
టయోటా హైరైడర్.. స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త కారు పేరు 'హైరైడర్ ఏరో ఎడిషన్' (రూ.10.94 లక్షలు). ఇది స్టాండర్డ్ హైరైడర్ కంటే రూ. 31,999 ఎక్కువ ధరలో ప్రత్యేకమైన స్టైలింగ్ కిట్‌ను పొందుతుంది.
కంపెనీ అందించే ఈ ప్రత్యేకమైన స్టైలింగ్ కిట్‌లో.. బంపర్‌కు మరింత దూకుడుగా ఉండే లుక్‌ని ఇచ్చే ఫ్రంట్ స్పాయిలర్, వెనుక భాగంలో స్పాయిలర్, హైరైడర్‌కు మొత్తం మీద స్పోర్టియర్ లుక్‌ని తెచ్చే సైడ్ స్కర్ట్‌లు వంటివి ఉన్నాయి. ఈ కిట్ కూడా పరిమిత సమయం మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఇదీ చదవండి: ఇందులో భారత్ అభివృద్ధి ఆగిపోతోంది!: గౌతమ్ సింఘానియా
హైరైడర్ ఏరో ఎడిషన్ తెలుపు, సిల్వర్, నలుపు, ఎరుపు అనే నాలుగు రంగులలో లభిస్తుంది. కాగా టయోటా హైరైడర్ మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్, సీఎన్జీ పవర్‌ట్రెయిన్‌తో అందుబాటులో ఉంది. ఇందులోని 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్, 103 హార్స్ పవర్, 136 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ 116 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది e-CVTతో లభిస్తుంది. CNG ఇంజిన్ 87 హార్స్ పవర్, 121 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.