తాడేపల్లి: తన పుట్టినరోజు సందర్భంగా బర్త్‌డే విషెస్ తెలిపిన అందరికీ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృతజ్ఞతల తెలియజేశారు. తనపై వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యులు చూపిన ప్రేమ, ఆప్యాయతలకు ఉప్పొంగిపోయానన్నారు వైఎస్ జగన్. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మీ అందరి మద్దతే తన బలమని వైఎస్ జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కాగా, వైఎస్ జగన్ పుట్టిన రోజు నేడు(డిసెంబర్ 21, 2025). ఈ సందర్భంగా జననేతకు లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు నెట్టింట సందడి చేస్తున్నారు. మరోవైపు రాజకీయ ప్రముఖులు సైతం శుభాకాంక్షలు తెలియజేశారు... ఇంకా చేస్తునే ఉన్నారు. ఈ క్రమంలో ఎక్స్‌లో టాప్ ట్రెండింగ్‌గా ‘హ్యాపీ బర్త్ డే వైఎస్ జగన్’ నిలవడంతో పాటు ఇటు మిగతా ప్లాట్‌ఫారమ్‌లలోనూ పోస్టులతో సోషల్ మీడియా షేక్ అవుతోంది.
వైఎస్ జగన్ పట్ల అభిమానులు చూపిన ప్రేమ, ఆదరణ గ్లోబల్ ట్రెండింగ్‌లోకి తీసుకెళ్లింది. ఆయన పాలనను, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను.. ఆయన విజన్‌ను ప్రశంసిస్తూ పోస్టులు చేస్తున్నారు. ఎడిటింగ్ వీడియోలు.. ఫొటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ప్రస్తుతం ఎక్స్‌లో ‘#HappyBirthdayYSJagan’, ‘#HBDYSJagan’, ‘Jagan Anna’ వంటి హ్యాష్‌ట్యాగ్‌లు గ్లోబల్ ట్రెండింగ్‌లో కొనసాగుతున్నాయి. ఈ ట్రెండింగ్ ప్రపంచవ్యాప్తంగా రాజకీయ విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది.
ఇదీ చదవండి:


