
కొత్త జీఎస్టీ (GST) ఈ రోజు (సోమవారం) అమలులోకి వచ్చింది. అంతకంటే ముందు అమెరికన్ కార్ల తయారీ సంస్థ అయిన జీప్ (Jeep) ఇండియన్ మార్కెట్లోని తన కార్ల ధరలను గరిష్టంగా రూ. 4.57 లక్షలు తగ్గించినట్లు ప్రకటించింది. ఈ కొత్త రేట్లు కూడా నేటి నుంచే (సెప్టెంబర్ 22) నుంచి అమల్లోకి వస్తాయి.
➤జీప్ కంపాస్: పాత ధర రూ. 18.99 లక్షలు & కొత్త ధర రూ. 17.73 లక్షలు (రూ. 1.26 లక్షలు తగ్గింది)
➤జీప్ మెరిడియన్ : పాత ధర రూ. 24.99 లక్షలు & కొత్త ధర రూ. 23.33 లక్షలు (రూ. 1.66 లక్షలు తగ్గింది)
➤జీప్ రాంగ్లర్ : పాత ధర రూ. 68.65 లక్షలు & కొత్త ధర రూ. 64.08 లక్షలు (రూ. 4.57 లక్షలు తగ్గింది)
➤జీప్ గ్రాండ్ చెరోకీ : పాత ధర రూ. 67.50 లక్షలు & కొత్త ధర రూ. 63.00 లక్షలు (రూ. 4.50 లక్షలు తగ్గింది)
ఇదీ చదవండి: జీఎస్టీ 2.0 ఎఫెక్ట్: చౌకగా లభించే కార్ల జాబితా
జీప్ కంపెనీ ఇప్పటి వరకు భారతదేశంలో లాంచ్ చేసిన దాదాపు అన్ని కార్లు మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉన్నాయి. ఇవి రోజువారీ వినియోగానికి మాత్రమే కాకుండా.. ఆఫ్ రోడింగ్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ కారణంగానే ఇవి దేశీయ విఫణిలో మంచి అమ్మకాలను పొందగలుగుతున్నాయి.