వ్యాపారం నిమిత్తం బయటకు వెళ్లిన ఓ రియల్‌ఎస్టేట్ వ్యాపారి కనిపించకుండా పోయిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
హైదరాబాద్: వ్యాపారం నిమిత్తం బయటకు వెళ్లిన ఓ రియల్‌ఎస్టేట్ వ్యాపారి కనిపించకుండా పోయిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... వనస్థలిపురం సాయినగర్‌కాలనీ శ్రీసాయి నిలయంలో వెంకట్రావు(35) శిరీష దంపతులు నివాసం ఉంటున్నారు. వెంకట్రావు రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తుంటారు.
ఈ నెల 1వ తేదీన వ్యాపార నిమిత్తం వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలు దేరిన వెంకట్రావు తిరిగి రాలేదు. బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ తెలియలేదు. అతని ఫోన్ పనిచేయడం లేదు. దీంతో ఆందోళన చెందిన శిరీష ఆదివారం వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.