
భారతదేశంలో ఎక్కువమంది మారుతి సుజుకి కార్లను కొనుగోలు చేస్తుంటారు. దీనికి కారణం మల్టిపుల్ మోడల్స్ ఉండటం, ధరలు కొంత తక్కువ కావడం. ఇందులో చెప్పుకోదగ్గ కారు.. దశాబ్దాల చరిత్ర కలిగిన మోడల్ మారుతి ఆల్టో కే10. జీఎస్టీ తగ్గింపు, పండుగ ఆఫర్స్ కలిసి రావడంతో దీని ధర ఇప్పుడు మరింత తగ్గిపోయింది.
రూ. 4.23 లక్షల ధర వద్ద లభిస్తున్న మారుతి ఆల్టో కే10 బేస్ వేరియంట్ ఇప్పుడు రూ. 3.70 లక్షల ధరకే లభిస్తుంది. అంటే దీని ధర మునుపటి కంటే రూ. 53000 తక్కువ. టాప్ వేరియంట్ అయిన VXi Plus (O) AMT ధర ఇప్పుడు రూ. 64000 తగ్గి.. రూ. 5.45 లక్షలకు అందుబాటులో ఉంది. జీఎస్టీ 2.0 కంటే ముందు దీని ధర రూ. 6.09 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).
ఇదీ చదవండి: ఎన్ని కార్లు ఉన్నా.. బ్లాక్ బీస్ట్ అంటేనే ఇష్టం: ఆనంద్ మహీంద్రా
మారుతి ఆల్టో కే10 మల్టిపుల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. కంపెనీ అన్ని వేరియంట్ల ధరలను.. కొత్త జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత తగ్గించింది. ఈ కారు చూడటానికి పరిమాణంలో కొంత చిన్నగా ఉన్నప్పటికీ.. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి రోజువారీ వినియోగానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కారణంగానే.. ఈ కారును చాలామంది ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు.