breaking news
ups and downs
-
దీపావళి స్టాక్స్ పటాకా!
కొత్త సంవత్ 2082లో కొంత ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ మార్కెట్లు ముందుకే సాగుతాయనే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆదాయాల వృద్ధి వేగం పుంజుకోవడం, మళ్లీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం మొదలు కావడం, వాణిజ్య విధానాలపై స్పష్టత, భౌగోళిక రాజకీయ స్థిరత్వం వంటి అంశాలు సానుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. దేశీయంగా పాలసీలు స్థిరంగా కొనసాగడం, భారీ పెట్టుబడులు, సానుకూల ద్రవ్యపరపతి విధానాలు మొదలైనవి కీలక చోదకాలుగా నిలుస్తాయనే అంచనాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం నెమ్మదించడం, ఆర్థిక క్రమశిక్షణ, కార్పొరేట్ల రుణభారం తగ్గడం తదితర అంశాల దన్నుతో కంపెనీల ఆదాయాలు మెరుగుపడొచ్చని నువామా రీసెర్చ్ అభిప్రాయపడింది. 2026 ఆర్థిక సంవత్సరంలో అమెరికా ఫెడ్, ఈసీబీలు వడ్డీ రేట్లను మరికాస్త తగ్గించవచ్చని పేర్కొంది. ద్రవ్యోల్బణం కాస్త అదుపులో ఉన్న నేపథ్యంలో దేశీయంగా ఆర్బీఐ కూడా ఇదే బాటలో పయనించవచ్చని తెలిపింది. వేల్యుయేషన్స్ సముచిత స్థాయిలో ఉన్నాయని, అయితే గణనీయంగా పెరిగిన మిడ్–స్మాల్ క్యాప్స్‌లో మాత్రం కన్సాలిడేషన్‌కి ఆస్కారం ఉందని వివరించింది. జీఎస్టీ 2.0 సరళీకరణ, ఆదాయపు పన్నుపరమైన ఊరట, పండుగల సీజన్ మొదలైన అంశాల కారణంగా వినియోగం గణనీయంగా రికవర్ అవుతుందని మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది. ఆటో, కన్జూమర్ డ్యూరబుల్స్, ట్రావెల్, హోటల్స్, రిటైల్ వంటి రంగాలు మెరుగ్గా ఉండొచ్చని పేర్కొంది. మరోవైపు, ఆటో, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, తదితర రంగాలు ఆకర్షణీయంగా ఉంటాయని సెంట్రమ్ బ్రోకింగ్ తెలిపింది. నిఫ్టీ 28,500కి, సెన్సెక్స్ 95,000కు చేరొచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. వినియోగ ఆధారిత సంస్థలు, ప్రైవేట్ బ్యాంకులు మెరుగ్గా రాణించవచ్చని ట్రేడ్జినీ సీవోవో త్రివేష్ తెలిపారు. వచ్చే ఏడాది కాలానికి వివిధ బ్రోకరేజీ సంస్థలు అందిస్తున్న స్టాక్ సిఫార్సులు సాక్షి పాఠకులకు ప్రత్యేకం! బ్రోకరేజ్: జేఎం ఫైనాన్షియల్ మారుతీ సుజుకీప్రస్తుత ధర: రూ. 16,399 టార్గెట్ ధర: రూ. 19,000 (వృద్ధి: 16%) కార్యకలాపాలు స్థిరపడే కొద్దీ విస్తరణ వ్యయాలు తగ్గుముఖం పట్టడం, ప్రోడక్టుల మేళవింపు సానుకూలంగా ఉండటం మార్జిన్లు మెరుగుపడేందుకు దోహదపడొచ్చు. ఇన్‌హౌస్ బ్యాటరీ ప్లాంటుతో మరిన్ని హైబ్రిడ్ వాహనాలను ప్రవేశపెట్టొచ్చు. హైబ్రిడ్ సెగ్మెంట్లో వ్యయాలు తగ్గి, లాభదాయకత పెరుగుతుంది. అయితే, తీవ్రమైన పోటీ, కొత్తగా ప్రవేశపెట్టిన ప్యాసింజర్ వాహనాలకు స్పందన అంతంతమాత్రంగానే ఉండటం వంటివి ప్రతికూలాంశాలుగా ఉండొచ్చు. యాక్సిస్ బ్యాంక్ ప్రస్తుత ధర: రూ. 1,200 టార్గెట్ ధర: రూ. 1,330 (వృద్ధి: 11%)ఆకర్షణీయమైన వేల్యుయేషన్, అసెట్ క్వాలిటీ రిస్కులు తక్కువగా ఉండటం, నిర్వహణ వ్యయాలు నెమ్మదించడం వంటివి సానుకూలాంశాలు. రాబోయే త్రైమాసికాల్లో వృద్ధి వేగం మరింత పుంజుకోవచ్చు. నికర వడ్డీ మార్జిన్లు ఊహించిన దానికంటే క్షీణించే అవకాశాలు ప్రతికూలాంశం. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ప్రస్తుత ధర: రూ. 498 టార్గెట్ ధర: రూ. 600 (వృద్ధి: 20%)వేల్యుయేషన్ మెరుగ్గా ఉండటం, ఆదాయ రికవరీ వల్ల రీ–రేటింగ్‌కి అవకాశం ఉంది. పసిడి ధరల పరుగు కొనసాగుతుండటమనేది ఆదాయ అంచనాల పెంపునకు, రుణాల పోర్ట్‌ఫోలియో మెరుగుపడేందుకు ఉపయోగపడొచ్చు. అయితే, రుణ సంబంధ వ్యయాలు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉండటం కీలక రిసు్కల్లో ఒకటిగా ఉంటుంది.ఎల్అండ్టీ ఫైనాన్స్ ప్రస్తుత ధర: రూ. 266 టార్గెట్ ధర: రూ. 300 (వృద్ధి: 13% )మాతృ సంస్థ పటిష్టంగా ఉండటం, వైవిధ్యమైన ప్రోడక్టుల పోర్ట్‌ఫోలియో, లోన్ బుక్‌లో రిటైల్ ఫైనాన్స్ వాటా 90 శాతానికి పెరగడం వంటివి సానుకూలాంశాలు. ద్వితీయార్ధంలో పండగ సీజన్ డిమాండ్‌తో వృద్ధి వేగం పటిష్టంగా ఉండొచ్చు. అసెట్ క్వాలిటీపరమైన రిసు్కలు మళ్లీ తలెత్తే అవకాశాలుండటం ప్రతికూలాంశాల్లో ఒకటిగా నిలవొచ్చు. అపోలో హాస్పిటల్స్ ప్రస్తుత ధర: రూ. 7,909 టార్గెట్ ధర: రూ. 9,000 (వృద్ధి: 14% )కొత్తగా 1,717 పడకలు జతకానుండటం, ఫార్మసీ ఔట్లెట్స్ సంఖ్య 8 శాతం పెరుగుదల, పోటీ సంస్థ మ్యాక్స్ హెల్త్‌కేర్‌తో పోలిస్తే డిస్కౌంటులో ట్రేడవుతుండటం మొదలైనవి పాజిటివ్ అంశాలు. పడకల సామర్థ్యం పెంపు ఊహించిన దానికన్నా నెమ్మదిగా ఉండటం, రెగ్యులేటరీ రిస్కుల్లాంటివి ప్రతికూలాంశాలుగా ఉండొచ్చు.బ్రోకరేజ్: చాయిస్ ఈక్విటీ బ్రోకింగ్ ఫెడరల్ బ్యాంక్ ప్రస్తుత ధర: రూ. 212 టార్గెట్ ధర: రూ. 245 (వృద్ధి: 16% )టెక్నికల్‌గా కొన్నాళ్ల నుంచి పటిష్టమైన బేస్ ఏర్పర్చుకుంటోంది. రూ. 195–215 శ్రేణిలో తిరుగాడుతోంది. కరెక్షన్ జరిగిన ప్రతిసారి సపోర్ట్ బలపడుతోంది. 220పై నిలకడగా కొనసాగితే రూ. 245–255 వైపు ర్యాలీ చేయొచ్చు. రూ. 207–205 వరకు తగ్గితే కొనుగోళ్లకు అవకాశంగా భావించవచ్చు. రూ. 195 దిగువకి పడిపోతే బలహీనపడటాన్ని సూచిస్తుంది. సిప్లా ప్రస్తుత ధర: రూ. 1,578 టార్గెట్ ధర: రూ. 1,770 (వృద్ధి: 12%) నిర్దిష్ట శ్రేణిలో కన్సాలిడేట్ అవుతూ షేరు బలపడుతున్న సంకేతాలిస్తోంది. రూ. 1,580 వద్ద తక్షణ రెసిస్టెన్స్ ఉండగా, దీన్ని నిర్ణయాత్మకంగా దాటితే మధ్యకాలికంగా, దీర్ఘకాలికంగా రూ. 1,770–1,850 వైపుగా వెళ్లొచ్చు. తగ్గితే రూ. 1,480 వద్ద సపోర్ట్ లభిస్తుంది. మొమెంటమ్ ఇండికేటర్ల ప్రకారం చూస్తే బులి‹Ùగానే కనిపిస్తోంది. అశోక్ లేల్యాండ్ ప్రస్తుత ధర: రూ. 134 టార్గెట్ ధర: రూ. 151 (వృద్ధి: 13% )కనిష్ట స్థాయిల్లో కన్సాలిడేట్ అవుతూ, స్థిరంగా రికవర్ అవుతోంది. ప్రస్తుతం వీక్లీ చార్ట్‌లో బులి‹Ùగా కనిపిస్తోంది. టెక్నికల్‌గా రూ. 140 తక్షణ రెసిస్టెన్స్‌ని దాటితే మధ్య, దీర్ఘకాలికంగా రూ. 151–రూ. 158 వరకు పెరగవచ్చు. దిగువ వైపున రూ. 131 వరకు కొనుగోలుకు అవకాశం ఉంటుంది. రూ. 126 వద్ద పటిష్టమైన మద్దతు ఉంటుంది. దానికన్నా దిగువకి పడిపోతే ర్యాలీకి స్వల్పకాలిక రిస్కులు ఉంటాయి. సెయిల్ ప్రస్తుత ధర: రూ. 129 టార్గెట్ ధర: రూ.147 (వృద్ధి: 14% )టెక్నికల్‌గా పటిష్టమైన బేస్ ఏర్పర్చుకున్న స్టాక్, ప్రస్తుతం నిర్ణయాత్మక బ్రేకవుట్కి సిద్ధంగా ఉన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. భారీ వాల్యూమ్స్‌తో రూ. 138కి ఎగువన నిలకడగా క్లోజయితే, తదుపరి దశ ర్యాలీకి దారితీయొచ్చు. దిగువన రూ. 125 స్థాయి వరకు మరింతగా షేర్లను మరింతగా కొనుగోలు చేయొచ్చు. రూ. 116 వద్ద సపోర్ట్ ఉంటుంది. బీడీఎల్ ప్రస్తుత ధర: రూ. 1,540 టార్గెట్ ధర: రూ. 1,700 (వృద్ధి: 10% )ఫిబోనకీ రిట్రేస్‌మెంట్ లెవెల్‌కి 50 శాతం వద్ద కన్సాలిడేట్ అవుతోంది. ఇదే జోన్లో సపోర్ట్ లభిస్తోంది. సాధారణంగా ర్యాలీ చేసే ముందు, ఇలాంటి కన్సాలిడేషన్ కనిపిస్తుంది. తక్షణ రెసిస్టెన్స్ రూ. 1,560 వద్ద ఉంటుంది. దీన్ని నిర్ణయాత్మకంగా దాటితే బులిష్ ధోరణి బలపడి, సమీప భవిష్యత్తులో మరింత ర్యాలీకి దోహదపడొచ్చు. తగ్గితే, రూ. 