జగనన్న బర్త్‌డే.. సోషల్‌ మీడియా షేక్‌ | YS Jagan Birth day wishes hashtag top on the global charts | Sakshi
Sakshi News home page

జగనన్న బర్త్‌డే.. సోషల్‌ మీడియా షేక్‌

Dec 21 2025 8:32 AM | Updated on Dec 21 2025 10:33 AM

YS Jagan Birth day wishes hashtag top on the global charts

వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు నేడు(డిసెంబర్‌ 21, 2025). ఈ సందర్భంగా జననేతకు లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు నెట్టింట సందడి చేస్తున్నారు. మరోవైపు రాజకీయ ప్రముఖులు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఎక్స్‌లో టాప్‌ ట్రెండింగ్‌గా ‘హ్యాపీ బర్త్‌ డే వైఎస్‌ జగన్‌’ నిలవడంతో పాటు ఇటు మిగతా ప్లాట్‌ఫారమ్‌లలోనూ పోస్టులతో సోషల్‌ మీడియా షేక్‌ అవుతోంది.

వైఎస్‌ జగన్‌ పట్ల అభిమానులు చూపిన ప్రేమ, ఆదరణ గ్లోబల్‌ ట్రెండింగ్‌లోకి తీసుకెళ్లింది. ఆయన పాలనను, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను.. ఆయన విజన్‌ను ప్రశంసిస్తూ పోస్టులు చేస్తున్నారు. ఎడిటింగ్‌ వీడియోలు.. ఫొటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 

ప్రస్తుతం ఎక్స్‌లో ‘#HappyBirthdayYSJagan’, ‘#HBDYSJagan’, ‘Jagan Anna’ వంటి హ్యాష్‌ట్యాగ్‌లు గ్లోబల్‌ ట్రెండింగ్‌లో కొనసాగుతున్నాయి. ఈ ట్రెండింగ్‌ ప్రపంచవ్యాప్తంగా రాజకీయ విభాగంలో అగ్రస్థానంలో నిలవడం విశేషం. 

మరోవైపు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఏపీవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రక్తదాన శిబిరాలు, అన్నదానాలు, పండ్ల పంపిణీ, పేదలకు సహాయం వంటి కార్యక్రమాలతో కోలాహలం నెలకొంది. ఇది కేవలం ఏపీకే పరిమితం కాలేదు. ఇటు తెలంగాణలోనూ జగన్‌ అభిమానులు ఆయన పుట్టిన రోజును ఒక వేడుకలా నిర్వహిస్తుండడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement