Lara Trump
-
ట్రంప్ కోడలా మజాకా.. షాకిస్తున్న ఐదు సంచలనాలు..
అమెరికా రాజకీయ రంగంలో ‘ట్రంప్’ అనేది ఒక బ్రాండ్. ఇప్పుడు ఆ కుటుంబం నుండి మరో శక్తివంతమైన గొంతు ప్రపంచానికి వినిపిస్తోంది. ఆమెనే లారా ట్రంప్. కేవలం డోనాల్డ్ ట్రంప్ కోడలిగానే కాకుండా, తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న లారా గురించి ఇప్పుడు ప్రపంచమంతటా చర్చ జరుగుతోంది. ఫోక్స్ న్యూస్ హోస్ట్‌గా, రాజకీయ విశ్లేషకురాలిగా ఆమె ప్రస్థానం దూసుకుపోతోంది. ఆమెకు సంబంధించిన ఐదు షాకిచ్చే సంగతులు ఇప్పుడు తెలుసుకుందాం..ట్రంప్ కుటుంబంలో కీలకంలారా ట్రంప్.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మూడవ కుమారుడు ఎరిక్ ట్రంప్‌ను 2014లో వివాహం చేసుకున్నారు. అలా ట్రంప్ కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టిన ఆమె, అనతి కాలంలోనే ఆ కుటుంబంలో అత్యంత కీలకమైన, నమ్మకస్తురాలైన మనిషిగా మారారు.రాజకీయాల్లో చక్రం తిప్పుతూ..కేవలం ఇంటికే పరిమితం కాకుండా, రిపబ్లికన్ పార్టీలో ఆమె చురుకైన పాత్ర పోషిస్తున్నారు. 2024లో రిపబ్లికన్ నేషనల్ కమిటీ (ఆర్ఎన్సీ) కో-చైర్‌గా బాధ్యతలు చేపట్టి, పార్టీ నిధుల సేకరణలో, ఎన్నికల వ్యూహరచనలో తనదైన ముద్ర వేశారు.ఫోక్స్ న్యూస్ స్టార్ హోస్ట్‌గా..మీడియా రంగంలోనూ లారా తన సత్తా చాటుతున్నారు. 2025 ఫిబ్రవరిలో ఆమె ఫోక్స్ న్యూస్‌లో ‘మై వ్యూ విత్ లారా ట్రంప్’ (My View with Lara Trump) అనే సొంత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి శనివారం ప్రసారమయ్యే ఈ షోలో జాతీయ భద్రత, రాజకీయ పరిణామాలపై ఆమె చేసే విశ్లేషణలకు విపరీతమైన క్రేజ్ ఉంది.పబ్లిక్ లైఫ్ ఒత్తిడిపై ఓపెన్ కామెంట్స్రాజకీయాల్లోకి రాకముందు ఉన్న సాధారణ జీవితాన్ని తాము అప్పుడప్పుడు మిస్ అవుతుంటామని లారా గతంలో ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ట్రంప్ అధ్యక్ష బరిలోకి దిగిన తర్వాత తమ కుటుంబంపై పెరిగిన నిఘా, విమర్శల కారణంగా తమ పాత రోజులను గుర్తుచేసుకుంటామని ఆమె చెబుతుంటారు.వ్యక్తిగత జీవితంలారా, ఎరిక్ దంపతులకు ల్యూక్, కరోలినా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ట్రంప్ కుటుంబ సభ్యులతో కలిసి బహిరంగ వేడుకల్లో ఆమె తరచూ కనిపిస్తుంటారు. సోషల్ మీడియాలోనూ ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. ట్రంప్ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో లారా ట్రంప్ ఇప్పుడు ఒక బలమైన శక్తిగా కనిపిస్తున్నారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: మొజ్తబా ఖమేనీ ముఖం చిద్రమైందా? -
తొమ్మిదోసారి తాత అయిన ట్రంప్
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తొమ్మిదోసారి తాతయ్య అయ్యారు. ఆయన కుమారుడు ఎరిక్ ట్రంప్, కోడలు లారా ట్రంప్‌లకు మగబిడ్డ (ఎరిక్ ల్యూక్ ట్రంప్) జన్మించాడు. ట్రంప్ ఆర్గనేజేషన్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసింది. ట్రంప్ కూడా తన కొడుకు, కోడలికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఎరిక్ ట్రంప్, అతడి సోదరుడు డాన్ జూనియర్లు ప్రముఖ న్యాయవాదులు మాత్రమే కాకుండా ప్రచార సమయంలో కూడా వీరు కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పనిచేస్తున్న నేపథ్యంలో కుటుంబ వ్యవహారాలు, వ్యాపారాలు వీరే చూసుకుంటున్నారు. లారా ట్రంప్ కూడా నాటి అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం చేశారు. ట్రంప్‌కు ఇప్పటికే ఎనిమిదిమంది మనవళ్లు మనవరాళ్లు ఉన్నారు. Congratulations to Eric & Lara on the birth of their son, Eric "Luke" Trump this morning! https://t.co/Aw0AV82XdE — Donald J. Trump (@realDonaldTrump) 12 September 2017 .@LaraLeaTrump and I are excited to announce the birth of our son, Eric "Luke" Trump at 8:50 this morning. pic.twitter.com/b8zRSktcd8 — Eric Trump (@EricTrump) 12 September 2017 -
తెరపైకి ట్రంప్ కోడలు
ఆష్ బర్న్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు హిల్లరీ క్లింటన్ వైపే మొగ్గుచూపుతున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్... ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీని తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకోసం తన కుటుంబ సభ్యులను రంగంలోకి దింపారు. వర్జీనియాలోని లాడన్ కౌంటీలో రాజధాని హిందూ దేవాలయంలో జరిగిన దీపావళి వేడుకల్లో ట్రంప్ కోడలు లారా పాల్గొన్నారు. పనిలో పనిగా తన మామగారికి ఓటు వేయాలని ప్రవాస భారతీయులను అభ్యర్థించారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే భారత్- అమెరికా సంబంధాలు మరింత బలోపేతమవుతాయని అన్నారు. భారతదేశం అన్నా, భారతీయులన్నా తన మామగారికి ఎంతో అభిమానమని చెప్పారు. భారతీయ సంస్కృతిని తాను ఎంతోగానే గౌరవిస్తానని పేర్కొంటూ చెప్పులు బయట విడిచిపెట్టి ఆమె ఆలయంలోకి ప్రవేశించారు. హిందూ సాంప్రదాయాలు అంటే తనకెంతో ఇష్టమని ట్రంప్ రెండో కుమారుడు ఎరిక్ భార్య అయిన లారా చెప్పారు. ట్రంప్ కుమార్తె ఇవాంకా ఇక్కడికి రావాల్సివుంది. అయితే ఆమె వేరే చోటికి వెళ్లాల్సిరావడంతో లారా ఈ వేడుకలకు హాజరయ్యారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థులకు చెందిన కుటుంబంలోని సభ్యురాలు హిందూ ఆలయానికి రావడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. లారాకు ప్రవాస భారతీయ సంఘం నేత రాజేశ్ గూటి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్థానికులతో మమేకం అయేందుకు పండుగలు దోహం చేస్తాయని పేర్కొన్నారు.


