భారత కరెన్సీ రూపాయి విలువ రికార్డు స్థాయి కనిష్టానికి పడిపోయింది. అమెరికా డాలర్ తో పోలిస్తే ఎన్నడూ లేనంతగా రూ.90 స్థాయిని దాటింది. బుధవారం ప్రారంభ ట్రేడింగ్ లో 6 పైసలు పడిపోయి 90.02 వద్ద ముగిసింది.
బ్యాంకులు అధిక స్థాయిలో యూఎస్ డాలర్లను కొనుగోలు చేస్తూనే ఉండటంతోపాటు కరెన్సీలో మరింత బలహీనపడేలోపు బయటపడేందుకు కంపెనీల హడావిడి మధ్య విదేశీ సంస్థాగత పెట్టుబడుల అవుట్ ఫ్లోలు కొనసాగుతుండటం రూపాయి ఈ స్థాయిలో పతనం కావడానికి కారణాలుగా నిలుస్తున్నాయి.



