
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) తగ్గింపు ప్రయోజనాలను కస్టమర్లకు బదలాయించడంపై దృష్టి పెట్టాలని దేశీ పరిశ్రమకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ సూచించారు. దీని వల్ల పరిశ్రమకు కూడా లబ్ధి చేకూరుతుందన్నారు. మరోవైపు, పరిశ్రమకు లావాదేవీల వ్యయాలను తగ్గించే దిశగా సమగ్ర రాష్ట్ర, నగర లాజిస్టిక్స్ ప్రణాళికలను ఆయన ఆవిష్కరించారు.
ఎనిమిది రాష్ట్రాలవ్యాప్తంగా ఇవి అమలవుతాయి. ప్రస్తుత లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు, అంతరాలను గుర్తించడం, సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం, వ్యయాలను తగ్గించుకోవడానికి సంబంధించి మార్గదర్శ ప్రణాళికను రూపొందించేందుకు ఈ ప్రణాళిక తోడ్పడుతుంది. అటు వాణిజ్య చర్చల కోసం సెపె్టంబర్ 22న భారత అధికారిక బృందాన్ని తీసుకుని గోయల్ అమెరికా వెళ్లనున్నట్లు కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది.