
ప్రముఖ క్రికెటర్ రోహిత్ శర్మ.. ఇటీవల టెస్లా మోడల్ వై కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా టెస్లా చేసిన ఒక ట్వీట్ ఎలాన్ మస్క్ దృష్టిని ఆకర్షించింది.
''టెస్లా ప్రకటన చేయవలసిన అవసరం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో 45 మిలియన్ల మంది అనుచరులను కలిగి ఉన్న రోహిత్ శర్మ (భారత జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్) కొత్త టెస్లా మోడల్ వై కొనుగోలు చేశారు''. అనే పోస్టు టెస్లా సహ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ దృష్టిని ఆకర్షించడంతో.. దానిని రీపోస్ట్ చేశారు. ఎక్కువమంది ఫాలోవర్స్ ఉండటం చేత ఈ కారు గురించి అందరికి తెలుస్తుందనే ఉద్దేశ్యంతో కంపెనీ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.

టెస్లా మోడల్ వై గురించి
టెస్లా మోడల్ వై అనేది.. ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టెస్లా ఏకైక మోడల్. ఎంట్రీ లెవల్ మోడల్ Y రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్), లాంగ్ రేంజ్ RWD వెర్షన్ రూ. 67.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. రెండు మోడళ్ల డెలివరీలు 2025 మూడవ త్రైమాసికంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: లాంచ్‌కు ముందే అన్నీ కొనేశారు!
స్టాండర్డ్ మోడల్ Y RWD 60 kWh బ్యాటరీతో.. ఒక ఛార్జ్‌పై 500 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా లాంగ్ రేంజ్ వేరియంట్ 75 kWh బ్యాటరీ ఒక ఛార్జ్‌పై 622 కిమీ రేంజ్ అందిస్తుంది. రెండు వెర్షన్‌లు దాదాపు 295 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేసే ఒకే ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతాయి. పర్ఫామెన్స్ విషయానికి వస్తే.. టెస్లా మోడల్ వై బేస్ RWD మోడల్ 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది, అయితే లాంగ్ రేంజ్ వెర్షన్ కొన్ని 5.6 సెకన్లలో ఈ వేగాన్ని చేరుకుంటుంది. అయితే వీటి టాప్ స్పీడ్ 201 కిమీ/గం.
This is why Tesla doesn’t need to advertise - Rohit Sharma (captain of India’s national cricket team), who has 45M followers on Instagram, just bought a new Tesla Model Ypic.twitter.com/m02awSltMR https://t.co/XQSLYyo4XZ
— Teslaconomics (@Teslaconomics) October 9, 2025