
దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా.. ఆటోమొబైల్ ఔత్సాహిలు. ఈ కారణంగానే పలు కార్లను వినియోగిస్తున్నారు. అయితే ఈయన ఉపయోగించే అన్ని కార్లు కూడా స్వదేశీ ఉత్పత్తులే. ముఖ్యంగా తనకు బొలెరో అంటే చాలా ఇష్టమని.. దీనిని ఆయన బ్లాక్ బీస్ట్ అని పిలుస్తారని గతంలో వెల్లడించారు. ఇప్పుడు తాజాగా ఓ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
మా మొట్టమొదటి హార్డ్ టాప్ ఎస్యూవీ అయిన 'మహీంద్రా అర్మాడ' మొదటిసారి విడుదలైనప్పటి నుంచి.. నేను మరే ఇతర కార్ బ్రాండ్‌ను నడపలేదు. అర్మడకు ముందు, నా దగ్గర హిందూస్తాన్ మోటార్స్ కాంటెస్సా ఉండేది!. అయితే నేను ఇప్పుడు మహీంద్రా లేటెస్ట్ కారు ఎక్స్ఈవీ 9ఈను ఉపయోగిస్తున్నప్పటికీ.. నాకు బొలెరో అంటేనే ఇష్టం అని నిజాయితీగా చెప్పగలను అని ఆనంద్
స్కార్పియో ప్రారంభించబడటానికి ముందే నేను "బ్లాక్ బీస్ట్" అనే మారుపేరుతో ఉన్న నా బొలెరోను స్వయంగా నడిపాను. ఇప్పుడు, బీస్ట్ తిరిగి వచ్చింది. ఇది సరికొత్త 2025 అవతార్‌లో ఉంది. వ్యాగన్ ఆర్ తరువాత.. 2000లో ప్రారంభించినప్పటి నుంచి నిరంతర ఉత్పత్తిలో ఉన్న పురాతన భారతీయ కార్ బ్రాండ్ బొలెరో. అది ఆల్టో కంటే కేవలం ఒక నెల ముందు వచ్చిందని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కొత్తకారు కొన్న రోహిత్ శర్మ: ఎలాన్ మస్క్ రీపోస్ట్..
కొన్నేళ్లుగా.. మహీంద్రా ఆటో బృందాలు బోలెరోను దశలవారీగా నిలిపేయాలని భావించప్పటికీ.. అది సాధ్యం కాలేదు. కానీ ఎప్పటికప్పుడు కొత్త హంగులతో అప్డేట్స్ పొందుతూనే ఉంది. ఇందులో భాగంగానే 2025 బొలెరో మార్కెట్లో లాంచ్ అయిందని వెల్లడించారు.
2025 మహీంద్రా బొలెరో
మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల కొత్త బొలెరో లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 7.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది చిన్న కాస్మొటిక్ అప్డేట్లతో పాటు.. కొత్త ఫీచర్స్ పొందుతుంది. అయితే యాంత్రికంగా ఎలాంటి అప్డేట్స్ పొందలేదు. ఇందులో 5 3 ఇంజిన్ ఉంటుంది. ఇది 76 హార్స్ పవర్, 210 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది.
Since the Mahindra Armada, our first hard-top SUV, first rolled out, I’ve never driven any other car brand.
(Before the Armada, I had a Hindustan Motors Contessa!)
And although today I use the XEV 9e, the most advanced vehicle Mahindra has ever built, I can honestly say that the… pic.twitter.com/K4Axlnmzi2— anand mahindra (@anandmahindra) October 11, 2025