఒత్తిళ్లు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.పోనీ.. అరెస్టు చేసినట్టు వెల్లడించిన ముగ్గురు నిందితులనైనా నిబంధనల ప్రకారం న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండ్‌కు తరలించాలి. ఏమైందో తెలియదు కానీ.. అరెస్టు చేసినట్లు ప్రకటించిన వనిత, రెడ్డి రాము, గంజి మహేశ్‌బాబుకు పోలీసులు 41 ఏ నోటీసులు ఇచ్చి వదిలేయడంతో ముగ్గురూ దర్జాగా బయటకు వచ్చేశారు. ఈ ఘాతుకానికి సహకరించిన కుప్పం డిప్యూటీ డీఎంహెచ్‌వో గంగాదేవిని అసలు అరెస్టు చేయకుండానే అంతకుముందే పోలీసులు విడిచిపెట్టారు. ఈ వ్యవహారం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. హత్య కేసులో నిందితులను రిమాండ్‌కు పంపకుండా పోలీసులు ఎలా విడిచిపెట్టారన్నది మిస్టరీగా మారింది. దీనిపై మదనపల్లి పోలీసు అధికారులను సంప్రదించగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు వదిలేసినట్లు వెల్లడించారు. హతుడికి ఎంతటి తీవ్రమైన నేర చరిత్ర ఉన్నా నిందితులను నిబంధనల ప్రకారం న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండ్‌కు తర లించాలి. న్యాయస్థానం తీర్పే అంతిమం. దీనికి విరుద్ధంగా అన్నమ య్య జిల్లా ఎస్పీ వ్యవహరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సోషల్ మీడియా కార్యకర్తలపై జులుం.. మరోవైపు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తూ రిమాండ్‌కు తరలిస్తుండటం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ అక్రమ అరెస్టులపై ఇటీవల హైకోర్టు తీవ్రంగా స్పందించింది. సోషల్ మీడియా పోస్టులు, మీడియా, కళాత్మక భావ వ్యక్తీకరణలపై నిబంధనలకు విరుద్ధంగా అరెస్టులు చేయవద్దని, రిమాండ్‌కు పంపవద్దని హైకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. వీటిని సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించడం గమనార్హం. తాము యథేచ్ఛగా హక్కులను కాలరాస్తున్నా.. అణచివేస్తున్నా అడ్డు చెప్పకూడదనే రీతిలో చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తోంది.ఐఏఎస్ ‘పచ్చ’పాతం!ఓ ప్రైవేట్ భవనం నీలి రంగు డిజైన్‌ను తొలగించాలని సీనియర్ ఐఏఎస్ హుకుం శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆయనో సీనియర్ ఐఏఎస్ అధికారి. తమ జిల్లా టీడీపీలో క్రియాశీలంగా ఉన్న కుటుంబానికి చెందిన ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక స్థానంలో ఉన్నారు. తాడేపల్లిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటున్నారు. ఆ అపార్టుమెంట్‌ను ఆనుకునే ఓ ప్రైవేటు భవనం ఉంది. దాని యజమాని తన భవనానికి ఫ్రంట్ ఎలివేషన్ చేయించారు. అందులో తమ బిల్డింగ్‌కు ‘వీ స్వే్కర్’ అనే లోగోను అందంగా డిజైన్ చేయించి నీలిరంగు పెయింటింగ్ వేయించారు. అదే ఆ సీనియర్ ఐఏఎస్‌కు కంటగింపుగా మారింది. తాను ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు పక్కన బిల్డింగ్‌పై నీలి రంగులో ‘వీ స్వే్కర్ ’ అనే పేరు కనిపించడం చూసి తట్టుకోలేకపోతున్నానని చెప్పారు. నీలి రంగులో ఉన్న ఆ లోగోను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఈమేరకు మున్సిపల్ అధికారుల ద్వారా ఆ బిల్డింగ్ యజమానికి హుకుం జారీ చేశారు. ఓ ప్రైవేటు వ్యక్తి తన సొంత భవనానికి తన అభిరుచికి తగ్గట్టుగా రూపొందించిన లోగోను, తనకు నచ్చిన రంగుల్లో డిజైన్ చేయించుకుంటే సీనియర్ ఐఏఎస్ అధికారి దాన్ని తొలగించాలని ఆదేశించడం ఏమిటన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. -
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫ్యామిలీ సూసైడ్.. పాపం మానసిక క్షోభ ఏపాటిదో చావులోనే!
