
పెట్రోల్ కార్లు, ఎలక్ట్రిక్ కార్లు, గ్యాస్ కార్లకు గుడ్‌బై చెప్పే సమయం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు కొత్త హీరో వచ్చాడు. పేరు ‘లైట్‌యేర్ జీరో’. ఇది ప్రపంచంలోనే సౌరశక్తితో నడిచే మొట్టమొదటి కారు. ప్రముఖ డచ్ కంపెనీ రూపొందించిన ఈ కారు పైభాగం, ముందువైపు మొత్తం సోలార్ ప్యానెల్స్‌తో కప్పబడి ఉంటుంది. కారు డిజైన్‌కు ఇది ఏ మాత్రం ఆటంకం కలిగించదు. పైగా, దీన్ని గాలి ఒరిపిడిని తగ్గించేలా తేలికపాటి నిర్మాణాలతో డిజైన్ చేశారు. ఫలితంగా, సాధారణ కార్లతో పోలిస్తే ఎక్కువ వేగంతో మరింత సమర్థంగా పనిచేస్తుంది.
ఒక్క సూర్యోదయంతో దాదాపు డైబ్భై కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. ఒకసారి బ్యాటరీని చార్జ్ చేస్తే, ఏకంగా ఏడువందల కిలోమీటర్లు వెళ్లగలదు. అంటే, ఛార్జింగ్ స్టేషన్ల కోసం ఎదురుచూసే రోజులు ఇక పోతాయి. గ్రామాలు, ఇంధన సమస్యలున్న ప్రాంతాలకు ఇది నిజమైన ‘సూపర్ హీరో’ కారు. ప్రస్తుతం ఇది ఇంకా మార్కెట్‌లోకి రాలేదు కాని, భవిష్యత్తులో మొత్తం రవాణా వాహనాలు ఇలాగే మారుతాయని నిపుణులు చెప్తున్నారు.
ఇదీ చదవండి: దీపావళి వేళ ఏరో ఎడిషన్ లాంచ్: స్పెషల్ కిట్ కూడా