
జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వచ్చాయి. సెప్టెంబర్ 22 నుంచి కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. అయితే కొన్ని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో ఆ ప్రయోజనాలను బదిలీ చేయడం లేదంటూ ఫిర్యాదులు వస్తున్నాయి. కొత్త జీఎస్టీ ప్రకారం.. ధరలు తగ్గించడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేంద్రం స్పందించింది.
మేము ధరల మార్పులను పర్యవేక్షిస్తున్నాము. కాబట్టి ఇప్పుడు వస్తున్న ఫిర్యాదులపై వెంటనే స్పందించలేము. సెప్టెంబర్ 30 నాటికి జీఎస్టీ అమలుకు సంబంధించిన నివేదిక అందుతుంది. నివేదిక అందిన తరువాత.. ఏవైనా సమస్యలు తలెత్తితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రెండు అమెరికా కంపెనీల నిర్ణయం: సీఈఓలుగా ఇండియన్స్
ఇప్పటికే ఆర్థిక మంత్రిత్వ శాఖ.. కేంద్ర జీఎస్టీ ఫీల్డ్ అధికారులకు లేఖ రాసింది. సాధారణంగా ఉపయోగించే వస్తువుల ధరల మార్పులపై నెలవారీ నివేదికను సమర్పించాలని కోరింది. బ్రాండ్ వారీగా ఈ వస్తువుల గరిష్ట రిటైల్ ధర (MRP) తులనాత్మక వివరాలపై మొదటి నివేదికను సెప్టెంబర్ 30లోపు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC)కి సమర్పించాలని వెల్లడించింది. ఈ నివేదిక తరువాత తదుపరి చర్యలు తీసుకోనుంది.