
ఒడిదుడుకులున్నా మార్కెట్ ముందుకే..
కార్పొరేట్ల ఆదాయాలు, పెట్టుబడులపై సానుకూల అంచనాలు
సంవత్ 2082లో కొత్త గరిష్టాలకు సూచీలు
నిఫ్టీ @ 28,500, సెన్సెక్స్ @ 95,000
ఆకర్షణీయంగా బ్యాంకింగ్, ఆటో, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ తదితర రంగాలు
కొత్త సంవత్ 2082లో కొంత ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ మార్కెట్లు ముందుకే సాగుతాయనే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆదాయాల వృద్ధి వేగం పుంజుకోవడం, మళ్లీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం మొదలు కావడం, వాణిజ్య విధానాలపై స్పష్టత, భౌగోళిక రాజకీయ స్థిరత్వం వంటి అంశాలు సానుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు.
దేశీయంగా పాలసీలు స్థిరంగా కొనసాగడం, భారీ పెట్టుబడులు, సానుకూల ద్రవ్యపరపతి విధానాలు మొదలైనవి కీలక చోదకాలుగా నిలుస్తాయనే అంచనాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం నెమ్మదించడం, ఆర్థిక క్రమశిక్షణ, కార్పొరేట్ల రుణభారం తగ్గడం తదితర అంశాల దన్నుతో కంపెనీల ఆదాయాలు మెరుగుపడొచ్చని నువామా రీసెర్చ్ అభిప్రాయపడింది.
2026 ఆర్థిక సంవత్సరంలో అమెరికా ఫెడ్, ఈసీబీలు వడ్డీ రేట్లను మరికాస్త తగ్గించవచ్చని పేర్కొంది. ద్రవ్యోల్బణం కాస్త అదుపులో ఉన్న నేపథ్యంలో దేశీయంగా ఆర్‌బీఐ కూడా ఇదే బాటలో పయనించవచ్చని తెలిపింది. వేల్యుయేషన్స్ సముచిత స్థాయిలో ఉన్నాయని, అయితే గణనీయంగా పెరిగిన మిడ్–స్మాల్ క్యాప్స్‌లో మాత్రం కన్సాలిడేషన్‌కి ఆస్కారం ఉందని వివరించింది.
జీఎస్‌టీ 2.0 సరళీకరణ, ఆదాయపు పన్నుపరమైన ఊరట, పండుగల సీజన్ మొదలైన అంశాల కారణంగా వినియోగం గణనీయంగా రికవర్ అవుతుందని మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది. ఆటో, కన్జూమర్ డ్యూరబుల్స్, ట్రావెల్, హోటల్స్, రిటైల్ వంటి రంగాలు మెరుగ్గా ఉండొచ్చని పేర్కొంది. మరోవైపు, ఆటో, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, తదితర రంగాలు ఆకర్షణీయంగా ఉంటాయని సెంట్రమ్ బ్రోకింగ్ తెలిపింది.
నిఫ్టీ 28,500కి, సెన్సెక్స్ 95,000కు చేరొచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. వినియోగ ఆధారిత సంస్థలు, ప్రైవేట్ బ్యాంకులు మెరుగ్గా రాణించవచ్చని ట్రేడ్‌జినీ సీవోవో త్రివేష్ తెలిపారు. వచ్చే ఏడాది కాలానికి వివిధ బ్రోకరేజీ సంస్థలు అందిస్తున్న స్టాక్ సిఫార్సులు సాక్షి పాఠకులకు ప్రత్యేకం!
బ్రోకరేజ్: జేఎం ఫైనాన్షియల్
మారుతీ సుజుకీ
ప్రస్తుత ధర: రూ. 16,399
టార్గెట్ ధర: రూ. 19,000 (వృద్ధి: 16%)
కార్యకలాపాలు స్థిరపడే కొద్దీ విస్తరణ వ్యయాలు తగ్గుముఖం పట్టడం, ప్రోడక్టుల మేళవింపు సానుకూలంగా ఉండటం మార్జిన్లు మెరుగుపడేందుకు దోహదపడొచ్చు. ఇన్‌హౌస్ బ్యాటరీ ప్లాంటుతో మరిన్ని హైబ్రిడ్ వాహనాలను ప్రవేశపెట్టొచ్చు. హైబ్రిడ్ సెగ్మెంట్‌లో వ్యయాలు తగ్గి, లాభదాయకత పెరుగుతుంది. అయితే, తీవ్రమైన పోటీ, కొత్తగా ప్రవేశపెట్టిన ప్యాసింజర్ వాహనాలకు స్పందన అంతంతమాత్రంగానే ఉండటం వంటివి ప్రతికూలాంశాలుగా ఉండొచ్చు.
యాక్సిస్ బ్యాంక్
ప్రస్తుత ధర: రూ. 1,200
టార్గెట్ ధర: రూ. 1,330 (వృద్ధి: 11%)
ఆకర్షణీయమైన వేల్యుయేషన్, అసెట్ క్వాలిటీ రిస్కులు తక్కువగా ఉండటం, నిర్వహణ వ్యయాలు నెమ్మదించడం వంటివి సానుకూలాంశాలు. రాబోయే త్రైమాసికాల్లో వృద్ధి వేగం మరింత పుంజుకోవచ్చు. నికర వడ్డీ మార్జిన్లు ఊహించిన దానికంటే క్షీణించే అవకాశాలు ప్రతికూలాంశం.
ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్
ప్రస్తుత ధర: రూ. 498
టార్గెట్ ధర: రూ. 600 (వృద్ధి: 20%)
వేల్యుయేషన్ మెరుగ్గా ఉండటం, ఆదాయ రికవరీ వల్ల రీ–రేటింగ్‌కి అవకాశం ఉంది. పసిడి ధరల పరుగు కొనసాగుతుండటమనేది ఆదాయ అంచనాల పెంపునకు, రుణాల పోర్ట్‌ఫోలియో మెరుగుపడేందుకు ఉపయోగపడొచ్చు. అయితే, రుణ సంబంధ వ్యయాలు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉండటం కీలక రిసు్కల్లో ఒకటిగా
ఉంటుంది.
ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్
ప్రస్తుత ధర: రూ. 266
టార్గెట్ ధర: రూ. 300 (వృద్ధి: 13% )
మాతృ సంస్థ పటిష్టంగా ఉండటం, వైవిధ్యమైన ప్రోడక్టుల పోర్ట్‌ఫోలియో, లోన్ బుక్‌లో రిటైల్ ఫైనాన్స్ వాటా 90 శాతానికి పెరగడం వంటివి సానుకూలాంశాలు. ద్వితీయార్ధంలో పండగ సీజన్ డిమాండ్‌తో వృద్ధి వేగం పటిష్టంగా ఉండొచ్చు. అసెట్ క్వాలిటీపరమైన రిసు్కలు మళ్లీ తలెత్తే
అవకాశాలుండటం ప్రతికూలాంశాల్లో ఒకటిగా నిలవొచ్చు.
అపోలో హాస్పిటల్స్
ప్రస్తుత ధర: రూ. 7,909
టార్గెట్ ధర: రూ. 9,000 (వృద్ధి: 14% )
కొత్తగా 1,717 పడకలు జతకానుండటం, ఫార్మసీ ఔట్‌లెట్స్ సంఖ్య 8 శాతం పెరుగుదల, పోటీ సంస్థ మ్యాక్స్ హెల్త్‌కేర్‌తో పోలిస్తే డిస్కౌంటులో ట్రేడవుతుండటం మొదలైనవి పాజిటివ్ అంశాలు. పడకల సామర్థ్యం పెంపు ఊహించిన దానికన్నా నెమ్మదిగా ఉండటం, రెగ్యులేటరీ రిస్కుల్లాంటివి ప్రతికూలాంశాలుగా ఉండొచ్చు.
బ్రోకరేజ్: చాయిస్ ఈక్విటీ బ్రోకింగ్
ఫెడరల్ బ్యాంక్
ప్రస్తుత ధర: రూ. 212
టార్గెట్ ధర: రూ. 245 (వృద్ధి: 16% )
టెక్నికల్‌గా కొన్నాళ్ల నుంచి పటిష్టమైన బేస్ ఏర్పర్చుకుంటోంది. రూ. 195–215 శ్రేణిలో తిరుగాడుతోంది. కరెక్షన్ జరిగిన ప్రతిసారి సపోర్ట్ బలపడుతోంది. 220పై నిలకడగా కొనసాగితే రూ. 245–255 వైపు ర్యాలీ చేయొచ్చు. రూ. 207–205 వరకు తగ్గితే కొనుగోళ్లకు అవకాశంగా భావించవచ్చు. రూ. 195 దిగువకి పడిపోతే బలహీనపడటాన్ని సూచిస్తుంది.
సిప్లా
ప్రస్తుత ధర: రూ. 1,578
టార్గెట్ ధర: రూ. 1,770 (వృద్ధి: 12%)
నిర్దిష్ట శ్రేణిలో కన్సాలిడేట్ అవుతూ షేరు బలపడుతున్న సంకేతాలిస్తోంది. రూ. 1,580 వద్ద తక్షణ రెసిస్టెన్స్ ఉండగా, దీన్ని నిర్ణయాత్మకంగా దాటితే మధ్యకాలికంగా, దీర్ఘకాలికంగా రూ. 1,770–1,850 వైపుగా వెళ్లొచ్చు. తగ్గితే రూ. 1,480 వద్ద సపోర్ట్ లభిస్తుంది. మొమెంటమ్ ఇండికేటర్ల ప్రకారం చూస్తే
బులి‹Ùగానే కనిపిస్తోంది.
అశోక్ లేల్యాండ్
ప్రస్తుత ధర: రూ. 134
టార్గెట్ ధర: రూ. 151 (వృద్ధి: 13% )
కనిష్ట స్థాయిల్లో కన్సాలిడేట్ అవుతూ, స్థిరంగా రికవర్ అవుతోంది. ప్రస్తుతం వీక్లీ చార్ట్‌లో బులి‹Ùగా కనిపిస్తోంది. టెక్నికల్‌గా రూ. 140 తక్షణ రెసిస్టెన్స్‌ని దాటితే మధ్య, దీర్ఘకాలికంగా రూ. 151–రూ. 158 వరకు పెరగవచ్చు. దిగువ వైపున రూ. 131 వరకు కొనుగోలుకు అవకాశం ఉంటుంది. రూ. 126 వద్ద పటిష్టమైన మద్దతు ఉంటుంది. దానికన్నా దిగువకి పడిపోతే ర్యాలీకి స్వల్పకాలిక రిస్కులు ఉంటాయి.
సెయిల్
ప్రస్తుత ధర: రూ. 129
టార్గెట్ ధర: రూ.147 (వృద్ధి: 14% )
టెక్నికల్‌గా పటిష్టమైన బేస్ ఏర్పర్చుకున్న స్టాక్, ప్రస్తుతం నిర్ణయాత్మక బ్రేకవుట్‌కి సిద్ధంగా ఉన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. భారీ వాల్యూమ్స్‌తో రూ. 138కి ఎగువన నిలకడగా క్లోజయితే, తదుపరి దశ ర్యాలీకి దారితీయొచ్చు. దిగువన రూ. 125 స్థాయి వరకు మరింతగా షేర్లను మరింతగా కొనుగోలు చేయొచ్చు. రూ. 116 వద్ద సపోర్ట్ ఉంటుంది.
బీడీఎల్
ప్రస్తుత ధర: రూ. 1,540
టార్గెట్ ధర: రూ. 1,700 (వృద్ధి: 10% )
ఫిబోనకీ రిట్రేస్‌మెంట్ లెవెల్‌కి 50 శాతం వద్ద కన్సాలిడేట్ అవుతోంది. ఇదే జోన్‌లో సపోర్ట్ లభిస్తోంది. సాధారణంగా ర్యాలీ చేసే ముందు, ఇలాంటి కన్సాలిడేషన్ కనిపిస్తుంది. తక్షణ రెసిస్టెన్స్ రూ. 1,560 వద్ద ఉంటుంది. దీన్ని నిర్ణయాత్మకంగా దాటితే బులిష్ ధోరణి బలపడి, సమీప భవిష్యత్తులో మరింత ర్యాలీకి దోహదపడొచ్చు. తగ్గితే, రూ. 1,440 వరకు కొనుక్కోవచ్చు. రూ. 1,380 బలమైన సపోర్ట్ జోన్‌గా ఉంటుంది.
