
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న జీఎస్టీ సంస్కరణలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి ప్రశంసించారు. ఇది దేశంలోని ప్రతి పౌరుడికీ భారీ విజయమని ఆమె అభివర్ణించారు. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ మాట్లాడారు.
దీపావళి పండుగకు ముందు జీఎస్టీ సంస్కరణల అమలు ఎందుకన్నదానిపైనా ఆర్థిక మంత్రి వివరణ ఇచ్చారు. భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి వారి సొంత పండుగలు ఉంటాయన్న నిర్మలా సీతారామన్.. దీపావళి పండుగకు ముందు జీఎస్టీ సంస్కరణల అమలును ప్రారంభించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలకు ముందే నిర్ణయించినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు.
చెన్నై సిటిజన్స్ ఫోరం నిర్వహించిన 'ట్యాక్స్ రిఫార్మ్స్ ఫర్ రైజింగ్ భారత్' కార్యక్రమంలో ఆమె ప్రసంగిస్తూ, దేశ ప్రజలు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు అన్ని ఉత్పత్తులపైనా జీఎస్టీ ప్రయోజనకరమైన ప్రభావం ఉంటుందని ఆమె అన్నారు.
జీఎస్టీ కింద గతంలో 12 శాతం పన్ను విధించిన 99 శాతం వస్తువులను ఇప్పుడు 5 శాతానికి తగ్గించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా ఇప్పటివరకు ఉన్న శ్లాబులను రెండు శ్లాబులకే జీఎస్టీ కౌన్సిల్ కుదించింది. ఇకపై 5, 28 శాతం పన్ను శ్లాబులు మాత్రమే కొనసాగనున్నాయి. తాజా జీఎస్టీ సంస్కరణలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఇదీ చదవండి: ఐటీఆర్ గడువు పొడిగిస్తారా? వెల్లువెత్తుతున్న విజ్ఞప్తులు