మోజ్తాబా ప్రాణాలతో లేడు.. ట్రంప్ సంచలన ప్రకటన | hearing mojtaba Khamenei not alive trump claim | Sakshi
Sakshi News home page

మోజ్తాబా ప్రాణాలతో లేడు.. ట్రంప్ సంచలన ప్రకటన

Mar 15 2026 9:06 AM | Updated on Mar 15 2026 11:16 AM

hearing mojtaba Khamenei not alive trump claim

వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ప్రాణాలతో లేడన్నారు. ఆయన మరణించినట్లు తాను వార్తలు విన్నానని పేర్కొన్నారు. అయితే  ఇదివరకే ఇరాన్ మోజ్తాబా ఆరోగ్యంపై ప్రకటన విడుదల చేసింది ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఎటువంటి ప్రమాదం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి.

ప్రస్తుతం ఇజ్రాయెల్, ఇరాన్ అధినేతల ఉనికిపై చర్చ జోరుగా నడుస్తోంది. మార్చి 2న  ఇజ్రాయెల్ ప్రధాని  కార్యాలయంపై ఇరాన్ దాడి జరిపింది. ఈ వివరాలను ప్రకటిస్తూ నెతన్యాహు అదృష్టం ఏలా ఉందో తెలియలేదు. అని ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ రోజు నుంచి నెతన్యాహు ఆరోగ్యంపై పుకార్లు ప్రచారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టెల్‌ అవీవ్ నెతన్యాహుకు సంబంధించిన  వీడియో విడుదల చేసింది. అందులో నెతన్యాహు కుడిచేతికి ఆరువేళ్లు ఉన్నాయని అది  ఏఐ జనరేటడ్‌ వీడియో అని నెటిజన్స్‌ కామెంట్ చేస్తున్నారు. అయితే దీనిపై ఇజ్రాయెల్ ఎటువంటి స్పష్టమైన ప్రకటన విడుదల చేయలేదు.

మరో వైపు ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించిన మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఇదే విధమైన ఆరోపణలు ప్రచారమవుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరించినా వారిని  లేపేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలోనే సుప్రీం లీడర్‌గా మోజ్తాబా ఖమేనీ బాధ్యతలు స్వీకరించారు. కొద్దిరోజులకే ఇరాన్‌పై జరిపిన దాడుల్లో ఆయనకు తీవ్రగాయాలయ్యాయని కోమాలో ఉన్నారని ప్రచారం జరిగింది. ఈ వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది.

తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై స్పందించారు. శనివారం ఆ దేశ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ " మోజ్తాబా ఖమేనీ బ్రతికే ఉన్నాడో లేదో తెలియదు. ఆయన గురించి స్పష్టమైన సమాచారం లేదు. అయితే ఆయన ప్రాణాలతో లేడని నేను విన్నాను. ఒక వేళ ప్రాణాలతో ఉంటే వారి దేశం కోసం తెలివిగా ఆలోచిస్తారు. అది ఆయన లొంగిపోవడమే" అని ట్రంప్ అన్నారు.

కాగా మోజ్తాబా ఖమేనీ సుప్రీంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి బహిరంగంగా కనిపించలేదు. సుప్రీం బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కేవలం రాతపూర్వక ఆదేశాలు మాత్రమే ఇస్తున్నారు. ఇటీవల ఇరాన్‌పై జరిగిన దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారని కాలు పోయిందని ప్రచారం జరిగింది. అయితే వాటిని ఇరాన్ ఖండించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి ఆయనపై మాట్లాడడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

Advertisement
 
Advertisement
Advertisement