
జీఎస్టీ 2.0 ఎప్పుడెప్పుడు అమలవుతుందా.. కొత్త కార్లు ఎప్పుడు కొనుగోలు చేద్దామా అని చాలామంది ఎదురు చూశారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగా సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వచ్చాయి. దీంతో కార్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.
జీఎస్టీ సంస్కరణలు అమలులోకి రావడంతో చిన్నకార్ల ధరలు చాలా వరకు తగ్గాయి. దీంతో కార్లను కొనుగోలు చేయడానికి వాహనప్రియులు ఎగబడ్డారు. కొత్త జీఎస్టీ అమల్లోకి వచ్చిన మొదటిరోజే.. మారుతి సుజుకి (Maruti Suzuki) 30,000 యూనిట్ల కార్లను విక్రయించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) సుమారు 11,000 కార్లను విక్రయించింది. టాటా మోటార్స్ (Tata Motors) కూడా 10,000 కార్లను విక్రయించింది.
ఇదీ చదవండి: కారు మైలేజ్ పెరగడానికి టిప్స్
దేశంలో చిన్న కార్ల విక్రయాలు భారీగా పెరిగాయి. ఆటోమొబైల్ కంపెనీలు జీఎస్టీ ప్రయోజనాలను పూర్తిగా కస్టమర్లకు అందిస్తున్నాయి. రాబోయి రోజుల్లో కూడా ఈ సేల్స్ ఇలాగే కొనసాగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా.. సోమవారం కార్లను కొనుగోలు చేయడానికి కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో డీలర్‌షిప్‌లకు తరలిరావడంతో, ఆటోమోటివ్ డీలర్ల రద్దీ పెరిగిందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) తెలిపింది.