ట్రంప్ కోడలా మజాకా.. షాకిస్తున్న ఐదు సంచలనాలు.. | Who is Lara Trump and how is she related to Donald Trump | Sakshi
Sakshi News home page

ట్రంప్ కోడలా మజాకా.. షాకిస్తున్న ఐదు సంచలనాలు..

Mar 15 2026 11:14 AM | Updated on Mar 15 2026 1:15 PM

Who is Lara Trump and how is she related to Donald Trump

అమెరికా రాజకీయ రంగంలో ‘ట్రంప్’ అనేది ఒక బ్రాండ్‌. ఇప్పుడు ఆ కుటుంబం నుండి మరో శక్తివంతమైన గొంతు ప్రపంచానికి వినిపిస్తోంది. ఆమెనే లారా ట్రంప్. కేవలం డోనాల్డ్ ట్రంప్ కోడలిగానే కాకుండా, తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న లారా గురించి ఇప్పుడు ప్రపంచమంతటా చర్చ జరుగుతోంది. ఫోక్స్ న్యూస్ హోస్ట్‌గా, రాజకీయ విశ్లేషకురాలిగా ఆమె ప్రస్థానం దూసుకుపోతోంది. ఆమెకు సంబంధించిన ఐదు షాకిచ్చే సంగతులు ఇప్పుడు తెలుసుకుందాం..

ట్రంప్ కుటుంబంలో కీలకం
లారా ట్రంప్.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మూడవ కుమారుడు ఎరిక్ ట్రంప్‌ను 2014లో వివాహం చేసుకున్నారు. అలా ట్రంప్ కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టిన ఆమె, అనతి కాలంలోనే ఆ కుటుంబంలో అత్యంత కీలకమైన,  నమ్మకస్తురాలైన  మనిషిగా మారారు.

రాజకీయాల్లో చక్రం తిప్పుతూ..
కేవలం ఇంటికే పరిమితం కాకుండా, రిపబ్లికన్ పార్టీలో ఆమె చురుకైన పాత్ర పోషిస్తున్నారు. 2024లో రిపబ్లికన్ నేషనల్ కమిటీ (ఆర్‌ఎన్‌సీ) కో-చైర్‌గా బాధ్యతలు చేపట్టి, పార్టీ నిధుల సేకరణలో, ఎన్నికల వ్యూహరచనలో తనదైన ముద్ర వేశారు.

ఫోక్స్ న్యూస్ స్టార్ హోస్ట్‌గా..
మీడియా రంగంలోనూ లారా తన సత్తా చాటుతున్నారు. 2025 ఫిబ్రవరిలో ఆమె ఫోక్స్ న్యూస్‌లో ‘మై వ్యూ విత్ లారా ట్రంప్’ (My View with Lara Trump) అనే సొంత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి శనివారం ప్రసారమయ్యే ఈ షోలో జాతీయ భద్రత, రాజకీయ పరిణామాలపై ఆమె చేసే విశ్లేషణలకు విపరీతమైన క్రేజ్ ఉంది.

పబ్లిక్ లైఫ్ ఒత్తిడిపై ఓపెన్ కామెంట్స్
రాజకీయాల్లోకి రాకముందు ఉన్న సాధారణ జీవితాన్ని తాము అప్పుడప్పుడు మిస్ అవుతుంటామని లారా గతంలో ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ట్రంప్ అధ్యక్ష బరిలోకి దిగిన తర్వాత తమ కుటుంబంపై పెరిగిన నిఘా, విమర్శల  కారణంగా తమ పాత రోజులను గుర్తుచేసుకుంటామని ఆమె చెబుతుంటారు.

వ్యక్తిగత జీవితం
లారా, ఎరిక్ దంపతులకు ల్యూక్, కరోలినా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ట్రంప్ కుటుంబ సభ్యులతో కలిసి బహిరంగ వేడుకల్లో ఆమె తరచూ కనిపిస్తుంటారు. సోషల్ మీడియాలోనూ ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. ట్రంప్ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో లారా ట్రంప్ ఇప్పుడు ఒక బలమైన శక్తిగా కనిపిస్తున్నారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: మొజ్తబా ఖమేనీ ముఖం చిద్రమైందా?

Advertisement
 
Advertisement
Advertisement