
2025 ఆర్థిక సంవత్సరంలో 1,98,451 యూనిట్ల అమ్మకాలతో, మారుతి సుజుకి వేగన్ ఆర్.. టాటా పంచ్ వంటి పోటీదారులను అధిగమించి నాలుగో సారి అత్యధికంగా అమ్ముడైన కారుగా తన కిరీటాన్ని నిలుపుకొంది. ఎస్‌యూవీలు డిమాండ్‌లో ఉన్నా, ఈ ప్రాక్టికల్ హ్యాచ్‌బ్యాక్ తన ప్రత్యేక స్థానాన్ని నిలుపుకొంటోంది.
జీఎస్టీ 2.0 అమలుతో మారుతీ సుజుకీ ధరల నిర్మాణాన్ని మారుస్తూ వాగన్ ఆర్ మోడళ్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. ఇది పండుగ సీజన్‌లో బడ్జెట్ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. దీంతో ఈ దీపావళికి కారు కొనాలనుకుంటున్నవారికి మంచి అవకాశంగా భావిస్తున్నారు.
వాగన్ ఆర్ ధరల తగ్గింపులు
1.0L LXI (మ్యాన్యువల్) – రూ.5,78,500 నుండి రూ.4,98,900 (రూ.79,600 తగ్గింపు)
1.0L VXI (మ్యాన్యువల్) – రూ.6,23,500 నుండి రూ.5,51,900 ( రూ.71,600 తగ్గింపు)
1.2L ZXI (మ్యాన్యువల్) – రూ.6,52,000 నుండి రూ.5,95,900 ( రూ.56,100 తగ్గింపు)
1.2L ZXI+ (మ్యాన్యువల్)– రూ.6,99,500 నుండి రూ.6,38,900 (రూ.60,600 తగ్గింపు)
1.0L VXI AMT – రూ.6,73,500 నుండి రూ.5,96,900 ( రూ.76,600 తగ్గింపు)
1.2L ZXI AMT– రూ.7,02,000 నుండి రూ.6,40,900 (రూ.61,100 తగ్గింపు)
1.2L ZXI+ AMT– రూ.7,49,500 నుండి రూ.6,83,900 ( రూ.65,600 తగ్గింపు)
1.0L LXI CNG– రూ.6,68,500 నుండి రూ.5,88,900 ( రూ.79,600 తగ్గింపు)
1.0L VXI CNG – రూ.7,13,500 నుండి రూ.6,41,900 ( రూ.71,600 తగ్గింపు)
వాగన్ ఆర్ ప్రత్యేకతలు
341 లీటర్ల బూట్ స్పేస్ (సెగ్మెంట్‌లో టాప్)
1.0L (67 BHP), 1.2L (89 BHP) ఇంజిన్లు
సీఎన్జీ మోడల్ – 32 km/kg మైలేజ్
- ప్రాక్టికల్ డిజైన్, సులభమైన ఎంట్రీ/ఎగ్జిట్