
ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్.. భారతదేశంలో క్విడ్ లాంచ్ చేసి పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కంపెనీ క్విడ్ 10వ యానివర్సరీ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. అయితే దీనిని 500 మందికి మాత్రమే విక్రయించనుంది.
రెనాల్ట్ క్విడ్ 10వ యానివర్సరీ ఎడిషన్ ఆటోమాటిక్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 5.63 లక్షలు, రూ. 5.14 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది డ్యూయల్ టోన్ కలర్ ఎంపికలో మార్కెట్లో లాంచ్ అయింది. కాబట్టి ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
ఇదీ చదవండి: జీఎస్టీ 2.0 ఎఫెక్ట్: రూ.4.50 లక్షలు తగ్గిన జీప్ ధరలు
లిమిటెడ్ ఎడిషన్ క్విడ్ లోపలి భాగంలో 10వ వార్షికోత్సవ నేపథ్యంతో కూడిన సీటు డిజైన్‌లు, ప్రీమియం డీటెయిలింగ్‌లు ఉన్నాయి. సీట్లపై ఎల్లో కలర్ యాక్సెంట్స్, మెటల్ మస్టర్డ్ స్టిచ్‌తో కూడిన లెథరెట్ స్టీరింగ్ వీల్, ఇన్ఫోటైన్‌మెంట్ సరౌండ్, ప్రకాశవంతమైన స్కఫ్ ప్లేట్లు, పుడిల్ లాంప్‌లు మొదలైనవి ఉన్నాయి. ఇందులోని అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లను పొందుతుంది.