
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా.. 'విండ్సర్ ఈవీ ఇన్‌స్పైర్ ఎడిషన్'ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 16.65 లక్షలు (ఎక్స్-షోరూమ్). BaaS (బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ ఆప్షన్)తో ఈ కారును ఎంచుకునేవారు.. రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇది లిమిటెడ్ ఎడిషన్ వెర్షన్ కావడంతో, కంపెనీ దీనిని 300 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది.
ఎంజీ విండ్సర్ ఈవీ ఇన్‌స్పైర్ ఎడిషన్.. పెర్ల్ వైట్ అండ్ స్టార్రి బ్లాక్‌లను కలిగి ఉన్న డ్యూయల్-టోన్ ఎక్స్టీరియర్‌తో వస్తుంది. ఫ్రంట్ గ్రిల్, బంపర్ కార్నర్ ప్రొటెక్టర్‌లపై రోజ్ గోల్డ్ డిజైన్ ఎలిమెంట్‌లను కలిగి ఉన్న యాక్సెసరీ ప్యాక్‌తో కూడా లభిస్తుంది.
ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇన్‌స్పైర్ ఎడిషన్ దాని థీమ్‌ను సాంగ్రియా రెడ్ అండ్ బ్లాక్ లెదర్ అప్హోల్స్టరీ, హెడ్‌రెస్ట్‌లపై ఎంబ్రాయిడరీ ఇన్‌స్పైర్ లోగో వంటివి పొందుతుంది. ఆప్షనల్ యాక్ససరీస్ జాబితాలో.. స్కైలైట్ ఇన్ఫినిటీ వ్యూ గ్లాస్ రూఫ్ & వైర్‌లెస్ ఇల్యూమినేటెడ్ సిల్ ప్లేట్లు ఉన్నాయ., వీటిని ఎంజీ డీలర్‌షిప్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.
ఇదీ చదవండి: జపాన్ మొబిలిటీ షో 2025: సిద్దమైన ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు
ఎంజీ విండ్సర్ ఈవీ ఇన్‌స్పైర్ ఎడిషన్‌లో 38 కిలోవాట్ బ్యాటరీ, పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్‌ను పొందుతుంది. ఈ మోటార్ 134 bhp పవర్, 200 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ స్పెషల్ ఎడిషన్ ఒక ఫుల్ ఛార్జ్‌పై 331 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. దీనిని డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 40 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.