కుటుంబంతో సహా బలవన్మరణానికి ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎంతో మానసిక క్షోభకు గురైనట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్‌కు చెందిన సూర్యప్రకాష్ నగరంలోని ఓ ప్రముఖ హోటల్ గదిలో భార్య, ఇద్దరు పిల్లలకు కేక్‌లో విషం పెట్టి తనూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు మరణించారని నిర్ధారణ చేసుకున్న తర్వాతే.. మృతదేహాలను బెడ్‌పై పడుకోబెట్టాడు. పిల్లల ముక్కులో నుంచి రక్తం కారకుండా దూది పెట్టాడు. భార్య మృతదేహంపై దుప్పటి కప్పాడు. ఈ స్థితిలో సూర్యప్రకాష్ ఎంతటి మానసిక వేదనకు గురయ్యాడో అంటూ అక్కడి వారు కంటనీరు తెచ్చుకున్నారు. నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ గదిలో నలుగురు కుటుంబ సభ్యుల బలవన్మరణం స్థానికంగా కలకలం రేపింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పార్ట్నర్ల మధ్య గొడవతో తీవ్ర వేధింపులు, దాడులకు గురైన ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సూర్యప్రకాష్ (37), భార్య అక్షయ (36), కూతురు ప్రత్యూష (13) కొడుకు అద్వైత్ (10) లకు విషమిచ్చి తనూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూర్యప్రకాష్ కుటుంబం బతుకుదెరువు కోసం 40 ఏళ్ల క్రితం నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లింది. అక్కడే ఐరన్హార్డ్వేర్ షాపు, పెట్రోల్ బంక్ నిర్వహించారు. ఆరేళ్ల క్రితం పెట్రోల్ బంక్‌ను అమ్మేసి హైదరాబాద్‌కు మకాం మార్చారు. హైదరాబాద్‌లో నలుగురు పార్ట్‌నర్స్‌తో కలిసి సూర్యప్రకాష్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారంలో పార్ట్‌నర్స్‌తో విభేదాలు వచ్చి గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సూర్యప్రకాష్ ఇంటికి వెళ్లి ప్రత్యర్థులు దాడులు చేశారు. దీంతో పదిహేడు రోజుల క్రితం సూర్యప్రకాష్ కుటుంబ సభ్యులతో నిజామాబాద్ వచ్చి ప్రముఖ హోటల్ లో ఉంటున్నారు. హోటల్ సిబ్బంది శనివారం మధ్యాహ్నం తలుపులు తట్టగా స్పందించకపోవడంతో నిద్రపోయారని భావించారు. రాత్రి వేళ సిబ్బంది రూమ్‌కు వెళ్లగా గడియ వేసుకుని ఉండటంతో అటువైపు వెళ్లలేదు. ఆదివారం ఉదయం కూడా రూం క్లీనింగ్ కోసం డోర్ తట్టడంతో ఎంతకూ లోపలున్నవారు స్పందించకపోవడంతో అనుమానం వచ్చి హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చి బలవంతంగా తలుపులు తెరిపించారు. గదిలో లోపల సూర్యప్రకాష్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా, అయన భార్య, ఇద్దరు పిల్లలు బెడ్‌పై విగత జీవులుగా కనిపించారు. సూర్యప్రకాష్ కుటుంబ సభ్యులకు ముందుగా కేక్‌లో విషం కలిపి తినిపించి, వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత ఉరివేసుకున్నట్లు గదిలో దొరికిన ఆనవాళ్లను బట్టి పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాల నుంచి రక్తం కారడంతో పిల్లల ముక్కుల్లో దూది పెట్టాడు. భార్య మృత దేహంపై దుప్పటి కప్పాడు. కుటుంబ సభ్యుల మృతదేహాలను సక్రమంగా బెడ్‌పైన పడుకోబెట్టిన సూర్యప్రకాష్ భార్య చున్నితో ఉరివేసుకున్నాడు. గదిలో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వా«దీ నం చేసుకున్నారు. సూసైడ్ నోట్లో ఏముంది..? బాధిత కుటుంబం రాసిన మరణ వాంగ్మూలంలోని వివరాలు తెలియాల్సి ఉంది. రియల్ ఎస్టేట్ పార్ట్ట్‌నర్స్ బాధితుల ఇంటిపైకి వెళ్లి దాడి చేసినట్లు లేఖలో ఉన్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. అందులో కిరణ్ కుమార్, వెంకట్ అనే ఇద్దరు మోసం చేశారని, తన చావుకు వారే కారణమని రాసినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు కనాయం