కొలంబియాలో ఫ్లైట్ మిస్.. ప్రయాణికుల క్షేమంపై ఆందోళన | A flight has gone missing in Colombia | Sakshi
Sakshi News home page

కొలంబియాలో ఫ్లైట్ మిస్.. ప్రయాణికుల క్షేమంపై ఆందోళన

Jan 29 2026 3:14 AM | Updated on Jan 29 2026 3:16 AM

కొలంబియాలో ఓ ప్రైవేట్ జెట్ మిస్సింగ్ ఆ దేశంలో కలకలం రేపుతుంది. ఆ దేశంలోని కుకుటా నగరం నుంచి టేకాఫ్ అయిన ఫ్లైట్ టేకాప్ అయ్యే ‍ప్రాంతానికి చేరుకోకముందే  కంట్రోలింగ్ టవర్స్‌తో సిగ్నల్స్ తెగిపోయాయి. ఈ ఫ్లైట్‌లో 13 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తుంది.

ఆ దేశ సరిహద్దు నగరం కుకుటా నుండి 13 ప్రయాణికులతో బయిలుదేరిన విమానం ఆదేశ కాలమానం ప్రకారం మధ్యాహ్నం12 గంటల ప్రాంతంలో ఒకానా నగరంలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే ఆ సమయానికి కొద్ది సేపు ముందే కంట్రోలింగ్ టవర్స్‌తో ఆ ఫ్లైట్స్ సిగ్నల్స్ తెగిపోయినట్లు అక్కడి ఎయిర్‌లైన్స్ ప్రకటించింది.

అయితే ఫ్లైట్ మిస్సైన ప్రాంతం వెనిజువెలాకు సరిహద్దున ఉండడంతో పాటు అది పర్వతాలతో కూడిన ప్రాంతమని అక్కడ వాతావరణం సరిగ్గా ఉండదని అక్కడి అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఆ విమానంలో ఆదేశానికి చెందిన ఒక శాసనసభ్యుడు ఉన్నట్లు సమాచారం. ఇటీవలే అమెరికాలో వాతావరణ అనూకూలించకపోవడంతో ఒక ప్రైవేట్ జెట్ కూలిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement