
మారుతి సుజుకి త్వరలో జరగనున్న జపాన్ మొబిలిటీ షో 2025లో ప్రదర్శించబోయే.. మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కాన్సెప్ట్ గురించి వెల్లడించింది. ఇది 85 శాతం వరకు ఇథనాల్ బ్లెండింగ్‌కు మద్దతు ఇచ్చే ప్రస్తుత 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ట్వీక్డ్ వెర్షన్ ద్వారా శక్తిని పొందుతుందని సమాచారం. అయితే కంపెనీ ఫ్లెక్స్-ఫ్యూయల్ పవర్‌ట్రెయిన్ వివరాలను పూర్తిగా వెల్లడించలేదు.
జపాన్ మొబిలిటీ షోలో కనిపించనున్న ఫ్రాంక్స్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు డిజైన్ ముందు భాగంలో సుజుకి ఎటువంటి మార్పులకు లోను కాలేదు. అయితే సైడ్ ప్రొఫైల్ కొన్ని 'ఫ్లెక్స్-ఫ్యూయల్' డెకల్‌లను పొందుతుంది. టెయిల్‌గేట్‌పై ఫ్లెక్స్-ఫ్యూయల్ బ్యాడ్జ్ ఉన్నట్లు తెలుస్తుంది.
జపాన్ మొబిలిటీ షో 2025లో సుజుకి
జపాన్ మొబిలిటీ షో అనేది రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆటో షో. ఈ కార్యక్రమం 2025 అక్టోబర్ 30 నుంచి నవంబర్ 9 వరకు ఒడైబాలోని టోక్యో బిగ్ సైట్‌లో జరుగుతుంది. ఇందులో సుజుకి రాబోయే ఈ-విటారా , ఫేస్‌లిఫ్టెడ్ ఎక్స్-బీ, జిమ్నీ నోమేడ్ (5-సీట్ల మేడ్-ఇన్-ఇండియా జిమ్నీ), స్పేసియా, విజన్ ఈ-స్కై బీఈవీ కాన్సెప్ట్ & ఈ-ఎవ్రీ కమర్షియల్ వ్యాన్ కాన్సెప్ట్‌లను కూడా ప్రదర్శించనుంది. ఈవేదికపైనే ఫ్రాంక్స్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కాన్సెప్ట్‌ను కూడా ప్రదర్శించనుంది.