
క్లాసిక్ లెజెండ్స్ (సీఎల్) తమ జావా, యెజ్డి బైక్‌ల కొత్త ధరలను ప్రకటించింది. వీటిలో అడ్వెంచర్, రోడ్స్టర్, బాబర్ నుండి స్క్రాంబ్లర్ వరకు ఉన్నాయి. ఇప్పుడివి రూ .2 లక్షల లోపు అందుబాటులో ఉన్నాయి. పర్యావరణానికి పనికిరాదని భావించిన టూ స్ట్రోక్ మోటార్ సైకిల్ ను నిషేధించిన విధాన మార్పు కారణంగా భారతదేశంలో జావా, యెజ్డీ అమ్మకాలను కంపెనీ గతంలో నిలిపివేసింది. అయితే జీఎస్టీ 2.0 సంస్కరణలతో, జావా, యెజ్డీ బైక్లు తిరిగి రోడ్లపైకి వస్తాయని కంపెనీ తెలిపింది.
350 సీసీ లోపు మోటార్ సైకిళ్లపై జీఎస్టీని తగ్గించి 18 శాతం పరిధిలోకి తీసురావడాన్ని స్వాగతిస్తున్నట్లు జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ సహ వ్యవస్థాపకుడు అనుపమ్ తరేజా చెప్పారు. జీఎస్టీ తగ్గింపుతో తమ 293 సీసీ జావా, 334 సీసీ యెజ్డి పర్ఫార్మెన్స్ క్లాసిక్ బైక్‌ల ధరలు కస్టమర్లకు మరింత అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొన్నారు.
కొత్త ధరలు ఇవే
- 42 మోడల్ పాత ధర రూ.1,72,942 కాగా కొత్త ధర రూ.1,59,431 తగ్గింపు రూ. 13,511
- జావా 350 పాత ధర రూ.1,98,950, కొత్త ధర రూ.1,83,407, తగ్గింపు రూ.15,543
- 42 బాబర్ పాత ధర రూ.2,09,500, కొత్త ధర రూ.1,93,133, తగ్గింపు రూ.16,367
- 42 బాబర్ (ఇంకొక వేరియంట్) పాత ధర రూ.2,10,142, కొత్త ధర రూ.1,93,725, తగ్గింపు రూ.16,417
- పెరక్ పాత ధర రూ.2,16,705, కొత్త ధర రూ.1,99,775, తగ్గింపు రూ.16,930