
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం కియా (Kia) తాజాగా కారెన్స్ క్లావిస్ (Carens Clavis)లో కొత్త వెర్షన్ హెచ్‌టీఎక్స్ (ఓ)ని ప్రవేశపెట్టింది దీని ధర రూ. 19,26,717 (ఎక్స్ షోరూం)గా ఉంటుందని సంస్థ తెలిపింది.
ఈ కొత్త వెర్షన్ కారులో బోస్ ప్రీమియం సౌండ్ సిస్టం, డ్రైవ్ మోడ్ సెలెక్ట్, స్మార్ట్ కీ రిమోట్ ఇంజిన్ స్టార్ట్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ తదితర ఫీచర్లు ఉంటాయి. ఇది 6,7 సీటర్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. అలాగే హెచ్‌టీకే ప్లస్, హెచ్‌టీకె ప్లస్ (ఓ)లో 6 సీటర్ వేరియంట్లను కూడా ప్రవేశపెట్టినట్లు కంపెనీ తెలిపింది. ఇవి అక్టోబర్ 13 నుంచి దేశవ్యాప్తంగా తమ షోరూమ్‌లలో లభిస్తాయని పేర్కొంది.