
అంతర్జాతీయంగా అనిశ్చితి వల్ల పలు దేశాలు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ పటిష్టంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు. యువ జనాభా, దేశీయంగా డిమాండ్ మెరుగ్గా ఉండటం, స్థిరమైన ఆర్థిక విధానాలు ఎకానమీ వృద్ధికి దోహదపడుతున్నాయని చెప్పారు.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 91వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆమె ఈ విషయాలు వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో భారత్ 7.8 శాతం వృద్ధి సాధించిందని, ఎస్‌అండ్‌పీలాంటి రేటింగ్ ఏజెన్సీలు కూడా దేశ రేటింగ్‌ను పెంచాయని మంత్రి చెప్పారు. భారత్‌పై ప్రపంచానికి గల నమ్మకానికి ఇది నిదర్శనమని వివరించారు. వృద్ధి సాధనలో కీలక పాత్ర పోషించే బ్యాంకులు, కస్టమర్ల నమ్మకాన్ని చూరగొనడం, ఫిర్యాదులను సత్వరం పరిష్కరించడంపై మరింతగా దృష్టి పెట్టాలని సూచించారు.