breaking news
GST 2.0
-
దీపావళి స్టాక్స్ పటాకా!
కొత్త సంవత్ 2082లో కొంత ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ మార్కెట్లు ముందుకే సాగుతాయనే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆదాయాల వృద్ధి వేగం పుంజుకోవడం, మళ్లీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం మొదలు కావడం, వాణిజ్య విధానాలపై స్పష్టత, భౌగోళిక రాజకీయ స్థిరత్వం వంటి అంశాలు సానుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. దేశీయంగా పాలసీలు స్థిరంగా కొనసాగడం, భారీ పెట్టుబడులు, సానుకూల ద్రవ్యపరపతి విధానాలు మొదలైనవి కీలక చోదకాలుగా నిలుస్తాయనే అంచనాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం నెమ్మదించడం, ఆర్థిక క్రమశిక్షణ, కార్పొరేట్ల రుణభారం తగ్గడం తదితర అంశాల దన్నుతో కంపెనీల ఆదాయాలు మెరుగుపడొచ్చని నువామా రీసెర్చ్ అభిప్రాయపడింది. 2026 ఆర్థిక సంవత్సరంలో అమెరికా ఫెడ్, ఈసీబీలు వడ్డీ రేట్లను మరికాస్త తగ్గించవచ్చని పేర్కొంది. ద్రవ్యోల్బణం కాస్త అదుపులో ఉన్న నేపథ్యంలో దేశీయంగా ఆర్బీఐ కూడా ఇదే బాటలో పయనించవచ్చని తెలిపింది. వేల్యుయేషన్స్ సముచిత స్థాయిలో ఉన్నాయని, అయితే గణనీయంగా పెరిగిన మిడ్–స్మాల్ క్యాప్స్‌లో మాత్రం కన్సాలిడేషన్‌కి ఆస్కారం ఉందని వివరించింది. జీఎస్టీ 2.0 సరళీకరణ, ఆదాయపు పన్నుపరమైన ఊరట, పండుగల సీజన్ మొదలైన అంశాల కారణంగా వినియోగం గణనీయంగా రికవర్ అవుతుందని మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది. ఆటో, కన్జూమర్ డ్యూరబుల్స్, ట్రావెల్, హోటల్స్, రిటైల్ వంటి రంగాలు మెరుగ్గా ఉండొచ్చని పేర్కొంది. మరోవైపు, ఆటో, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, తదితర రంగాలు ఆకర్షణీయంగా ఉంటాయని సెంట్రమ్ బ్రోకింగ్ తెలిపింది. నిఫ్టీ 28,500కి, సెన్సెక్స్ 95,000కు చేరొచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. వినియోగ ఆధారిత సంస్థలు, ప్రైవేట్ బ్యాంకులు మెరుగ్గా రాణించవచ్చని ట్రేడ్జినీ సీవోవో త్రివేష్ తెలిపారు. వచ్చే ఏడాది కాలానికి వివిధ బ్రోకరేజీ సంస్థలు అందిస్తున్న స్టాక్ సిఫార్సులు సాక్షి పాఠకులకు ప్రత్యేకం! బ్రోకరేజ్: జేఎం ఫైనాన్షియల్ మారుతీ సుజుకీప్రస్తుత ధర: రూ. 16,399 టార్గెట్ ధర: రూ. 19,000 (వృద్ధి: 16%) కార్యకలాపాలు స్థిరపడే కొద్దీ విస్తరణ వ్యయాలు తగ్గుముఖం పట్టడం, ప్రోడక్టుల మేళవింపు సానుకూలంగా ఉండటం మార్జిన్లు మెరుగుపడేందుకు దోహదపడొచ్చు. ఇన్‌హౌస్ బ్యాటరీ ప్లాంటుతో మరిన్ని హైబ్రిడ్ వాహనాలను ప్రవేశపెట్టొచ్చు. హైబ్రిడ్ సెగ్మెంట్లో వ్యయాలు తగ్గి, లాభదాయకత పెరుగుతుంది. అయితే, తీవ్రమైన పోటీ, కొత్తగా ప్రవేశపెట్టిన ప్యాసింజర్ వాహనాలకు స్పందన అంతంతమాత్రంగానే ఉండటం వంటివి ప్రతికూలాంశాలుగా ఉండొచ్చు. యాక్సిస్ బ్యాంక్ ప్రస్తుత ధర: రూ. 1,200 టార్గెట్ ధర: రూ. 1,330 (వృద్ధి: 11%)ఆకర్షణీయమైన వేల్యుయేషన్, అసెట్ క్వాలిటీ రిస్కులు తక్కువగా ఉండటం, నిర్వహణ వ్యయాలు నెమ్మదించడం వంటివి సానుకూలాంశాలు. రాబోయే త్రైమాసికాల్లో వృద్ధి వేగం మరింత పుంజుకోవచ్చు. నికర వడ్డీ మార్జిన్లు ఊహించిన దానికంటే క్షీణించే అవకాశాలు ప్రతికూలాంశం. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ప్రస్తుత ధర: రూ. 498 టార్గెట్ ధర: రూ. 600 (వృద్ధి: 20%)వేల్యుయేషన్ మెరుగ్గా ఉండటం, ఆదాయ రికవరీ వల్ల రీ–రేటింగ్‌కి అవకాశం ఉంది. పసిడి ధరల పరుగు కొనసాగుతుండటమనేది ఆదాయ అంచనాల పెంపునకు, రుణాల పోర్ట్‌ఫోలియో మెరుగుపడేందుకు ఉపయోగపడొచ్చు. అయితే, రుణ సంబంధ వ్యయాలు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉండటం కీలక రిసు్కల్లో ఒకటిగా ఉంటుంది.ఎల్అండ్టీ ఫైనాన్స్ ప్రస్తుత ధర: రూ. 266 టార్గెట్ ధర: రూ. 300 (వృద్ధి: 13% )మాతృ సంస్థ పటిష్టంగా ఉండటం, వైవిధ్యమైన ప్రోడక్టుల పోర్ట్‌ఫోలియో, లోన్ బుక్‌లో రిటైల్ ఫైనాన్స్ వాటా 90 శాతానికి పెరగడం వంటివి సానుకూలాంశాలు. ద్వితీయార్ధంలో పండగ సీజన్ డిమాండ్‌తో వృద్ధి వేగం పటిష్టంగా ఉండొచ్చు. అసెట్ క్వాలిటీపరమైన రిసు్కలు మళ్లీ తలెత్తే అవకాశాలుండటం ప్రతికూలాంశాల్లో ఒకటిగా నిలవొచ్చు. అపోలో హాస్పిటల్స్ ప్రస్తుత ధర: రూ. 7,909 టార్గెట్ ధర: రూ. 9,000 (వృద్ధి: 14% )కొత్తగా 1,717 పడకలు జతకానుండటం, ఫార్మసీ ఔట్లెట్స్ సంఖ్య 8 శాతం పెరుగుదల, పోటీ సంస్థ మ్యాక్స్ హెల్త్‌కేర్‌తో పోలిస్తే డిస్కౌంటులో ట్రేడవుతుండటం మొదలైనవి పాజిటివ్ అంశాలు. పడకల సామర్థ్యం పెంపు ఊహించిన దానికన్నా నెమ్మదిగా ఉండటం, రెగ్యులేటరీ రిస్కుల్లాంటివి ప్రతికూలాంశాలుగా ఉండొచ్చు.బ్రోకరేజ్: చాయిస్ ఈక్విటీ బ్రోకింగ్ ఫెడరల్ బ్యాంక్ ప్రస్తుత ధర: రూ. 212 టార్గెట్ ధర: రూ. 245 (వృద్ధి: 16% )టెక్నికల్‌గా కొన్నాళ్ల నుంచి పటిష్టమైన బేస్ ఏర్పర్చుకుంటోంది. రూ. 195–215 శ్రేణిలో తిరుగాడుతోంది. కరెక్షన్ జరిగిన ప్రతిసారి సపోర్ట్ బలపడుతోంది. 220పై నిలకడగా కొనసాగితే రూ. 245–255 వైపు ర్యాలీ చేయొచ్చు. రూ. 207–205 వరకు తగ్గితే కొనుగోళ్లకు అవకాశంగా భావించవచ్చు. రూ. 195 దిగువకి పడిపోతే బలహీనపడటాన్ని సూచిస్తుంది. సిప్లా ప్రస్తుత ధర: రూ. 1,578 టార్గెట్ ధర: రూ. 1,770 (వృద్ధి: 12%) నిర్దిష్ట శ్రేణిలో కన్సాలిడేట్ అవుతూ షేరు బలపడుతున్న సంకేతాలిస్తోంది. రూ. 1,580 వద్ద తక్షణ రెసిస్టెన్స్ ఉండగా, దీన్ని నిర్ణయాత్మకంగా దాటితే మధ్యకాలికంగా, దీర్ఘకాలికంగా రూ. 1,770–1,850 వైపుగా వెళ్లొచ్చు. తగ్గితే రూ. 1,480 వద్ద సపోర్ట్ లభిస్తుంది. మొమెంటమ్ ఇండికేటర్ల ప్రకారం చూస్తే బులి‹Ùగానే కనిపిస్తోంది. అశోక్ లేల్యాండ్ ప్రస్తుత ధర: రూ. 134 టార్గెట్ ధర: రూ. 151 (వృద్ధి: 13% )కనిష్ట స్థాయిల్లో కన్సాలిడేట్ అవుతూ, స్థిరంగా రికవర్ అవుతోంది. ప్రస్తుతం వీక్లీ చార్ట్‌లో బులి‹Ùగా కనిపిస్తోంది. టెక్నికల్‌గా రూ. 140 తక్షణ రెసిస్టెన్స్‌ని దాటితే మధ్య, దీర్ఘకాలికంగా రూ. 151–రూ. 158 వరకు పెరగవచ్చు. దిగువ వైపున రూ. 131 వరకు కొనుగోలుకు అవకాశం ఉంటుంది. రూ. 126 వద్ద పటిష్టమైన మద్దతు ఉంటుంది. దానికన్నా దిగువకి పడిపోతే ర్యాలీకి స్వల్పకాలిక రిస్కులు ఉంటాయి. సెయిల్ ప్రస్తుత ధర: రూ. 129 టార్గెట్ ధర: రూ.147 (వృద్ధి: 14% )టెక్నికల్‌గా పటిష్టమైన బేస్ ఏర్పర్చుకున్న స్టాక్, ప్రస్తుతం నిర్ణయాత్మక బ్రేకవుట్కి సిద్ధంగా ఉన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. భారీ వాల్యూమ్స్‌తో రూ. 138కి ఎగువన నిలకడగా క్లోజయితే, తదుపరి దశ ర్యాలీకి దారితీయొచ్చు. దిగువన రూ. 125 స్థాయి వరకు మరింతగా షేర్లను మరింతగా కొనుగోలు చేయొచ్చు. రూ. 116 వద్ద సపోర్ట్ ఉంటుంది. బీడీఎల్ ప్రస్తుత ధర: రూ. 1,540 టార్గెట్ ధర: రూ. 1,700 (వృద్ధి: 10% )ఫిబోనకీ రిట్రేస్‌మెంట్ లెవెల్‌కి 50 శాతం వద్ద కన్సాలిడేట్ అవుతోంది. ఇదే జోన్లో సపోర్ట్ లభిస్తోంది. సాధారణంగా ర్యాలీ చేసే ముందు, ఇలాంటి కన్సాలిడేషన్ కనిపిస్తుంది. తక్షణ రెసిస్టెన్స్ రూ. 1,560 వద్ద ఉంటుంది. దీన్ని నిర్ణయాత్మకంగా దాటితే బులిష్ ధోరణి బలపడి, సమీప భవిష్యత్తులో మరింత ర్యాలీకి దోహదపడొచ్చు. తగ్గితే, రూ. 1,440 వరకు కొనుక్కోవచ్చు. రూ. 1,380 బలమైన సపోర్ట్ జోన్‌గా ఉంటుంది.బ్రోకరేజ్: మిరే అసెట్ షేర్‌ఖాన్ అంబర్ ఎంటర్ప్రైజెస్ ప్రస్తుత ధర: రూ. 8,245 టార్గెట్ ధర: రూ. 9,300 (వృద్ధి: 13%) ఈ సంస్థ రెసిడెన్షియల్, కమర్షియల్ ఏసీలు, రిఫ్రిజిరేషన్ ఉత్పత్తులను అందిస్తోంది. కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో ఏసీలతో పాటు కంపెనీ వాషింగ్ మెషీన్ల మార్కెట్లోకి, అటు ఎల్రక్టానిక్స్లోకి, సెమీకండక్టర్ సబ్్రస్టేట్ పీసీబీలు మొదలైన వాటిల్లోకి ప్రవేశిస్తుండటం ద్వారా మార్కెట్ పరిధిని విస్తరించుకుంటోంది. ఎల్రక్టానిక్స్‌పై వచ్చే అయిదేళ్లలో రూ. 3,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. చాలెట్ హోటల్స్ ప్రస్తుత ధర: రూ. 975 టార్గెట్ ధర: రూ. 1,172 (వృద్ధి: 20%)వ్యూహాత్మక కొనుగోళ్లు, గదుల పెంపు, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం వంటివి సంస్థకు సానుకూలంగా ఉండనున్నాయి. అలాగే, కమర్షియల్ బిజినెస్ వాటా పెరుగుతుండటమనేది వృద్ధికి కీలక చోదకంగా నిలవనుంది. 2027 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 2,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 2025 డిసెంబర్ ఆఖరు నాటికి గదుల సంఖ్యను 4,500కి పెంచుకోనుంది. కమిన్స్ ఇండియా ప్రస్తుత ధర: రూ. 3,976 టార్గెట్ ధర: రూ. 4,500 (వృద్ధి: 13% )హై–హార్స్పవర్ (హెచ్‌హెచ్‌పీ) జెన్సెట్ల మార్కెట్లో అగ్రగామిగా నిలుస్తోంది. పటిష్టమైన బ్రాండింగ్, డి్రస్టిబ్యూషన్ నెట్వర్క్ ఉంది. 2025 తొలినాళ్ల నుంచి పవర్‌జెన్ వ్యాపారం పుంజుకుంది. డేటా సెంటర్లు, హాస్పిటల్స్, మొదలైన రంగాల నుంచి హెచ్‌హెచ్‌పీ జెన్సెట్లకు డిమాండ్ కొనసాగనుంది. ఎగుమతులు పటిష్టంగా ఉన్నాయి. యూరప్, ఆప్రికా, పశ్చిమాసియాలో డిమాండ్ స్థిరంగా ఉంది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ ప్రస్తుత ధర: రూ. 4,880 టార్గెట్ ధర: రూ. 6,000 (వృద్ధి: 23%) ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్లు, ఇంజిన్లు, యాక్సెసరీలు అందించే హెచ్ఏఎల్కి భారతదేశపు డిఫెన్స్ రంగంలో విశిష్టమైన స్థానం ఉంది. తయారీ సెగ్మెంట్ కార్యకలాపాలు పుంజుకోవడం వల్ల ఆదాయ వృద్ధి మెరుగుపడొచ్చు. రూ. 1.9 లక్షల కోట్ల ఆర్డర్ బ్యాక్లాగ్ ఉంది. రాబోయే 1–2 ఏళ్లలో రూ. లక్ష కోట్ల ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. హడ్కో ప్రస్తుత ధర: రూ. 224 టార్గెట్ ధర: రూ. 260 (వృద్ధి: 16% )సామాజిక హౌసింగ్, అర్బన్ మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రభుత్వ నోడల్ ఏజెన్సీగా పని చేస్తోంది. ప్రభుత్వాలతో పటిష్టమైన సంబంధాలు ఉన్నాయి. 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఏయూఎం వార్షికంగా 25 శాతం పైగా, లాభం 23 శాతం పైగా వృద్ధి చెందవచ్చు. వచ్చే 18 నెలల్లో మొండిపద్దుల భారాన్ని పరిష్కరించుకోవాలని కంపెనీ నిర్దేశించుకుంది. బ్రోకరేజ్: మోతీలాల్ ఓస్వాల్ ఎస్బీఐ ప్రస్తుత ధర: రూ. 889 టార్గెట్ ధర: రూ. 1,000 (వృద్ధి: 12%)జీఎస్టీ 2.0, ఆదాయ పన్ను సంస్కరణలు, ద్రవ్య లభ్యతను పెంచేందుకు ఆర్బీఐ తీసుకున్న చర్యలు మొదలైనవి రుణ వృద్ధికి దారి తీయొచ్చని, బీఎఫ్ఎస్ఐ రంగం లాభదాయకతకు తోడ్పడవచ్చని అంచనాలు ఉన్నాయి. రిటైల్, ఎస్ఎంఈ, కార్పొరేట్ సెగ్మెంట్లవ్యాప్తంగా పటిష్టమైన కార్యకలాపాలు ఉండటం బ్యాంకుకు సానుకూలాంశం. ఎంఅండ్ఎం ప్రస్తుత ధర: రూ. 3,648 టార్గెట్ ధర: రూ. 4,091 (వృద్ధి: 12%)2026 క్యాలెండర్ సంవత్సరం నుంచి 2030 నాటికి కంపెనీ 7 ఐసీఈ ఎస్యూవీ వాహనాలను, 5 బీఈవీలను, 5 ఎల్‌సీవీలను ప్రవేశపెట్టే ప్రణాళికల్లో ఉంది. తద్వారా ఐసీఈ, ఈవీ సెగ్మెంట్లలో కంపెనీ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో రికవరీ, కొత్త ఉత్పత్తుల దన్ను, ట్రాక్టర్ల మార్జిన్లు మెరుగుపడటం మొదలైనవి సంస్థకు కలిసి రానున్నాయి. భారత్ ఎల్రక్టానిక్స్ ప్రస్తుత ధర: రూ. 413 టార్గెట్ ధర: రూ. 490 (వృద్ధి: 19% )ఆర్మీ నుంచి రూ. 30,000 కోట్ల అనంత శస్త్ర ప్రాజెక్టు టెండర్లకు సంబంధించి కంపెనీ, లీడ్ ఇంటిగ్రేటరుగా వ్యవహరిస్తుండటం వల్ల కంపెనీ అర్డరు బుక్ రూ. లక్ష కోట్ల స్థాయిని దాటే అవకాశముంది. ఇది, వ్యూహాత్మక డిఫెన్స్ ప్రోగ్రాంలలో కంపెనీ నాయకత్వ స్థానాన్ని తెలియజేస్తోంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్వ్యాప్తంగా అవకాశాలతో దీర్ఘకాలికంగా కంపెనీ వృద్ధి అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. స్విగ్గీ ప్రస్తుత ధర: రూ. 432 టార్గెట్ ధర: రూ. 550 (వృద్ధి: 27% )పోటీ నెమ్మదిస్తుండటం, డార్క్ స్టోర్లను విస్తరణ క్రమంగా స్థిరపడుతుండటం మొదలైన వాటి కారణంగా కంపెనీకి చెందిన ఇన్‌స్టామార్ట్ విభాగం త్వరలో లాభదాయకంగా మారే అవకాశాలు ఉన్నాయి. జీఎస్టీ మార్పుల వల్ల వినియోగం మరింత పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో 2026–27 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి వ్యాపార వృద్ధి, గతంలో అంచనా వేసిన 20 శాతానికన్నా మెరుగ్గా 23 శాతం స్థాయిలో ఉంటుందని అంచనా. ఇండియన్ హోటల్స్ ప్రస్తుత ధర: రూ. 735 టార్గెట్ ధర: రూ. 880 (వృద్ధి: 20% )ఆక్యుపెన్సీ, ఏఆర్ఆర్ పెరుగుతుండటం వంటి అంశాల కారణంగా దేశీయంగా హాస్పిటాలిటీ పరిశ్రమ 2026 ఆర్థిక సంవత్సరంలో భారీగా వృద్ధి చెందనుంది. అలాగే ఎంఐసీఈ యాక్టివిటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ద్వితీయార్ధంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైనవి కూడా కంపెనీ వృద్ధికి దోహదపడనున్నాయి. బ్రోకరేజ్: హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అసోసియేటెడ్ ఆల్కహాల్స్ అండ్ బ్రూవరీస్ (ఏఏబీఎల్) ప్రస్తుత ధర: రూ. 1,058 టార్గెట్ ధర:రూ. 1,182 (వృద్ధి: 12% )క్రమంగా ప్రీమియం లిక్కర్ బ్రాండ్స్ వైపు మళ్లుతోంది. మధ్యప్రదేశ్‌లో 20–25 శాతం వరకు మార్కెట్ వాటా ఉంది. అలాగే, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, ఉత్తర్‌ప్రదేశ్ మార్కెట్లలోకి కూడా విస్తరిస్తోంది. ఇటీవలే నికోబార్ జిన్, హిల్‌ఫోర్ట్ విస్కీ అనే ప్రీమియం బ్రాండ్లను ప్రవేశపెట్టడంతో పాటు కొత్తగా బ్రాందీ, టెకీలాలో కూడా మరిన్ని ప్రోడక్ట్లను ప్రవేశపెట్టబోతోంది. వ్యయాలు తగ్గించుకుని, స్థిరమైన మార్జిన్లను సాధించేందుకు కసరత్తు చేస్తోంది. భారతి ఎయిర్టెల్ ప్రస్తుత ధర: రూ. 2,011 టార్గెట్ ధర: రూ. 2,244 (వృద్ధి: 12%) ఏఆర్ పీయూ, డిజిటల్ వ్యాపారాలు వృద్ధి చెందుతున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏఆర్పీయూ రూ. 250గా ఉండగా, టారిఫ్‌ల పెంపుతో రూ. 300 సమీపానికి చేరే అవకాశం ఉంది. ఇక గూగుల్, ఒరాకిల్, యాపిల్, హ్యూస్‌లాంటి దిగ్గజాలతో జట్టు కట్టడం ద్వారా మొబైల్ సరీ్వసుల పరిధికి మించి ఇతర విభాగాల్లోకి ప్రవేశించడంలో కంపెనీకి తోడ్పడనుంది. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ ప్రస్తుత ధర: రూ. 541 టార్గెట్ ధర: రూ. 639 (వృద్ధి: 18% )భారతదేశపు ఇంధన పరివర్తన లక్ష్యాలతో కంపెనీకి ప్రయోజనం చేకూరనుంది. కంపెనీ ఇప్పటికే నిర్దేశించుకున్న గడువు కన్నా ముందే 20 గిగావాట్ల స్ట్రాటెజీ 2.0 టార్గెట్‌ని సాధించింది. ఇప్పుడు 2030 నాటికి 30 గిగావాట్ల కెపాసిటీ, 40 గిగావాట్‌అవర్ స్టోరేజీని సాధించే దిశగా ముందుకెళ్తోంది. రూ. 1.3 లక్షల కోట్ల భారీ పెట్టుబడుల ప్రణాళికలు ఉన్నప్పటికీ పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తోంది. ఎల్అండ్టీ ప్రస్తుత ధర: రూ. 3,839 టార్గెట్ ధర: రూ. 4,243 (వృద్ధి: 11%) క్యాపిటల్ గూడ్స్ విభా గానికి చెందిన ఈ సంస్థ కు రూ. 6.1 లక్షల కోట్ల ఆర్డర్ బుక్ ఉంది. ఇన్ఫ్రా, ఎనర్జీ, హైడ్రోకార్బన్ ప్రాజెక్టులకు సంబంధించి రూ. 14.8 లక్షల కోట్ల ఆర్డర్లు కుదిరే దశలో ఉన్నాయి. ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం ద్వారా కంపెనీ లాభదాయకత మరింత మెరుగుపడనుంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ప్రస్తుత ధర: రూ. 72 టార్గెట్ ధర: రూ. 88.5 (వృద్ధి: 23%)కాసా డిపాజిట్లు 26 శాతం వృద్ధి చెందాయి. దీంతో కాసా నిష్పత్తి 48 శాతానికి, క్రెడిట్–డిపాజిట్ నిష్పత్తి 93.4 శాతానికి పెరిగాయి. నిధుల సమీకరణ వ్యయా లు తగ్గి, 2025–26 మూడో త్రైమాసికానికి మార్జిన్లు 5.7 శాతానికి చేరే అవకాశముంది. 2024–25లో రూ. 1,525 కోట్లుగా ఉన్న లాభాలు, 2026 కల్లా రూ. 4,560 కోట్లకు ఎగిసే అవకాశాలు ఉన్నాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఎల్ఐసీ కొత్త పాలసీలు.. జీఎస్టీ తగ్గాక వచ్చిన ప్లాన్లు ఇవే..
దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) రెండు కొత్త బీమా ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. విభిన్న వ్యక్తిగత అవసరాలను తీర్చడానికి, ఆర్థిక రక్షణ, పొదుపు ప్రయోజనాలను అందించడానికి ‘ఎల్ఐసీ జన్ సురక్ష’, ‘ఎల్ఐసీ బీమా లక్ష్మి’ అనే పేర్లతో వీటిని రూపొందించింది.ఎల్ఐసీ జన్ సురక్ష (LIC Jan Suraksha), ఎల్ఐసీ బీమా లక్ష్మి (LIC Bima Lakshmi) అక్టోబర్ 15 నుంచి ఈ రెండు కొత్త పాలసీలు అందుబాటులో ఉంటాయని, కొత్త నెక్స్ట్ జెన్ జీఎస్టీ విధానంలో ఎల్ఐసీ విడుదల చేసిన మొదటి ఉత్పత్తులు ఇవేనని బీమా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.ఎల్ఐసీ జన్ సురక్షఎల్ఐసీ జన్ సురక్ష ప్లాన్ ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం రూపొందించిన తక్కువ ఖర్చుతో కూడిన బీమా పథకం. ఇది నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్, అంటే ఇది మార్కెట్ లేదా బోనస్ లతో లింక్ చేయబడదు.🔹 ముఖ్య లక్షణాలురకం: నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్ప్రత్యేకత: తక్కువ ఆదాయ వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన వారికి అనుకూలంబీమా మొత్తం: కనీసం రూ.1,00,000, గరిష్టంగా రూ.2,00,000పాలసీ కాలం: 12 నుంచి 20 సంవత్సరాలుప్రీమియం చెల్లింపు కాలం: మొత్తం పాలసీ కాలంలో 5 సంవత్సరాలు తీసివేయగా వచ్చే కాలంఅర్హత:వయస్సు: 18 నుండి 55 ఏళ్లుఆరోగ్యం: పాలసీదారుకు మంచి ఆరోగ్యస్థితి ఉండాలి. వైద్య చికిత్సలు తీసుకుంటూ ఉండరాదు.అదనపు ప్రయోజనాలు:3 సంవత్సరాల ప్రీమియం చెల్లింపుల తర్వాత ఆటో కవర్1 సంవత్సరం తర్వాత పాలసీ రుణంగ్యారెంటీడ్ ఎడిషన్లుఎల్ఐసీ బీమా లక్ష్మిఎల్ఐసీ బీమా లక్ష్మి అనేది మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జీవిత బీమా, పొదుపు పథకం. ఇది నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ స్కీం, ఇది జీవిత బీమా, కాలానుగుణ మనీబ్యాక్ ఎంపికలు రెండింటినీ అందిస్తుంది.🔹 ముఖ్య లక్షణాలురకం: నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ మనీబ్యాక్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ప్రత్యేకత: మహిళల కోసం ప్రత్యేకంబీమా మొత్తం: కనీసం రూ. 2,00,000, గరిష్ట పరిమితి లేదు (అండర్‌రైటింగ్ ఆధారంగా)పాలసీ కాలం: 25 సంవత్సరాలుప్రీమియం చెల్లింపు కాలం: 7 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉంటుంది.అర్హత:వయస్సు: 18–50 సంవత్సరాల మధ్యఅదనపు ప్రయోజనాలుగ్యారెంటీడ్ వార్షిక జోడింపులుసర్వైవల్ బెనిఫిట్లు నచ్చినట్లు ఎంచుకునే అవకాశంసర్వైవల్ బెనిఫిట్లు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు.మెచ్యూరిటీ / డెత్ బెనిఫిట్ వాయిదాలలో తీసుకునే అవకాశంఆటో కవర్ సౌలభ్యం (3 సంవత్సరాల తర్వాత)అధిక బీమా మొత్తానికి ప్రోత్సాహకాలుఇదీ చదవండి: దీపావళి ఇన్సూరెన్స్ రూ.5 లకే.. -
జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. కలిసొచ్చిన నవరాత్రి: అమ్మకాల్లో అరుదైన రికార్డ్!
భారతదేశంలో ప్రతి సంవత్సరం పండుగ సీజన్లో వాహన విక్రయాలు కొంత పెరుగుతాయి. అయితే ఈ సారి మాత్రం వెహికల్ సేల్స్ ఊహకందని రీతిలో గణనీయంగా పెరిగాయి. దీనికి కారణం మోదీ ప్రభుత్వం అమలుచేసిన జీఎస్టీ 2.0 అని తెలుస్తోంది. కొత్త జీఎస్టీ సంస్కరణల కారణంగా.. కార్లు, బైకులు ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో సేల్స్ భారీగా పెరిగాయి.ఆటోమొబైల్ రంగంఏ రంగం ఎలా ఉన్నా.. ఆటోమొబైల్ రంగానికి మాత్రం పండుగ సీజన్ బాగా కలిసొచ్చింది. మారుతి సుజుకి నవరాత్రి అమ్మకాలు.. గత సంవత్సరం కంటే రెట్టింపు అయ్యాయి. నవరాత్రి మొదటి ఎనిమిది రోజుల్లో 1.65 లక్షల వాహనాలను కంపెనీ డెలివరీ చేసింది. మొదటి రోజు 30,000 కార్లను డెలివరీ చేసి అమ్మకాల్లో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. సంస్థ మొత్తం బుకింగ్‌లు 1.50 లక్షలుగా నివేదించింది. ఈ సంఖ్య రెండు లక్షలకు చేరుకుంటుందని కంపెనీ భావిస్తోంది. గత ఏడాది ఇదే సమయంలో సంస్థ 85,000 వాహనాలను విక్రయించింది. దీన్నిబట్టి చూస్తే.. మారుతి సుజుకి సేల్స్ ఏ స్థాయిలో పెరిగాయో స్పష్టంగా అర్థమవుతోంది.ఇక దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఫెస్టివల్ సీజన్లో 60 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ ఎక్స్‌యూవీ700, స్కార్పియో ఎన్ వంటి కార్లను ఎక్కువ సంఖ్యలో విక్రయించింది. ఆల్ట్రోజ్, పంచ్, నెక్సాన్, టియాగో వంటి మోడళ్లకు డిమాండ్ పెరగడంతో టాటా మోటార్స్ 50,000 వాహనాలను విక్రయించింది. హ్యుందాయ్ క్రెటా, వెన్యూలకు డిమాండ్ పెరగడంతో..ఈ ఎస్‌యూవీల వాటా మొత్తం అమ్మకాలలో 72 శాతానికి పైగా పెరిగింది.ఇక టూ వీలర్స్ విషయానికి వస్తే.. హీరో మోటోకార్ప్ ముందు వరుసలో నిలిచింది. అంటే ఈ బ్రాండ్ అమ్మకాలు భారీగా పెరిగాయి. కంపెనీ షోరూమ్‌ల వద్ద రద్దీ ఈ నవరాత్రిలో రెట్టింపు అయ్యింది. కమ్యూటర్ విభాగంలోని బైకుల సేల్స్ గణనీయంగా పెరిగాయి. బజాజ్ ఆటో కూడా బలమైన అమ్మకాలను నమోదు చేసింది.ఎలక్ట్రానిక్స్ రంగంఆటోమొబైల్ రంగం పక్కన పెడితే.. ఎలక్ట్రానిక్స్ రంగం కూడా మంచి పురోగతిని సాధించింది. హైయర్ అమ్మకాలు 85 శాతం పెరిగాయి. ఈ కంపెనీ తన దీపావళి స్టాక్ అయిన.. 85 ఇంచెస్, 100 ఇంచెస్ టీవీలను దాదాపుగా విక్రయించేసింది. అంతే కాకుండా ఈ సంస్థ రోజుకు 300-350 యూనిట్ల 65 ఇంచెస్ టీవీలను సేల్ చేసింది.ఇదీ చదవండి: గిఫ్ట్‌గా రూ.33 లక్షల కారు: అభిషేక్ శర్మపై పడే ట్యాక్స్ ఎంత?భారతదేశంలోని అతిపెద్ద రిటైలర్ అయిన రిలయన్స్ రిటైల్ అమ్మకాలు.. గత సంవత్సరం నవరాత్రి కంటే 20-25 శాతం పెరిగాయి. పెద్ద స్క్రీన్ టీవీలు, స్మార్ట్ఫోన్లు, ఫ్యాషన్ వంటి సేల్స్ అమాంతం పెరిగాయి. ఇదే సమయంలో ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ 'విజయ్ సేల్స్' అమ్మకాలు 20 శాతం కంటే ఎక్కువ వృద్ధి చెందాయి. -
కొత్త జీఎస్టీతో ధరలు పెరిగిన బైక్‌లు..
జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా కొత్త పన్ను రేట్లు అమల్లోకి రావడంతో 350సీసీ కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న చాలా మోటర్ సైకిళ్లు, స్కూటర్ల ధరలు తగ్గాయి. మరోవైపు 350సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైక్‌లను అత్యధిక రేటు కేటగిరిలోకి చేర్చడంతో ద్విచక్ర వాహన కంపెనీలు ఆ మేరకు పెద్ద బైక్‌ల ధరలను పెంచేశాయి.హోండా (Honda) మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా భారత మార్కెట్లో తన పెద్ద బైక్ పోర్ట్ ఫోలియో ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కనిష్టంగా రెబెల్ 500 మోడల్ ధర రూ .37,000 పెరిగింది. కంపెనీ ఫ్లాగ్ షిప్ బైక్ జీఎల్ 1800 గోల్డ్ వింగ్ టూర్ రూ .2.92 లక్షల పెరుగుదలను చూసింది.పూర్తి ధరల జాబితామోడల్పాత ధరకొత్త ధరతేడారెబెల్ 500రూ.5.12 లక్షలురూ.5.49 లక్షలురూ.37,000ఎన్ఎక్స్500రూ.5.90 లక్షలురూ.6.33 లక్షలురూ.43,000సీబీ750 హార్నెట్రూ.8.60 లక్షలురూ.9.22 లక్షలురూ.62,000సీబీ650ఆర్రూ.9.60 లక్షలురూ.10.30 లక్షలురూ.70,000సీబీఆర్ 650ఆర్రూ.10.40 లక్షలురూ.11.16 లక్షలురూ.76,000ఎక్స్ఎల్ 750 ట్రాన్సాల్ప్రూ. 11.00 లక్షలురూ.11.81 లక్షలురూ.81,000ఎక్స్-ఏడీవీరూ .11.91 లక్షలురూ.12.79 లక్షలురూ.88,000సీబీ1000 హార్నెట్ ఎస్పీరూ.12.36 లక్షలురూ.13.29 లక్షలురూ.93,000సీబీఆర్1000ఆర్ఆర్-ఆర్ ఫైర్ బ్లేడ్ ఎస్పీరూ .28.99 లక్షలురూ.31.18 లక్షలురూ.2.19 లక్షలుజీఎల్1800 గోల్డ్ వింగ్ టూర్రూ.39.90 లక్షలురూ.42.82 లక్షలురూ.2.92 లక్షలుసుజుకీ కూడా..సుజుకి మోటార్ సైకిల్ ఇండియా కూడా తన మోటార్ సైకిళ్ల ధరలను సవరించింది. రేట్లు పెరిగిన బైక్ మోడల్స్ జాబితాలో లెజెండరీ హయాబుసా, వి-స్ట్రోమ్ 800 డీఈ, మిడిల్-వెయిట్ జీఎస్ఎక్స్-8ఆర్ ఉన్నాయి.సుజుకి భారతీయ లైనప్ లో అత్యధిక ధర కలిగిన మోడల్ గా, హయాబుసా (Suzuki Hayabusa) జీఎస్టీ సవరణతో ఎక్కువగా ప్రభావితమైంది. దీని ధర రూ .1.16 లక్షలు పెరిగింది. అంటే ఈ మోటార్ సైకిల్ ధర రూ .16.90 లక్షల నుండి రూ .18.06 లక్షలకు పెరిగింది.ఇక వీ-స్ట్రోమ్ 800డీఈ (V-Strom 800DE) జిక్సర్ (GSX-8R) కూడా ధరల పెరుగుదలను అనుభవించాయి. వి-స్ట్రోమ్ ధర రూ .71,000 పెరిగి రూ .11.01 లక్షలకు చేరింది. జిక్సర్ ధర రూ .64,000 పెరిగి రూ .9.89 లక్షలకు చేరుకుంది.ఇదీ చదవండి: ‘ఇండియన్ ఐటీ కంపెనీలు మేల్కోకపోతే మునిగిపోతాయ్’ -
చేనేతపై పెనుభారమే!
మన దేశంలో చేనేత పరిశ్రమ అత్యంత పురాతనమైన వృత్తి. దీనిని దేశ వారసత్వ సంపదగా కూడా గుర్తిస్తారు. వ్యవసాయరంగం తరువాత దేశంలో ఎక్కువమంది గ్రామీణ ప్రజలు ఆధార పడ్డ రంగం చేనేత రంగం. కానీ ఇటీవల వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పుల్లో భాగంగా చేనేత, టెక్స్టైల్ రంగంపై ఏకంగా 18 శాతం జీఎస్టీని విధించడంతో ఆ రంగంపై పెను భారం పడనుంది. రూ. 1,000 కంటే తక్కువ ధర ఉన్న చేనేత వస్త్రాలపై 5 శాతం, ఆ ధర కంటే ఎక్కువ ధర ఉండే చేనేత వస్త్రాలపై 12 శాతం జీఎస్టీని ఇప్పటివరకు విధించారు. నూతన జీఎస్టీలో భాగంగా 2,500 రూపాయల కంటే తక్కువ ధర ఉండే వస్త్రాలపై 5 శాతం, 2,500 రూపాయల కంటే ఎక్కువ ధర ఉండే చేనేత, ఇతర వస్త్రాలపై ఉన్న 12 శాతం జీఎస్టీని 18 శాతానికి పెంచారు. గత కొన్నేళ్లుగా మార్కెట్లో ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా వస్త్రాల ధరలు పెరిగి 5 శాతం స్లాబ్ నుండి 12 శాతం స్లాబ్‌లోకి వచ్చాయి. దీంతో మార్కెట్లో డిమాండ్ లేకుండా పోతోంది. చదవండి: ఖరీదైన ఆస్తిని అమ్మేస్తున్న ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్ఫలితంగా ఆదాయం కోల్పోయి చాలా కుటుంబాలు చేనేత వృత్తిని వదిలి ఇతర వృత్తులను ఎంచు కుంటున్నాయి. ఇప్పుడు జీఎస్టీని కొన్ని దుస్తులకు పెంచడంతో రానున్న రోజుల్లో చేనేత పరిశ్రమ మరింత నష్టాలను ఎదుర్కోక తప్పదు. ఇప్పుడు దేశంలో పేరొందిన పోచంపల్లి, కంచి, బెనారస్, ధర్మవరం, గద్వాల్ చేనేత వస్త్రాలు కేవలం రూ. 2,500 లోపే మార్కెట్లో దొరుకుతాయా? ఎటు వంటి శారీరక శ్రమతో పనిలేకుండా కృత్రిమ దారాలతో, యంత్రాల సహాయంతో తయారు చేసే పాలిస్టర్ వంటి వస్త్రాలపై జీఎస్టీని 12 శాతం నుండి5 శాతానికి తగ్గించడం ఈ సందర్భంగా గమనార్హం. ఈ వస్త్రాలు తక్కువధర లకు లభించడంతో వినియోగదారులు వాటిపై మొగ్గుచూపే అవకాశం ఉంటుంది. ఫలితంగా చేనేత పరిశ్రమకు మరింత నష్టాలు వచ్చే అవకాశంఉంది. నిజానికి చేనేత వస్త్రాలు విలాసవంతమైన వస్తువులు కావు. అవి భార తీయ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీక. ముఖ్యంగా, లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్నాయి. అలాంటి ఉత్పత్తులపై జీఎస్టీని తీసివేయాలి.లేదా ధరల సీలింగ్ లిమిట్‌ను హేతుబద్ధీకరించాలి. స్వదేశీ వస్తువులనే ప్రోత్సహించాలి. ‘వోకల్ ఫర్ లోకల్’, స్వదేశంలోనే ప్రతి వస్తువును తయారు చేయాలంటూ ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మ నిర్భర్ భారత్’ అంటున్న కేంద్ర ప్రభుత్వం... స్వదేశీ సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే చేనేత వస్త్రాలపై జీఎస్టీ విషయంపై పునఃసమీక్ష చేయాలి.ఇదీ చదవండి: నవదుర్గకు ప్రతీకగా నీతా అంబానీ : 9 రంగుల్లో బనారసీ లెహంగా చోళీ– డా.రామకృష్ణ బండారుకామర్స్ అధ్యాపకులు, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ -
జీఎస్టీ 2.0 ఎఫెక్ట్: మొదటి రోజే భారీగా అమ్ముడైన కార్లు
జీఎస్టీ 2.0 ఎప్పుడెప్పుడు అమలవుతుందా.. కొత్త కార్లు ఎప్పుడు కొనుగోలు చేద్దామా అని చాలామంది ఎదురు చూశారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగా సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వచ్చాయి. దీంతో కార్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.జీఎస్టీ సంస్కరణలు అమలులోకి రావడంతో చిన్నకార్ల ధరలు చాలా వరకు తగ్గాయి. దీంతో కార్లను కొనుగోలు చేయడానికి వాహనప్రియులు ఎగబడ్డారు. కొత్త జీఎస్టీ అమల్లోకి వచ్చిన మొదటిరోజే.. మారుతి సుజుకి (Maruti Suzuki) 30,000 యూనిట్ల కార్లను విక్రయించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) సుమారు 11,000 కార్లను విక్రయించింది. టాటా మోటార్స్ (Tata Motors) కూడా 10,000 కార్లను విక్రయించింది.ఇదీ చదవండి: కారు మైలేజ్ పెరగడానికి టిప్స్దేశంలో చిన్న కార్ల విక్రయాలు భారీగా పెరిగాయి. ఆటోమొబైల్ కంపెనీలు జీఎస్టీ ప్రయోజనాలను పూర్తిగా కస్టమర్లకు అందిస్తున్నాయి. రాబోయి రోజుల్లో కూడా ఈ సేల్స్ ఇలాగే కొనసాగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా.. సోమవారం కార్లను కొనుగోలు చేయడానికి కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో డీలర్‌షిప్‌లకు తరలిరావడంతో, ఆటోమోటివ్ డీలర్ల రద్దీ పెరిగిందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) తెలిపింది. -
జీఎస్టీ 2.0 ఎఫెక్ట్: రూ.4.50 లక్షలు తగ్గిన జీప్ ధరలు
కొత్త జీఎస్టీ (GST) ఈ రోజు (సోమవారం) అమలులోకి వచ్చింది. అంతకంటే ముందు అమెరికన్ కార్ల తయారీ సంస్థ అయిన జీప్ (Jeep) ఇండియన్ మార్కెట్లోని తన కార్ల ధరలను గరిష్టంగా రూ. 4.57 లక్షలు తగ్గించినట్లు ప్రకటించింది. ఈ కొత్త రేట్లు కూడా నేటి నుంచే (సెప్టెంబర్ 22) నుంచి అమల్లోకి వస్తాయి.➤జీప్ కంపాస్: పాత ధర రూ. 18.99 లక్షలు & కొత్త ధర రూ. 17.73 లక్షలు (రూ. 1.26 లక్షలు తగ్గింది)➤జీప్ మెరిడియన్ : పాత ధర రూ. 24.99 లక్షలు & కొత్త ధర రూ. 23.33 లక్షలు (రూ. 1.66 లక్షలు తగ్గింది)➤జీప్ రాంగ్లర్ : పాత ధర రూ. 68.65 లక్షలు & కొత్త ధర రూ. 64.08 లక్షలు (రూ. 4.57 లక్షలు తగ్గింది)➤జీప్ గ్రాండ్ చెరోకీ : పాత ధర రూ. 67.50 లక్షలు & కొత్త ధర రూ. 63.00 లక్షలు (రూ. 4.50 లక్షలు తగ్గింది)ఇదీ చదవండి: జీఎస్టీ 2.0 ఎఫెక్ట్: చౌకగా లభించే కార్ల జాబితాజీప్ కంపెనీ ఇప్పటి వరకు భారతదేశంలో లాంచ్ చేసిన దాదాపు అన్ని కార్లు మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉన్నాయి. ఇవి రోజువారీ వినియోగానికి మాత్రమే కాకుండా.. ఆఫ్ రోడింగ్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ కారణంగానే ఇవి దేశీయ విఫణిలో మంచి అమ్మకాలను పొందగలుగుతున్నాయి. -
దేశవ్యాప్తంగా వినియోగదారులకు ఊరట.. అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వినియోగదారులకు భారీ ఊరట కలిగిస్తూ.. జీఎస్టీ 2.0 సోమవారం అమల్లోకి వచ్చింది. నూతన శ్లాబ్ రేట్ల విధానం ద్వారా పన్ను శ్లాబ్‌లు సరళతరం కావడంతో.. ఇవాళ్టి నుంచి 375 రకాల వస్తువులపై ధరలు తగ్గనున్నాయి. ఇందులో మెడిసిన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాలు, సిమెంట్ ప్రధానంగా ఉన్నాయి.వంటగది సరకులు, ఎలక్ట్రానిక్స్, మందులు, వైద్య పరికరాలు, వాహనాలు, వ్యక్తిగత జీవిత- ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం ధరలు తగ్గాయి. ఎఫ్ఎంసీజీ, వాహన, ఎలక్ట్రానిక్స్, డెయిరీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను నేటి నుంచి తగ్గిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. మందులు, నిత్యావసరాల ప్యాక్‌లపై కొత్త ధరలు ముద్రించకున్నా.. విక్రయాల్లో మాత్రం తక్కువ ధరలు అమలు కావాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ తగ్గింపు వల్ల వ్యవస్థలోకి రూ.2 లక్షల కోట్ల నగదు వస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. ఈ తగ్గింపులు మధ్య తరగతి కుటుంబాలకు నెలవారీ ఖర్చుల్లో గణనీయమైన ఊరట లభించొచ్చు. అదే సమయంలో పండుగలపూట సాధారణంగానే డిస్కౌంట్లు ప్రకటించే కంపెనీల నిర్ణయంతో వినియోగదారులకు మరింత ఊరట దక్కే అవకాశం ఉంది. జీఎస్టీ 2.0లో ప్రధానంగా తగ్గినవి ఇవే:ఔషధాలు & వైద్య పరికరాలు36 జీవన రక్షక ఔషధాలపై జీరో జీఎస్టీసాధారణ మందులు 12% నుంచి 5%కి తగ్గింపుడయాగ్నస్టిక్ కిట్స్, గ్లూకోమీటర్లు – 5% GSTనిర్మాణ సామగ్రిసిమెంట్ – 28% నుంచి 18%కి తగ్గింపు ఎలక్ట్రానిక్స్ & గృహోపకరణాలు (18% GST)టీవీలు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, డిష్వాషర్లు32 ఇంచుల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న టీవీ రేట్లే తగ్గనున్నాయి రూ.2,500-85,000 తగ్గనున్న టీవీల ధరలువాహనాలుచిన్న కార్లు (1200cc లోపు) – 28% నుంచి 18%ద్విచక్ర వాహనాలు – 18% GSTమారుతి, టాటా, హ్యుందాయ్ వంటి కంపెనీల కార్లు లక్షల రూపాయల వరకు చౌకయ్యాయిద్విచక్ర వాహనాల ధరలు రూ.18,800 వరకు, కార్ల ధరలను రూ.4.48 లక్షల వరకు తగ్గిస్తున్నట్లు ఇప్పటికే కంపెనీలు ప్రకటించాయి. సేవలుజిమ్, యోగా సెంటర్లు, సెలూన్లు, హెల్త్ క్లబ్‌లు – 5% GSTరూ.7500 - అంతకంటే తక్కువ అద్దె కలిగిన హోటల్ గదులపై జీఎస్టీని 12% నుంచి 5 శాతానికి తగ్గింపు.. రూ.525 వరకు ఆదా. జీఎస్టీ తగ్గింపుతో పాటు ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ (ఐటీసీ) లేకుండా తగ్గించడం ఇందుకు కారణం. దినసరి వినియోగ వస్తువులు (5% GST)• టూత్‌పేస్ట్, సబ్బులు, షాంపూలు• హేర్ ఆయిల్, షేవింగ్ క్రీమ్, టాల్కం పౌడర్• బిస్కెట్లు, నంకీన్, జామ్, కెచప్, జ్యూస్• ప్యాకేజ్డ్ ఫుడ్స్, డైరీ ప్రొడక్టులు (నెయ్యి, పనీరూ, బటర్)• డ్రై ఫ్రూట్స్, ఐస్ క్రీమ్స్• సైకిల్స్, స్టేషనరీ, నోట్‌బుక్స్• చపాతీ, రొటీ, పరాటా, పిజ్జా బ్రెడ్అయితే హానికర ఉత్పత్తులపై మాత్రం జీఎస్టీ 28% నుంచి 40 శాతానికి పెరిగింది. అంటే సిగరెట్లు, గుట్కాలు తదిరాలు. - చక్కెర కలిగిన లేదా ఫ్లేవర్ కలిగిన నాన్-అల్కహాలిక్ బీవరేజెస్, విలాసవంతమైన హైఎండ్ కార్లు (350cc పైగా బైకులు, 1200cc పెట్రోల్ కార్లు, 500ccపైన డీజీల్ కార్లు, 4 మీటర్ల కంటే పొడవున్న కార్లు, ఎస్‌యూవీలు), హెలికాప్టర్లు, యాచ్‌లు, ఆన్లైన్ గేమింగ్ & బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, గేమింగ్ యాప్స్ (రియల్ మనీ గేమ్స్), కోల్, లిగ్నైట్, పీట్ (Coal products), డైమండ్స్.. ప్రెషస్ స్టోన్స్ ఇలా విలాసవంతమైన వస్తువులకు జీఎస్టీ పెరిగింది. జీఎస్టీ అంటే Goods and Services Tax. ఇది ఒక ఏకీకృత పన్ను విధానం, అంటే దేశవ్యాప్తంగా అన్ని రకాల పన్నులను కలిపి ఒకే పన్నుగా వసూలు చేసే విధానం. 2017లో ఇది అమల్లోకి వచ్చింది. అయితే.. జీఎస్టీ 2.0లో గతంలో ఉన్న నాలుగు శ్లాబ్‌లను నుంచి రెండుకు తగ్గించింది కేంద్రం. అందులో ఉన్న 12, 28 శాతం శ్లాబ్‌లను తొలగించింది కేంద్రం. దీంతో ఇకపై జీఎస్టీలో 5, 18 శాతం శ్లాబ్‌లే కొనసాగనున్నాయి. అదే సమయంలో నిత్యావసరాలపై 5 శాతం జీఎస్టీ విధించాలని నిర్ణయించింది. 12 శాతంలో ఉండే 99 శాతం వస్తువులపై 5 శాతం జీఎస్టీ, 28 శాతం ఉండే 99 శాతం వస్తువులపై 18 శాతం జీఎస్టీ విధిస్తారు. తాజా సవరణలతో.. ఒకే పన్ను-ఒకే విధానం లక్ష్యాన్ని మరింత సమర్థవంతంగా అమలు కావొచ్చని కేంద్రం ఆశిస్తోంది. -
రేపటి నుంచే కొత్త జీఎస్టీ: ధరలు తగ్గే వస్తువులు ఇవే..
జీఎస్టీ సంస్కరణలు రేపటి (సెప్టెంబర్ 22) నుంచే అమలులోకి రానున్నాయి. దీంతో వంటగదిలో ఉపయోగించే వస్తువుల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు, మందుల (మెడిసిన్స్) దగ్గర నుంచి ఆటోమొబైల్స్ వరకు చాలా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. వినియోగదారులకు వరంలాగా.. జీఎస్టీ కౌన్సిల్.. నవరాత్రి మొదటి రోజు నుంచి రేట్లను తగ్గించాలని నిర్ణయించింది.రేపటి నుంచి ధరలు తగ్గనున్న వస్తువుల జాబితాలో నెయ్యి, పనీర్, వెన్న, నామ్కీన్, కెచప్, జామ్, డ్రై ఫ్రూట్స్, కాఫీ, ఐస్ క్రీములు వంటివాటితో పాటు.. టీవీ, ఏసీ, వాషింగ్ మెషీన్స్ కూడా ఉన్నాయి.ఔషధాలు, గ్లూకోమీటర్లు, డయాగోనిస్టిక్ కిట్ల ధరలు తగ్గనున్నాయి. సిమెంట్ 18 శాతం జీఎస్టీ పరిధిలోకి రావడంతో.. గృహనిర్మాణదారులు ప్రయోజనం పొందుతారు. GST తగ్గింపు ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, ఫార్మసీలు తమ MRPని సవరించాలని లేదా తక్కువ రేటుకు మందులను విక్రయించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.జీఎస్టీ రేటు తగ్గింపు వల్ల.. ఆటోమొబైల్ కొనుగోలుదారులు లాభపడతారు.ఇప్పటికి దాదాపు అన్ని కార్ల కంపెనీలు తగ్గిన ధరలను వెల్లడించాయి. ఇవి రేపటి నుంచే అమలులోకి రానున్నాయి. జీఎస్టీ సంస్కరణలు మాత్రమే కాకుండా.. ఫెస్టివల్ ఆఫర్స్ లేదా బెనిఫిట్స్ కూడా ఇప్పుడు వాహన కొనుగోలుదారులకు చాలా అనుకూలంగా మారనున్నాయి.హెయిర్ ఆయిల్, టాయిలెట్ సబ్బు బార్లు, షాంపూలు, టూత్ బ్రష్, టూత్ పేస్టు, టాల్కమ్ పౌడర్, ఫేస్ పౌడర్, షేవింగ్ క్రీమ్, ఆఫ్టర్-షేవ్ లోషన్ వంటి ఇతర రోజువారీ వినియోగ వస్తువుల ట్యాక్స్ తగ్గడంతో.. ధరలు మరింత చౌకగా మారనున్నాయి.ఇదీ చదవండి: తిరిగి వచ్చేయండి.. భయంతో జీవించవద్దు: శ్రీధర్ వెంబు -
జీఎస్టీ 2.0 రేపటి నుంచే.. ఈ చిన్న కార్లు మరింత చౌక!
జీఎస్టీ 2.0 కొత్త నిర్మాణం సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి రానుంది. సవరించిన పన్ను నిర్మాణం కారణంగా దేశంలో ప్యాసింజర్ వాహనాలపై పన్ను భారం గణనీయంగా తగ్గనుంది. ఫలితంగా దేశంలోని కార్ల తయారీ సంస్థలు ధరల తగ్గింపును ప్రకటించాయి. జీఎస్టీ తగ్గింపుతో హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ వంటి చిన్న కార్లలో ఎక్కువ ప్రయోజనం కనిపిస్తుంది. 10 పాపులర్ చిన్న కార్ల ధరలు ఎలా తగ్గుతున్నాయన్నది ఇప్పుడు చూద్దాం..మారుతి సుజుకి ఆల్టో కె10మారుతి సుజుకి ఆల్టో కె 10 దేశంలో అత్యంత చౌక ఐసీఈ-శక్తితో నడిచే హ్యాచ్ బ్యాక్. దాని ప్రాక్టికాలిటీ, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, అధిక విలువ ప్రతిపాదన కారణంగా ఆల్టో కె 10 ప్రైవేట్ కొనుగోలుదారుల విభాగంలోనే కాకుండా, క్యాబ్ విభాగంలో కూడా ప్రాచుర్యం పొందింది. మారుతి సుజుకి ఆల్టో కె 10 ధరలు వేరియంట్లను బట్టి రూ .107,600 వరకు తగ్గాయి. సెప్టెంబర్ 22 నుంచి చిన్న హ్యాచ్ బ్యాక్ ధర రూ .369,900 (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతుంది.మారుతి సుజుకి ఎస్-ప్రెస్సోమారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ప్రైవేట్, టాక్సీ విభాగాలలో భారతదేశంలో మరొక ప్రసిద్ధ హ్యాచ్ బ్యాక్. 1.0-లీటర్ ఇంజిన్, మినీ ఎస్ యూవీ స్టాన్స్ డిజైన్ ఫిలాసఫీతో నడిచే ఈ చిన్న హ్యాచ్ బ్యాక్ ప్రారంభ ధర రూ .349,900 (ఎక్స్-షోరూమ్) వద్ద లభిస్తుంది. ఎస్-ప్రెస్సో వేరియంట్ ను బట్టి రూ .129,600 వరకు ధర తగ్గింది.మారుతి సుజుకి సెలెరియోఆల్టో కె 10 లేదా ఎస్-ప్రెస్సో అంత ప్రాచుర్యం పొందకపోయినా మారుతి సుజుకి సెలెరియో కూడా దాని కాంపాక్ట్ డిజైన్, మెరుగైన ఫీచర్లతో చాలా మంది కస్టమర్లను ఆకర్షిస్తూనే ఉంది. ఇది సెప్టెంబర్ 22 నుండి రూ .469,900 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు లభిస్తుంది. మారుతి సుజుకి ఈ మోడల్‌కు రూ .94,100 వరకు ధర తగ్గింపును ప్రకటించింది.మారుతి సుజుకి వ్యాగన్ఆర్ఆల్టో కె 10 తర్వాత మారుతి సుజుకి నుండి అత్యంత ప్రాచుర్యం పొందిన హ్యాచ్ బ్యాక్ మారుతి సుజుకి వ్యాగన్ఆర్. ఈ టాల్ బాయ్ హ్యాచ్ బ్యాక్ భారతదేశంలో చాలా కాలంగా వ్యాపారంలో ఉంది. ముఖ్యంగా టాక్సీ విభాగంలో ఇప్పటికీ దానికి కస్టమర్ల ఆదరణ కొనసాగుతోంది. జీఎస్టీ తగ్గింపు తరువాత, మారుతి సుజుకి వ్యాగన్ఆర్ రూ .498,900 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభిస్తుంది. తగ్గింపు రూ .79,600.మారుతి సుజుకి స్విఫ్ట్ఆల్ టైమ్ బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఒకటి, భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన కాంపాక్ట్ కారు మారుతి సుజుకి స్విఫ్ట్. జిఎస్టి 2.0 కింద దీనినై రూ .84,600 వరకు ధరను తగ్గించింది కంపెనీ. సెప్టెంబర్ 22 నుండి ఈ హ్యాచ్ బ్యాక్ ప్రారంభ ధర రూ .578,900 (ఎక్స్-షోరూమ్) వద్ద లభిస్తుంది.మారుతి సుజుకి బాలెనోనెక్సా రిటైల్ నెట్ వర్క్ ద్వారా విక్రయించే మారుతి సుజుకి బాలెనో ప్రీమియం హ్యాచ్ బ్యాక్ ప్రారంభ ధర రూ .598,900 (ఎక్స్-షోరూమ్) వద్ద లభిస్తుంది. జీఎస్టీ 2.0 పాలనలో ఈ హ్యాచ్ బ్యాక్ ధర రూ.86,100 వరకు తగ్గింది.మారుతి సుజుకి ఇగ్నిస్మారుతి సుజుకి నుండి వచ్చిన స్పోర్టీ,కాంపాక్ట్ హ్యాచ్ బ్యాక్ మారుతి సుజుకి ఇగ్నిస్. నెక్సా రిటైల్ చైన్, ఇగ్నిస్ ద్వారా కంపెనీ దీన్ని విక్రయిస్తోంది. సవరించిన పన్ను నిర్మాణం కింద దీని ధర రూ .71,300 వరకు తగ్గింది. ఈ హ్యాచ్ బ్యాక్ సెప్టెంబర్ 22 నుండి ప్రారంభ ధర రూ .535,100 (ఎక్స్-షోరూమ్) వద్ద లభిస్తుంది.టాటా టియాగోటాటా టియాగో అధిక ఎన్సీఏపీ సేఫ్టీ రేటింగ్ తో పాటు ప్రీమియం ఫీచర్లు, కఠినమైన బిల్డ్ క్వాలిటీతో భారతీయ హ్యాచ్ బ్యాక్ మార్కెట్లో గేమ్ చేంజర్ ఈ కారు. ఎస్‌యూవీలపై ఎక్కువ దృష్టి పెట్టినప్పటికీ, టాటా మోటార్స్ టియాగో హ్యాచ్ బ్యాక్ ను భారతదేశంలో విక్రయిస్తూనే ఉంది. మారుతి సుజుకి స్విఫ్ట్ కు పోటీ అయిన ఈ హ్యాచ్ బ్యాక్ కొత్త పన్ను విధానంలో రూ .75,000 వరకు ధర తగ్గింపును పొందింది.టాటా ఆల్ట్రోజ్మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఐ20 వంటి ప్రత్యర్థులతో నేరుగా పోటీ పడే టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ జీఎస్టి 2.0 కింద రూ .110,000 భారీ ధర తగ్గింపును పొందింది. పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఎంపికలతో పాటు విస్తృత రేంజ్ ట్రాన్స్మిషన్ ఎంపికలలో లభిస్తుంది. ఆల్ట్రోజ్ సెప్టెంబర్ 22 నుండి ప్రారంభ ధర రూ .630,390 (ఎక్స్-షోరూమ్) వద్ద లభిస్తుంది.హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్దక్షిణ కొరియా ఆటో బ్రాండ్ ఇండియా లైనప్ లో ఎంట్రీ లెవల్ మోడల్ అయిన హ్యుందాయ్ గ్రాండ్ ఐ20 నియోస్.. జీఎస్టి 2.0 పాలనలో రూ .73,800 వరకు ధరను తగ్గించింది. దీనితో ఈ హ్యాచ్ బ్యాక్ సెప్టెంబర్ 22 నుండి రూ .547,278 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు లభిస్తుంది. -
జీఎస్టీ తగ్గింపును కస్టమర్లకు బదలాయించండి
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గింపు ప్రయోజనాలను కస్టమర్లకు బదలాయించడంపై దృష్టి పెట్టాలని దేశీ పరిశ్రమకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ సూచించారు. దీని వల్ల పరిశ్రమకు కూడా లబ్ధి చేకూరుతుందన్నారు. మరోవైపు, పరిశ్రమకు లావాదేవీల వ్యయాలను తగ్గించే దిశగా సమగ్ర రాష్ట్ర, నగర లాజిస్టిక్స్ ప్రణాళికలను ఆయన ఆవిష్కరించారు.ఎనిమిది రాష్ట్రాలవ్యాప్తంగా ఇవి అమలవుతాయి. ప్రస్తుత లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు, అంతరాలను గుర్తించడం, సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం, వ్యయాలను తగ్గించుకోవడానికి సంబంధించి మార్గదర్శ ప్రణాళికను రూపొందించేందుకు ఈ ప్రణాళిక తోడ్పడుతుంది. అటు వాణిజ్య చర్చల కోసం సెపె్టంబర్ 22న భారత అధికారిక బృందాన్ని తీసుకుని గోయల్ అమెరికా వెళ్లనున్నట్లు కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. -
జీఎస్టీ సంస్కరణలు దీపావళి ముందే ఎందుకంటే..
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న జీఎస్టీ సంస్కరణలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి ప్రశంసించారు. ఇది దేశంలోని ప్రతి పౌరుడికీ భారీ విజయమని ఆమె అభివర్ణించారు. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ మాట్లాడారు.దీపావళి పండుగకు ముందు జీఎస్టీ సంస్కరణల అమలు ఎందుకన్నదానిపైనా ఆర్థిక మంత్రి వివరణ ఇచ్చారు. భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి వారి సొంత పండుగలు ఉంటాయన్న నిర్మలా సీతారామన్.. దీపావళి పండుగకు ముందు జీఎస్టీ సంస్కరణల అమలును ప్రారంభించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలకు ముందే నిర్ణయించినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు.చెన్నై సిటిజన్స్ ఫోరం నిర్వహించిన 'ట్యాక్స్ రిఫార్మ్స్ ఫర్ రైజింగ్ భారత్' కార్యక్రమంలో ఆమె ప్రసంగిస్తూ, దేశ ప్రజలు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు అన్ని ఉత్పత్తులపైనా జీఎస్టీ ప్రయోజనకరమైన ప్రభావం ఉంటుందని ఆమె అన్నారు.జీఎస్టీ కింద గతంలో 12 శాతం పన్ను విధించిన 99 శాతం వస్తువులను ఇప్పుడు 5 శాతానికి తగ్గించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా ఇప్పటివరకు ఉన్న శ్లాబులను రెండు శ్లాబులకే జీఎస్టీ కౌన్సిల్ కుదించింది. ఇకపై 5, 28 శాతం పన్ను శ్లాబులు మాత్రమే కొనసాగనున్నాయి. తాజా జీఎస్టీ సంస్కరణలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి.ఇదీ చదవండి: ఐటీఆర్ గడువు పొడిగిస్తారా? వెల్లువెత్తుతున్న విజ్ఞప్తులు -
అమెరికా టారిఫ్‌ల ప్రభావం ఇదిగో ఇంతే..
అమెరికా టారిఫ్‌ల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీపై నికరంగా పడే ప్రభావం 0.2–0.3 శాతం వరకు ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ అంచనా వేశారు. అయితే జీఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశీ డిమాండ్‌ను పెంచడం ద్వారా ఈ ప్రభావాన్ని భర్తీ చేస్తాయని అభిప్రాయపడ్డారు.ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద అమెరికాకు చేసిన ఎగుమతుల్లో సగం మేర ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఐదు నెలల్లోనే నమోదైనట్టు గుర్తు చేశారు.సుంకాలు స్వల్పకాలమే గానీ, దీర్ఘకాలం పాటు కొనసాగకపోవచ్చన్నారు. ఒకవేళ దీర్ఘకాలం పాటు కొనసాగితే అప్పుడు ద్వితీయ, తృతీయ అంచ ప్రభావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయంటూ.. పెట్టుబడులు, మూలధన వ్యయాలు, ఆర్థిక వ్యవస్థ సెంటిమెంట్‌పై దీని తాలూకూ అనిశ్చితి ఉంటుందని చెప్పారు.అయితే, జీఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశీయంగా బలమైన వినియోగ సృష్టి ద్వారా టారిఫ్‌ల తాలూకూ ద్వితీయ, తృతీయ అంచ ప్రభావాలను అధిగమించేందుకు సాయపడతాయన్నారు. కనుక మొత్తం మీద జీడీపీపై పడే ప్రభావం 0.3 శాతం మించి ఉండదన్నారు. 2025–26 సంవత్సరానికి 6.3–6.8% మధ్య జీడీపీ వృద్ధి నమోదు కావొచ్చన్న తమ అంచనాలను గుర్తు చేశారు.సాగులో సంస్కరణలు.. వ్యవసాయ రంగం జీడీపీకి మరో 0.5–0.70 శాతం వరకు తోడ్పాటునివ్వగలదని నాగేశ్వరన్ తెలిపారు. ఇందుకు గాను రైతులు వారు కోరుకున్న చోట విక్రయించే హక్కు అవసరమన్నారు. ప్రకృతి విపత్తులపై సాగు దిగుబడులు ఆధారపడి ఉన్నందున వారికి బీమా రూపంలోనూ దన్నుగా నిలవాలన్నారు. ప్రపంచ వాణిజ్యం విషయంలో అంతర్జాతీయ కరెన్సీగా ఉన్న డాలర్ స్థానాన్ని భర్తీ చేసే ఎలాంటి ప్రతిపాదన లేదని సీఈఏ అనంత నాగేశ్వరన్ స్పష్టం చేశారు.అటువంటి చర్యలో భారత్ పాలుపంచుకోదని ఓ ప్రశ్నకు సమాధనంగా చెప్పారు. డాలర్‌కు మెరుగైన ప్రత్యామ్నాయం ప్రస్తుతానికి లేదంటూ.. ఇందుకు చాలా కాలం పట్టొచ్చన్నారు. గతేడాది జరిగిన బ్రిక్స్ సదస్సులో భాగస్వామ్య దేశాల మధ్య వాణిజ్యానికి స్థానిక కరెన్సీల్లో చెల్లింపులకు, ప్రత్యేకంగా బ్రిక్స్ కరెన్సీ ఏర్పాటుకు అంగీకారం కుదరడం గమనార్హం. -
తగ్గనున్న పాల ప్యాకెట్ల ధరలు..
ప్రతి ఇంట్లో వాడే పాల ధరలు త్వరలో తగ్గనున్నాయి. ప్యాకేజ్డ్ మిల్క్ పై 5 శాతం జీఎస్టీ నుంచి మినహాయించాలని ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అమలులోకి వచ్చిన వెంటనే దేశంలోని దాదాపు అన్ని బ్రాండ్ల పాల ప్యాకెట్ల ధరలపైనా తక్షణ ఉపశమనం లభించనుంది.ఈ జీఎస్టీ మినహాయింపు నేరుగా సాధారణ వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎందుకంటే పాలపై 5% పన్ను సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ఉండదు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో పాలు వంటి నిత్యావసర వస్తువులను మరింత అందుబాటులో ధరల్లోకి తీసుకురావాలనేది ఈ చర్య ఉద్దేశం.దేశంలో ఎక్కువ మంది వినియోగిస్తున్న ప్రముఖ పాల ఉత్పత్తుల బ్రాండ్లలో ఒకటైన అమూల్, మదర్ డెయిరీ ప్రస్తుత ధరలు, జీఎస్టీ తొలగింపు అమల్లోకి వచ్చిన తర్వాత ఎంత తగ్గుతాయన్నది ఈ కింద చూద్దాం. అమూల్ ఉత్పత్తులలో ఫుల్ క్రీమ్ మిల్క్ 'అమూల్ గోల్డ్' ధర ప్రస్తుతం లీటరుకు రూ. 69 కాగా, టోన్డ్ మిల్క్ రూ.57. అదే విధంగా మదర్ డైరీ ఫుల్ క్రీమ్ మిల్క్ రూ. 69, టోన్డ్ మిల్క్ సుమారు రూ.57 ఉంది. గేదె, ఆవు పాలు ధరలు కూడా రూ.50-75 మధ్య ఉన్నాయి.జీఎస్టీ ఎత్తివేసిన తర్వాత ధరలు ఎంత తగ్గుతాయి?ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం పాల ధరలు లీటరుకు రూ.3 నుంచి రూ.4 వరకు తగ్గుతాయి. ఉదాహరణకు, అమూల్ గోల్డ్ ధర సుమారు రూ .65-66 కు తగ్గుతుంది, మదర్ డెయిరీ ఫుల్ క్రీమ్ మిల్క్ ధర కూడా అదే స్థాయిలో తగ్గుతుందని భావిస్తున్నారు. టోన్డ్ మిల్ఖ్, గేదె పాలపై కూడా ఇలాంటి ఉపశమనం కనిపిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది వినియోగించే విజయ ప్యాకేజ్డ్ పాలు కూడా జీఎస్టీ మినహాయింపు తర్వాత లీటర్‌కు రూ.2 నుంచి రూ.3 తగ్గే అవకాశం ఉంది.పాల రకంప్రస్తుత ధర (లీటరుకు)కొత్త ధర (లీటరుకు)అమూల్ గోల్డ్ (ఫుల్ క్రీమ్)₹69₹65–66అమూల్ ఫ్రెష్ (టోన్డ్)₹57₹54–55అమూల్ టీ స్పెషల్₹63₹59–60అమూల్ గేదె పాలు₹75₹71–72అమూల్ ఆవు పాలు₹58₹55–57మదర్ డైరీ ఫుల్ క్రీమ్₹69₹65–66మదర్ డైరీ టోన్డ్ మిల్క్₹57₹55–56మదర్ డైరీ గేదె పాలు₹74₹71మదర్ డైరీ ఆవు పాలు₹59₹56–57 -
టయోటా కార్ల ధరల తగ్గింపు.. ఫార్చూనర్పై రూ.3.5 లక్షలు..
జీఎస్టీ తగ్గింపు, పరిహార సెస్ రద్దు వాహన కొనుగోలుదారులతో పాటు తయారీదారులకు భారీ ఉపశమనం కలిగించింది. ఇది కార్లు, ద్విచక్ర వాహనాలతో సహా అన్ని రకాల వాహనాల ధరలపైనా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది. ఫలితంగా, వాహన తయారీ సంస్థలు తమ అన్ని మోడళ్ల సవరించిన ధరలను ప్రకటించడం ప్రారంభించాయి.తాజాగా జపాన్ ఆటో దిగ్గజం టయోటా తమ అన్ని కార్లపై ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చే రోజు అంటే సెప్టెంబర్ 22 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. సకాలంలో డెలివరీలు అందుకోవడానికి పండుగ సీజన్ ప్రారంభానికి ముందే వీలైనంత త్వరగా బుకింగ్‌లను కన్ఫర్మ్ చేసుకోవాలని కస్టమర్లను కోరింది.కొన్ని ప్రీమియం మోడళ్ల తగ్గింపు ధరలను కంపెనీ ప్రకటించింది. తాజా అప్ డేట్ ప్రకారం. అత్యధికంగా ఫార్చ్యూనర్ ధర రూ .3.49 లక్షల వరకు తగ్గుతుంది. దీని తరువాత మరో ప్రీమియం వేరియంట్ లెజెండర్ ధర రూ .3.34 లక్షల వరకు తగ్గనుంది. ఫార్చ్యూనర్, లెజెండర్ ధరలు వరుసగా రూ .36.05 లక్షలు, రూ .44.51 లక్షలు (రెండూ ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. తమ లైనప్ లోని ప్రతి మోడల్ ప్రతి వేరియంట్ సవరించిన ధరలను టయోటా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.సవరించిన జీఎస్టీ నిర్మాణం అన్ని విభాగాలలో కార్ల ధరలను తగ్గించింది. 4 మీటర్ల లోపు పరిమాణం ఉన్న చిన్న కార్లపై (1,200సీసీ వరకు పెట్రోల్ ఇంజిన్లు లేదా 1,500 సీసీ వరకు డీజిల్ ఇంజిన్లు) ఇకపై 28% బదులుగా 18% జీఎస్టీ వర్తిస్తుంది.దీంతో వీటి ధరలు 5-13% తగ్గుతున్నాయి.ఇక 4 మీటర్ల కంటే ఎక్కువ పరిమాణం, పెద్ద ఇంజిన్లు ఉన్న పెద్ద కార్లపై 28 శాతం జీఎస్టీకి బదులుగా 40 శాతం (ప్రత్యేక శ్లాబ్) జీఎస్టీ విధిస్తారు. అయితే సెస్ తొలగింపుతో వీటి ధరలు కూడా 3-10% తగ్గే అవకాశం ఉంది. -
జీఎస్టీ 2.0.. స్వదేశీ అని గర్వంగా చెప్పండి: ప్రధాని మోదీ
జీఎస్టీ 2.0 పేరిట తెచ్చిన సంస్కరణలను మేక్ ఇన్ ఇండియా ప్రచారంలో భాగంగానే పరిగణించాలని.. వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఎన్డీయే ఎంపీలకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. సోమవారం ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన.. ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. GST 2.0 సంస్కరణల గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ప్రతి ఎంపీ తమ నియోజకవర్గంలో 20 నుంచి 30 సమావేశాలు నిర్వహించాలి. స్థానిక వ్యాపారులు, దుకాణదారులకు GST 2.0 ప్రయోజనాలు వివరించాలి. నవరాత్రి నుంచి దీపావళి మధ్య.. స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహం కోసం స్థానిక హస్తకళాకారులు, చిన్న పరిశ్రమలు పాల్గొనే స్వదేశీ ప్రదర్శనలు, జాతరలు నిర్వహించాలి. గర్వంగా చెప్పండి.. ఇది స్వదేశీ అనే నినాదంతో అన్ని రంగాల్లోనూ ఎగ్జిబిషన్లు నిర్వహించాలని సూచించారు.అదే సమయంలో పంజాబ్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వరదలు కారణంగా ఎన్డీయే ఎంపీల విందు కార్యక్రమాన్ని ఆయన వాయిదా వేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, నేను ఉత్సవ విందు ఎలా నిర్వహించగలను? అని అన్నారాయన. ప్రజలపై పన్ను భారం తగ్గించడంతో పాటు భారత ఎకానమీకి బూస్ట్ ఇస్తుందని భావిస్తోంది. జీఎస్టీ 2.0 అనేది భారత ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా పన్ను సంస్కరణ. ఇది 2025 సెప్టెంబర్ 22 నుండి అమలులోకి రానుంది. 2017లో ప్రారంభమైన జీఎస్టీ వ్యవస్థకు పెద్ద మార్పుగా భావించబడుతోంది.ప్రధాన మార్పులు:• పాత slabs: 0%, 5%, 12%, 18%, 28% + cess• కొత్త slabs: 0%, 5%, 18%, 40% (cess తొలగింపు)ధరలు తగ్గిన వస్తువులు:👉అవశ్యక వస్తువులు: పన్ను 0%పన్నీర్, చపాతీ, UHT పాలు, అవసరమైన ఔషధాలు👉 ప్రాముఖ్యమైన వినియోగ వస్తువులు: 5%షాంపూ, టూత్‌పేస్ట్, హేర్ ఆయిల్, వ్యవసాయ పరికరాలు👉సాధారణ వస్తువులు: 18%TVs, ACs, వాషింగ్ మెషీన్లు, చిన్న కార్లు👉లగ్జరీ & హానికర వస్తువులు: 40%పొగతాగే పదార్థాలు, పాన్ మసాలా, లగ్జరీ కార్లు👉ఆటోమొబైల్ రంగంపై ప్రభావం.. చిన్న కార్లు: GST 28% → 18% (ధరలు తగ్గాయి). బెండ్స్, టాటా, హ్యుందాయ్, రెనాల్ట్ వంటి కంపెనీలు రూ. 60,000–₹10 లక్షల వరకు ధరలు తగ్గించాయి👉 ఇన్సూరెన్స్ పాలసీలు: జీవన, ఆరోగ్య బీమాలపై GST పూర్తిగా మాఫీ👉పాఠశాల వస్తువులు: పెన్సిల్, షార్పెనర్, నోట్‌బుక్‌లపై పన్ను తగ్గింపు👉వ్యవసాయ పరికరాలు: ట్రాక్టర్లు, డ్రిప్ ఇరిగేషన్, కంపోస్టింగ్ యంత్రాలు — 5% GSTజీఎస్టీ 2.0 లక్ష్యాల్లో ప్రధానమైంది సాధారణీకరణ. పన్ను slabs తగ్గించడం ద్వారా వ్యాపారులకు సులభతరం అవుతుంది. అవసరమైన వస్తువులపై పన్ను తగ్గింపుతో పాటు ఆర్థిక వృద్ధికి తోడ్పాటు, తద్వారా వినియోగం పెరగడం ద్వారా GDP వృద్ధి చెందుతుంది. పన్ను వ్యవస్థలో స్పష్టత, పారదర్శకత కారణంగా.. వివాదాలు, విమర్శలు తొలగిపోతాయనే ఆలోచనతోనూ ఎన్డీయే ప్రభుత్వం ఉంది. -
జావా, యెజ్డి బైక్‌ల ధరలు తగ్గింపు.. కొత్త రేట్లు ప్రకటించిన కంపెనీ
క్లాసిక్ లెజెండ్స్ (సీఎల్) తమ జావా, యెజ్డి బైక్‌ల కొత్త ధరలను ప్రకటించింది. వీటిలో అడ్వెంచర్, రోడ్‌స్టర్, బాబర్ నుండి స్క్రాంబ్లర్ వరకు ఉన్నాయి. ఇప్పుడివి రూ .2 లక్షల లోపు అందుబాటులో ఉన్నాయి. పర్యావరణానికి పనికిరాదని భావించిన టూ స్ట్రోక్ మోటార్ సైకిల్ ను నిషేధించిన విధాన మార్పు కారణంగా భారతదేశంలో జావా, యెజ్డీ అమ్మకాలను కంపెనీ గతంలో నిలిపివేసింది. అయితే జీఎస్టీ 2.0 సంస్కరణలతో, జావా, యెజ్డీ బైక్‌లు తిరిగి రోడ్లపైకి వస్తాయని కంపెనీ తెలిపింది.350 సీసీ లోపు మోటార్ సైకిళ్లపై జీఎస్టీని తగ్గించి 18 శాతం పరిధిలోకి తీసురావడాన్ని స్వాగతిస్తున్నట్లు జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ సహ వ్యవస్థాపకుడు అనుపమ్ తరేజా చెప్పారు. జీఎస్టీ తగ్గింపుతో తమ 293 సీసీ జావా, 334 సీసీ యెజ్డి పర్ఫార్మెన్స్ క్లాసిక్ బైక్‌ల ధరలు కస్టమర్లకు మరింత అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొన్నారు.కొత్త ధరలు ఇవే42 మోడల్ పాత ధర రూ.1,72,942 కాగా కొత్త ధర రూ.1,59,431 తగ్గింపు రూ. 13,511జావా 350 పాత ధర రూ.1,98,950, కొత్త ధర రూ.1,83,407, తగ్గింపు రూ.15,54342 బాబర్ పాత ధర రూ.2,09,500, కొత్త ధర రూ.1,93,133, తగ్గింపు రూ.16,36742 బాబర్ (ఇంకొక వేరియంట్) పాత ధర రూ.2,10,142, కొత్త ధర రూ.1,93,725, తగ్గింపు రూ.16,417పెరక్ పాత ధర రూ.2,16,705, కొత్త ధర రూ.1,99,775, తగ్గింపు రూ.16,930 -
జీఎస్టీ 2.0.. కాంగ్రెస్ క్రెడిట్‌పై నిర్మలమ్మ చురకలు
వస్తు సేవల పన్ను (GST) 2.0 క్రెడిట్ ముమ్మాటికీ తమదేనంటున్న కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చురకలంటించారు. గతంలో జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని విమర్శించినవాళ్లే.. ఇప్పుడు GST 2.0కు క్రెడిట్ తీసుకుంటున్నారని అన్నారామె. గతంలో వస్తు సేవల పన్నును గబ్బర్ సింగ్ టాక్స్ అని అభివర్ణించిన ప్రతిపక్ష నేతలు.. ఇప్పుడు అదే పన్ను వ్యవస్థలో మార్పుల క్రెడిట్‌ను ఖాతాలో వేసుకుంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ‘‘GST 2.0 అనేది ప్రజల కోసం, వ్యాపారాల కోసం తీసుకున్న నిర్ణయం. ఇది రాజకీయ విమర్శలకు సమాధానం కాదు. కానీ, గతంలో దీనిని ‘గబ్బర్ సింగ్ టాక్స్’ అని పిలిచినవాళ్లే ఇప్పుడు దీన్ని తమ విజయం అని చెప్పుకోవడం ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది అని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ అన్నారు.అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ తమ పాలనలో దీన్ని ఎందుకు అమలు చేయలేకపోయిందో చెప్పాలి? అని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తమ పాలనలో GST అమలు చేయడం అసాధ్యమని భావించిందని, కానీ మోదీ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసి, ఇప్పుడు రెండో దశ సంస్కరణలు కూడా తీసుకువస్తోందని పేర్కొన్నారు.పన్ను శ్లాబ్‌ల సరళీకరణ, 5% & 18% ప్రధాన శ్లాబ్‌లు, 40% సిన్ టాక్స్ (తంబాకూ, లగ్జరీ వస్తువులపై) GST 2.0లో కీలక మార్పులని చెప్పొచ్చు. అయితే.. 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి దీనిని ఆయుధంగా చేసుకునే ప్రతిపక్షాలు ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. జీఎస్టీ 2.0పై స్పందించిన కాంగ్రెస్ నేతలు.. ఇది రాహుల్ గాంధీ 2016లో సూచించిన 18% GST క్యాప్‌ను అనుసరించడమే అని పేర్కొన్నారు. GST 2.0లో సాధారణ వినియోగదారులకు ప్రయోజనం కలగాలన్న ఉద్దేశంతో తీసుకున్న చర్యలపై తమ పాత్రను గుర్తు చేశారు.ఇదిలా ఉంటే.. జీఎస్టీని గబ్బర్ సింగ్ టాక్స్ అని మొదటగా పిలిచిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ. 2017 అక్టోబర్‌లో గుజరాత్ గాంధీనగర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఈ వ్యాఖ్య చేశారు. జీఎస్టీలో 28% అత్యధిక పన్ను ఉంది, మూడు రిటర్న్ ఫారమ్‌లు ఉన్నాయి. ఇది ప్రజలపై భారం పెడుతోంది. ఇది గబ్బర్ సింగ్ టాక్స్లా ఉంది అని అన్నారాయన. బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ షోలేలోని విలన్ గబ్బర్ సింగ్ లాగా, ప్రభుత్వం ప్రజల వద్ద నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తోందన్న ఉద్దేశంతో ఆయన పై వ్యాఖ్య చేశారు. GST అమలులో బహుళ పన్ను శ్లాబ్‌లు, క్లిష్టమైన కంప్లయన్స్ విధానం ఉండటం వల్ల చిన్న వ్యాపారులు, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆ సమయంలో ప్రతిపక్షాలు ఆరోపించాయి కూడా.