1,440 వరకు కొనుక్కోవచ్చు. రూ. 1,380 బలమైన సపోర్ట్ జోన్‌గా ఉంటుంది.బ్రోకరేజ్: మిరే అసెట్ షేర్‌ఖాన్ అంబర్ ఎంటర్ప్రైజెస్ ప్రస్తుత ధర: రూ. 8,245 టార్గెట్ ధర: రూ. 9,300 (వృద్ధి: 13%) ఈ సంస్థ రెసిడెన్షియల్, కమర్షియల్ ఏసీలు, రిఫ్రిజిరేషన్ ఉత్పత్తులను అందిస్తోంది. కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో ఏసీలతో పాటు కంపెనీ వాషింగ్ మెషీన్ల మార్కెట్లోకి, అటు ఎల్రక్టానిక్స్లోకి, సెమీకండక్టర్ సబ్్రస్టేట్ పీసీబీలు మొదలైన వాటిల్లోకి ప్రవేశిస్తుండటం ద్వారా మార్కెట్ పరిధిని విస్తరించుకుంటోంది. ఎల్రక్టానిక్స్‌పై వచ్చే అయిదేళ్లలో రూ. 3,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. చాలెట్ హోటల్స్ ప్రస్తుత ధర: రూ. 975 టార్గెట్ ధర: రూ. 1,172 (వృద్ధి: 20%)వ్యూహాత్మక కొనుగోళ్లు, గదుల పెంపు, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం వంటివి సంస్థకు సానుకూలంగా ఉండనున్నాయి. అలాగే, కమర్షియల్ బిజినెస్ వాటా పెరుగుతుండటమనేది వృద్ధికి కీలక చోదకంగా నిలవనుంది. 2027 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 2,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 2025 డిసెంబర్ ఆఖరు నాటికి గదుల సంఖ్యను 4,500కి పెంచుకోనుంది. కమిన్స్ ఇండియా ప్రస్తుత ధర: రూ. 3,976 టార్గెట్ ధర: రూ. 4,500 (వృద్ధి: 13% )హై–హార్స్పవర్ (హెచ్‌హెచ్‌పీ) జెన్సెట్ల మార్కెట్లో అగ్రగామిగా నిలుస్తోంది. పటిష్టమైన బ్రాండింగ్, డి్రస్టిబ్యూషన్ నెట్వర్క్ ఉంది. 2025 తొలినాళ్ల నుంచి పవర్‌జెన్ వ్యాపారం పుంజుకుంది. డేటా సెంటర్లు, హాస్పిటల్స్, మొదలైన రంగాల నుంచి హెచ్‌హెచ్‌పీ జెన్సెట్లకు డిమాండ్ కొనసాగనుంది. ఎగుమతులు పటిష్టంగా ఉన్నాయి. యూరప్, ఆప్రికా, పశ్చిమాసియాలో డిమాండ్ స్థిరంగా ఉంది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ ప్రస్తుత ధర: రూ. 4,880 టార్గెట్ ధర: రూ. 6,000 (వృద్ధి: 23%) ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్లు, ఇంజిన్లు, యాక్సెసరీలు అందించే హెచ్ఏఎల్కి భారతదేశపు డిఫెన్స్ రంగంలో విశిష్టమైన స్థానం ఉంది. తయారీ సెగ్మెంట్ కార్యకలాపాలు పుంజుకోవడం వల్ల ఆదాయ వృద్ధి మెరుగుపడొచ్చు. రూ. 1.9 లక్షల కోట్ల ఆర్డర్ బ్యాక్లాగ్ ఉంది. రాబోయే 1–2 ఏళ్లలో రూ. లక్ష కోట్ల ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. హడ్కో ప్రస్తుత ధర: రూ. 224 టార్గెట్ ధర: రూ. 260 (వృద్ధి: 16% )సామాజిక హౌసింగ్, అర్బన్ మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రభుత్వ నోడల్ ఏజెన్సీగా పని చేస్తోంది. ప్రభుత్వాలతో పటిష్టమైన సంబంధాలు ఉన్నాయి. 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఏయూఎం వార్షికంగా 25 శాతం పైగా, లాభం 23 శాతం పైగా వృద్ధి చెందవచ్చు. వచ్చే 18 నెలల్లో మొండిపద్దుల భారాన్ని పరిష్కరించుకోవాలని కంపెనీ నిర్దేశించుకుంది. బ్రోకరేజ్: మోతీలాల్ ఓస్వాల్ ఎస్బీఐ ప్రస్తుత ధర: రూ. 889 టార్గెట్ ధర: రూ. 1,000 (వృద్ధి: 12%)జీఎస్టీ 2.0, ఆదాయ పన్ను సంస్కరణలు, ద్రవ్య లభ్యతను పెంచేందుకు ఆర్బీఐ తీసుకున్న చర్యలు మొదలైనవి రుణ వృద్ధికి దారి తీయొచ్చని, బీఎఫ్ఎస్ఐ రంగం లాభదాయకతకు తోడ్పడవచ్చని అంచనాలు ఉన్నాయి. రిటైల్, ఎస్ఎంఈ, కార్పొరేట్ సెగ్మెంట్లవ్యాప్తంగా పటిష్టమైన కార్యకలాపాలు ఉండటం బ్యాంకుకు సానుకూలాంశం. ఎంఅండ్ఎం ప్రస్తుత ధర: రూ. 3,648 టార్గెట్ ధర: రూ. 