
ఒక కారు కొనుగోలు చేయాలంటే కొందరు ఫీచర్స్ చూస్తారు, ఇంకొందరు డిజైన్ చూస్తారు, మరికొందరు సేఫ్టీ చూస్తుంటారు. అయితే చాలామందికి కావల్సినది మాత్రం మంచి మైలేజ్ ఇచ్చే కార్లే. దీనిని దృష్టిలో ఉంచుకునే.. ఉత్తమ మైలేజ్ ఇచ్చే కార్లను కొనుగోలు చేస్తుంటారు. కానీ ఉపయోగించే కారు మైలేజ్ కొంత ఎక్కువ ఇవ్వాలంటే కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. అలాంటి టిప్స్ ఇక్కడ తెలుసుకుందాం.
➤కారును డ్రైవ్ చేసే సమయంలో.. తక్కువ వేగంలో టాప్ గేర్, ఎక్కువ వేగంలో స్టార్టింగ్ గేర్స్ ఉపయోగించకూడదు. ఇలా చేస్తే ఇంజిన్ మీద ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి సరైన గేర్ ఉపయోగించాలి.
➤అకస్మాత్తుగా బ్రేక్స్ వేయడం, ఎక్స్‌లేటర్ వేగాన్ని పెంచడం వంటివి చేయకూడదు.
➤ఎక్కువ మైలేజ్ కావలనంటే కారు టైర్లలో తగినంత గాలి ఉండేలా చూసుకోవడం కూడా ముఖ్యమే.
➤కారు కెపాసిటీ కంటే ఎక్కువ లోడింగ్ వేయకూడదు. ఓవర్ లోడింగ్ మీ కారు మైలేజిని తగ్గిస్తుంది.
➤కారును ఎప్పటికప్పుడు సర్వీస్ చేయిస్తూ ఉండాలి. ఇది మైలేజిని మెరుగుపరుస్తుంది.
➤దుమ్ముపట్టిన ఎయిర్ ఫిల్టర్స్.. ఇంజిన్‌లో గాలి ప్రసరణను తగ్గిస్తుంది. దీనివల్ల ఫ్యూయెల్ వినియోగం కొంత ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎయిర్ ఫిల్టర్స్ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
ఇదీ చదవండి: క్విడ్ స్పెషల్ ఎడిషన్: 500 మందికి మాత్రమే!