

సినీ నటుడు సాయికిరణ్ ఈ మధ్య ఓ శుభవార్త చెప్పాడు. 47 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు.

గతేడాది డిసెంబర్‌లో సహనటి స్రవంతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు స్రవంతి తల్లి కాబోతోంది.

ఈ మేరకు భార్య బేబీ బంప్ ఫోటోను షేర్ చేస్తూ తమ ఇంట్లోకి కొత్త మెంబర్ రాబోతోందని జంట ప్రకటించింది. సాయికిరణ్, స్రవంతి.. కోయిలమ్మ సీరియల్‌లో కలిసి నటించారు.

నువ్వే కావాలి, ప్రేమించు వంటి పలు సినిమాల్లో నటించిన సాయికిరణ్ సినిమాల్లోనే కాకుండా సీరియల్స్‌లోనూ యాక్ట్ చేశాడు.

కోయిలమ్మ, గుప్పెడంత మనసు, భానుమతి.. వంటి పలు సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

కాగా సాయికిరణ్ గతంలో వైష్ణవిని పెళ్లిచేసుకోగా వీరికి ఓ పాప ఉంది. విభేదాలు రావడంతో వీరు విడిపోయారు.