4,091 (వృద్ధి: 12%)2026 క్యాలెండర్ సంవత్సరం నుంచి 2030 నాటికి కంపెనీ 7 ఐసీఈ ఎస్యూవీ వాహనాలను, 5 బీఈవీలను, 5 ఎల్‌సీవీలను ప్రవేశపెట్టే ప్రణాళికల్లో ఉంది. తద్వారా ఐసీఈ, ఈవీ సెగ్మెంట్లలో కంపెనీ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో రికవరీ, కొత్త ఉత్పత్తుల దన్ను, ట్రాక్టర్ల మార్జిన్లు మెరుగుపడటం మొదలైనవి సంస్థకు కలిసి రానున్నాయి. భారత్ ఎల్రక్టానిక్స్ ప్రస్తుత ధర: రూ. 413 టార్గెట్ ధర: రూ. 490 (వృద్ధి: 19% )ఆర్మీ నుంచి రూ. 30,000 కోట్ల అనంత శస్త్ర ప్రాజెక్టు టెండర్లకు సంబంధించి కంపెనీ, లీడ్ ఇంటిగ్రేటరుగా వ్యవహరిస్తుండటం వల్ల కంపెనీ అర్డరు బుక్ రూ. లక్ష కోట్ల స్థాయిని దాటే అవకాశముంది. ఇది, వ్యూహాత్మక డిఫెన్స్ ప్రోగ్రాంలలో కంపెనీ నాయకత్వ స్థానాన్ని తెలియజేస్తోంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్వ్యాప్తంగా అవకాశాలతో దీర్ఘకాలికంగా కంపెనీ వృద్ధి అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. స్విగ్గీ ప్రస్తుత ధర: రూ. 432 టార్గెట్ ధర: రూ. 550 (వృద్ధి: 27% )పోటీ నెమ్మదిస్తుండటం, డార్క్ స్టోర్లను విస్తరణ క్రమంగా స్థిరపడుతుండటం మొదలైన వాటి కారణంగా కంపెనీకి చెందిన ఇన్‌స్టామార్ట్ విభాగం త్వరలో లాభదాయకంగా మారే అవకాశాలు ఉన్నాయి. జీఎస్టీ మార్పుల వల్ల వినియోగం మరింత పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో 2026–27 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి వ్యాపార వృద్ధి, గతంలో అంచనా వేసిన 20 శాతానికన్నా మెరుగ్గా 23 శాతం స్థాయిలో ఉంటుందని అంచనా. ఇండియన్ హోటల్స్ ప్రస్తుత ధర: రూ. 735 టార్గెట్ ధర: రూ. 880 (వృద్ధి: 20% )ఆక్యుపెన్సీ, ఏఆర్ఆర్ పెరుగుతుండటం వంటి అంశాల కారణంగా దేశీయంగా హాస్పిటాలిటీ పరిశ్రమ 2026 ఆర్థిక సంవత్సరంలో భారీగా వృద్ధి చెందనుంది. అలాగే ఎంఐసీఈ యాక్టివిటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ద్వితీయార్ధంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైనవి కూడా కంపెనీ వృద్ధికి దోహదపడనున్నాయి. బ్రోకరేజ్: హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అసోసియేటెడ్ ఆల్కహాల్స్ అండ్ బ్రూవరీస్ (ఏఏబీఎల్) ప్రస్తుత ధర: రూ. 1,058 టార్గెట్ ధర:రూ. 1,182 (వృద్ధి: 12% )క్రమంగా ప్రీమియం లిక్కర్ బ్రాండ్స్ వైపు మళ్లుతోంది. మధ్యప్రదేశ్‌లో 20–25 శాతం వరకు మార్కెట్ వాటా ఉంది. అలాగే, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, ఉత్తర్‌ప్రదేశ్ మార్కెట్లలోకి కూడా విస్తరిస్తోంది. ఇటీవలే నికోబార్ జిన్, హిల్‌ఫోర్ట్ విస్కీ అనే ప్రీమియం బ్రాండ్లను ప్రవేశపెట్టడంతో పాటు కొత్తగా బ్రాందీ, టెకీలాలో కూడా మరిన్ని ప్రోడక్ట్లను ప్రవేశపెట్టబోతోంది. వ్యయాలు తగ్గించుకుని, స్థిరమైన మార్జిన్లను సాధించేందుకు కసరత్తు చేస్తోంది. భారతి ఎయిర్టెల్ ప్రస్తుత ధర: రూ. 2,011 టార్గెట్ ధర: రూ. 2,244 (వృద్ధి: 12%) ఏఆర్ పీయూ, డిజిటల్ వ్యాపారాలు వృద్ధి చెందుతున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏఆర్పీయూ రూ. 250గా ఉండగా, టారిఫ్‌ల పెంపుతో రూ. 300 సమీపానికి చేరే అవకాశం ఉంది. ఇక గూగుల్, ఒరాకిల్, యాపిల్, హ్యూస్‌లాంటి దిగ్గజాలతో జట్టు కట్టడం ద్వారా మొబైల్ సరీ్వసుల పరిధికి మించి ఇతర విభాగాల్లోకి ప్రవేశించడంలో కంపెనీకి తోడ్పడనుంది. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ ప్రస్తుత ధర: రూ. 541 టార్గెట్ ధర: రూ. 