2030 నాటికి భారత్ మార్కెట్లోకి..
భారత్‌లో అమ్మకాలు, మార్కెట్ వాటాను మరింతగా పెంచుకోవడంపై జపాన్ ఆటో దిగ్గజం హోండా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా 2030 నాటికి దేశీ మార్కెట్లో 10 కొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టనుంది. వీటిలో ఏడు ఎస్‌యూవీలు ఉండనున్నాయి. తమ వ్యాపార వృద్ధికి అమెరికా, జపాన్ తర్వాత భారత్ అత్యంత కీలకమైన మార్కెట్ అని హోండా మోటర్స్ డైరెక్టర్ తొషిహిరో మిబె తెలిపారు.
ప్రస్తుతం ఏటా 43 లక్షల యూనిట్లుగా ఉన్న మార్కెట్ 2030 నాటికి 60 లక్షల యూనిట్ల స్థాయికి చేరుతుందని అంచనాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మార్కెట్ వా టాను పెంచుకునే క్రమంలో మరిన్ని ప్రీమియం అంతర్జాతీయ వాహనాలు, స్థానికంగా తయారు చేసిన మోడల్స్‌ను ప్రవేశపెట్టనున్నామని చెప్పారు. టూ– వీలర్ల తరహాలోనే కార్ల తయారీకి సంబంధించి కూడా భారతీయ సరఫరాదార్లతో కలిసి పని చేసే వ్యూహంపై కసరత్తు చేస్తున్నట్లు మిబె చెప్పారు.
ఇదీ చదవండి: ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు


