గచ్చిబౌలి చోరీ కేసు ఛేదించిన పోలీసులు | Gachibowli Robbery Case Chased by Hyderabad Police | Sakshi
Sakshi News home page

గచ్చిబౌలి చోరీ కేసు ఛేదించిన పోలీసులు

Jun 10 2026 3:39 AM | Updated on Jun 10 2026 3:39 AM

Gachibowli Robbery Case Chased by Hyderabad Police

హైదరాబాద్‌: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. హిల్‌ రిడ్జ్‌ విల్లాలో చోరీకి పాల్పడ్డ నేపాలీ గ్యాంగ్‌ను అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఒక వ్యాపారవేత్త ఇంట్లో సుమారు 1 కేజీ బంగారు ఆభరణాలు అపహరించారు. ఇంట్లో పనిచేసే నేపాల్‌కు చెందిన భార్యాభర్తలు ప్రధాన అనుమానితులుగా భావించిన పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు చేయగా ఆ గ్యాంగ్‌ చోరీకి పాల్పడి విషయం బయటపడింది. 

​కొద్దిరోజుల క్రితం యజమాని కుటుంబం ముంబైకి వెళ్లి, ఆదివారం తిరిగి వచ్చేసరికి ఆ నేపాలీ దంపతులు కనిపించలేదు. నెల రోజుల క్రితమే పనిలో చేరిన వారు చాకచక్యంగా చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో తాళాలు పగలగొట్టినట్లు ఎలాంటి గుర్తులు లేకపోవడంతో మొదట వారు చెప్పకుండా వెళ్లిపోయారని భావించారు. అయితే పూజా గదిలోని విగ్రహానికి ఉన్న బంగారు గొలుసు, 

తదుపరి జరిపిన తనిఖీల్లో మరికొన్ని ఆభరణాలు మాయమైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు సదరు వ్యాపారవేత్త.  దీనిపై రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు నిందితులు గాలించి ఎట్టకేలకు వారిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement