నిజామాబాద్లో భారీ చోరీ | robbery in nizamabad | Sakshi
Sakshi News home page

నిజామాబాద్లో భారీ చోరీ

Jun 9 2016 11:59 AM | Updated on Oct 17 2018 6:06 PM

నిజామాబాద్ నగరం న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలోని వినాయకనగర్‌లో గురువారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది.

నిజామాబాద్ : నిజామాబాద్ నగరం న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలోని వినాయకనగర్‌లో గురువారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. రియల్‌ఎస్టేట్ వ్యాపారి తుకారం ఇంటి వెనుక గది కిటికీ చువ్వలు తొలగించి దుండగులు ఇంట్లోకి జొరబడ్డారు. అనంతరం బీరువాలో ఉంచిన రూ.1,50 లక్షల నగదు, 8 తులాల బంగారు నగలు, రెండు కిలోల వెండి ఆభరణాలు దోచుకెళ్లారు.

ఆ విషయాన్ని గురువారం ఉదయం తుకారాం గమనించి... నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీమ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చోరీ జరిగిన సమయంలో తుకారం కుటుంబ సభ్యులతో కలసి ఇంటి ముందుబాగంలో నిద్రిస్తున్నట్లు చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement