
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా నెట్‌వర్క్ విస్తరణపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో అదనంగా 500 కొత్త సర్వీసు వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేయనుంది. కోయంబత్తూర్‌లో తన 5,000వ అరీనా సర్వీసు టచ్‌పాయింట్ ప్రారంభించినట్లు తెలిపింది.
‘‘భవిష్యత్తులోనూ మా నెట్‌వర్క్‌ను మరింత విస్తరిస్తాము. గత ఆర్థిక సంవత్సరంలో అరీనా, నెక్సా నెట్‌వర్క్‌ల కింద 460 సర్వీస్ టచ్‌పాయింట్లను ఏర్పాటు చేశాయి. 2025–26లో అదనంగా 500 సరీ్వసు వర్క్‌షాప్‌లను ప్రారంభించే యోచనలో ఉన్నాము’’ అని మారుతీ సుజుకీ ఎండీ, సీఈవో హిసాషీ టకేయుచి తెలిపారు. కొత్త టచ్‌పాయింట్ల ఏర్పాటుతో మారుతీ సుజుకీ సరీ్వస్ నెట్‌వర్క్ 5,640కి చేరనుంది.