
జీఎస్టీ 2.0 పేరిట తెచ్చిన సంస్కరణలను మేక్ ఇన్ ఇండియా ప్రచారంలో భాగంగానే పరిగణించాలని.. వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఎన్డీయే ఎంపీలకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. సోమవారం ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన.. ఈ మేరకు దిశానిర్దేశం చేశారు.
GST 2.0 సంస్కరణల గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ప్రతి ఎంపీ తమ నియోజకవర్గంలో 20 నుంచి 30 సమావేశాలు నిర్వహించాలి. స్థానిక వ్యాపారులు, దుకాణదారులకు GST 2.0 ప్రయోజనాలు వివరించాలి.
నవరాత్రి నుంచి దీపావళి మధ్య.. స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహం కోసం స్థానిక హస్తకళాకారులు, చిన్న పరిశ్రమలు పాల్గొనే స్వదేశీ ప్రదర్శనలు, జాతరలు నిర్వహించాలి. గర్వంగా చెప్పండి.. ఇది స్వదేశీ అనే నినాదంతో అన్ని రంగాల్లోనూ ఎగ్జిబిషన్లు నిర్వహించాలని సూచించారు.
అదే సమయంలో పంజాబ్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వరదలు కారణంగా ఎన్డీయే ఎంపీల విందు కార్యక్రమాన్ని ఆయన వాయిదా వేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, నేను ఉత్సవ విందు ఎలా నిర్వహించగలను? అని అన్నారాయన. ప్రజలపై పన్ను భారం తగ్గించడంతో పాటు భారత ఎకానమీకి బూస్ట్ ఇస్తుందని భావిస్తోంది.
జీఎస్టీ 2.0 అనేది భారత ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా పన్ను సంస్కరణ. ఇది 2025 సెప్టెంబర్ 22 నుండి అమలులోకి రానుంది. 2017లో ప్రారంభమైన జీఎస్టీ వ్యవస్థకు పెద్ద మార్పుగా భావించబడుతోంది.
ప్రధాన మార్పులు:
• పాత slabs: 0%, 5%, 12%, 18%, 28% + cess
• కొత్త slabs: 0%, 5%, 18%, 40% (cess తొలగింపు)
ధరలు తగ్గిన వస్తువులు:
👉అవశ్యక వస్తువులు: పన్ను 0%
పన్నీర్, చపాతీ, UHT పాలు, అవసరమైన ఔషధాలు
👉 ప్రాముఖ్యమైన వినియోగ వస్తువులు: 5%
షాంపూ, టూత్‌పేస్ట్, హేర్ ఆయిల్, వ్యవసాయ పరికరాలు
👉సాధారణ వస్తువులు: 18%
TVs, ACs, వాషింగ్ మెషీన్లు, చిన్న కార్లు
👉లగ్జరీ & హానికర వస్తువులు: 40%
పొగతాగే పదార్థాలు, పాన్ మసాలా, లగ్జరీ కార్లు
👉ఆటోమొబైల్ రంగంపై ప్రభావం.. చిన్న కార్లు: GST 28% → 18% (ధరలు తగ్గాయి). బెండ్స్, టాటా, హ్యుందాయ్, రెనాల్ట్ వంటి కంపెనీలు రూ. 60,000–₹10 లక్షల వరకు ధరలు తగ్గించాయి
👉 ఇన్సూరెన్స్ పాలసీలు: జీవన, ఆరోగ్య బీమాలపై GST పూర్తిగా మాఫీ
👉పాఠశాల వస్తువులు: పెన్సిల్, షార్పెనర్, నోట్‌బుక్‌లపై పన్ను తగ్గింపు
👉వ్యవసాయ పరికరాలు: ట్రాక్టర్లు, డ్రిప్ ఇరిగేషన్, కంపోస్టింగ్ యంత్రాలు — 5% GST
జీఎస్టీ 2.0 లక్ష్యాల్లో ప్రధానమైంది సాధారణీకరణ. పన్ను slabs తగ్గించడం ద్వారా వ్యాపారులకు సులభతరం అవుతుంది. అవసరమైన వస్తువులపై పన్ను తగ్గింపుతో పాటు ఆర్థిక వృద్ధికి తోడ్పాటు, తద్వారా వినియోగం పెరగడం ద్వారా GDP వృద్ధి చెందుతుంది. పన్ను వ్యవస్థలో స్పష్టత, పారదర్శకత కారణంగా.. వివాదాలు, విమర్శలు తొలగిపోతాయనే ఆలోచనతోనూ ఎన్డీయే ప్రభుత్వం ఉంది.