మూడవ తరం హోండా అమేజ్.. భారత్ ఎన్‌సీఏపీ క్రాష్-టెస్ట్ ప్రోగ్రామ్ కింద.. పెద్దల ప్రయాణీకులకు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ & పిల్లల ప్రయాణీకులకు 4-స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఇది భారతదేశంలో అత్యంత సురక్షితమైన కుటుంబ సెడాన్‌లలో ఒకటిగా నిలిపింది.
క్రాష్ టెస్టింగ్‌లో హోండా అమేజ్ గొప్ప ఫలితాలను సాధించింది. ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో 16కి 14.33 పాయింట్లు. సైడ్ ఇంపాక్ట్ టెస్ట్‌లో 16కి 14.00 స్కోర్ చేసి.. మొత్తం అడల్ట్ సేఫ్టీ టెస్టులో 24కి 23.81 స్కోర్ సాధించింది. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, లోడ్ లిమిటర్‌లతో కూడిన బెల్ట్ ప్రిటెన్షనర్లు, సైడ్ హెడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు, సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), రియర్ పార్కింగ్ సెన్సార్లు, చైల్డ్ సీట్ల కోసం ISOFIX మౌంట్‌లు వంటి ప్రామాణిక భద్రతా ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.
ఇదీ చదవండి: ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లు
పిల్లల సేఫ్టీ విషయంలో.. అమేజ్ CRS ఇన్‌స్టాలేషన్‌లో 12/12 స్కోర్‌ను సాధించింది. ఈ సెడాన్‌లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, సీట్‌బెల్ట్ రిమైండర్‌లు, ఈబీఎస్ విత్ ఈబీడీ, ఎయిర్‌బ్యాగ్ కట్-ఆఫ్ స్విచ్, రియర్ డీఫాగర్ అండ్ చైల్డ్-సేఫ్టీ లాక్‌లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్రయాణంలో రక్షణ కల్పిస్తాయి.