639 (వృద్ధి: 18% )భారతదేశపు ఇంధన పరివర్తన లక్ష్యాలతో కంపెనీకి ప్రయోజనం చేకూరనుంది. కంపెనీ ఇప్పటికే నిర్దేశించుకున్న గడువు కన్నా ముందే 20 గిగావాట్ల స్ట్రాటెజీ 2.0 టార్గెట్‌ని సాధించింది. ఇప్పుడు 2030 నాటికి 30 గిగావాట్ల కెపాసిటీ, 40 గిగావాట్‌అవర్ స్టోరేజీని సాధించే దిశగా ముందుకెళ్తోంది. రూ. 1.3 లక్షల కోట్ల భారీ పెట్టుబడుల ప్రణాళికలు ఉన్నప్పటికీ పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తోంది. ఎల్అండ్టీ ప్రస్తుత ధర: రూ. 3,839 టార్గెట్ ధర: రూ. 4,243 (వృద్ధి: 11%) క్యాపిటల్ గూడ్స్ విభా గానికి చెందిన ఈ సంస్థ కు రూ. 6.1 లక్షల కోట్ల ఆర్డర్ బుక్ ఉంది. ఇన్ఫ్రా, ఎనర్జీ, హైడ్రోకార్బన్ ప్రాజెక్టులకు సంబంధించి రూ. 14.8 లక్షల కోట్ల ఆర్డర్లు కుదిరే దశలో ఉన్నాయి. ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం ద్వారా కంపెనీ లాభదాయకత మరింత మెరుగుపడనుంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ప్రస్తుత ధర: రూ. 72 టార్గెట్ ధర: రూ. 88.5 (వృద్ధి: 23%)కాసా డిపాజిట్లు 26 శాతం వృద్ధి చెందాయి. దీంతో కాసా నిష్పత్తి 48 శాతానికి, క్రెడిట్–డిపాజిట్ నిష్పత్తి 93.4 శాతానికి పెరిగాయి. నిధుల సమీకరణ వ్యయా లు తగ్గి, 2025–26 మూడో త్రైమాసికానికి మార్జిన్లు 5.7 శాతానికి చేరే అవకాశముంది. 2024–25లో రూ. 1,525 కోట్లుగా ఉన్న లాభాలు, 2026 కల్లా రూ. 4,560 కోట్లకు ఎగిసే అవకాశాలు ఉన్నాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
టారిఫ్‌లు, ప్రపంచ మార్కెట్లపై దృష్టి
ముంబై: ప్రధానంగా ప్రపంచ పరిణామాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశించనున్నాయి. బుధవారం (26న) మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లు భారీ అమ్మకాల కారణంగా నేలచూపులకే పరిమితమవుతున్నాయి. ఈ బాటలో మరోసారి ఆటుపోట్లు చవిచూడనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. చైనా ఎఫెక్ట్ యూఎస్ టారిఫ్‌లు తదితర పాలసీ నిర్ణయాలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలు దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. కొద్ది నెలలుగా మార్కెట్లు దిద్దుబాటు ధోరణిలో సాగుతున్నాయి. దీంతో మార్కెట్లు ఎక్కడ టర్న్అరౌండ్ అయ్యేదీ అంచనా వేయడం కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల మరోసారి చైనా మార్కెట్లవైపు విదేశీ ఇన్వెస్టర్లు దృష్టి పెట్టినట్లు పేర్కొంటున్నారు. ఫలితంగా దేశీ మార్కెట్లలో అమ్మకాలు కొనసాగుతున్నట్లు తెలియజేశారు. దీంతో పలువురికి ఆదాయపన్ను ఉపశమనాన్ని కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్, వడ్డీ రేట్లకు కీలకమైన రెపోలో 0.25 శాతం కోత పెట్టిన ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష పెద్దగా ప్రభావం చూపలేకపోయినట్లు ప్రస్తావించారు. వారాంతాన... గత కేలండర్ ఏడాది(2024) చివరి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు శుక్రవారం(28న) వెల్లడికానుంది. అక్టోబర్–డిసెంబర్(క్యూ4)లో దేశ జీడీపీ పురోగతి గణాంకాలు విడుదలకానున్నాయి. జులై–సెప్టెంబర్(క్యూ3)లో జీడీపీ 5.4 శాతం వృద్ధి చూపింది. మరోపక్క యూఎస్ క్యూ4 జీడీపీ రెండో అంచనాలు 27న వెలువడనున్నాయి. ముందస్తు అంచనాలు 2.3 శాతం వృద్ధిని సంకేతించాయి. గత మూడు త్రైమాసికాలలో ఇది తక్కువకాగా.. క్యూ3లో 3.1 శాతం పురోగతి నమోదైంది. ఇదే రోజు జనవరి నెలకు యూఎస్ కీలక ద్రవ్యోల్బణ గణాంకాలు, డ్యురబుల్ గూడ్స్ ఆర్డర్లు, వ్యక్తిగత ఆదాయం, వ్యయాలు తదితర గణాంకాలు సైతం వెల్లడికానున్నాయి. ఇన్వెస్టర్లు గ్లోబల్ అంశాలపైనా దృష్టి పెట్టనున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసె స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ తెలియజేశారు.గత వారమిలా..గత వారం(17–21) దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోవారంలోనూ డీలా పడ్డాయి. అమ్మకాలు ఊపందుకోవడంతో సెన్సెక్స్ నికరంగా 628 పాయింట్లు(0.85 శాతం) క్షీణించి 75,311 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 133 పాయింట్లు(0.6 శాతం) నీరసించి 22,796 వద్ద స్థిరపడింది. అయితే బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 1.6 శాతం, 1 శాతం చొప్పున బలపడటం గమనార్హం!ఇతర అంశాలురష్యా– ఉక్రెయిన్ యుద్ధం సంబంధిత వార్తలు, ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి తీరు సైతం దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు ఖేమ్కా పేర్కొన్నారు. దేశీ మార్కెట్లలో బలహీన సెంటిమెంటు నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు వినోద్ అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ ఆర్జన మెరుగుపడటం, గ్లోబల్ లిక్విడిటీ, కరెన్సీ నిలకడం వంటి సానుకూల పరిస్థితులు నెలకొనేవరకూ మార్కెట్లు కన్సాలిడేట్ అయ్యే వీలున్నట్లు నిపుణులు వివరించారు. యూఎస్ విధిస్తున్న టారిఫ్‌లపై ఆందోళనలు దేశీ మార్కెట్లతోపాటు.. పలు ఇతర మార్కెట్లను సైతం ప్రభావితం చేయనున్నట్లు కొటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలియజేశారు. సమీప భవిష్యత్‌లో టారిఫ్ వార్తలు ట్రెండ్‌ను నిర్దేశించవచ్చని అంచనా వేశారు. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ విధిస్తున్న టారిఫ్‌లు కీలక భాగస్వామ్య దేశాలను ప్రభావితం చేయనున్నట్లు మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునీత్ సింఘానియా పేర్కొన్నారు. దీనికితోడు దేశీయంగా కార్పొరేట్ ఫలితాలు కొంతమేర నిరాశపరుస్తున్నట్లు తెలియజేశారు. -
తీవ్ర హెచ్చుతగ్గులు
♦ చివరకు సెన్సెక్స్ 81 పాయింట్లు డౌన్ ♦ 25 పాయింట్లు తగ్గిన నిఫ్టీ ముంబై: అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా రోజంతా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైన భారత్ స్టాక్ మార్కెట్ చివరకు క్షీణతతో ముగిసింది. గత రాత్రి అమెరికా మార్కెట్ పతనం కావడం, అదేరీతిలో ఆసియా మార్కెట్లు పడిపోవడంతో గురువారం తొలుత బీఎస్ఈ సెన్సెక్స్ 300 పాయింట్ల వరకూ క్షీణించి 24,473 పాయింట్ల కనిష్టస్థాయికి పతనమయ్యింది. ఇన్ఫోసిస్ ఫలితాలు ఉత్సాహపర్చడం, చైనా మార్కెట్ రికవరీ కావడంతో మధ్యాహ్న సెషన్లో కోలుకుని 25,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించింది. అయితే అటుతర్వాత యూరప్ మార్కెట్లు పతనబాటపట్టడంతో చివరకు 81 పాయింట్ల తగ్గుదలతో 24,773 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేబాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 7,440-7,600 పాయింట్ల మధ్య ఊగిసలాడి చివరకు 25 పాయింట్ల నష్టంతో 7,537 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. రూపాయి రెండున్నరేళ్ల కనిష్టస్థాయికి పడిపోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపర్చింది. చైనా మినహా మిగిలిన ప్రపంచ ప్రధాన మార్కెట్లు బలహీనంగా ట్రేడ్‌కావడంతో సెన్సెక్స్ లాభాల్ని నిలబెట్టుకోలేకపోయిందని హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ చెప్పారు. వెలుగులో ఇన్ఫో సిస్, లోహ, బ్యాంకింగ్ షేర్లు పతనం.... ఇన్ఫోసిస్ ఫలితాలు మార్కెట్ అంచనాల్ని మించడం, పూర్తి ఆర్థిక సంవత్సరానికి గెడైన్స్ పెంచడంతో ఆ షేరు 5 శాతం వరకూ ర్యాలీ జరిపింది. ఇదేబాటలో టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్‌లు స్వల్పంగా పెరిగాయి. ప్రపంచ ట్రెండ్‌ను అనుసరిస్తూ లోహ షేర్లు పతనమయ్యాయి. అధిక రుణభారం కారణంగా టాటా స్టీల్‌ను ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ డౌన్‌గ్రేడ్ చేయడంతో ఆ షేరు 3.3 శాతం క్షీణించింది. వేదాంత, హిందాల్కోలు 2.5 శాతం వరకూ తగ్గాయి. జిందాల్ ఐరెన్ అండ్ స్టీల్ 8 శాతం పతనమయ్యింది. మరోవైపు యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు 1-4 శాతం మధ్య తగ్గాయి. చైనా షాంఘై సూచి 2 శాతం వరకూ పెరిగింది. సెన్సెక్స్ 22,000కు..: ఆంబిట్ అంచనా దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతున్నదని, ఫలితంగా వచ్చే కొద్దిరోజుల్లో సెన్సెక్స్ 22,000 స్థాయికి పడిపోతుందని బ్రోకరేజ్ సంస్థ ఆంబిట్ క్యాపిటల్ అంచనావేసింది. బలహీన కార్పొరేట్ ఫలితాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహకరణ ఈ పతనానికి దారితీస్తుందని ఆంబిట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఈక్విటీస్) సౌరభ్ ముఖర్జియా చెప్పారు. బొగ్గు, సిమెంటు ఉత్పత్తి, ద్విచక్ర వాహన విక్రయాలు, గ్రామీణ వేతనాలు, విద్యుదుత్పత్తి, చమురుయేతర బ్యాంకు రుణాలు, డిపాజిట్లు తగ్గుతున్నాయని ముఖర్జియా తెలిపారు. ఈ అంశాలు ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతున్నదనడానికి సంకేతాలన్నారు. -
ఆటుపోట్లను అధిగమిస్తూ...
చెన్నై, సాక్షి ప్రతినిధి: జయలలిత.. ఈ పేరు ఒకప్పుడు సాధారణ నటిది. కానీ నేడు జాతీయ స్థాయిలో ఒక ఉక్కుమహిళగా పేరుగాంచిన అన్నా డీఎంకే అధినేత్రిది. 33 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లను అధిగమించిన చరిత్ర ఆమెది. తమిళనాడు ప్రజలతో అమ్మ అని పిలిపించుకోవడంలోనే ఆమె సమ్మోహనాస్త్రముంది. 1948 ఫిబ్రవరి 24న జన్మించిన జయలలిత నటిగా వెలుగొందుతున్న కాలంలో ఎం.జి.రామచంద్రన్ ఆమెలోని ప్రతిభా పాటవాలను గుర్తించి 1982లో పార్టీలోకి ఆహ్వానించారు. 1983లో పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ప్రచార కార్యదర్శిగా ఎంజీఆర్ వద్ద ఆమె మంచి మార్కులు కొట్టేశారు. జయ ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని మెచ్చుకున్న ఎంజీఆర్ 1984లో ఆమెను రాజ్యసభ సభ్యురాలిని చేశారు. 1987 డిసెంబరు 24న ఎంజీఆర్ మరణానంతరం తొలిసారిగా జయకు రాజకీయకష్టాలు మొదలయ్యాయి. ఎంజీఆర్ అంత్యక్రియల ఊరేగింపు నుంచి జయను ఆ పార్టీ నేతలే తోసివేశారు. పార్టీ ఎంజీఆర్ భార్య జానకీ రామచంద్రన్ వర్గం, జయ వర్గంగా విడిపోయింది. ఎంజీఆర్ వారసురాలిగా 93 మంది సభ్యుల మద్దతుతో 1988 జనవరి 7వ తేదీన జానకి సీఎం పదవిని అధిష్టించినా అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ రాజ్యాంగంలోని 356 సెక్షన్‌తో ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో రాష్ట్రపతి పాలన వచ్చింది. అన్నా డీఎంకే పగ్గాలు జయ చేతికి రాగా 1989 నాటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో తొలి మహిళా విపక్ష నేతగా నిలిచారు. జయను ప్రతిపక్ష నేతగా సహించలేని డీఎంకే సభ్యులు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెపై మైక్‌లు విసిరివేసి తీవ్రంగా అవమానించి కన్నీళ్లు పెట్టుకుంటూ అసెంబ్లీ వదిలి వెళ్లిపోయేలా చేశారు. సీఎంగా అవతరణ..ఎంజీఆర్‌ను కోల్పోయిన అన్నా డీఎంకేకు జయ చుక్కానిగా మారారు. 1991 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని తొలిసారి సీంగా ఐదేళ్లు పాలించారు. 