బంగారం ధరలు వరుస పెరుగుదలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. రెండు రోజుల్లో ఏకంగా రూ. 6000తగ్గింది. దీంతో పసిడి ధరల్లో ఊహించని మార్పులు జరిగాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు ఎలా ఉందో తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడ నగరాల్లో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా రెండు రోజుల్లో 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.6220 తగ్గి, రూ. 1,36,200 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 5700 రూపాయలు తగ్గింది. దీంతో రేటు రూ.1,24,850 వద్దకు చేరింది.
ఢిల్లీ నగరంలో ధరలు దాదాపు తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగా పెరిగినప్పటికీ.. రేట్లలో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,36,350 వద్ద, 22 క్యారెట్ల రేటు రూ. 1,25,000 వద్ద ఉంది.
చెన్నై విషయానికి వస్తే.. ఇక్కడ 24 క్యారెట్ల గోల్డ్ రేటు రెండు రోజుల్లో 5450 రూపాయలు తగ్గడం వల్ల.. 10గ్రాముల ధర రూ. 137460 వద్ద ఉంది. ఇదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 5000 తగ్గింది. కాబట్టి రేటు రూ. 1,26,000 వద్ద నిలిచింది.