చక్రవర్తి, జెనం చక్రవర్తి పేర్లు కూడా çసూసైడ్ నోట్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చిన ఆర్థిక నష్టంతో పాటు, భాగస్వాములుగా ఉన్నవారు మోసం చేయడంతోనే సూర్యప్రకాష్ కుటుంబం బలవన్మరణం చెందినట్లు తెలుస్తోంది. పోలీసులు క్లూస్ టీంతో ఆనవాళ్లు సేకరించారు. నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. రియల్ ఎస్టేట్ పార్ట్నర్స్ వేధించారు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన సూర్యప్రకాష్ కు టుంబం ఆత్మహత్య చేసుకుంది. వారి వద్ద నుంచి సూసైడ్ నోట్ స్వా«దీనం చేసుకున్నాం. పార్ట్నర్స్ వే ధింపులకు పాల్పడడంతో ఆత్మహత్య చేసుకున్నా రు. కేసు నమోదు చేశాం. దీనిపై విచారణ చేస్తాం. – వెంకటేశ్వర్లు, నిజామాబాద్ ఏసీపీ -
రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్
సాక్షి, హైదరాబాద్ : వనస్థలిపురం చైతన్య నగర్లో ఓ వ్యక్తి కిడ్నాప్ కలకలం రేగింది. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి అంతయ్య(68) అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేశారు. దీనికి రియల్ ఎస్టేట్ వ్యాపార వ్యవహారాలే కారణమని అనుమానిస్తున్నారు. అతడి బంధువులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈయన దేవరకొండ సర్పంచ్‌గా కూడా పనిచేశారు. -
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య
మిర్యాలగూడ (నల్గొండ జిల్లా): మిర్యాలగూడ పట్టణంలోని ఓ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణానికి చెందిన మారం శ్రీనివాస్(45) అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. భార్యాబిడ్డలతో కలిసి హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు. రియల్ ఎస్టేట్‌లో నష్టాలు రావడంతో అప్పులపాలై బలవన్మరణానికి పాల్పడ్డాడు. మిర్యాలగూడ పట్టణంలోని జీవీ ఆసుపత్రి వద్ద విషం తాగి కారులోనే ఉండి లాక్ చేసుకున్నాడు. శ్రీనివాస్ అపస్మారకస్థితిలో ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిజామాబాద్‌లో భారీ చోరీ
నిజామాబాద్ : నిజామాబాద్ నగరం న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలోని వినాయకనగర్‌లో గురువారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. రియల్ఎస్టేట్ వ్యాపారి తుకారం ఇంటి వెనుక గది కిటికీ చువ్వలు తొలగించి దుండగులు ఇంట్లోకి జొరబడ్డారు. అనంతరం బీరువాలో ఉంచిన రూ.1,50 లక్షల నగదు, 8 తులాల బంగారు నగలు, రెండు కిలోల వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. ఆ విషయాన్ని గురువారం ఉదయం తుకారాం గమనించి... నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీమ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చోరీ జరిగిన సమయంలో తుకారం కుటుంబ సభ్యులతో కలసి ఇంటి ముందుబాగంలో నిద్రిస్తున్నట్లు చెప్పారు. -
రియల్ ఎస్టేట్ వ్యాపారి అదృశ్యం
హైదరాబాద్: వ్యాపారం నిమిత్తం బయటకు వెళ్లిన ఓ రియల్ఎస్టేట్ వ్యాపారి కనిపించకుండా పోయిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... వనస్థలిపురం సాయినగర్‌కాలనీ శ్రీసాయి నిలయంలో వెంకట్రావు(35) శిరీష దంపతులు నివాసం ఉంటున్నారు. వెంకట్రావు రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తుంటారు. ఈ నెల 1వ తేదీన వ్యాపార నిమిత్తం వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలు దేరిన వెంకట్రావు తిరిగి రాలేదు. బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ తెలియలేదు. అతని ఫోన్ పనిచేయడం లేదు. దీంతో ఆందోళన చెందిన శిరీష ఆదివారం వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కలకలం