
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి సోమవారం (సెప్టెంబర్ 8) భారతదేశంలోని అన్ని మోడళ్లలో ధరల తగ్గింపును ప్రకటించింది. జీఎస్టీ తగ్గింపు తరువాత కంపెనీ ఈ ప్రకటన చేసింది. ఇది ఆడి కార్ల కొనుగోలుదారులకు కొంత ప్రయోజనం చేకూరుస్తుంది.
GST 2.0 అమలు తర్వాత 'ఆడి ఇండియా' తన ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో అంతటా సవరించిన ధరలను ఒక ప్రకటనలో ప్రకటించింది. ధరల తగ్గుదల తరువాత మోడల్‌ను బట్టి రూ. 2.6 లక్షల నుంచి రూ. 7.8 లక్షల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. సరికొత్త ధరలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. పండుగ సీజన్‌కు ముందు కస్టమర్ డిమాండ్‌కు ధరల తగ్గింపు ఊతం ఇస్తున్నాయని ప్రకటన పేర్కొంది.
కొత్త ధరల ప్రకారం.. కంపెనీ ఎంట్రీ SUV క్యూ3 ధర రూ. 43.07 లక్షల నుండి ప్రారంభమవుతుంది. దీని ధర గతంలో రూ. 46.14 లక్షలు. అదే విధంగా టాప్ ఎండ్ SUV క్యూ8 ప్రారంభ ధర రూ. 1.1 కోట్లుగా ఉంటుంది. ఇది గతంలో రూ. 1.18 కోట్లుగా ఉండేది. సెడాన్లు A4, A6 లతో పాటు SUVలు క్యూ5, క్యూ7 వంటి ఇతర మోడళ్ల ధరలు కూడా తగ్గుతాయి.