
జీఎస్టీ కొత్త శ్లాబులు ఈరోజు నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. జీఎస్టీ క్రమబద్ధీకరణ సరళమైన, న్యాయమైన పన్ను వ్యవస్థ వైపు ఒక విప్లవాత్మక అడుగుగా అభివర్ణించారు. సామాన్య ప్రజానీకానికి ఈ నిర్ణయం వల్ల ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఈమేరకు ఎక్స్‌లో తన అభిప్రాయాన్ని పోస్ట్ చేశారు.
‘జీఎస్టీ పునర్నిర్మాణం సరళమైన, న్యాయమైన పన్ను వ్యవస్థ వైపు ఒక విప్లవాత్మక అడుగు. వస్తువులు, సేవలను ప్రతి పౌరుడికి మరింత సరళంగా, సరసమైనదిగా మార్చడానికి ఈ చర్యలు ఎంతో తోడ్పడుతాయి. ప్రాథమికంగా కొన్ని ఫిర్యాదుల నిర్వహణలో లోపాలు ఉండొచ్చు. కానీ ఇది ఒక ప్రక్రియ. దీని ప్రయోజనాలు తుది వినియోగదారులకు చేరుకుంటాయని నేను ఆశిస్తున్నాను. ఇది కచ్చితంగా ఆర్థిక వ్యవస్థలో వినియోగానికి, మరింత పెట్టుబడులకు అవసరమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది’ అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
The GST restructuring is a revolutionary step towards a simpler, fairer tax system It is a commendable move to make goods & services more simpler and affordable to every citizen. Here and there ,there might be a few glitches with a few complaints but it’s a process and I am…
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 22, 2025
ఇక 12 శాతం; 28 శాతం ఉండవు..
సేల్స్‌ట్యాక్స్, వ్యాట్, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ సహా పలు రకాల పరోక్ష పన్నులన్నిటినీ తొలగిస్తూ 2017 జులై నుంచీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్‌టీ) అమల్లోకి వచ్చింది. తక్కువ పన్నురేట్లుండాలని మొదట లక్ష్యించినా సాధ్యం కాలేదు. తాజా సవరణలతో అది సాధ్యమై జీఎస్‌టీ శ్లాబ్‌లు 3కు తగ్గాయి. తక్కువ శ్లాబ్‌లుంటే పాలన, ధరల నిర్ణయం, బిల్లింగ్ సులువవుతుంది. పన్ను అధికారులపైనా భారం తగ్గుతుంది. జీఎస్‌టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత ప్రధానమైనది.. 12 శాతం, 28 శాతం పన్ను రేట్లను పూర్తిగా తొలగించటం.
కొన్ని విలాస, అనారోగ్య (సిన్) వస్తువుల కోసం 40 శాతం పన్ను రేటును చేర్చటం. వాస్తవంగా చూస్తే చాలావరకూ ఆహార పదార్థాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ 5% పరిధిలోకి వచ్చాయి. కొన్నింటిపై పన్నే లేకుండా చేశారు. గతంలో వీటిపై 12, 28 శాతం పన్ను రేట్లుండేవి. ఇది అత్యధికులకు ఊరటే. ఇక కొన్ని విలాస వస్తువులు, కూల్‌డ్రింక్స్, టొబాకో ఉత్పత్తులు, పాన్ మసాలా వంటివి మాత్రం 28 శాతం పన్ను పరిధిలో ఉండగా ఇపుడు 40 శాతం శ్లాబ్‌లోకి వెళ్లాయి.
ఇదీ చదవండి: ఏఐతో ఊడ్చుకుపోయే ఉద్యోగాలు ఇవే..