సెలవుల్లేవ్.. వారంలో 7 రోజులు పని! | Maruti Suzuki Factories To Run Seven Days a Week During Festive Boom | Sakshi
Sakshi News home page

సెలవుల్లేవ్.. వారంలో 7 రోజులు పని!

Oct 4 2025 2:49 PM | Updated on Oct 4 2025 3:26 PM

Maruti Suzuki Factories To Run Seven Days a Week During Festive Boom

భారతదేశంలో మారుతి సుజుకి అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. దీంతో కంపెనీ సెప్టెంబర్ నెలలో తమ ఉత్పత్తిని 26 శాతం పెంచింది. వాహనాల ఉత్పత్తి పెరగడం వల్ల.. కొనుగోలుదారులకు సకాలంలో డెలివరీలు జరిగాయి. ఈ తరుణంలో ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధిని సాధించడానికి.. ప్రొడక్షన్ టీమ్ ఆదివారాలు & సెలవు దినాలలో పని చేయాలని మారుతి సుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు.

నవరాత్రి మొదటి ఎనిమిది రోజుల్లో మారుతి సుజుకి దాదాపు 1,65,000 వాహనాలను డెలివరీ చేసింది. ఈ అమ్మకాలు గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే 27.5 శాతం ఎక్కువ. త్వరలో డెలివరీలు రెండు లక్షలకు చేరుకుంటుందని చెబుతున్నారు. కంపెనీ సేల్స్ పెరగడానికి జీఎస్టీ 2.0 కూడా సహకరించింది. గత పదేళ్లలో ఇంతటి వృద్ధి (బుకింగ్స్ & డెలివరీలు) ఎప్పుడూ చూడలేదని కూడా పార్థో బెనర్జీ అన్నారు.

ఇదీ చదవండి: గిఫ్ట్‌గా రూ.33 లక్షల కారు: అభిషేక్ శర్మపై పడే ట్యాక్స్ ఎంత?

డిమాండుకు తగ్గ డెలివరీలు చేయడానికి.. మారుతి సుజుకి గత నెలలో 12,318 యూనిట్ల ఆల్టో & ఎస్ ప్రెస్సో మోడళ్లను ఉత్పత్తి చేసింది. బాలెనో, సెలెరియో, డిజైర్ & స్విఫ్ట్ వంటి కాంపాక్ట్ మోడళ్ల ఉత్పత్తి సెప్టెంబర్‌లో 93,301 యూనిట్లు. బ్రెజ్జా, ఎర్టిగా & ఫ్రాంక్స్ వంటి యుటిలిటీ వాహనాల ఉత్పత్తి 79,496 యూనిట్లకు చేరుకుంది. ఈకో ఉత్పత్తి కూడా 13,201 యూనిట్లకు పెరిగింది. మొత్తం మీద కంపెనీ ఈ ఏడాది అమ్మకాల్లో గణనీయమైన వృద్ధిని సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement