
జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హోండా మోటార్‌లో అధునాతన సాంకేతిక అభివృద్ధి విభాగానికి బాధ్యత వహిస్తున్న చీఫ్ ఇంజినీర్ షోటారో ఓడేట్ ‘అనిమే’ అనే హెయిర్ స్టైల్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం తన హెయిర్ స్టైల్ కారణంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. 84 ఏళ్ల వయసున్న ఈ సీనియర్ ఆటోమోటివ్ నిపుణుడు సురక్షిత డ్రైవింగ్ టెక్నాలజీలో అపారమైన కృషి సంస్థలో ప్రత్యేక గుర్తింపు సాధించారు.
ఇటీవల ఒక జపనీస్ షోలో ఓడేట్ మాట్లాడుతూ అనిమే స్పైకీ హెయిర్‌స్టైల్‌ను ఐదేళ్లుగా కొనసాగిస్తున్నానని వెల్లడించారు. తన జుట్టు అసాధారణంగా గట్టిగా, సులభంగా ముడుచుకుపోతుందని పేర్కొన్నారు. తన పేలవమైన నిద్ర అలవాట్ల కారణంగా ప్రతి ఉదయం జుట్టు అస్తవ్యస్తంగా ఉండేదని చెప్పారు. ఈక్రమంలో కొత్త హెయిర్ స్టైల్‌ను అనుసరించినట్లు తెలిపారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం ఈయన తన చిన్నతనంలో తన జుట్టును స్టైల్‌గా ఉంచుకోవడానికి చాలా సమయాన్ని గడిపేవారట.
ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూనే కోట్లు సంపాదించే మార్గాలు..
షోటారో ఓడేట్ కేవలం హెయిర్‌స్టైల్‌ను ఫాలో అవ్వడంలో మాత్రమేకాదు సాంకేతిక రంగంలో చాలా కృషి చేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన సురక్షిత డ్రైవింగ్ టెక్నాలజీలకు సంబంధించి మొత్తం 253 పేటెంట్లు కలిగి ఉండటం విశేషం. ఆయన 2003లో హోండాలో చేరినప్పుడు సీట్ బెల్టుల్లో ప్రత్యేకత కలిగిన డిజైనర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన హోండా సెన్సింగ్ 360+ ADAS సిస్టమ్ లీడ్ ఇంజినీర్‌గా వ్యవహరిస్తున్నారు. దాంతోపాటు డ్రైవర్-అసిస్టెన్స్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
About to go to bed so im going to put this up... Shotaro Odate. 84 years old. Chief Engineer at Honda. Looks strong and rocks the Sasuke Hairstyle daily.
Something to strive for. pic.twitter.com/hnUotU6vKV— Jonathan Magno 🇺🇲 🇵🇭 (@HyperM0nkey1) September 29, 2025
Honda Chief Engineer Shotaro Odate
Being cool is ageless and timeless. 😊 pic.twitter.com/9KByqO0gtH— meemingwong (@freetheatoms) September 22, 2025