2001లో రెండోసారి సీఎంగా పగ్గాలు చేపట్టారు. అయితే ఆ ఏడాది సెప్టెంబర్‌లో టాన్సీ(తమిళనాడు చిన్నతరహా పరిశ్రమల సంస్థ) కేసులో దోషిగా తేలినందున సీఎం పదవికి రాజీనామా చేశారు. అప్పుడు తన అనుచరుడు పన్నీర్‌సెల్వంను సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. తర్వాత 2002లో నిర్దోషిగా తేలడంతో మరోసారి సీఎం పగ్గాలు చేపట్టారు. 2014 సెప్టెంబర్‌లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కిందికోర్టు దోషిగా ప్రకటించడంతో మళ్లీ సీఎం పదవికి రాజీనామా చేశారు. అప్పుడు కూడా పన్నీర్‌సెల్వంను సీఎం కుర్చీలో కూర్చొబెట్టారు. 21 రోజులు జైల్లో ఉండి, సుప్రీం బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చారు. జయను వెంటాడిన డీఎంకే.. అన్నా డీఎంకే అధినేత్రిగా జయ ఏకు మేకైందని భావించిన డీఎంకే తాను అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఆమెపై అనేక కేసులు పెట్టింది. జయ వాటి నుంచి బయటపడుతూ వచ్చారు. జయ నాటి నుంచి నేటి వరకు 14 కేసులతో ఆటుపోట్లను అధిగమించి ఉక్కు మహిళగా నిలిచారు. టాన్సీ, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు, ప్లజెంట్ స్టే హోటల్ కేసు ఇలా14 కేసుల నుంచి బయటపడి పేరులోనే కాదు జీవితంలోనూ జయమేనని నిరూపించారు. ఈ కేసులన్నీ 1996-2001 మధ్య డీఎంకే ప్రభుత్వ హయాంలో మోపినవే. 2001లో జయ మళ్లీ సీఎం అయిన తర్వాత ఒక్కొక్కటిగా కేసుల నుంచి బయటపడ్డారు. కోర్టుల్లో ఆరోపణలు నిరూపణ కాకపోవడంతో అన్ని కేసుల్లో నిర్దోషిగా మిగిలారు. 13కేసుల్లో నిరపరాధిగా నిరూపించుకున్నారు. బలమైన కేసు... గతంలో ఎదుర్కొన్న కేసుల కంటే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు అత్యంత బలమైనది. 1991-96 మధ్య సీఎంగా జయ అక్రమాస్తులు కూడగట్టారని అప్పటి జనతా పార్టీ చీఫ్ సుబ్రహ్మణ్యస్వామి(ప్రస్తుతం బీజేపీ నేత) 1996 జూన్ 14న మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. అప్పట్లో తమిళనాడు గవర్నర్‌గా ఉన్న మర్రి చెన్నారెడ్డి అనుమతి తీసుకుని మరీ పిటిషన్ వేశారు. విచారణలో రూ. 66.65 కోట్లు అక్రమార్జనగా జయపై అభియోగం మోపారు. కేసులో ఆధారాలు బలంగా ఉన్నాయని ప్రత్యర్థులు ప్రచారం చేసినట్లుగానే ప్రత్యేక కోర్టులో జయకు శిక్షపడింది. కర్ణాటక హైకోర్టులో అప్పీలు చేసుకోవడం ద్వారా డీఎంకే పెట్టిన అన్ని కేసుల నుంచి జయ నిర్దోషిగా నిలిచినట్లయింది. జయ విజయ రహస్యం... సినీ వ్యక్తులను రాజకీయంగా సైతం ఆరాధించే తమిళనాడులో జయ ప్రత్యేక ఆకర్షణ. ఎంజీఆర్ మరణించి 30 ఏళ్లు దాటినా ఆయనపై తరగని అభిమానం ఉంది. ఎంజీఆర్ బతికున్నప్పుడే పార్టీ భవిష్య నాయకురాలిగా జయను తెరపైకి తేవడాన్ని ప్రజలు నేటికీ గుర్తుంచుకున్నారు. డీఎంకేకు ప్రత్యామ్నాయం అన్నాడీఎంకే మాత్రమే అనే రీతిలో ఎంజీఆర్ తీర్చిదిద్దగా అదే బాటలో జయ సైతం నడవడం మరింత బలాన్ని చేకూర్చింది. జయ తాత మైసూరు మహారాజు సంస్థానంలో సర్జన్‌గా పనిచేసినందున ఉన్నత కుటుంబ నేపథ్యంతో పాటు విద్యాధికురాలిగా ఆమెను గుర్తించారు. ఇంగ్లిష్తో పాటు తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఆమె అనర్గళంగా మాట్లాడగలరు. ఎంజీఆర్‌ను పురచ్చితలైవర్ (విప్లవ నాయకుడు) అని పిలుచుకునే తమిళనాడు ప్రజలు జయను పురచ్చితలైవి(విప్లవనాయకురాలు)గా పిలవడం ప్రారంభించారు. అమ్మ అంటే జయ అంటూ అక్కున చేర్చుకున్నారు. ప్రధానంగా ఆమె తెచ్చిన పథకాలు ఆమెను ప్రజలకు మరింత చేరువ చేశాయి. జయకు జైలు శిక్షపడిన నాటి నుంచి తాజా తీర్పు వరకు 233 మంది బలవన్మరణాలకు పాల్పడటం ప్రజలకు ఆమెపై ఉన్న అభిమానానికి తార్కాణం.