మారుతి సుజుకి ఇండియా.. భారతదేశంలో మూడు కోట్ల యూనిట్ల సేల్స్ సాధించింది. దీంతో అమ్మకాల్లో అరుదైన మైలురాయి చేరుకున్న మొట్టమొదటి ఫ్యాసింజర్ వెహికల్స్ తయారీదారుగా రికార్డ్ క్రియేట్ చేసింది. 1983 డిసెంబర్ 14న తన మొదటి మారుతి 800 డెలివరీ చేసిన కంపెనీ 42 ఏళ్లలో ఈ విజయాన్ని సొంతం చేసుకుంది.
మారుతి సుజుకి తన మొదటి కోటి యూనిట్లను విక్రయించడానికి 28 సంవత్సరాల 2 నెలల సమయం పట్టింది. రెండవ కోటి యూనిట్లను 7 సంవత్సరాల 5 నెలల్లో సాధించగా.. ఇటీవలి కోటి యూనిట్లను విక్రయించడానికి 6 సంవత్సరాల 4 నెలలు మాత్రమే పట్టింది. ఇందులో ఆల్టో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్.
ఇదీ చదవండి: ఎయిర్‌బ్యాగ్ ఇష్యూ.. ప్రముఖ కంపెనీ కీలక నిర్ణయం!
మొత్తం 3 కోట్ల అమ్మకాల్లో.. 47 లక్షల కంటే ఎక్కువ సేల్స్ ఆల్టో పొందగా, వ్యాగన్ ఆర్ 34 లక్షల కంటే ఎక్కువ అమ్మకాలను సొంతం చేసుకుంది. స్విఫ్ట్ 32 లక్షల యూనిట్ల సేల్స్ సాధించింది. ఆ తరువాత స్థానాల్లో బ్రెజ్జా.. ఫ్రాంక్స్ కూడా ఉన్నాయి. కంపెనీ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో మొత్తం 19 వాహనాలను విక్రయిస్తోంది. వివిధ పవర్‌ట్రెయిన్ & ట్రాన్స్‌మిషన్ ఎంపికల ఆధారంగా తీసుకుంటే.. దేశంలో మొత్తం 170 కంటే ఎక్కువ వేరియంట్‌లు అమ్మకానికి ఉన్నాయి.


