చెక్కుల తక్షణ క్లియరెన్స్‌ రెండో దశ వాయిదా | why RBI postponed second phase of its faster cheque clearing mechanism | Sakshi
Sakshi News home page

చెక్కుల తక్షణ క్లియరెన్స్‌ రెండో దశ వాయిదా

Dec 31 2025 8:39 AM | Updated on Dec 31 2025 8:39 AM

why RBI postponed second phase of its faster cheque clearing mechanism

చెక్కుల చెల్లింపులను వేగవంతం చేసే రెండో దశ అమలును ఆర్‌బీఐ వాయిదా వేసింది. చెక్కుల తక్షణ క్లియరెన్స్‌కు వీలుగా బ్యాంక్‌లు తమ కార్యకలాపాలను మరింత క్రమబద్దీకరించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. తదుపరి నోటీస్‌ జారీ చేసే వరకు ఇది కొనసాగుతుందని పేర్కొంది.

వాస్తవానికి అయితే జనవరి 3 నుంచి రెండో దశను బ్యాంక్‌లు అమలు చేయాల్సి ఉంది. వేగంగా చెక్కుల చెల్లింపులకు (క్లియరెన్స్‌) సంబంధించి మొదటి దశ అక్టోబర్‌ 4 నుంచి అమల్లో రావడం గమనార్హం. అయితే మొదటి దశ అమలులో కొన్ని సమస్యలు ఎదురుకావడంతో రెండో దశను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. మొదటి దశకు ముందు చెక్కుల చెల్లింపులు పూర్తయ్యేందుకు రెండు రోజుల వరకు సమయం పట్టేది. ఇప్పుడు మొదటి దశలో భాగంగా గంటల్లోనే చెల్లింపులు పూర్తవుతున్నాయి.

మొదటి దశలో భాగంగా చెక్కుల సమర్పణ సమయాన్ని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ఆర్‌బీఐ తాజాగా సవరించింది. ఇప్పటి వరకు ఇది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంది. చెక్కుల ధ్రువీకరణ సమయాన్ని సైతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటలకు సవరించింది.

ఇదీ చదవండి: పసిడి, వెండి ధరల తగ్గుదల.. కారణం ఇదేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement