
మారుతి సుజుకి ఇన్విక్టో.. భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (BNCAP) పరీక్షలో 5 స్టార్ రేటింగ్ సాధించింది. దీంతో ఈ ఎంపీవీ దేశంలోని అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా నిలిచింది.
మారుతి ఇన్విక్టో.. వయోజన ప్రయాణీకుల రక్షణలో 32 పాయింట్లకు 30.43 పాయింట్లు స్కోర్ చేయగలిగింది. పిల్లల రక్షణలో 49 పాయింట్లకు 45 పాయింట్లు సాధించింది. ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో 16 పాయింట్లకు 14.43 పాయింట్లు సాధించగా, సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో 16 పాయింట్లు పరిపూర్ణ స్కోరు లభించింది. ఇలా మొత్తం మీద సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది.
భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ పరీక్షకు ఉపయోగించిన కారు.. 6 ఎయిర్‌బ్యాగులు కలిగి ఉంది. అంతే కాకుండా ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఏబీఎస్ విత్ ఈబీడీ, హిల్ హోల్డ్ అసిస్ట్‌తో, 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకరేజ్, 360 డిగ్రీ వ్యూ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందింది.