
హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) సరికొత్త సీబీ350సీ స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ధర రూ. 2.01 లక్షల (ఎక్స్-షోరూమ్). దీని కోసం సంస్థ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు అక్టోబర్ 2025 మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి.
హోండా సీబీ350సీ స్పెషల్ ఎడిషన్.. బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా అందుబాటులో ఉంటాయి. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే కొంత ఎక్కువ అప్డేట్స్ పొందింది. ఇంధన ట్యాంక్, ముందు, వెనుక ఫెండర్‌లలో గ్రాఫిక్స్ కనిపిస్తాయి. ఇది రెబెల్ రెడ్ మెటాలిక్ అండ్ మాట్ డ్యూన్ బ్రౌన్ అనే రెండు రంగు ఎంపికలలో లభిస్తుంది.
సీబీ350సీ స్పెషల్ ఎడిషన్ బైక్ 348.36 సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 5500 rpm వద్ద, 20 హార్స్ పవర్, 3000 rpm వద్ద 29.5 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. కాబట్టి పర్ఫామెన్స్ స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది.