
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి
న్యూఢిల్లీ: ధరల తగ్గింపు రూ పంలో వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) రేట్ల కోత ప్రయోజనాలు వినియోగదారులకు పూర్తిగా బదిలీ అవు తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రోజువారీ వినియోగించే 54 ఉత్పత్తుల ధరలను ప్రభుత్వం సమీక్షిస్తోందని జీఎస్‌టీ బచత్ ఉత్సవ్‌పై నిర్వహించిన సమావేశంలో ఆమె చెప్పారు. వీటి వివరాలను ఎప్పటికప్పుడు జోనల్ ఏరియాల నుంచి తెప్పించుకుంటున్నామని మంత్రి వివరించారు.
సెపె్టంబర్ 22 నుంచి జీఎస్‌టీ రేట్లను నిర్దిష్టంగా 2 శ్లాబుల కింద (5%, 18%, అల్ట్రా లగ్జరీ ఉత్పత్తులపై ప్ర త్యేకంగా 40% రేటు) సవరించిన సంగతి తెలిసిందే. జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో కొనుగోళ్లు పెరిగాయని ఆమె పేర్కొ న్నారు. షాంపూ, పౌడరు, ఉపకరణాలు, బొమ్మలు మొదలైన వాటిపై రేట్లు తగ్గాయని వివరించారు. జీఎస్‌టీ రేట్ల కోతకు తగ్గట్లుగా ధరలు తగ్గించలేదంటూ వినియోగదారుల వ్యవహారాల విభాగానికి 3,169 ఫిర్యాదులు రాగా 3,075 ఫిర్యాదులు నోడల్ ఆఫీసర్లకు బదిలీ అయినట్లు పేర్కొన్నారు.