బ్రోకరేజ్: మిరే అసెట్ షేర్‌ఖాన్
అంబర్ ఎంటర్‌ప్రైజెస్
ప్రస్తుత ధర: రూ. 8,245
టార్గెట్ ధర: రూ. 9,300 (వృద్ధి: 13%)
ఈ సంస్థ రెసిడెన్షియల్, కమర్షియల్ ఏసీలు, రిఫ్రిజిరేషన్ ఉత్పత్తులను అందిస్తోంది. కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో ఏసీలతో పాటు కంపెనీ వాషింగ్ మెషీన్ల మార్కెట్లోకి, అటు ఎల్రక్టానిక్స్‌లోకి, సెమీకండక్టర్ సబ్‌్రస్టేట్ పీసీబీలు మొదలైన వాటిల్లోకి ప్రవేశిస్తుండటం ద్వారా మార్కెట్ పరిధిని విస్తరించుకుంటోంది. ఎల్రక్టానిక్స్‌పై వచ్చే అయిదేళ్లలో రూ. 3,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది.
చాలెట్ హోటల్స్
ప్రస్తుత ధర: రూ. 975
టార్గెట్ ధర: రూ. 1,172 (వృద్ధి: 20%)
వ్యూహాత్మక కొనుగోళ్లు, గదుల పెంపు, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం వంటివి సంస్థకు సానుకూలంగా ఉండనున్నాయి. అలాగే, కమర్షియల్ బిజినెస్ వాటా పెరుగుతుండటమనేది వృద్ధికి కీలక చోదకంగా నిలవనుంది. 2027 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 2,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 2025 డిసెంబర్ ఆఖరు నాటికి గదుల సంఖ్యను 4,500కి పెంచుకోనుంది.
కమిన్స్ ఇండియా
ప్రస్తుత ధర: రూ. 3,976
టార్గెట్ ధర: రూ. 4,500 (వృద్ధి: 13% )
హై–హార్స్‌పవర్ (హెచ్‌హెచ్‌పీ) జెన్‌సెట్ల మార్కెట్లో అగ్రగామిగా నిలుస్తోంది. పటిష్టమైన బ్రాండింగ్, డి్రస్టిబ్యూషన్ నెట్‌వర్క్ ఉంది. 2025 తొలినాళ్ల నుంచి పవర్‌జెన్ వ్యాపారం పుంజుకుంది. డేటా సెంటర్లు, హాస్పిటల్స్, మొదలైన రంగాల నుంచి హెచ్‌హెచ్‌పీ జెన్‌సెట్లకు డిమాండ్ కొనసాగనుంది. ఎగుమతులు పటిష్టంగా ఉన్నాయి. యూరప్, ఆప్రికా, పశ్చిమాసియాలో డిమాండ్ స్థిరంగా ఉంది.
హిందుస్తాన్ ఏరోనాటిక్స్
ప్రస్తుత ధర: రూ. 4,880
టార్గెట్ ధర: రూ. 6,000 (వృద్ధి: 23%)
ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్లు, ఇంజిన్లు, యాక్సెసరీలు అందించే హెచ్‌ఏఎల్‌కి భారతదేశపు డిఫెన్స్ రంగంలో విశిష్టమైన స్థానం ఉంది. తయారీ సెగ్మెంట్ కార్యకలాపాలు పుంజుకోవడం వల్ల ఆదాయ వృద్ధి మెరుగుపడొచ్చు. రూ. 1.9 లక్షల కోట్ల ఆర్డర్ బ్యాక్‌లాగ్ ఉంది. రాబోయే 1–2 ఏళ్లలో రూ. లక్ష కోట్ల ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది.
హడ్కో
ప్రస్తుత ధర: రూ. 224
టార్గెట్ ధర: రూ. 260 (వృద్ధి: 16% )
సామాజిక హౌసింగ్, అర్బన్ మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రభుత్వ నోడల్ ఏజెన్సీగా పని చేస్తోంది. ప్రభుత్వాలతో పటిష్టమైన సంబంధాలు ఉన్నాయి. 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఏయూఎం వార్షికంగా 25 శాతం పైగా, లాభం 23 శాతం పైగా వృద్ధి చెందవచ్చు. వచ్చే 18 నెలల్లో మొండిపద్దుల భారాన్ని పరిష్కరించుకోవాలని కంపెనీ నిర్దేశించుకుంది.
బ్రోకరేజ్: మోతీలాల్ ఓస్వాల్
ఎస్‌బీఐ
ప్రస్తుత ధర: రూ. 889
టార్గెట్ ధర: రూ. 1,000 (వృద్ధి: 12%)
జీఎస్‌టీ 2.0, ఆదాయ పన్ను సంస్కరణలు, ద్రవ్య లభ్యతను పెంచేందుకు ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు మొదలైనవి రుణ వృద్ధికి దారి తీయొచ్చని, బీఎఫ్‌ఎస్‌ఐ రంగం లాభదాయకతకు తోడ్పడవచ్చని అంచనాలు ఉన్నాయి. రిటైల్, ఎస్‌ఎంఈ, కార్పొరేట్ సెగ్మెంట్లవ్యాప్తంగా పటిష్టమైన కార్యకలాపాలు ఉండటం
బ్యాంకుకు సానుకూలాంశం.
ఎంఅండ్‌ఎం
ప్రస్తుత ధర: రూ. 3,648
టార్గెట్ ధర: రూ. 4,091 (వృద్ధి: 12%)
2026 క్యాలెండర్ సంవత్సరం నుంచి 2030 నాటికి కంపెనీ 7 ఐసీఈ ఎస్‌యూవీ వాహనాలను, 5 బీఈవీలను, 5 ఎల్‌సీవీలను ప్రవేశపెట్టే ప్రణాళికల్లో ఉంది. తద్వారా ఐసీఈ, ఈవీ సెగ్మెంట్లలో కంపెనీ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో రికవరీ, కొత్త ఉత్పత్తుల దన్ను, ట్రాక్టర్ల మార్జిన్లు మెరుగుపడటం మొదలైనవి సంస్థకు కలిసి రానున్నాయి.
భారత్ ఎల్రక్టానిక్స్
ప్రస్తుత ధర: రూ. 413
టార్గెట్ ధర: రూ. 490 (వృద్ధి: 19% )
ఆర్మీ నుంచి రూ. 30,000 కోట్ల అనంత శస్త్ర ప్రాజెక్టు టెండర్లకు సంబంధించి కంపెనీ, లీడ్ ఇంటిగ్రేటరుగా వ్యవహరిస్తుండటం వల్ల కంపెనీ అర్డరు బుక్ రూ. లక్ష కోట్ల స్థాయిని దాటే అవకాశముంది. ఇది, వ్యూహాత్మక డిఫెన్స్ ప్రోగ్రాంలలో కంపెనీ నాయకత్వ స్థానాన్ని తెలియజేస్తోంది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌వ్యాప్తంగా అవకాశాలతో దీర్ఘకాలికంగా కంపెనీ వృద్ధి అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి.
స్విగ్గీ
ప్రస్తుత ధర: రూ. 432
టార్గెట్ ధర: రూ. 550 (వృద్ధి: 27% )
పోటీ నెమ్మదిస్తుండటం, డార్క్ స్టోర్లను విస్తరణ క్రమంగా స్థిరపడుతుండటం మొదలైన వాటి కారణంగా కంపెనీకి చెందిన ఇన్‌స్టామార్ట్ విభాగం త్వరలో లాభదాయకంగా మారే అవకాశాలు ఉన్నాయి. జీఎస్‌టీ మార్పుల వల్ల వినియోగం మరింత పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో 2026–27 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి వ్యాపార వృద్ధి, గతంలో అంచనా వేసిన 20 శాతానికన్నా మెరుగ్గా 23 శాతం స్థాయిలో ఉంటుందని అంచనా.
ఇండియన్ హోటల్స్
ప్రస్తుత ధర: రూ. 735
టార్గెట్ ధర: రూ. 880 (వృద్ధి: 20% )
ఆక్యుపెన్సీ, ఏఆర్‌ఆర్ పెరుగుతుండటం వంటి అంశాల కారణంగా దేశీయంగా హాస్పిటాలిటీ పరిశ్రమ 2026 ఆర్థిక సంవత్సరంలో భారీగా వృద్ధి చెందనుంది. అలాగే ఎంఐసీఈ యాక్టివిటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ద్వితీయార్ధంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైనవి కూడా కంపెనీ వృద్ధికి దోహదపడనున్నాయి.
బ్రోకరేజ్: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్
అసోసియేటెడ్ ఆల్కహాల్స్ అండ్ బ్రూవరీస్ (ఏఏబీఎల్)
ప్రస్తుత ధర: రూ. 1,058
టార్గెట్ ధర:రూ. 1,182 (వృద్ధి: 12% )
క్రమంగా ప్రీమియం లిక్కర్ బ్రాండ్స్ వైపు మళ్లుతోంది. మధ్యప్రదేశ్‌లో 20–25 శాతం వరకు మార్కెట్ వాటా ఉంది. అలాగే, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, ఉత్తర్‌ప్రదేశ్ మార్కెట్లలోకి కూడా విస్తరిస్తోంది. ఇటీవలే నికోబార్ జిన్, హిల్‌ఫోర్ట్ విస్కీ అనే ప్రీమియం బ్రాండ్లను ప్రవేశపెట్టడంతో పాటు కొత్తగా బ్రాందీ, టెకీలాలో కూడా మరిన్ని ప్రోడక్ట్‌లను ప్రవేశపెట్టబోతోంది. వ్యయాలు తగ్గించుకుని, స్థిరమైన మార్జిన్లను సాధించేందుకు కసరత్తు చేస్తోంది.
భారతి ఎయిర్‌టెల్
ప్రస్తుత ధర: రూ. 2,011
టార్గెట్ ధర: రూ. 2,244 (వృద్ధి: 12%)
ఏఆర్ పీయూ, డిజిటల్ వ్యాపారాలు వృద్ధి చెందుతున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏఆర్‌పీయూ రూ. 250గా ఉండగా, టారిఫ్‌ల పెంపుతో రూ. 300 సమీపానికి చేరే అవకాశం ఉంది. ఇక గూగుల్, ఒరాకిల్, యాపిల్, హ్యూస్‌లాంటి దిగ్గజాలతో జట్టు కట్టడం ద్వారా మొబైల్ సరీ్వసుల పరిధికి మించి ఇతర విభాగాల్లోకి ప్రవేశించడంలో కంపెనీకి తోడ్పడనుంది.
జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ
ప్రస్తుత ధర: రూ. 541
టార్గెట్ ధర: రూ. 639 (వృద్ధి: 18% )
భారతదేశపు ఇంధన పరివర్తన లక్ష్యాలతో కంపెనీకి ప్రయోజనం చేకూరనుంది. కంపెనీ ఇప్పటికే నిర్దేశించుకున్న గడువు కన్నా ముందే 20 గిగావాట్ల స్ట్రాటెజీ 2.0 టార్గెట్‌ని సాధించింది. ఇప్పుడు 2030 నాటికి 30 గిగావాట్ల కెపాసిటీ, 40 గిగావాట్‌అవర్ స్టోరేజీని సాధించే దిశగా ముందుకెళ్తోంది. రూ. 1.3 లక్షల కోట్ల భారీ పెట్టుబడుల ప్రణాళికలు ఉన్నప్పటికీ పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణను
పాటిస్తోంది.
ఎల్‌అండ్‌టీ
ప్రస్తుత ధర: రూ. 3,839
టార్గెట్ ధర: రూ. 4,243 (వృద్ధి: 11%)
క్యాపిటల్ గూడ్స్ విభా గానికి చెందిన ఈ సంస్థ కు రూ. 6.1 లక్షల కోట్ల ఆర్డర్ బుక్ ఉంది. ఇన్‌ఫ్రా, ఎనర్జీ, హైడ్రోకార్బన్ ప్రాజెక్టులకు సంబంధించి రూ. 14.8 లక్షల కోట్ల ఆర్డర్లు కుదిరే దశలో ఉన్నాయి. ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం ద్వారా కంపెనీ లాభదాయకత మరింత మెరుగుపడనుంది.
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్
ప్రస్తుత ధర: రూ. 72
టార్గెట్ ధర: రూ. 88.5 (వృద్ధి: 23%)
కాసా డిపాజిట్లు 26 శాతం వృద్ధి చెందాయి. దీంతో కాసా నిష్పత్తి 48 శాతానికి, క్రెడిట్–డిపాజిట్ నిష్పత్తి 93.4 శాతానికి పెరిగాయి. నిధుల సమీకరణ వ్యయా లు తగ్గి, 2025–26 మూడో త్రైమాసికానికి మార్జిన్లు 5.7 శాతానికి చేరే అవకాశముంది. 2024–25లో రూ. 1,525 కోట్లుగా ఉన్న లాభాలు, 2026 కల్లా రూ. 4,560 కోట్లకు ఎగిసే అవకాశాలు ఉన్నాయి.
– సాక్షి, బిజినెస్ డెస్క్