happy birthday
-
Birthday Special: అలియా భట్ 32వ బర్త్‌డే వేడుకలో స్పెషల్ ఫొటోస్
-
ఆమెతో డేటింగ్ నిజమే.. ప్రేయసితో 'అమిర్ ఖాన్' సెలబ్రేషన్స్ : ఫోటోలు
-
Happy Birthday: 'రీతు వర్మ' బర్త్ డే స్పెషల్ ఫోటోలు
-
HBD Nani: అసలు పేరు 'నాని' కాదు.. తొలి రెమ్యునరేషన్ 4 వేలు! (ఫోటోలు)
-
Happy Birthday: అనుపమ పరమేశ్వరన్ బర్త్‌డే స్పెషల్
-
Happy Birthday: బర్త్ డే రోజు రెడ్ డ్రెస్ లో మెరిసిపోతున్న హీరోయిన్ రెబా మోనికా ఫోటోలు
-
వైఎస్ జగన్ కలిసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
-
జనరంజక పాలనకు కేరాఫ్ వైఎస్ జగన్
-
యాదాద్రి పేరు మార్పు..రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
-
సీఎం రేవంత్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
-
అనుష్క బర్త్ డే.. ఆ తప్పు చేయకపోయింటే ఈ పాటికి ఎక్కడో! (ఫొటోలు)
-
రికార్డుల రారాజు.. సచిన్‌ను మైమరిపించిన విరాటుడు
ప్రపంచ క్రికెట్లో అతడొక కింగ్. అతడికి సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు. తండ్రి ఆశయం కోసం ఎంతటి సవాలునైనా ఎదిరించగల సాహసి. ప్రాణంలా ప్రేమించిన తండ్రి మరణం బాధిస్తున్నా.. ఆటగాడిగా తన విధిని నిర్వర్తించిన అంకితభావం గల వ్యక్తి. టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్ ఏదైనా సరే అతడు బరిలోకి దిగనంతవరకే.. అతడు మైదానంలో అడుగుపెడితే ప్రత్యర్ధి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే.రికార్డులను తన ఇంటి పేరుగా మార్చుకుంటూ వరల్డ్ క్రికెట్‌పై తనదైన ముద్ర వేసుకున్న ధీరుడు అతడు. క్రికెట్ దేవుడు సచిన్‌ను మరిపించేలా పరుగుల ప్రవాహంతో అనేక రికార్డులు బద్దలు కొట్టడం.. మరెన్నో రికార్డుల మీద గురి పెట్టడం అతడికే చెల్లింది.కొండంత లక్ష్యాన్ని కూడా సరే అవలీలగా కరిగించే ఛేజ్ మాస్టర్. వరల్డ్‌క్రికెట్‌లో ఫిట్‌నెస్‌కు మారుపేరు అతడు. అతడు ఎవరో కాదు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి. "విరాట్ కోహ్లి నుదుటి రాతను దేవుడు రాయడు అతనే స్వయంగా తన రాత రాసుకుంటాడు". ఇది సచిన్ వన్డే సెంచరీల రికార్డును విరాట్ బ్రేక్ చేసినప్పుడు కామెంటేటర్ సునీల్ గవాస్కర్ చెసిన వాఖ్య ఇది. ఇది నిజంగా అక్షర సత్యం. కోహ్లి నేడు తన 36వ పుట్టిన రోజు జరుపునకుంటున్నాడు. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో సాధించిన పలు అరుదైన రికార్డులపై ఓ లుక్కేద్దాం.👉: అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డు కలిగి ఉన్నాడు. ఇప్పటివరకు 295 వన్డేలు ఆడిన కోహ్లి మొత్తంగా 50 సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌పై సెంచరీ నమోదు చేసిన విరాట్.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు మాస్టర్‌బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(49) పేరిట ఉండేది. ఆ రికార్డును ఎవరూ టచ్ చేయలేరని అంతా అనుకున్నారు. కానీ సచిన్ రికార్డు బద్దలు కొట్టి కోహ్లి చరిత్రకెక్కాడు. తన ఆటతో సచిన్‌ను కూడా ఫిదా చేసి.. క్రికెట్ దేవుడినే మైమరిపించాడు.👉: వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 13000 పరుగులు చేసిన రికార్డు కూడా కోహ్లి పేరిటే ఉంది. 2023 ఆసియాకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఈ ఫీట్ నమోదు చేశాడు. కోహ్లి కేవలం 278వ మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు సచిన్(321) పేరిటే ఉండేది.👉: మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడు కూడా కోహ్లినే. ఇప్పటివరకు 538 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 21 సార్లు ఈ అవార్డును గెలుచుకున్నాడు. టెస్టుల్లో మూడుసార్లు, వన్డేల్లో 11సార్లు, టీ20ల్లో 7సార్లు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును కింగ్ కోహ్లి సొంతం చేసుకున్నాడు.👉: వన్డే ప్రపంచకప్ ఒక ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డు కలిగి ఉన్నాడు. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో కోహ్లి ఏకంగా 765 పరుగులు చేసి ఈ ఫీట్‌ను సాధించాడు.👉: అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన జాబితాలో విరాట్ కోహ్లి పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ అజం తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటివకు 125 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 39 హాఫ్ సెంచరీలు చేశాడు. బాబర్ కూడా సరిగ్గా 39 హాఫ్ సెంచరీలు సాధించాడు.👉: అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 3500 పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డు సృష్టించాడు. ఆసియాకప్-2022లో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఈ రికార్డు సాధించాడు. కేవలం 96 ఇన్నింగ్స్‌లలోనే కోహ్లిఈ ఫీట్ నమోదు చేశాడు. -
లవ్ యూ.. నిన్ను చూసి గర్విస్తున్నా:సారా టెండుల్కర్ (ఫొటోలు)
-
హ్యారీకి రాజకుటుంబం.. పుట్టినరోజు శుభాకాంక్షలు
బ్రిటన్ యువరాజు హ్యారీకి బ్రిటన్ రాజ కుటుంబం జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ఆదివారం ఆయన 40వ జన్మదినం సందర్భంగా బర్త్ డే కేక్ ఎమోజీతో మెరిసిపోతున్న హ్యారీ ఫోటోను పంచుకుంది. ‘‘డ్యూక్ ఆఫ్ ససెక్స్‌కు 40 వ పుట్టినరోజు శుభాకాంక్షలు’’క్యాప్షన్‌ను జత చేసింది. ప్రిన్స్, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కూడా ఈ ఫొటోను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. 2021 తరువాత రాజకుటుంబం ఖాతా నుంచి హ్యారీకి వచి్చన మొట్టమొదటి బహిరంగ పుట్టినరోజు సందేశం ఇది. డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ ససెక్స్ 2020 జనవరిలో రాయల్ డ్యూటీలను వదులుకుంటున్నట్లు ప్రకటించారు. ఆర్థికంగా స్వతంత్రంగా జీవించేందుకు వీలుగా రాజకుటుంబం క్రియాశీలక విధుల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. కాలిఫోరి్నయాలోని శాంటా బార్బరా సమీపంలోని మాంటెసిటోలో నివాసం ఉంటున్నారు. నెట్‌ఫ్లిక్స్, స్పాటిఫై సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. – లండన్ -
మదర్ థెరిసా జయంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళులు
-
క్యూట్ కుర్రాడిగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల.. అరుదైన ఫొటోలు
-
MS Dhoni Rare Photos: మహేంద్ర సింగ్ ధోనీ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
నందమూరి కళ్యాణ్ రామ్ బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
క్రేజ్ కా బాప్.. లియోనెల్ మెస్సీ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
-
హ్యాపీ బర్త్‌డే.. ఇండియన్ పాలిటిక్స్‌లో రా.గా.(ఫొటోలు)
-
చిరంజీవితో 16 సినిమాల్లో నటించిన హీరోయిన్ బర్త్‌డే (ఫోటోలు)
-
Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్.. ఫోటోలు
-
Sai Pallavi Unseen Photos: హైబ్రిడ్ పిల్లా ‘సాయిపల్లవి’ బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
HBD Pat Cummins: సన్‌రైజర్స్ కెప్టెన్ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)
-
Rohit Sharma: మా జట్టు గుండె చప్పుడు!.. వీడియో వైరల్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పుట్టినరోజు నేడు(ఏప్రిల్ 30). హిట్‌మ్యాన్ మంగళవారం నాడు 37వ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.బీసీసీఐ కార్యదర్శి జై షా సహా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, గౌతం గంభీర్, వసీం జాఫర్ తదితరులు రోహిత్ శర్మకు విషెస్ తెలిపారు. ఇక హిట్‌మ్యాన్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఐపీఎల్ ముంబై ఇండియన్స్ అతడి బర్త్‌డే గిఫ్ట్‌గా ఫ్యాన్స్ కోసం ప్రత్యేక వీడియోను షేర్ చేసింది.మా జట్టు గుండె చప్పుడు‘‘భారత క్రికెట్లో ఉత్తుంగతరంగంలా దూసుకుపోతున్న మా కెప్టెన్ రోహిత్ శర్మకు హ్యాపీ బర్త్‌డే! నీ నాయకత్వ పటిమ, నైపుణ్యం అమోఘం. మా జట్టు గుండె చప్పుడు నువ్వు.బౌండరీలు బాదుతూ.. మరో వసంతంలోకి! చరిత్ర పుటల్లోకెక్కిన హిట్‌మ్యాన్.. నువ్వు మరింత ప్రకాశవంతంగా వెలిగిపోవాలి’’ అని జై షా ఆకాంక్షించాడు.సోదర సమానుడు‘‘ఆయురారోగ్యాలు, సంతోషాలతో నువ్వెప్పుడూ విలసిల్లాలి రోహిత్’’ అంటూ గంభీర్ విష్ చేశాడు. ఇక యువీ.. ‘‘సోదర సమానుడు రోహిత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ బ్యాట్ నుంచి మరిన్ని పరుగులు జాలువారాలి’’ అని విషెస్ తెలిపాడు.కాగా ప్రస్తుతం ఐపీఎల్-2024తో బిజీగా ఉన్న ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ భార్య రితికాతో కలిసి బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians) ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. ఇందులో సూర్యకుమార్ యాదవ్, అతడి భార్య దేవిషా శెట్టి కూడా కనిపిస్తున్నారు. కాగా ముంబై మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. HBD Rohit Sharma: హిట్‌మ్యాన్ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్ ఇదే! -
Birthday Special: 'దేవర' బ్యూటీ జాన్వీ కపూర్ బర్త్ డే స్పెషల్.. రేర్ (ఫొటోలు)
-
కాగ్నిజెంట్ మాజీ సీఈవో బర్త్‌డే విషెస్.. ఎవరికో తెలుసా?
ప్రత్యర్థి కంపెనీల నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగులను నియమించుకుని వార్తల్లో నిలిచిన సాఫ్ట్వేర్ సంస్థ కాగ్నిజెంట్ మాజీ సీఈవో తాజాగా ఆ కంపెనీకి బర్త్‌డే విషెస్ చెప్పారు. కాగ్నిజెంట్ శుక్రవారం (జనవరి 26) నాటికి 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. కాగ్నిజెంట్ వృద్ధిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులలో మాజీ సీఈవో ఫ్రాన్సిస్కో డిసౌజా ఒకరు. 2007 జనవరి నుంచి 2019 మార్చి మధ్య కాలంలో 12 సంవత్సరాల పాటు కంపెనీ సీఈవోగా పనిచేసిన ఆయన ఆపై ఒక సంవత్సరం పాటు బోర్డు వైస్ చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. 1994 జనవరి 26న భారత్‌లోని చైన్నైలో కాగ్నిజెంట్ ఏర్పాటైంది. ఈ సంస్థకు ప్రస్తుతం ఎస్.రవికుమార్ సీఈవోగా ఉన్నారు. కాగ్నిజెంట్ 30వ వార్షికోత్సవం సందర్భంగా డిసౌజా లింక్డ్ఇన్లో ఓ పోస్టు పెట్టారు. సంస్థలో పనిచేసిన ప్రతి వ్యక్తి ప్రతిభకు, అంకితభావానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. "హ్యాపీ బర్త్‌డే కాగ్నిజెంట్! 30 సంవత్సరాల క్రితం, సాంకేతిక సేవల పరిశ్రమను ఏదో ఒకరోజు తీర్చిదిద్దే లక్ష్యంతో చిన్న జట్టులో భాగమయ్యే అవకాశం నాకు లభించింది. ఈరోజు కాగ్నిజెంట్‌కు 30 ఏళ్లు నిండుతున్నాయి. ఈ సందర్భంగా కంపెనీ ఎదుగుదల, ఆవిష్కరణలు, ఎక్సలెన్స్ ప్రయాణాన్ని ప్రతిబింబిస్తాను" అంటూ రాసుకొచ్చారు. -
Birthday Special: హీరో వరుణ్ తేజ్ బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
Vijay Sethupathi Unseen Photos: విజయ్ సేతుపతి చిన్ననాటి ఫోటోలు చూశారా..?
-
Namrata Shirodkar Photos: ఫ్రెండ్స్‌తో కలిసి బర్త్ డే పార్టీ ఎంజాయ్ చేస్తున్న నమ్రత శిరోద్కర్ (ఫోటోలు)
-
Deepika Padukone: రెడ్ డ్రెస్ లో సొగసులు ఆరబోసిన అందాల తార దీపికా
-
రతన్ టాటా గురించి ఐదు ఆసక్తికర విషయాలు
భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, టాటా గ్రూప్ మాజీ చైర్పర్సన్ 'రతన్ టాటా' (Ratan Tata) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సుమారు 12.7 మిలియన్స్ ఎక్స్ (ట్విటర్) ఫాలోవర్స్, 9 మిలియన్స్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కలిగిన ఈయన నేటితో 85 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. రతన్ టాటా జన్మదినం సందర్భంగా ఈ కథనంలో ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. రతన్ టాటా గురించిన 5 ఆసక్తికరమైన విషయాలు 👉రతన్ టాటా క్యాంపియన్ స్కూల్లో పాఠశాల విద్యను, ఆ తరువాత ఉన్నత విద్య కోసం సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్‌కు వెళ్లారు. ఈయన ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థి కూడా. 👉రతన్ టాటా "ఫ్రమ్ స్టీల్ టు సెల్యులార్, ది విట్ & విస్డమ్ ఆఫ్ రతన్ టాటా' అనే పుస్తకారు రాశారు. 👉86 సంవత్సరాల రతన్ టాటా అవివాహితుడు. గతంలో ఈయన నాలుగు సార్లు పెళ్లికి దగ్గరగా వచ్చినట్లు సమాచారం, కానీ ప్రతి సారీ ఏదో ఒక భయం, లేదా ఇతర కారణాల వల్ల వెనక్కి తగ్గారు. 👉పేద ప్రజల కోసం ఒక కారుని రూపొందించాలనే ఉద్దేశ్యంతో.. తక్కువ ధరకే లభించే టాటా నానో కారుని లాంచ్ చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత సరసమైన ధర వద్ద లభించే కారు కావడంనా గమనార్హం. చిన్న కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని ఈ కారుని లాంచ్ చేసినట్లు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. 👉తాను చదివిన హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (HBS)లో ఎగ్జిక్యూటివ్ సెంటర్‌ను నిర్మించడానికి టాటా గ్రూప్ 2010లో 50 మిలియన్ డాలర్లను విరాళంగా అందించారు. దానికి టాటా హాల్ అని పేరు పెట్టారు. భారతదేశంలోని అనేక మంచి కార్యక్రమాల కోసం రతన్ టాటా లెక్కకు మించిన డబ్బును విరాళంగా ఇచ్చిన సంఘటనలు కోకొల్లలు. -
Birthday Special: సీఎం వైఎస్ జగన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
600 కేజీల భారీ కేక్‌ను కట్ చేసిన ఎమ్మెల్సీ రఘురామ్, మంత్రి మేరుగ
-
సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా భారీ బైక్ ర్యాలీ
-
Niharika Konidela Photos: నిహారిక కొణిదెల బర్త్ డే సెలబ్రేషన్స్ పిక్స్ వైరల్ (ఫోటోలు)
-
Sameera Reddy Birthday: పింక్ సూట్ లో ముద్దొచ్చే ఫోజులతో అదరగొట్టిందిగా
-
సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
హీరోయిన్ నయనతార బర్త్ డే స్సెషల్ (ఫోటోలు)
-
Happy Birthday S Thaman: హ్యాపీ బర్త్‌డే సంగీత దర్శకుడు ఎస్ తమన్ (ఫోటోలు)
-
Mehreen Pirzada Birthday: మెహరీన్ బర్త్ డే సందర్భంగా ఇంట్లో గ్రాండ్ పార్టీ
-
Anushka Shetty Birthday: లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి బర్త్‌డే ఫోటోలు
-
Birthday Special: మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న అందాల తార టబు
-
ఇర్ఫాన్ పఠాన్ బర్త్ డే స్పెషల్ (ఫోటోలు)
-
టాలీవుడ్ మన్మధుడి కళ్లు చెదిరే నెట్‌వర్త్, కార్లు, ఇల్లు ఈ విషయాలు తెలుసా?
ఇండియన్ సౌత్ ఫిల్మ్స్ మెగాస్టార్ గురించి పరిచయం అవసరం లేదు. 63 ఏళ్ల వయసులో కూడా టాలీవుడ్ మన్మధుడిగా అక్కినేని నాగార్జున ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోల్లో ఒకరు. అలనాటి టాప్ హీరో దివంగత అక్కినేని నాగేశ్వర రావు కుమారుడిగా తెలుగు తెరకు పరిచయమైనప్పటికీ, తనదైన నటన, ప్రతిభతో సూపర్ స్టార్‌గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను మాత్రమేకాదు బాకాఫీస్ బ్లాక్ బస్టర్ మూవీలతో అటు దర్శక నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాడు. అద్భుత నటనలో విమర్శకుల ప్రశంసలందుకున్న నటుడు. కేవలం నటుడుగా మాత్రమే కాదు నిర్మాతగా, థియేటర్ ఆర్టిస్ట్, పాపులర్ టీవీ షోకు హోస్ట్‌గా పాత్ర ఏదైనా తనదైన శైలిలో ఆకట్టు కోవడం ఆయన స్పెషాల్టీ. ‘నాగ్’ బర్తడే సందర్భంగా ఆయన నెట్‌వర్త్ తదితర విషయాలను గురించి చూద్దాం. 1959, ఆగస్టు 29న చెన్నైలో పుట్టిన నాగార్జున 1986లో తెరంగేట్రం చేశారు. అనతికాలంలోనే అనేక బాక్లబస్టర్ సినిమాలను అందించి స్టార్‌గా తన వారసత్వాన్ని నిలుపు కున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఎవర్ గ్రీన్ కింగ్ నటనా ప్రతిభకు ప్రశంసలు దక్కాయి. అలాగే హైయ్యస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న నటుల్లో ఒకరిగా ఉన్నాడు. దేశంలో అత్యధికంగా పన్ను చెల్లించేవారిలో నాగార్జున కూడా ఒకరు. 2016లో మొత్తం ఆదాయపు పన్ను చెల్లింపులు రూ.16 కోట్లకు పైగా ఉన్నాయి. 2023 నాటికి నాగార్జున నికర విలువ 950 కోట్ల రూపాయలుగా ఇండస్ట్రీ వర్గాల అంచనా. వార్షిక ఆదాయం దాదాపు 40కోట్ల రూపాయలు. నాగార్జున లగ్జరీ కార్లు: BMW 7-సిరీస్ , ఆడి A-7 తదితర కార్లు ఉన్నాయి. వీటిలో ఒక్కో కారు ధర 1- 2.5 కోట్ల వరకు ఉంటుంది. ఇందులో ఎక్కువ భాగం సినిమాలే. అలాగే బ్రాండ్ ఎండార్స్మెంట్ల కోసం భారీ మొత్తంలోనే వసూలు చేస్తాడని ఇండస్ట్రీ టాక్. నాగార్జునకు హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లోని లగ్జరీ భవనం ఉంది. దీని అంచనా విలువ దాదాపు రూ.42.3 కోట్లు. దీంతోపాటు దేశవ్యాప్తంగా పలు ఆస్తులు కూడా ఉన్నాయి.రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భారీ పెట్టుబడులున్నాయి. ప్రస్తుతానికి కళ్యాణ్ జ్యువెలర్స్ మినహా కళ్యాణ్ జ్యువెలర్స్‌కు అక్కినేని నాగార్జునకు బ్రాండ్ ఎండార్స్మెంట్లు లేవు. దీనికి ఏడాదికి రూ.2 కోట్లు తీసుకుంటాడు. మరో పాపులర్ షోకు సంబంధించి 40 ఎపిసోడ్ల షో కోసం నాగార్జున రూ.3 కోట్లు ప్లస్ రెమ్యునరేషన్‌ను ఆఫర్ చేసినట్లు తాజా సంచలనం. ఒక్కో సినిమాకు ఆయన తీసుకునే రెమ్యునరేషన్ 9-11 కోట్ల ఉంటుంది. దీనికి తోడు కేబీసీ తెలుగు వెర్షన్ మీలో ఎవరు కోటీశ్వరుడుకి నాగార్జున హోస్గ్గా భారీ మొత్తంలోనే సంపాదించాడు. నాగార్జున పలు సామాజిక, సంక్షేమ కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. HIV/AIDS అవగాహన ప్రచారాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. 2010లో, అతను స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో స్థాపించబడిన టీచ్‌ఎయిడ్స్ రూపొందించిన ఒక HIV/AIDS యానిమేటెడ్ సాఫ్ట్వేర్ ట్యుటోరియల్‌లో కూడా నటించాడు. -
Birthday Special: మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే స్పెషల్ ఫోటోలు
-
Manisha Koirala Birthday 2023: 90'sలో కోట్ల మంది కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసిన హీరోయిన్ (ఫోటోలు)
-
Sridevi Birthday Special Pics : దివంగత నటి శ్రీదేవి బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
చిరు, రజిని మధ్యలో మహేష్… బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే
-
HBDMaheshBabu: మహేష్‌బాబు నెట్‌వర్త్, లగ్జరీ కార్లు,ఖరీదైన జెట్, ఈ విషయాలు తెలుసా?
సౌత్సూపర్ స్టార్, తెలుగు సినిమా దిగ్గజం మహేష్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు, అత్యధిక పారితోషికం తీసుకునే టాప్ హీరోల్లో ఒకరు. టాలీవుడ్‌కి అనేక బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించిన మహేష్ బాబు బర్త్‌డే సందర్బంగా ఆయన లగ్జరీ ఇల్లు, ఖరీదైన కార్లపై ఫ్యాన్స్‌లో భారీ ఆసక్తి నెలకొంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పరిసరాల్లో అద్భుతమైన, విలాసవంతమైన ఇంట్లో టాలీవుడ్ ప్రిన్స్ ,భార్య నమ్రతా శిరోద్కర్ , గౌతమ్ , సితారతో ఉంటాడు. ఈ ఇంట్లో ఇండోర్ స్విమ్మింగ్ పూల్, హోమ్ జిమ్, బహుళ బెడ్రూమ్లతో పాటు విశాలమైన, ఖరీదైన పెరడు లాంటి పలు విధ సౌకర్యాలతో కళకళలాడుతూ ఉంటుంది. అంతేకాదు తన సన్నిహితులు, ఫ్యామిలీ మెంబర్స్‌తో ఈ బ్యాక్‌యార్డ్‌లో ఎక్కువగా పార్టీలు ఇస్తూ ఉంటాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటారు దీని విలువ రూ. 28 కోట్లు. దీంతోపాటు ముంబై, బెంగళూరులో కూడా భారీ ఆస్తులే ఉన్నాయి. ప్రైవేట్ జెట్ విలాసవంతమైన ప్రైవేట్ జెట్ కూడా మహేష్ బాబు సొంతం. తరచుగా తన కుటుంబంతో కలిసి తన విమానంలోనే పర్యటిస్తారు. నమ్రతా శిరోద్కర్ తరచుగా వారి చార్టర్లో విహారయాత్ర చేస్తున్న చిత్రాలను పంచుకుంటారు. స్విట్జర్లాండ్, పారిస్ , దుబాయ్ , జపాన్ ఇలా అద్భుతమైన డెస్టినేషన్ ఏదైనాతరుచుగా ఈ జెట్లోనేఎగిరిపోతారు. లగ్జరీ కార్ల సముదాయం సెలబ్రిటీలకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఈ విషయంలో టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు మినహాయింపేమీ కాదు. టాలీవుడ్లోనే దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరైన మహేష్ బాబు చాలా ఖరీదైన నాలుగు చక్రాల వాహనాలను కలిగి ఉండటంలో ఆశ్చర్యం ఏముంది. సౌత్ సినిమా ఐకాన్ గ్యారేజీలో రూ. 1.19 కోట్ల విలువైన ది ఆడి ఇ-ట్రాన్ ఎలక్ట్రిక్ కార్, రూ. 2.26 కోట్ల విలువైన రేంజ్ రోవర్ వోగ్ వంటి కార్లు ఉన్నాయి. ఇంకా BMW 730Ld, మెర్సిడెస్ GL క్లాస్ కూడా ఉన్నాయి. ఈ ఏడాదిలోనే మహేష్ బాబు గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ కారు కొన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కారు ఖరీదు రూ. 5.40 కోట్లు, ఇది మహేష్ బాబు కార్ కలెక్షన్లో అత్యంత ఖరీదైన కారిదే. మహేష్‌తో పాటు మోహన్‌లాల్, మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్ వంటి ప్రముఖ స్టార్లు కూడా రేంజ్ రోవర్ ఎస్వీని కలిగి ఉన్నారు.అంతేకాదు హైదరాబాద్‌లో గోల్డ్ కలర్ రేంజ్ రోవర్‌ను కలిగి ఉన్న ఏకైక వ్యక్తి కూడా మహేష్. కొద్ది రోజుల క్రితం కేజీఎఫ్ స్టార్ యష్ కూడా రేంజ్ రోవర్ కారు కొన్నాడు. ఈ కారులో అనేక లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయి. కాగా కెరీర్లో వన్ నేనొక్కడినే, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు, సర్కారు వారి పాట వంటి పలు సూపర్‌డూపర్ హిట్లను అందించిన టాలీవుడ్ సూపర్‌స్టార్ ఒక్కో సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ రూ.80కోట్లకుపై మాటే. దీనికితోడు యాడ్స్, ఎండార్స్మెంట్లు కూడా భారీగానే ఉన్నాయి. మహేష్ బాబు 2022 లెక్కల ప్రకారం నికర విలువ దాదాపు రూ. 244 కోట్లు ఉంటుందని అంచనా. ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నాడు మహేష్. వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లను పలకరించనున్న ఈ మూవీలో శ్రీలీల కీలక పాత్రలో నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
Devi Sri Prasad : మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసే రాక్ స్టార్ బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
పుట్టినరోజున పేదపిల్లలకు సితార పాప సైకిళ్ల పంపిణీ (ఫొటోలు)
-
పుట్టినరోజు నాడు సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడిగా సేవలు అందించిన సౌరవ్ గంగూలీ శనివారం 51వ పడిలో అడుగుపెట్టాడు. 'దాదా' అని ముద్దుగా పిలుచుకునే గంగూలీ క్రికెట్ ఆడిన రోజుల్లో ఏం చేసినా సంచలనమే. 2003 వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియాను ఫైనల్ చేర్చిన గంగూలీ ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డాడు. అంతకముందు 2002లో ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ గెలవడంలో కీలకపాత్ర వహించాడు. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన నాట్‌వెస్ట్ వన్డే సిరీస్‌ను గెలిచిన సందర్భంలో లార్డ్స్ బాల్కనీ నుంచి షర్ట్ విప్పి గిరగిరా తిప్పడం ఒక్క దాదాకే చెల్లింది. కాగా గంగూలీ తన పుట్టినరోజు నాడే ఒక కీలక ప్రకటన చేశాడు. ‘సౌరభ్ గంగూలీ మాస్టర్‌క్లాస్’ పేరుతో యాప్‌ను అందుబాటులోకి తెచ్చి నాయకత్వ లక్షణాలపై ఆన్లైన్ కోర్సు ప్రవేశపెడుతున్నట్లు తెలిపాడు. ''దాదాపు 16 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్, పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లు ఆడిన అనుభవంతో నా 51 పుట్టిన రోజు సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నా. నేను నేర్చుకున్న అంశాలను మీ కోసం తీసుకొస్తున్నా. 'సౌరభ్ గంగూలీ మాస్టర్‌క్లాస్' అనే యాప్ ద్వారా మొదటిసారి నాయకత్వంపై ఆన్లైన్ కోర్సును అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటిస్తున్నా. దీనికోసం కృషి చేసిన క్లాస్‌ప్లస్ (ఎడ్టెక్ స్టార్టప్)కు ధన్యవాదాలు. నేను, క్లాస్‌ప్లస్ కలిసి ఆన్లైన్ కోర్సును మీకు అందించడానికి వస్తున్నాం'' అని తెలిపాడు. ఇక గంగూలీ పుట్టినరోజు పురస్కరించుకొని పలువురు మాజీ క్రికెటర్లు సహా ఈతరం క్రికెటర్లు ట్విటర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 16+ years of international cricket and countless matches later… on this 51st bday, I sum up my learnings for you. They are now yours! Announcing “Sourav Ganguly Masterclass”, an app that has my first-ever online course on leadership - https://t.co/fX0dM4NVTb Thanks to… pic.twitter.com/Dek5fBzBM5 — Sourav Ganguly (@SGanguly99) July 8, 2023 -
Sourav Ganguly Rare Pics : సౌరవ్ గంగూలీ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
సినిమాను తలపించే ట్విస్టులు! కుటుంబాల మధ్య గొడవ.. సీక్రెట్‌గా ప్రేమా, పెళ్లి! ఆఖరికి
Sourav Ganguly Dona Roy Love Story: టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడిగా సేవలు అందించిన సౌరవ్ గంగూలీ శనివారం 51వ వసంతంలో అడుగుపెట్టాడు. వివాదాలను లెక్క చేయకుండా భారత క్రికెట్లో సంచలన మార్పులకు కారణమైన దాదా వ్యక్తిగత జీవితం గురించి కొందరికి మాత్రమే తెలుసు. ఈరోజు గంగూలీ పుట్టిన రోజు సందర్భంగా డోనా రాయ్‌తో అతడి ప్రేమ, పెళ్లి గురించిన ఆసక్తికర విషయాలు మీకోసం.. చిన్ననాటి నుంచే పరిచయం గంగూలీ చిన్నపుడు ఎక్కువగా ఫుట్‌బాల్ ఆడేవాడు. స్నేహితులతో కలిసి గ్రౌండ్‌కు వెళ్లే దారిలోనే డోనా ఇల్లు ఉండేది. అలా ఓసారి ఆమెను చూసిన దాదా.. తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడు. అప్పుడప్పుడు బ్యాడ్మింటన్ కూడా ఆడే గంగూలీ కావాలనే రెండు మూడుసార్లు షటిల్‌కాక్‌ను డోనా ఇంట్లో పడేశాడు. అలా తమకు సంబంధించిన వస్తువును తిరిగి తెచ్చుకునే సాకుతో డోనాతో మాటలు కలిపాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం పెరిగి స్నేహంగా మారింది. అప్పటి నుంచి గంగూలీ- డోనా డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. రెస్టారెంట్లో తొలిసారి అలా ప్రేమ పక్షులు తొలిసారి కోల్‌కతాలోని ఓ చైనీస్ రెస్టారెంట్లో కలుసుకున్నారు. నచ్చినవన్నీ ఆర్డర్ చేసి ఫుల్లుగా లాగించేశారు. ఆ తర్వాత నుంచి అక్కడే తరచుగా కలుసుకునేవారు డోనా- గంగూలీ. స్నేహం పెరిగి ప్రేమగా మారింది. కుటుంబాల మధ్య గొడవ సౌరవ్ గంగూలీ- డోనా రాయ్ కుటుంబాల మధ్య ముందు నుంచే గొడవలు ఉన్నాయి. దీంతో ఇరు కుటుంబాలు ఉప్పు-నిప్పుగా ఉండేవి. అయితే, ఇవేమీ ఈ లవ్బర్డ్స్పై ప్రభావం చూపలేదు. ఇద్దరి మనసులు కలవడంతో జీవితాంతం కలిసి ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. కానీ.. అప్పటికి జీవితంలో సెటిల్ కాలేదు కాబట్టి తమ రిలేషన్‌షిప్‌ను సీక్రెట్‌గానే ఉంచారు. అప్పటికే టీమిండియా తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన గంగూలీ.. 1996లో టెస్టుల్లోనూ అడుగుపెట్టాడు. ఇంట్లో చెప్పకుండా పెళ్లి ప్రఖ్యాత లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన గంగూలీ.. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత డోనాను వివాహమాడాలని ప్లాన్ చేసుకున్నాడు. స్నేహితుడి నివాసంలో రహస్యంగా పెళ్లి చేసుకునేందుకు అంతా సిద్ధం చేసుకున్నాడు. అంతా సజావుగానే సాగింది. ఒకరి చేయి ఒకరు వీడలేదు అయితే, తమ పెళ్లి విషయాన్ని చాలా కాలం వరకు సీక్రెట్‌గానే ఉంచిన గంగూలీ- డోనా.. ఒకానొక రోజు నిజం బయటపడటంతో ఇరు కుటుంబాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. కానీ.. ఒకరి చేయి ఒకరు వీడలేదు. తమ నిజమైన ప్రేమతో పెద్దల మనసు గెలిచి కథను సుఖాంతం చేసుకున్నారు. ఇక 1997లో పెళ్లి చేసుకున్న డోనా- సౌరవ్ గంగూలీ జంటకు 2001లో కూతురు జన్మించింది. ఆమెకు సనాగా నామకరణం చేశారు. ఇక టీమిండియా స్టార్‌గా గంగూలీ, ఒడిస్సీ డ్యాన్సర్‌గా డోనా తమ కెరీర్లో విజయవంతమైన విషయం తెలిసిందే. వైవాహిక జీవితంలోనూ ఒడిదొడుకులు ఎదురైనా వాటిని అధిగమించి ఒక్కటిగా కొనసాగుతున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: టీమిండియాతో సిరీస్‌కు జట్టును ప్రకటించిన విండీస్.. ఆ ఇద్దరు తొలిసారి -
బర్త్‌డేకు ఒక్కరోజు ముందు.. ఓపెనర్‌గా డబుల్ సెంచరీ
వన్డేల్లో ఎంఎస్ ధోని అత్యధిక స్కోరు ఎంత అని అడిగితే టక్కున వచ్చే సమాధానం.. శ్రీలంకపై 183* పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్. అంతకముందు పాకిస్తాన్‌పై 148 పరుగుల ఇన్నింగ్స్ ఆడినప్పటికి అంతగా పేరు రాలేదు. కానీ 183 పరుగులు ఇన్నింగ్స్ మాత్రం ధోని కెరీర్లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచిందనడంలో సందేహం అవసరం లేదు. ఇక్కడి నుంచి ధోని కొట్టిన హెలికాప్టర్ షాట్లు బాగా ఫేమస్ అయ్యాయి. అయితే ధోని ఈ రెండు ఇన్నింగ్స్‌లను మిడిలార్డర్లో వచ్చి ఆడినవే. మరి ధోని ఓపెనర్‌గా డబుల్ సెంచరీ బాదాడన్న విషయం మీకు తెలుసా? అవును ఓపెనర్‌గా ధోని డబుల్ సెంచరీ బాదాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్లో కాదు.. దేశవాలీ క్రికెట్లో. తన పుట్టినరోజుకు ఒక్కరోజు ముందు ధోని ఈ అద్బుత ఇన్నింగ్స్‌ను ఆడడం ఇక్కడ మరో విశేషం. జూన్ 6, 2005లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా ధోని షామ్ బజార్ క్లబ్ తరపున 50 ఓవర్ల మ్యాచ్ ఆడాడు. పి-సేన్ టోర్నమెంట్లో భాగంగా జార్జ్ టెలిగ్రాఫ్‌తో షామ్ బజార్ క్లబ్ జట్టు తలపడింది. ఆ మ్యాచ్‌కు వచ్చిన అభిమానులను ధోని నిరాశపరచలేదు. ప్రత్యర్థి జట్టు బౌలర్లను చీల్చి చెండాడుతూ కేవలం 126 బంతుల్లోనే 207 పరుగులు బాదాడు. బ్యాట్‌కు చిల్లుపడిందా అన్నట్లుగా స్టేడియాన్ని సిక్సర్ల వర్షంతో మోతెక్కించాడు. ఆరోజు ధోని ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు ఉండడం విశేషం. ఈ విషయాన్ని టెలిగ్రాఫ్ పత్రిక మరుసటి రోజు పెద్ద హెడ్‌లైన్స్‌తో ప్రచురించింది. ఇప్పటికి ధోని డబుల్ సెంచరీకి 18 ఏళ్ల పూర్తయిన సందర్భం.. ఇవాళ ధోని బర్త్‌డే సందర్భంగా ఆ విషయాన్ని గుర్తుచేసుకుంటూ బెంగాల్ క్రికెట్ అసోసియేష్(CAB) పంచుకుంది. అయితే అంతర్జాతీయ క్రికెట్లో ధోని 2006లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో ఓపెనర్‌గా వచ్చి 106 బంతుల్లో 96 పరుగులు చేసి ఔటయ్యాడు. కేవలం నాలుగు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. వన్డే కెరీర్లో ఓపెనర్‌గా ధోనికిదే అత్యధిక స్కోరు. ఇక ధోనికి వన్డేల్లో డబుల్ సెంచరీ లేకపోయినప్పటికి.. టెస్టుల్లో ఆ ముచ్చటను తీర్చుకున్నాడు. 2012-13లో చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ధోని ఈ ఫీట్ సాధించాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 265 బంతులాడిన ధోని 224 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 24 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. On MS Dhoni's 42nd birthday, I found this report from 7th June 2005. It was about Dhoni hitting 207 off just 126 balls with 10 6s for Shyambazar Club against George Telegraph in the P Sen tournament at the Eden Gardens. pic.twitter.com/HbZNIHTD1o — Joy Bhattacharjya (@joybhattacharj) July 7, 2023 ఇక టీమిండియా కెప్టెన్‌గా ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఎంఎస్ ధోని ఇవాళ(జూలై 7న) 42వ పడిలోకి అడుగుపెట్టాడు. టీమిండియా క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు పొందిన ఎంఎస్ ధోని 2007లో టి20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్‌కప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ ఇలా మూడు టైటిల్స్ గెలిచిన ఏకైక భారత కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు.అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి మూడేళ్లు కావొస్తున్నా అతని క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 16వ సీజన్ చాలు ధోని క్రేజ్ ఏంటో చెప్పడానికి. ఇక ఐపీఎల్లో సీఎస్కేను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపి అక్కడా సక్సెస్ఫుల్ కెప్టెన్ అయ్యాడు.2004లో టీమిండియాలో కీపర్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా అరంగేట్రం చేసిన ధోని.. సుమారు 15 సంవత్సరాల పాటు అంతర్జాతీయ కెరీర్లో జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ధోని కెరీర్లో 90 టెస్టుల్లో 4876 పరుగులు, 350 వన్డేల్లో 10,773 పరుగులు, 98 టి20ల్లో 1617 పరుగులు చేశాడు. చదవండి: '30 లక్షలు సంపాదించి రాంచీలో ప్రశాంతంగా బతికేస్తా' ధోనికి వాళ్లంటే ఇష్టం! ‘ఏకైక’ క్రికెటర్‌గా ఎన్నెన్నో ఘనతలు! 42 ఆసక్తికర విషయాలు -
'30 లక్షలు సంపాదించి రాంచీలో ప్రశాంతంగా బతికేస్తా'
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇవాళ(జూలై 7న) 42వ పడిలోకి అడుగుపెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి మూడేళ్లు కావొస్తున్నా అతని క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 16వ సీజన్ చాలు ధోని క్రేజ్ ఏంటో చెప్పడానికి. అందునా సీఎస్కే ఐదోసారి చాంపియన్‌గా నిలవడంతో ధోనిపై ప్రేమ ఆకాశమంత ఎత్తుకు వెళ్లిపోయింది. ఐపీఎల్ ఫైనల్ ముగిసిన రోజున ధోని ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ఇస్తాడని అంతా భావించారు. కానీ మరో తొమ్మిది నెలల తర్వాత తాను ఐపీఎల్ ఆడేది లేనిది చెప్తానంటూ పేర్కొన్నాడు. దీన్నిబట్టి ఫిట్‌గా ఉంటే ధోనిని వచ్చే ఐపీఎల్ సీజన్లో చూసే అవకాశం ఉంది. ఇక ధోని బర్త్‌డే పురస్కరించుకొని టీమిండియా క్రికెటర్లు సహా పలువురు దిగ్గజాలు, మాజీ క్రికెటర్లు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ధోనితో ఉన్న అనుబంధాన్ని ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నాడు. ధోనికి "ముందు నా ప్రియ మిత్రుడు ఎంఎస్ ధోనికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను 2005లో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాను. అప్పుడు ధోనీ టీమ్‌కు కొత్త. 2004 డిసెంబర్ లో జట్టులోకి వచ్చాడు. వన్డే క్రికెట్ ఆడుతున్నాడు. నేను అప్పట్లో టెస్ట్ క్రికెట్ ఆడేవాడిని. మేము వెనుకాల కూర్చునే వాళ్లం. నేను, నా భార్య, దినేష్ కార్తీక్, అతని భార్య, ఆర్పీ సింగ్ వెనుకాల సీట్లలో కూర్చునే వాళ్లం. అప్పట్లో మేమంతా వెనుకాల కూర్చొని చాలా మాట్లాడుకునేవాళ్లం. అతడు రైల్వేస్ లో పని చేసేవాడని మనందరికీ తెలుసు. క్రికెట్ ప్రాక్టీస్ కోసం చాలా తిరిగేవాడు. అంత చేసినా ఆడే అవకాశం మాత్రం వచ్చేది కాదు. అప్పట్లో అతడు ఆ జాబ్ వదిలేశాడనుకుంటా. రూ.30 లక్షలు సంపాదించి తన జీవితం మొత్తం హాయిగా రాంచీలో గడిపేస్తానని.. ఎట్టిపరిస్థితుల్లో రాంచీ వదలనని చెప్పేవాడు. క్రికెట్ లోకి కొత్తగా వచ్చిన వ్యక్తి కావడంతో రూ.30 లక్షలు సంపాదిస్తే చాలు.. నా జీవితం ప్రశాంతంగా గడిపేస్తా అనేవాడు. అంత వినయంగా ఉండేవాడు. ఇప్పటికీ అలాగే ఉన్నాడు. అతడు చాలా చిన్న లక్ష్యాలనే నిర్దేశించుకునేవాడు" అని జాఫర్ వెల్లడించాడు. చదవండి: MS Dhoni: ధోని బర్త్‌డే.. రవీంద్ర జడేజా ఎమోషనల్ ట్వీట్! వైరల్ -
MS Dhoni Rare Photos: మహేంద్ర సింగ్ ధోనీ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
#LionelMessi: 'కేజీఎఫ్' బ్యాక్‌గ్రౌండ్.. రోమాలు నిక్కబొడిచేలా..
5 అడుగుల 9 అంగుళాలు.. మొహంపై చెరగని చిరునవ్వు.. 18 ఏళ్లుగా తన ఆటతో అభిమానులను అలరిస్తూనే వస్తున్నాడు.. మారడోనా తర్వాత అర్జెంటీనా ఫుట్‌బాల్ అభిమానులకు ఆరాధ్య దైవంగా మారిపోయాడు.. ఈ తరంలో ఫుట్‌బాల్‌లో క్రిస్టియానో రొనాల్డోతో పోటీ పడుతున్న అతను ఒక మెట్టుపైనే ఉన్నాడు.అతనే అర్జెంటీనా గ్రేట్ లియోనల్ మెస్సీ. లియోనల్ మెస్సీ.. ఫుట్‌బాల్ కెరీర్లో చూడాల్సినవన్నీ చూశాడు. పసిఫిక్ దేశాల్లో ప్రతిష్టాత్మకంగా భావించే కోపా అమెరికా కప్‌ను 2021లో అర్జెంటీనాకు అందించాడు. ఇక ఇంతకాలం వెలితిగా ఉన్న ఫిఫా వరల్డ్‌కప్‌ను కూడా గతేడాది ఒడిసిపట్టాడు. వరల్డ్‌కప్ సాధించిన తర్వాత ఆటకు గుడ్‌బై చెప్తాడని అంతా భావించారు. కానీ మెస్సీ అలా చేయలేదు. తనలో శక్తి ఉన్నంతవరకు ఆడతానని.. ఇక ఆడలేను అన్నప్పుడు రిటైర్ అవుతానని మెస్సీ స్వయంగా పేర్కొన్నాడు. ఆల్‌టైమ్ గ్రేట్‌గా అభివర్ణిస్తున్న లియోనల్ మెస్సీ ఇవాళ(జూన్ 24న) 36వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. మరి కెరీర్లో ఎంత ఎత్తకు ఎదిగినా ఒదిగిన శిఖరంలా కనిపించే మెస్సీకి గుండె లోతుల్లోనుంచి చెబుతున్న ఒక్క మాట.. Happy Birthday Lionel Messi.. విచిత్రమైన డెబ్యూ.. ఏ ఆటగాడైనా తన అరంగేట్రంలో అదరగొట్టాలని భావించడం సహజం. కానీ మెస్సీ విషయంలో కాస్త భిన్నం. 2005లో అర్జెంటీనా తరపున హంగేరీతో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేశాడు. అది కూడా ఒక సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా. అయితే తొలి మ్యాచ్‌లోనే మెస్సీకి వింత అనుభవం ఎదురైంది. హంగేరీ ఆటగాడు మెస్సీ జెర్సీని పట్టుకొని లాగడంతో .. మెస్సీ మోచేతి సదరు ఆటగాడికి బలంగా తాకింది. దీంతో రిఫరీ మెస్సీకి రెడ్‌కార్డ్ చూపించాడు. కేవలం 47 సెకన్ల పాటు మాత్రమే గ్రౌండ్లో ఉన్న మెస్సీ అనూహ్య రీతిలో మైదానం వీడాల్సి వచ్చింది. అంతుచిక్కని వ్యాధి.. మెస్సీకి 11 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు.. గ్రోత్ హార్మోన్ లోపం (GHD) ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో మెస్సీ జీవితంలో ఫుట్‌బాల్ ఆటగాడు కాలేడని వైద్యులు ప్రకటించారు. అయితే మెస్సీకి చికిత్స చేయించేందుకు అప్పట్లోనే నెలకు 900 డాలర్లు ఖర్చు అయ్యేది. మెస్సీ కుటుంబానికి ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే కావడంతో మెస్సీ చికిత్సకు కష్టంగా మారింది. దీంతో మెస్సీ తండ్రితో ఉన్న అనుబంధం కారణంగా బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్ రంగంలోకి దిగింది. మెస్సీ కుటుంబానికి అండగా నిలబడిన బార్సిలోనా మెస్సీతో పాటు కుటుంబాన్ని మొత్తం స్పెయిన్‌కు తరలించి మెస్సీకి చికిత్స చేయించడం విశేషం. అలా 11 ఏళ్ల వయసులోనే మెస్సీ బార్సిలోనాకు రుణపడిపోయాడు. ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు బార్సిలోనా క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆల్‌టైమ్ గ్రేట్‌గా గుర్తింపు.. 2005లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేసిన లియోనల్ మెస్సీ అర్జెంటీనా తరపున 175 మ్యాచ్‌ల్లో 103 గోల్స్ చేశాడు. అర్జెంటీనా తరపున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా.. ఫుట్‌బాల్ ప్రపంచంలో రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. తన కెరీర్లో ఎక్కువగా బార్సిలోనా క్లబ్‌కు ఆడిన మెస్సీ 778 మ్యాచ్‌ల్లో 672 గోల్స్.. పారిస్ సెయింట్ జెర్మన్ క్లబ్ తరపున 75 మ్యాచ్‌ల్లో 32 గోల్స్.. ఓవరాల్‌గా అంతర్జాతీయ, ప్రైవేటు ఫుట్‌బాల్ క్లబ్స్ కలిపి 1028 మ్యాచ్‌లాడి 807 గోల్స్‌తో అత్యధిక గోల్స్ కొట్టిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. Happy Birthday Thalaivaaa😘🐐❤️#LeoMessi #Messi𓃵 #Messi #LionelMessi #HappyBirthdayMessi pic.twitter.com/NY7CR1WQrD — Chikadhee 🇦🇷 ™ (@Chickadhi) June 23, 2023 Happy 36th birthday GOAT 🐐#LionelAndresMessi. Happy Birthday Leo 🦁 Hoping for another Ballon d'Or in October. 🤗🤗#Messi #Leo #Messi36 #Messi𓃵 #MessiBirthday #LionelMessi pic.twitter.com/pSwzXxD0Hs — Fukkard (@Fukkard) June 24, 2023 #GOAT𓃵 #Messi𓃵 📸🙌🏻🐐🎂 pic.twitter.com/chrslX3wvd — sameer ᴩᴀᴛʜᴀɴ 👑🦁 (@sameerp07528955) June 24, 2023 -
హ్యాపీబర్త్‌డే రాహుల్ గాంధీ.. అరుదైన చిత్రాలు చూశారా?
-
హ్యాపీబర్త్‌డే రాహుల్ గాంధీ.. అరుదైన చిత్రాలు చూశారా?
-
‘ధమాకా’ బ్యూటీ శ్రీలీల బర్త్‌డే స్పెషల్..(ఫోటోలు)
-
సాయి పల్లవి బర్త్‌డే.. నటనే కాదు నవ్వుతోనూ అట్రాక్ట్ చేస్తున్న హైబ్రిడ్ పిల్ల (ఫొటోలు)
-
#HBD Sachin: సచిన్ క్రికెట్‌కి దేవుడైతే.. ఆ భక్తుడు ప్రత్యక్షం కావాల్సిందే!
సచిన్‌ను క్రికెట్‌కు దేవుడంటారు. ఎందుకంటే క్రికెట్ అనే విశ్వమతంలో ఆ దేవుడు చేసిన అద్భుతాలు అలాంటివి. మరి ఆ దేవుడికి అభిమానులనే భక్తులు ఉండడం సహజమే కదా. అందులో ప్రియ భక్తులు వేళ్ల మీద లెక్కపెట్టేలా ఉంటారు. శ్రీరాముడికి ఆంజనేయుడు ఎలాగో.. సచిన్‌కు సుధీర్ సుకుమార్ చౌదరీ అలాగ!. గుండెల నిండా సచిన్‌ను నింపేసుకున్న సుధీర్.. ఆయన మ్యాచ్ ఆడే సమయంలో మువ్వన్నెల రంగును ఒళ్లంతా పూసుకుని.. చేతిలో జెండాతో ప్రేక్షకుల గ్యాలరీలో చేసిన సందడి అంతా ఇంతా కాదు. కేవలం సచిన్ కోసమే వ్యక్తిగత జీవితాన్ని సైతం త్యాగం చేసిన సుధీర్ గురించి.. ఇవాళ్టి సచిన్ పుట్టినరోజు సందర్భంగా ఓసారి గుర్తు చేసుకుంటూ.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఏప్రిల్ 24న(సోమవారం) సచిన్ 50వ పడిలోకి అడుగుపెట్టారు. క్రికెట్లో లెక్కకు మించి సాధించిన రికార్డులు ఎన్నో. వంద సెంచరీలు బాది ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. అందుకే సచిన్ అభిమానించేవారు కోట్లలో ఉండేవారు. కానీ ఆ కోట్లాది మంది అభిమానుల్లో కొందరు ప్రత్యేకంగా కనిపించేవారు. ఆ కొందరిలోనూ మరింత ప్రత్యేకంగా కనిపించాడు సుదీర్ కుమార్ చౌదరీ. 👉 శరీరాన్ని మొత్తం భారతీయ జెండాలోని త్రివర్ణ రంగులతో నింపుకొని ఛాతిపై సచిన్ టెండూల్కర్ జెర్సీ నెంబర్ ముద్రించుకొని చేతిలో జాతీయ జెండాను పూని టీమిండియా ఎక్కడ మ్యాచ్‌లు ఆడితే అక్కడికి ఒక సైకిల్‌పైనే వెళ్లి మ్యాచ్‌లను చూసేవాడు. అలా సచిన్ ఆటను.. టీమిండియా మ్యాచ్‌లను చూడడం కోసం దేశం మొత్తం తిరిగిన ఘనత అతని సొంతం. మరి సుదీర్ కుమార్ జీవితం ఎలా సాగిందన్నది ఆసక్తికరం ఆరేళ్ల వయసులోనే సచిన్‌కు వీరాభిమాని.. 👉 ఆరేళ్ల వయసులోనే సచిన్‌కు వీరాభిమానిగా మారిపోయిన సుదీర్ కుమార్ చౌదరీ 1982లో బిహార్‌లోని ముజఫర్‌పుర్‌లో కడు పేదరిక కుటుంబంలో పుట్టాడు. ఆరేళ్ల వయసులో సచిన్‌పై ఇష్టం పెంచుకున్న సుధీర్ 14 ఏళ్ల వయసులో తన చదువును వదిలేశాడు. నిరుద్యోగి అయిన అతను కొన్నాళ్లు పాల కంపెనీలో చిరుద్యోగిగా పనిచేశాడు. ఆ తర్వాత టీటీసీ ట్రైనింగ్ తీసుకొని కొంతకాలం టీచర్‌గా పనిచేశాడు. కానీ ఇవేవి అతనికి ఆత్మసంతృప్తిని ఇవ్వలేకపోయాయి. 👉 సచిన్‌పై ఉన్న అభిమానం అతని పెళ్లి వాయిదా వేసుకునే వరకు వెళ్లిందంటే అర్థం చేసుకోవచ్చు. అయితే సుధీర్ అలా బతకడం కుటుంబసభ్యులకు నచ్చలేదు. తీరు మార్చుకోకుంటే ఇంట్లో నుంచి వెళ్లిపోమన్నారు. తల్లిదండ్రుల మాటను ఖాతరు చేయని సుధీర్ కట్టుబట్టలతో ఇంట్లో నుంచి బయటకి వచ్చేశాడు. తన జీవితం క్రికెట్ మ్యాచ్‌లకే అంకితమని తీర్మానం చేసుకున్న సుధీర్.. పబ్లిక్ సపోర్ట్‌తో వచ్చిన డబ్బులతో స్టేడియానికి వెళ్లి మ్యాచ్‌లను చూసేవాడు. 👉2003 అక్టోబర్ 28న భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా సచిన్ ఆటను చూడడం కోసం సుదీర్ పెద్ద సాహసమే చేశాడు. దాదాపు 21 రోజుల పాటు ముజఫర్‌పుర్ నుంచి మ్యాచ్ జరిగిన ముంబైకి సైకిల్ తొక్కుకుంటూ వచ్చాడు. ఈ మ్యాచ్ ద్వారానే తొలిసారి సుదీర్ కుమార్ చేతిలో భారత జెండాను పట్టుకొని రెపరెపలాడించడం మొదలుపెట్టాడు. ఇక 2010 వరకు దాదాపు 150 మ్యాచ్‌లు వీక్షించడం విశేషం. ఉపఖండపు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల్లో భారత్ ఆడిన సిరీస్‌లకు సైకిల్‌పైనే వెళ్లడం ఆటపై అతనికున్న అభిమానిన్ని చూపిస్తోంది. సచిన్‌ను మెప్పించిన అభిమాని.. పోలీసుల క్షమాపణ 👉2010లో కాన్పూర్ వేదికగా టీమిండియా మ్యాచ్ ఆడేందుకు వచ్చింది. అయితే ప్రాక్టీస్సెషన్ సమయంలో సచిన్‌తో కరచాలనం చేయడానికి సుదీర్ కుమార్ ప్రయత్నించాడు. కానీ పోలీసులు సుదీర్ పట్ల కాస్త దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకున్నారు. ఇది గమనించిన సచిన్ టెండూల్కర్ నేరుగా పోలీసుల వద్దకు చేరుకొని.. అతను నా వీరాభిమాని.. అతను నాకు ఫ్యాన్ కాదు.. నేనే అతని ఫ్యాన్‌ను అని చెప్పాడు. 👉 దిగ్గజం సచిన్ ఆ మాట అనడంతోనే పోలీసులు సుదీర్ కుమార్‌ను క్షమాపణ కోరారు. అలా క్రికెట్ దేవుడిని మెప్పించిన ఘనత సుదీర్ కుమార్‌కే దక్కింది. ఈ సంఘటన తర్వాత సుధీర్ కుమార్ అభిమానానికి పడిపోయిన బీసీసీఐ.. అప్పటినుంచి టీమిండియా ఆడే ప్రతీ మ్యాచ్‌కు అతని టికెట్‌కు స్పాన్సర్ చేయడం మొదలుపెట్టింది. 👉 2011 వన్డే వరల్డ్‌కప్.. మరిచిపోలేని క్షణం సుదీర్ కుమార్ జీవితంలో 2011, ఏప్రిల్ 2.. మరిచిపోలేని క్షణాలు. ధోని నేతృత్వంలోని టీమిండియా వన్డే వరల్డ్‌కప్ గెలిచిన రోజు కావడంతో యావత్ భారతావని పులకించిపోయింది. భారత్ డ్రెస్సింగ్ రూమ్‌లో సంబరాలు మొదలయ్యాయి. ఆ సమయంలో సచిన్ సుదీర్ చౌదరీని డ్రెస్సింగ్ రూమ్‌కు ఆహ్వానించాడు. జహీర్ ఖాన్ చేతుల మీదుగా వరల్డ్‌కప్ ట్రోఫీ అందుకున్న సుదీర్.. సచిన్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. 👉 తన అభిమాన క్రికెటర్ అలా పిలిచి కప్ చేతిలో పెట్టడంతో ఎమోషనల్ అయిన సుదీర్‌ను సచిన్ హగ్ చేసుకోవడం మరింత సంతోషాన్నిచ్చింది. వరల్డ్‌కప్ ట్రోఫీతో భారత్.. భారత్ అంటూ గట్టిగా నినాదాలు చేశాడు. క్రికెట్ చరిత్రలోనే ఇదొక అద్బుత ఘట్టమని చెప్పొచ్చు. తనను అంతగా ప్రేమించిన ఒక అభిమాని సంతోషపెట్టిన సచిన్ పేరు అప్పట్లో మార్మోగిపోయింది. 👉ఇక సచిన్ తన రిటైర్మెంట్ రోజున సుదీర్ చౌదరీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. నా 24 ఏళ్ల కెరీర్లో 14 ఏళ్ల పాటు నాపై అభిమానంతో ప్రతీ మ్యాచ్‌కు హాజరై టీమిండియాను ఆశీర్వదించిన సుదీర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాంటి అభిమాని నాకుండడం గర్వకారణం అని చెప్పుకొచ్చాడు. సచిన్ రిటైర్మెంట్ తర్వాత కొన్నాళ్ల పాటు ధోని అభిమానిగా మారిన సుదీర్ పలు మ్యాచ్‌లకు అతని జెర్సీ నెంబర్ ముద్రించుకొని వచ్చాడు. కానీ ఈ మధ్యన సుదీర్ కుమార్ చౌదరీ పెద్దగా కనిపించడం లేదు. అలా సచిన్ ఉన్నంతకాలం అతని ఆటను చూస్తూ సంతోషపడిన సుదీర్.. భారత్ క్రికెట్లో ఎప్పటికి గుర్తుండిపోయే అభిమానిగా మిగిలిపోవడం ఖాయం. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పార్టీ లేదా పుష్ప? నెట్టింట వైరల్‌గా మారిన బన్నీ-తారక్‌ల చాటింగ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ల మధ్య జరిగిన సరదా చిట్‌చాట్ ఇప్పుడు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే పుష్ప టీజర్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో అల్లు అర్జున్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. తాజాగా నిన్న(ఏప్రిల్8)న ఆయన పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్‌డే బన్నీ అనే హాష్ టాగ్ ట్రెండింగ్‌లో ఉంది. ఇక అల్లు అర్జున్ 41వ బర్త్‌డే సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు బర్త్‌డే విషెస్‌ను అందించగా, ఎన్టీఆర్ చేసిన ట్వీట్ మాత్రం వైరల్‌గా మారింది. 'హ్యాపీ బర్త్‌డే బావా.ఈ ఏడాది నీకు అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా'.. అంటూ తారక్ అల్లు అర్జున్‌కు విషెస్ చెప్పగా.. ఆయన కూడా 'థాంక్యూ వెరీ మచ్ బావ.. హగ్స్' అంటూ బన్నీ రిప్లై ఇచ్చారు. దీనికి మళ్లీ తారక్ స్పందిస్తూ.. 'ఓన్లీ హగ్స్ ఏనా? పార్టీ లేదా పుష్ప?'(పుష్పలోని డైలాగ్)అంటూ తనదైన స్టైల్లో అడగ్గా.. దీనికి బన్నీ వస్తున్నా(NTR 30లోని డైలాగ్)అంటూ సరదాగా రిప్లై ఇచ్చారు. మొత్తంగా వీరిద్దరి మధ్య కొనసాగిన ట్విటర్ చాట్ నెట్టింట వైరల్ అవుతుంది. స్టార్ హీరోలు అయ్యిండి కూడా బావా అంటూ సరదాగా పిలచుకోవడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ట్విటర్లో బావ అనే పదం ట్రెండింగ్‌లోకి వచ్చింది. తారక్-బన్నీల ట్వీట్స్‌ను రీట్వీట్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. Wishing you a Very Happy Birthday Bava @alluarjun. Have a great one !! — Jr NTR (@tarak9999) April 8, 2023 Only hugs? Party Leda Pushpa? 🤣 — Jr NTR (@tarak9999) April 8, 2023 Vasthunna !! 😉 — Allu Arjun (@alluarjun) April 8, 2023 -
Allu Arjun Birthday Photos Gallery: అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ ఫోటోలు
-
Happy Birthday Brahmanandam: బ్రహ్మానందం బర్త్ డే స్పెషల్ ఫోటోలు
-
ఏపీ: ఊరువాడా జననేత పుట్టినరోజు వేడుకలు (ఫొటోలు)
-
మీ పేరు నిలబెడతాం.. థ్యాంక్స్ మామయ్య
-
తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గం : సీఎం వైఎస్ జగన్
-
సీఎం జగన్ పై తన అభిమానాన్ని చాటుకున్న రైతు
-
యువీ కెరీర్‌ను మలుపు తిప్పిన ఐదు బెస్ట్ ఇన్నింగ్స్‌లు
టీమిండియా మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్(డిసెంబర్ 12న) 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. యువీ అనగానే మొదటగా గుర్తుకువచ్చేది ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు(2007 టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై). పరిమిత ఓవర్ల క్రికెట్లో గొప్ప ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న యువరాజ్ దాదాపు రెండు దశాబ్దాల పాటు టీమిండియా క్రికెట్లో కీలకపాత్ర పోషించాడు. ఈ రెండు దశాబ్దాల్లో ఐసీసీ మేజర్ టోర్నీలైన 2007 టి20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్‌లు అతని ఖాతాలో ఉన్నాయి. డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాటింగ్‌కు పెట్టింది పేరైన యువీలో మంచి బౌలర్ కూడా ఉన్నాడు. 2000 అక్టోబర్ నెలలో కెన్యాతో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన యువరాజ్ టీమిండియా తరపున 40 టెస్టుల్లో 1900 పరుగులు, 304 వన్డేల్లో 8701 పరుగులు, 58 టి20ల్లో 1177 పరుగులు సాధించాడు. అయితే ఎన్నో ఘనతలు, రికార్డులు అందుకున్నప్పటికి ఇప్పుడు చెప్పుకోబోయే ఐదు ఇన్నింగ్స్‌లు మాత్రం అతని కెరీర్లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. 69 పరుగులు వర్సెస్ ఇంగ్లండ్(నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్) నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్లో యువరాజ్ ఆడిన ఇన్నింగ్స్ అతని కెరీర్లో నెంబర్‌వన్ స్థానంలో ఉంటుంది. యువరాజ్ కెరీర్‌నే కాదు టీమిండియా గతినే మార్చేసింది.. ఈ మ్యాచ్. 326 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు గంగూలీ(60), సెహ్వాగ్(45) తొలి వికెట్‌కు 106 పరుగులు జోడించి పటిష్టమైన స్థితిలో నిలిపారు. అయితే స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరు ఔట్ కావడం.. ఆ తర్వాత 146 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అప్పుడు క్రీజులోకి వచ్చాడు యువరాజ్ సింగ్. మరో ఎండ్‌లో మహ్మద్ కైఫ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇద్దరు మంచి సమన్వయంతో ఇన్నింగ్స్‌ను ముంఉదకు తీసుకెళ్లారు. ఆరో వికెట్‌కు ఇద్దరు కలిసి 221 పరుగులు రికార్డు భాగస్వామ్యంతో టీమిండియాను గెలుపు దిశగా నడిపించారు. అయితే విజయాన్ని 59 పరుగులు అవసరమైన దశలో యువీ ఔటైనప్పటికి.. అతని ఇన్నింగ్స్‌కు ముచ్చటపడిన కైఫ్ ఆ బాధ్యతలను తాను తీసుకున్నాడు. చివరి వరకు క్రీజులో నిలబడి టీమిండియాకు విజయాన్ని అందించాడు. మ్యాచ్ విజయం తర్వాత లార్డ్స్ బాల్కనీ నుంచి కెప్టెన్ గంగూలీ తన షర్ట్‌ను విప్పి సెలబ్రేట్ చేయడం అప్పట్లో బాగా వైరల్ అయింది. యువీ కెరీర్లో మొదటి టర్నింగ్ పాయింట్ ఇదే. 139 వర్సెస్ ఆస్ట్రేలియా, 2004 2004లో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించింది. సిడ్నీ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా 80 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఆసీస్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న యువరాజ్ సెంచరీ సాధించాడు. 122 బంతుల్లో 16 ఫోర్లు, రెండు సిక్సర్లతో 139 పరుగులు చేసిన యువీ కెరీర్లో ఇది రెండో బెస్ట్ అని చెప్పొచ్చు. అతని ధాటికి టీమిండియా 50 ఓవర్లలో 296 పరుగులు చేసింది. అయితే డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌ను గెలుచుకుంది. 58 వర్సెస్ ఇంగ్లండ్, 2007 టి20 ప్రపంచకప్ యువీ కెరీర్లో మూడో టర్నింగ్ పాయింట్.. 2007 టి20 ప్రపంచకప్ ఇంగ్లండ్‌తో మ్యాచ్. ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో గొడవ యువరాజ్‌లోని విధ్వంసాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది అతనికి నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. అంతేకాదు 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న యువరాజ్ టి20 క్రికెట్లో అత్యంత వేగంగా అర్థసెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటికి ఆ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది. యువీ జోరుతో టీమిండియా తొలిసారి టోర్నీలో 200 పరుగుల మార్క్‌ను అందుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 57 వర్సెస్ ఆస్ట్రేలియా(2011 వన్డే వరల్డ్‌కప్) 2011 వన్డే వరల్డ్‌కప్‌లో యువరాజ్ ఆల్‌రౌండర్‌గా కీలకపాత్ర పోషించాడు. జట్టులో ఒక ఆల్‌రౌండర్ ఉంటే ఎంత బలమో యువీ చేసి చూపించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 143 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టపడుతోంది. పిచ్ బౌలర్లకు సహకరిస్తుండడంతో క్రీజులోకి వచ్చిన యువీ తనలోని క్లాస్ ఆటను చూపించాడు. సురేశ్ రైనా సహకారంతో ఓపికగా ఆడని యువీ టీమిండియాకు 14 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించాడు. మ్యాచ్‌లో 67 బంతుల్లో 57 పరుగులతో యువరాజ్ నాటౌట్‌గా నిలిచాడు. 150 వర్సెస్ ఇంగ్లండ్, 2017 కెరీర్ చివరి దశలో యువరాజ్ ఆడిన ఆఖరి బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. ఈ దశలో యువరాజ్.. ఎంఎస్ ధోనితో కలిసి మరుపురాని ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీతో కదం తొక్కిన యువరాజ్ 127 బంతుల్లో 150 పరుగులు చేశాడు. యువీ తన వన్డే కెరీర్లో అత్యధిక స్కోరును అందుకున్నాడు. యువీతో పాటు ధోని కూడా సెంచరీతో రాణించడంతో టీమిండియా 381 పరుగులు భారీ స్కోరు చేసింది. 15 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పరాజయం చెందింది. యువీ కెరీర్లో ఇదే ఆఖరి బెస్ట్ ఇన్నింగ్స్. ఆ తర్వాత క్రమంగా ఫామ్ కోల్పోయిన యువరాజ్ 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. To celebrate Yuvraj Singh's birthday, tell us your favourite memory of his ✨ pic.twitter.com/bCcSuqQbHq — ICC (@ICC) December 12, 2020 చదవండి: 'ఆ ఎక్స్ప్రెషన్ ఏంటయ్యా.. పిల్లలు జడుసుకుంటారు' Harry Kane: హీరో అనుకుంటే జీరో అయ్యాడు -
ఆటలో లోపం లేదు.. టాలెంట్‌కు కొదువ లేదు.. ఎప్పుడు గుర్తిస్తారో!
ఆటలో లోపం లేదు.. టాలెంట్‌కు కొదువ లేదు.. కానీ అవకాశాలు మాత్రం అంతంత మాత్రమే. టీమిండియా సీనియర్ జట్టులో చోటు దక్కడమే కష్టంగా మారిపోయింది. ఒకవేళ దక్కినా అది చిన్న జట్లతో ఆడేటప్పుడు మాత్రమే. అయినా ఏం బాధపడలేదు. తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఒడిసి పట్టుకుంటున్నాడు. అతనే వికెట్ కీపర్ సంజూ శాంసన్. టి20 ప్రపంచకప్ 2022లో టీమిండియా వైఫల్యం అనంతరం ఇప్పుడు సంజూ శాంసన్ లాంటి క్రికెట్ర్లు టీమిండియాకు అత్యవసరం. కాగా ఇవాళ(నవంబర్ 11న) సంజూ శాంసన్ పుట్టిన రోజు. తాజాగా టి20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌లో వెనుదిరగడంతో విమర్శలతో పాటు ట్రోల్స్ మొదలయ్యాయి. ఐపీఎల్‌కు మాత్రమే పనికొచ్చే కేఎల్ రాహుల్ స్థానంలో సంజూ శాంసన్ లాంటి కుర్రాళ్లకు అవకాశం ఇచ్చినా బాగుండు అని అభిమానులు పేర్కొన్నారు. ఇవాళ ఐపీఎల్‌ను బ్యాన్ చేయాలి అని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కానీ అదే ఐపీఎల్ నుంచి వెలుగులోకి వచ్చినవారిలో సంజూ శాంసన్ కూడా ఉన్నాడు. ఐసీసీ టోర్నీ కోసం భారత జట్టు ప్రకటించిన ప్రతిసారి.. సంజూ గురించే నెటిజన్లు ఎక్కువగా మాట్లాడుకునేవారు. తాజాగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లోనూ భారత్ సెమీస్ లో ఓడిపోవడంతో మనోడు మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. అయితే టీమిండియాలో ఉన్న రాజకీయాలు కూడా సంజూకు అవకాశాలు సరిగ్గా రాకపోవడానికి ఒక కారణమయ్యాయి. ఇక ఢిల్లీలో క్రికెట్ కెరీర్ ప్రారంభించిన సంజూ.. తన ఆటను డెవలప్ చేసుకునేందుకు సొంత రాష్ట్రం కేరళకు వెళ్లిపోయాడు. 17 ఏళ్ల వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అదే ఏడాది అంటే 2012లో అద్భుతమైన బ్యాటింగ్ తో అండర్-19 ఆసియాకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. దేశవాళీలో అదిరిపోయే బ్యాటింగ్ తో సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. అలా 2015లో జింబాబ్వే జట్టుపై టీ20 అరంగేట్రం చేశాడు. కానీ జట్టులో పర్మినెంట్ ప్లేస్ దక్కించుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా శాంసన్‌ది అదే పరిస్థితి. అయితే ఈ మధ్య కాలంలో సంజూ శాంసన్ నిలకడగా రాణిస్తున్నాడు. అందుకు ఉదాహరణ ఈ ఏడాది జూన్‌లో ఐర్లాండ్‌తో సిరీస్. ఈ సిరీస్‌లో రెండో టి20 మ్యాచ్‌లో శాంసన్ 42 బంతుల్లోనే 77 పరుగులు చేసి తొలి టి20 హాఫ్ సెంచరీ సాధించాడు. అంతేకాదు అదే మ్యాచ్‌లో దీపక్ హుడాతో కలిసి రెండో వికెట్‌కు 176 పరుగులు జోడించాడు. టీమిండియా తరపున టి20ల్లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. ఇదే మ్యాచ్‌లో దీపక్ హుడా సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో టి20 సిరీస్‌కు ఎంపికయినప్పటికి తుది జట్టలో చోటు దక్కలేదు. ఆ తర్వాత వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో ఆడాడు. అక్కడ తొలి వన్డే హాఫ్ సెంచరీ సాధించడమే గాక శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి 99 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. వెస్టిండీస్‌తో జరిగిన టి20 సిరీస్‌లో కేఎల్ రాహుల్ స్థానంలో వచ్చిన శాంసన్ అప్పుడు కూడా బ్యాట్‌తో మెరిశాడు. దీని తర్వాత జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో భాగంగా శాంసన్ రెండో వన్డేలో 43 పరుగులు నాటౌట్‌గా నిలవడంతో కీపర్ మూడ క్యాచ్‌లు అందుకొని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌కు ఎంపికయ్యాడు. ఇక స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో 86 పరుగులతో నాటౌట్ నిలిచి సత్తా చాటాడు. అలా తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్న సంజూ శాంసన్‌కు టి20 ప్రపచంకప్‌లో చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ మళ్లీ అవే రాజకీయాల కారణంగా సంజూకు చోటు దక్కలేదు. దీంతో అభిమానులు బీసీసీఐపై గరమయ్యారు. ఫామ్‌లో ఉన్న ఆటగాడిని కనీసం స్టాండ్ బై ప్లేయర్‌గానైనా ఎంపిక చేస్తే బాగుండేదని.. కనీసం ఆ అర్హత కూడా శాంసన్‌కు లేదా అంటూ ఫ్యాన్స్ బీసీసీఐకి చురకలంటిచారు. ఇక ఐపీఎల్లో ఎక్కువగా రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంజూ శాంసన్ 138 మ్యాచ్‌ల్లో 3526 పరుగులు చేశాడు. ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గానూ వ్యవహరిస్తున్నాడు. ఇదంతా పక్కనబెడితే.. నవంబరు 11న తన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన పలువురు నెటిజన్స్.. అతడికి శుభాకాంక్షలు చెప్పారు. ఇకపై అయినా సంజూ శాంసన్ ప్రతిభను గుర్తించి టీమిండియాలో విరివిగా అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటూ మరోసారి Happy Birthday Sanju Samson.. From Sanju's birthday celebration ❤️🤩#SamsonDay #SanjuSamson #HappyBirthdaySanjuSamson pic.twitter.com/z8LsRK0YDp — Sanju Samson Fans Page (@SanjuSamsonFP) November 10, 2022 Happy Birthday @IamSanjuSamson, the talent you possess is priceless & a true inspiration to the young generation out there. Wishing you success and happiness always brother 🤗 pic.twitter.com/q5BdvatPFS — Suresh Raina🇮🇳 (@ImRaina) November 11, 2022 Here's wishing @IamSanjuSamson a very happy birthday. 🎂 👏#TeamIndia pic.twitter.com/ys4C2QmLij — BCCI (@BCCI) November 11, 2022 చదవండి: 'ఒక్కడిని ఏం చేయగలను.. ఓటమి బాగా హర్ట్ చేసింది' -
సినిమాలో సంపాదించింది సినిమాకే పెట్టాడు.. దటీజ్ కమల్
టీనేజ్‌లో ఇంట్లో నుంచి గెంటేస్తే పట్టుదలగా బార్బర్ షాపులో పని చేశాడు కమల్‌హాసన్. గ్రూప్ డాన్సర్‌గా అవస్థలు పడ్డాడు. నటన నేర్చుకోవడానికి కె. బాలచందర్ చేతిలో చెంపదెబ్బలు తిన్నాడు. కాని సహించి భరించి ప్రయాణం కట్టేవాడే విజేత అవుతాడు. కమల్‌హాసన్ జీవితం, అతని లక్ష్యసిద్ధి ఏ తరానికైనా ఆదర్శమే. ఫ్యామిలీ అంతా విపరీతంగా మెచ్చే ఈ విశ్వ కథానాయకుడు ఇప్పటికీ హీరో. ఎప్పటికీ హీరో. ‘మీ పక్కన కాస్తంత చోటివ్వండి’ అంటాడు కమల్‌హాసన్ ‘సాగర సంగమం’లో జయప్రదతో ఫొటోకోసం నిలబడుతూ. ఆ ఫొటోలో అతను పడడు. కాని భారతీయ సినిమా రంగంలో అతని చోటును నేటికీ కదిల్చేవాళ్లు లేరు. అతని పక్కన చోటు కోసం పాకులాడని వారు లేరు. ‘స్టార్’ లేదా ‘యాక్టర్’ రెండు ముద్రలుంటాయి ఇండస్ట్రీలో. కాని యాక్టర్‌గా ఉంటూ స్టార్ అయినవాడు కమల్‌హాసన్. తెర అంటే ఏమిటి? నటనకు వీలు కల్పించేది. నటించాల్సినది. నటన లేకుండా తెర మీద వెలగడం అంటే పులి గాండ్రించకుండా ఉండటమే. కమల్ గాండ్రించే పులి. పాత్రలను వేటాడే పులి కూడా. ఇండస్ట్రీలో బాల నటులుగా ప్రవేశించినవారికి శాపం ఉంటుంది. యవ్వనంలో రాణించలేని శాపం. దానికి కారణం బాల నటులుగా ప్రవేశించాక చదువు సరిగ్గా నడవదు. అప్పటికే కెమెరా కాటేసి ఉంటుంది. ఏవేవో మెరుపు కలలు. కాని బాల్యంలో ఉన్న ముఖం వయసు పెరిగాక అంత ముద్దు రాకపోవచ్చు. బాల్యంలో ఉన్న ఈజ్ యవ్వనంలో మొద్దుబారవచ్చు. చాలా తక్కువ మందే చిన్నప్పుడు నటించి ఆ తర్వాత పెద్దయ్యాక కూడా స్టార్లు అయ్యారు. నటీమణుల్లో శ్రీదేవి. నటుల్లో కమల్‌హాసన్. నటన అతనిలో జన్మతః ఉంది. నటులు ఏం చేయాలో అతనికి తెలుసు. ‘సొమ్మొకడిది సోకొకడిది’ సినిమాలో ‘ఆ పొన్న నీడలో ఈ కన్నెవాడలో ఉన్నా’ అనే పాట ఉంటుంది. ఆ పాటను తీసింది కొబ్బరి చెట్ల మధ్య. అందుకే కమల్ మొదటి లైన్ పాడుతూ కొబ్బరి చెట్ల వైపు చూస్తూ ఇవి పొన్న చెట్లు కావే అన్నట్టుగా చూసి పాట కొనసాగిస్తాడు. న్యుయాన్సెస్ అంటారు దీనిని. కళ అంటేనే అది. ‘సాగర సంగమం’ సూపర్ డూపర్ హిట్ అయ్యాక కె. విశ్వనాథ్ ‘స్వాతిముత్యం’ తీశారు. ‘సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ’ పాట చిత్రీకరణ. అంత మంచి దర్శకుడు విశ్వనాథ్ కూడా ‘ఈ పాటకు మంచి స్టెప్స్ కంపోజ్ చేద్దాం’ అన్నారట పాత్ర ఔచిత్యం మరిచి. అప్పుడు కమల్ ‘సార్... ఈ పాటకు నేను డాన్స్ చేయను. ఎందుకంటే వీడు బాలు కాదు. శివయ్య. వీడికి డాన్సు రాదు’ అన్నారట. అదీ కమల్. ఆ తర్వాత ఆ పాటలో శివయ్య అను కమల్ వేసిన వచ్చీ రాని స్టెప్స్‌ను లోకం మురిసిపోయి చూసింది. కమల్ చార్లీ చాప్లిన్‌ను చూసి నటన మెరుగుపర్చుకున్నాడు. ‘డాన్స్‌మాస్టర్’లో స్వయంగా చాప్లిన్ పాత్ర చేశాడు. ఆ తర్వాత రాబిన్ విలియమ్స్ నటనతో కూడా ప్రభావితం అయ్యాడు. మంచి నటుడు బ్లాటింగ్ పేపర్ లాంటి వాడు. ఒక్క బొట్టు మంచి దొరికినా పీల్చేసుకుంటాడు. ‘గాడ్‌ఫాదర్’ను మోడల్‌గా పెట్టుకుని మణిరత్నం ‘నాయకుడు’ తీశాడు. గాడ్‌ఫాదర్‌లో మార్లెన్ బ్రాండో చేసింది గొప్పదే. ‘నాయకుడు’లో కమల్ చేసింది కూడా గొప్పే. కొడుకు చనిపోయినప్పుడు తండ్రి దుఃఖాన్ని ఒక్కో నటుడు ఒక్కోలా చేస్తాడు. కమల్ చేసింది ఒక సిలబస్. కమల్ చేసిన అతి ముఖ్యమైన పని ఆహార్యం గురించి శ్రద్ధ పెట్టడం. ఆహార్యం, దేహభాష ఒక పాత్రలో నటుణ్ణి నశింపచేసి పాత్రను సజీవం చేస్తుంది. ప్రతి సినిమాలో ఒకేలా ఉంటూ ఒకే నటన చేస్తూ నటుల్లా వెలిగే వారు ఉన్నారు నేటికీ. కాని కమల్ పాత్రను బట్టి మారుతాడు. అతని శరీర కదలికా మారుతుంది. ఆధునిక మేకప్‌లు రాని రోజుల్లోనే ‘సత్యమే శివం’ వంటి సినిమాల్లో ఆయన ఆహార్యం అద్భుతం. కమల్ తమిళంతో సమానంగా తెలుగులో కూడా సూపర్‌స్టార్. తెలుగులోనే నేరుగా సినిమాలు చేశాడు. ‘మరో చరిత్ర’, ‘ఇది కథ కాదు’, ‘ఆకలి రాజ్యం’ కొన్ని. ఒక గొప్ప నటుడు ఎవడయ్యా అంటే కామెడీ చేయగలిగినవాడు. సీరియస్ నటుడైన దిలీప్ కుమార్ కామిక్ టైమింగ్ అద్భుతం. అమితాబ్ కామెడీకి తిరుగు లేదు. కమల్ కామెడీ చేసి ‘పుష్పక విమానం’, ‘మైఖేల్ మదన కామరాజు’, ‘ముంబై ఎక్స్‌ప్రెస్’, ‘తెనాలి’... లిస్టు పెద్దది. ఒక గొప్ప హీరో తన దర్జాకు తగిన కోస్టార్‌ను పెట్టుకుంటాడు. కాని కమెడియన్ అయిన కోవై సరళతో ‘సతీ లీలావతి’ చేసి హిట్ కొట్టాడు కమల్. సినిమాలో సంపాదించింది సినిమాకే పెట్టాడు కమల్. నిర్మాతగా దర్శకుడుగా హిట్స్ ఫ్లాప్స్ ఇచ్చాడు. లాభపడ్డాడు. నష్టపోయాడు. కాని హీరోగానే ఉన్నాడు. హీరోగానే ఉండటానికి ఎంత ప్రొఫెషనల్‌గా, క్రియేటివ్‌గా ఉండాలో పరిశ్రమకు చూపించాడు. 67 ఏళ్ల వయసులో ‘విక్రమ్’ వంటి హిట్ ఇచ్చాడు. స్టార్లు పుడతారు. గిడతారు. కాని నటులు శాశ్వతం. కమల్ శాశ్వత నటుడు. హ్యాపీ బర్త్‌డే.(నవంబర్ 7న కమల్‌హాసన్ బర్త్‌డే) -
కింగ్ కోహ్లి 12 ఏళ్ల ట్వీట్ వైరల్..
టీమిండియా రన్‌మెషిన్.. కింగ్ కోహ్లి ఇవాళ(నవంబర్ 5న) 34వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా టీమిండియా అభిమానులు సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు కోహ్లికి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. 14 ఏళ్ల క్రికెట్ కెరీర్లో అన్ని ఫార్మాట్లు కలిపి 24వేలకు పైగా పరుగులు సాధించిన కోహ్లి ఇప్పటికీ పరుగుల వరదను కొనసాగిస్తూనే ఉన్నాడు. మధ్యలో మూడేళ్ల పాటు సెంచరీ లేకపోయినప్పటికి ఏ మాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా తనపై వచ్చిన విమర్శలను బ్యాట్‌తోనే తిప్పికొట్టడం అతనికే సాధ్యమైంది. ప్రస్తుతం టి20 ప్రపంచకప్‌లో టీమిండియా తరపున లీడింగ్ రన్‌స్కోరర్‌గా ఉన్న కోహ్లి జట్టుకు కప్ అందించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక 2022లో తిరిగి ఫామ్‌ను అందుకున్న కోహ్లి బర్త్‌డే సందర్భంగా 12 ఏళ్ల పాత ట్వీట్ తాజాగా మరోసారి వైరల్ అయింది. 2010 మార్చి 16న కోహ్లి ట్వీట్ చేసే సమయానికి అతను టీమిండియా తరపున కేవలం 23 వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 23 మ్యాచ్‌లాడి 847 పరుగులు చేసిన విరాట్ ఖాతాలో అప్పటికి రెండు సెంచరీలు, ఆరు ఫిప్టీలు ఉన్నాయి. ఆ సమయంలో కోహ్లి తన ట్విటర్లో ఒక మాట అన్నాడు. ''ఎప్పటికైనా టీమిండియా తరపున వీలైనన్నీ ఎక్కువ పరుగులు చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నా.. ఏదో ఒకరోజు అది నెరవేరుతుంది'' అంటూ రాసుకొచ్చాడు. ఇది పోస్టు చేసిన కొద్ది రోజులకు టి20ల్లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత 2011లో తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడడంతో మూడు ఫార్మాట్లలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాడిగా ఘనత సాధించాడు. కట్‌చేస్తే ఇవాళ అన్ని ఫార్మాట్లలో వందకు పైగా మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. అన్ని ఫార్మాట్లు కలిపి 24వేలకు పైగా పరుగులు, 71 సెంచరీలు, 92 అర్థసెంచరీలతో దుమ్మురేపుతున్నాడు. Looking forward to scoring lots of runs for my Team.. — Virat Kohli (@imVkohli) March 16, 2010 చదవండి: వర్షంతో మ్యాచ్ రద్దయినా టీమిండియాకే మేలు 'కింగ్' కోహ్లి.. కరగని శిఖరం కోహ్లి కెరీర్లో ముచ్చటగా ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు.. -
Virushka: అప్పుడప్పుడు నటించేవాడు కూడా.. ‘బ్యాడ్ జోక్’తో మాట కలిపి!
Virat Kohli- Anushka Sharma Love Story: క్రికెట్ రికార్డుల రారాజు అతడు.. ప్రతిభావంతురాలైన నటి ఆమె.. అప్పుడప్పుడు అతడూ ‘నటిస్తుంటాడు’.. అదే వారి చూపుల కలయికకు కారణమైంది.. పరిచయం స్నేహంగా.. ఆపై ప్రణయంగా మారి పరిణయానికి దారి తీసింది.. అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా పండంటి పాపాయినీ ఇచ్చింది.. ‘‘థాంక్ గాడ్.. నువ్వు ఈ భూమ్మీద పుట్టావు కాబట్టి సరిపోయింది.. లేదంటే నాకసలు ఏం తోచేదే కాదు.. నువ్వు లేకుంటే ఇక్కడి దాకా వచ్చేవాడినే కాదు.. నీ రూపమే కాదు.. మనసు కూడా ఎంతో అందమైనది’’ అంటూ ఆమెపై ప్రేమను కురిపిస్తాడు అతడు.. దేవుడు తనకిచ్చిన గొప్ప కానుకకు మనసులోనే ధన్యవాదాలు చెప్పుకొంటాడు.. ఆమె ఒక్కమాటలో.. ‘‘నువ్వే సర్వస్వం.. నీపై నా ప్రేమ అపరిమితం’’ అంటుంది. ఎల్లవేళలా అతడికి తోడుగా ఉంటుంది.. ఆమె అనుష్క శర్మ.. అతడు విరాట్ కోహ్లి.. వారి ప్రేమ కథే ఇది! చూపులు కలిసిన శుభవేళ కోహ్లి అప్పుడప్పుడే ఎదుగుతున్న సమయం.. 2011 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న విరాట్ బ్రాండ్ వాల్యూ దృష్ట్యా తమ కమర్షియల్ యాడ్‌లో అతడిని నటింపజేసింది ఓ షాంపూ కంపెనీ. 2013 నాటి ఆ యాడ్‌లో కోహ్లికి జోడీగా అనుష్క శర్మ. స్వతహాగా నటి కాబట్టి చాలా క్యాజువల్‌గానే సెట్లోకి వచ్చిందామె. కానీ కోహ్లికి కొత్త కాబట్టి కాస్త కంగారుగా ఉన్నాడు. పొడవాటి హీల్స్ వేసుకుని తన కంటే ఎత్తుగా కన్పిస్తున్న అనుష్కను చూసి.. ‘‘ఇంతకంటే పొడుగైన హీల్స్ దొరకలేదా’’ అంటూ ఆమెతో మాట కలిపేందుకు ప్రయత్నించాడు. ఆమె కాస్త చిరాగ్గా ఏంటీ అని ఎదురు ప్రశ్నించడంతో.. ‘‘లేదు లేదు నేను జోక్ చేశానంతే’’ అంటూ తప్పించుకున్నాడు. కానీ ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడే ఆమె వ్యక్తిత్వానికి ఫిదా కాకుండా మాత్రం ఉండలేకపోయాడు. ఆ తర్వాత ఎలాగోలా మాటలు కలిశాయి. అవును ప్రేమలో ఉన్నాం అడపాదడపా బయట కలిసి కనిపించేవారు.. ఇటు క్రికెట్.. అటు సినిమా వర్గాల్లో చర్చ.. ఇంతకీ వీళ్లు నిజంగానే ప్రేమలో పడ్డారా? లేదంటే మూణ్నాళ్ల ముచ్చటగానే వీరి బంధం ముగుస్తుందా? అంటూ చెవులు కొరుక్కున్నారు. అనవసరంగా గాసిప్ రాయుళ్లకు మరీ ఎక్కువ పని కల్పించడం ఎందుకని విరాట్- కోహ్లి తమ గురించి తామే స్వయంగా బయట ప్రపంచానికి తెలిసేలా ఓ ప్రకటన చేశారు. ‘‘ఇందులో దాచాల్సింది ఏమీ లేదు. అందరు యువతీ యువకుల్లాగే మేమూ రిలేషన్షిప్లో ఉన్నాం’’ అని తమ బంధాన్ని బాహాటంగానే వెల్లడించారు. ఇండియన్ సూపర్ లీగ్‌లో భాగంగా 2014 నవంబరులో ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు జంటగా హాజరయ్యారు. ఫ్లైయింగ్ కిస్‌తో.. అదే ఏడాది శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా వన్డేల్లో అత్యంత వేగంగా 6 వేల పరుగుల మార్కును అందుకున్న బ్యాటర్ విరాట్ చరిత్ర సృష్టించాడు. కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ వీక్షించేందుకు స్టేడియానికి వచ్చింది అనుష్క.. స్పెషల్ ఇన్నింగ్స్ తర్వాత బ్యాట్‌ను ముద్దాడి స్టాండ్స్‌లో ఉన్న నిచ్చెలికి ఫ్లైయింగ్ కిస్ విసిరాడు కోహ్లి. అతడి ప్రతిభకు మెచ్చుకోలుగా.. ప్రేమకు బదులుగా లేచి నిల్చుని చిరునవ్వులు చిందించింది అనుష్క. కానీ కొంతమంది ఆకతాయిలు వారి ప్రేమను అపహాస్యం చేసే విధంగా.. అనుష్కను దారుణంగా నిందిస్తూ ట్రోల్ చేశారు. అయితే, కోహ్లి ఆమెకు అండగా నిలబడ్డాడు. తనలో సానుకూల దృక్పథం పెంపొందడానికి కారణం ఆమేనంటూ ప్రేమను చాటుకున్నాడు. ఎంగేజ్మెంట్.. పెళ్లి 2016లో తాము నిశ్చితార్థం చేసుకున్నట్లు వచ్చిన కథనాలను ఇద్దరూ ఖండించారు. దీంతో విరుష్క ఫ్యాన్స్‌లో గందరగోళం నెలకొంది. అయితే వారి అనుమానాలన్నీ పటాపంచలు చేశాడు కోహ్లి. 2017లో అనుష్కతో దిగిన సెల్ఫీని పోస్ట్ చేస్తూ నీతో ఉన్న ప్రతిరోజూ వాలైంటైన్ డేనే అంటూ తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించాడు. అదే ఏడాది డిసెంబరులో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేసుకుందీ స్టార్ జంట. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అప్పటి నుంచి భార్యాభర్తలుగా తమ ప్రయాణం కొనసాగిస్తున్నారు విరుష్క. వీరి ప్రేమకు గుర్తుగా 2021లో కుమార్తె వామిక జన్మించింది. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా.. ఎన్‌హెచ్ 10 సినిమాతో నిర్మాతగా మారింది అనుష్క. ఆ సినిమాలో ఆమెదే లీడ్ రోల్. అనూహ్య పరిస్థితుల్లో అన్యాయంగా తన భర్తను, ఓ ప్రేమజంటను పొట్టనబెట్టుకున్న దుర్మార్గులకు శిక్ష విధించిన ఆధునిక స్త్రీగా ఆమె నటన అమోఘం. సినిమా చూసి మరోసారి ఫిదా అయ్యాడు కోహ్లి. నా అనుష్క నన్ను గర్వపడేలా చేసిందంటూ కితాబులిచ్చాడు. అనుష్క కూడా అంతే.. తన కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతనిస్తూ ఎల్లప్పుడూ భర్త వెంటే ఉండేందుకు ప్రయత్నిస్తుంటుంది. తన కెరీర్లో ఎత్తుపళ్లాలు.. ముఖ్యంగా గత మూడేళ్లలో నిలకడలేమి ఫామ్, కెప్టెన్సీ కోల్పోవడం వంటి పరిణామాల నేపథ్యంలో విమర్శల పాలైన కోహ్లికి ఆమె ధైర్యాన్నిచ్చింది. తిరిగి ఫామ్ పొందడం, ఆసియా కప్, ప్రపంచకప్ టోర్నీల్లో వరుసగా అద్భుత ఇన్నింగ్స్ నేపథ్యంలో ఒకానొక సందర్భంలో కోహ్లి.. తన సెంచరీని అనుష్కకు అంకితమిస్తూ.. తన జీవితంలో ఆమె పాత్ర, ప్రభావం ఏమిటో చెప్పకనే చెప్పాడు. ఇలా ఈ స్టార్ జంట ఎప్పటికప్పుడు కపుల్ గోల్స్ సెట్ చేస్తూ యువ జంటకు ఆదర్శంగా ఉంటోంది. (నవంబరు 5 కోహ్లి పుట్టినరోజు సందర్భంగా) - సుష్మారెడ్డి యాళ్ల చదవండి: Virat Kohli Birthday Special: 'కింగ్' కోహ్లి.. కరగని శిఖరం ఇద్దరూ ఒకప్పుడు టీమిండియా కెప్టెన్లే! ప్రేమా..పెళ్లి.. కవలలు.. మూడేళ్ల తర్వాత.. -
కోహ్లి కెరీర్లో ముచ్చటగా ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు..
విరాట్ కోహ్లి ఇవాళ(నవంబర్ 5న) 34వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. క్రికెట్లో లెక్కలేనన్ని రికార్డులు సొంతం చేసుకున్న కోహ్లి గురించి కొత్తగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు.అయితే ప్రతీ మనిషికి ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. వాటిని తట్టుకొని నిలబడేవాడు జీవితంలో గొప్పవాడు అవుతాడు. కోహ్లికి అందుకు చక్కటి ఉదాహరణ. కోహ్లి 33 నుంచి 34వ పడిలోకి అడుగుపెట్టే కాలంలో ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఇంతకముందు చాలా ఎదురుదెబ్బలు తగిలినప్పటికి అవన్నీ అతని బ్యాటింగ్ మూలంగా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం రాలేదు. కానీ గతేడాది మాత్రం కోహ్లి కెరీర్‌ను పాతాళంలో పడేసింది. ఒకవైపు కెప్టెన్సీ నుంచి తొలగింపు అనుకుంటే.. మరోవైపు పరుగులు చేయలేక విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక జట్టు నుంచి కోహ్లిని తీసేయాలన్న డిమాండ్ కూడా వచ్చింది. ఈ క్రమంలోనే బౌన్స్ బ్యాక్ అయిన తీరు.. ఇవాళ టి20 ప్రపంచకప్‌లో కోహ్లి ఆడుతున్న తీరు చూడముచ్చటగా ఉంది. అయితే కోహ్లి కెరీర్లో చాలా అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు ఉన్నాయి. వాటిలో ది బెస్ట్ ఏది అని చెప్పడం కష్టమే. కానీ మాకు తెలిసినంతవరకు ఇప్పుడు చెప్పబోయే ఒక ఐదు ఇన్నింగ్స్‌లు మాత్రం కోహ్లి కెరీర్లో బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ మాట ఎందుకంటే అతను ఫామ్‌లో ఉన్నప్పుడు పరుగులు సాధిస్తే పెద్ద విషయం కాదు. జట్టు కష్టాల్లో ఉన,్నప్పుడు లేదంటే తాను ఫామ్ కోల్పోయి తిరిగి బౌన్స్ బ్యాక్ అయిన ఇన్నింగ్స్‌లు అతని విలువను చూపిస్తాయని అంటారు. అందుకే కోహ్లి కెరీర్లో ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు ఏంటంటే.. 2016 ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై 49 పరుగులు ► 2016 ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా విజయంలో కోహ్లిదే కీలకపాత్ర. 84 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా మహ్మద్ ఆమిర్ దెబ్బకు 8 పరుగులకే మూడు వికెట్లు తీవ్ర కష్టాల్లో పడింది. ఈ క్రమంలో కోహ్లి బ్యాటింగ్‌లో చూపిన తెగువ మరిచిపోలేనిది. కత్తుల్లా దూసుకొస్తున్న బంతులను ఓపికగా ఆడుతూ 51 బంతుల్లో 49 పరుగులు చేసి ఔటయ్యాడు. కోహ్లి ఆరోజు ఆడకపోయుంటే టీమిండియా 50 పరుగులకే ఆలౌట్ అయ్యేలా కనిపించింది. కానీ కోహ్లి ఇచ్చిన ఉత్సాహంతో యువరాజ్(14 నాటౌట్), ఎంఎస్ ధోని(7 నాటౌట్) టీమిండియాను గెలిపించారు. 82 పరుగులు నాటౌట్ Vs పాకిస్తాన్, 2022 టి20 ప్రపంచకప్ ► టి20 ప్రపంచకప్ 2022లో పాకిస్తాన్‌పై ఆడిన ఇన్నింగ్స్ విరాట్ కోహ్లి కెరీర్లోనే కాదు.. ఈ దశాబ్దంలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల్లో ఒకటిగా మిగిలిపోవడం ఖాయం. ఈ ఇన్నింగ్స్‌తోనే కోహ్లిని GOATగా అభివర్ణించడం మొదలుపెట్టారు. 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి.. కష్టాల్లో పడ్డ టీమిండియాకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. నరాలు తెగే ఉత్కంఠతో సాగిన మ్యాచ్‌లో ఆఖర్లో కోహ్లి కొట్టిన రెండు సిక్సర్లు ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచాయి. మెల్బోర్న్ గ్రౌండ్లో 90 వేల మంది సమక్షంలో కోహ్లి ఆడిన ఇన్నింగ్స్ ఇప్పటికీ కళ్లముందు ఉంది. టీమిండియాను గెలిపించిన తర్వాత కోహ్లి ఆకాశంలోకి చూస్తూ కన్నీటి పర్యంతం అవడం అతని మనసులో ఎన్నాళ్ల నుంచి ఎంత బాధ దాగుందనేది అర్థమయింది. 122 పరుగులు నాటౌట్ Vs అఫ్గానిస్తాన్, ఆసియా కప్ 2022 ► అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్ వరకు కోహ్లిపై విమర్శలు దారుణంగా వచ్చాయి. కోహ్లి పని అయిపోయిందని.. తనను పక్కనబెట్టాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొనడం కోహ్లి అభిమానులతో పాటు సగటు వ్యక్తిని బాధపడేలా చేసింది. కానీ తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. 61 బంతుల్లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 122 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. దాదాపు మూడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ 71వ సెంచరీ సాధించాడు. ఎంత కాదన్నా కోహ్లి కెరీర్లో మాత్రం ఈ ఇన్నింగ్స్ ది బెస్ట్‌గా నిలిచిపోతుంది. 79 Vs పాకిస్తాన్, 2019 వన్డే వరల్డ్‌కప్ ► 2019 వన్డే వరల్డ్‌కప్‌లో కోహ్లి మంచి ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా ఐదు హాప్ సెంచరీలతో దుమ్మురేపాడు. అందులో భాగంగానే పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి రోహిత్ శర్మకు సపోర్ట్ ఇస్తూ ఆడిన 79 పరుగుల తుఫాను ఇన్నింగ్స్ మరిచిపోలేము. ఈ మ్యాచ్‌లో రోహిత్ 140 పరుగులతో విధ్వంసం సృష్టించినప్పటికి కోహ్లి సుడిగాలి ఇన్నింగ్స్ ఫ్యాన్స్‌కు బాగా అలరించింది. 94 Vs వెస్టిండీస్, 2019 ► 2019లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో కోహ్లి 94 పరుగులు ఇన్నింగ్స్ కూడా బెస్ట్ అని చెప్పొచ్చు. 208 పరుగుల లక్ష్య చేధనలో టీమిండియా తడబడిన సమయంలో కోహ్లి ఆదుకున్నాడు. విజయానికి 119 పరుగులు అవసరమైన దశలో 94 పరుగులు చేసి జట్టుకు విజయం అందించాడు. చదవండి: 'కింగ్' కోహ్లి.. కరగని శిఖరం -
Virat Kohli Photos: కింగ్ కోహ్లి (ఫొటోలు)
-
'కింగ్' కోహ్లి.. కరగని శిఖరం
విరాట్ కోహ్లి.. క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. టీమిండియా రన్ మెషిన్, చేజింగ్ మాస్టర్, కింగ్ కోహ్లి.. ఇలా ఎన్ని పేర్లు పెట్టి పిలుచుకున్నా అతనిపై ఉన్న అభిమానం ఇసుమంతైనా తగ్గదు. కొండలు కరుగుతాయన్న మాట నిజమో లేదో తెలియదు కానీ.. కోహ్లి లాంటి శిఖరం మాత్రం ఎన్నటికి కరగడు. వయస్సు పెరిగేకొద్ది తన ఆటలో మరింత పదును పెంచుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఏడాది క్రితం తనని విమర్శించిన నోళ్లే ఇవాళ మెచ్చుకుంటున్నాయి. టి20 ప్రపంచకప్ 2022లో టీమిండియా తరపున కోహ్లి టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన టీమిండియాలో సభ్యుడిగా ఉన్న కోహ్లి.. మరోసారి టి20 ప్రపంచకప్ అందించాలని ఉవ్విళ్లురుతున్నాడు. జీవితంలో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా తట్టుకొని నిలబడేవాడు గొప్ప వ్యక్తి అవుతాడు అని తన తండ్రి చెప్పిన మాటలను అక్షరాలా పాటిస్తున్నాడు. తనను GOAT అని పిలుస్తున్నా వాళ్లకు అలా పిలవొద్దని.. అందుకు నేను అర్హుడిని కాదంటూ పేర్కొని తన హుందాతనాన్ని చాటుకున్నాడు. కానీ అభిమానుల దృష్టిలో మాత్రం నువ్వు ఎప్పుడు GOATగానే ఉంటావు కోహ్లి. క్రికెట్లో రికార్డుల రారాజుగా పేరు పొందిన కోహ్లి ఇవాళ 34వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లికి Happy Birthday. 15 ఏళ్ల వయసులో క్రికెట్ లోకి అడుగుపెట్టాడు కోహ్లి.. ఆ తర్వాత అంచలంచలుగా ఎదుగుతూ 2008లో అండర్ 19 ప్రపంచ కప్‌కి కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. అప్పుడే అండర్ 19 వరల్డ్ కప్‌ను సాధించి పెట్టాడు. ఇదే కోహ్లీ కెరీర్ ని మలుపుతిప్పింది. రంజీ ట్రోఫీ ఆడే సమయంలో తన తండ్రి చనిపోయినప్పటికీ మ్యాచ్‌ను ఆడి ఒంటి చేత్తో టీంను గెలిపించి క్రికెట్ పట్ల తనకున్న నిబద్ధతను నిరూపించుకున్నాడు. 2008లో ఆస్ట్రేలియాలో జరిగిన ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్లో వంద పరుగులు సాధించిన తర్వాత, కోహ్లి టీం ఇండియా జట్టుకు ఎంపికయ్యాడు.సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్ ఇద్దరూ గాయపడినప్పుడు 2008లో శ్రీలంకతో ఆడిన ఐడియా కప్ ద్వారా మొదటిసారి వన్డే క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత కోహ్లి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. తన ప్రతిభ చాటుతూ ఎంఎస్ ధోని తరువాత భారత క్రికెట్ జట్టు సారధ్య బాధ్యతలు దక్కించుకున్నాడు. అప్పటి నుంచి టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు. అతని సారధ్యంలో టీమిండియా ఐసీసీ ట్రోఫీలు కొట్టలేదన్న అపవాదు తప్ప కెప్టెన్‌గా ఎన్నో సాధించాడు. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, ఈ ఫీట్ అందుకున్న మొట్టమొదటి కెప్టెన్‌గా నిలిచాడు. అంతేకాదు టి20 వరల్డ్‌కప్‌లోనూ హాఫ్ సెంచరీ చేసిన మొదటి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీయే. ధోనీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న విరాట్ కోహ్లీ... టెస్టుల్లో ఏడో స్థానంలో ఉన్న భారత జట్టును నెం.1 టీమ్‌గా నిలిపాడు. అతి తక్కువ కాలంలో అత్యధిక విజయాలు (40 టెస్టు విజయాలు) అందించిన భారత కెప్టెన్ విరాట్... బీసీసీఐతో విభేదాలతో మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. గతేడాది టి20 ప్రపంచకప్‌లో టీమిండియా ఓటమికి బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన కోహ్లికి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. ఆ తర్వాత వన్డే, టెస్టు కెప్టెన్సీ పదవులు కూడా ఊడిపోయాయి. దీనికి తోడూ ఒకప్పుడు సెంచరీలను మంచినీళ్ల ప్రాయంగా అందుకున్న కోహ్లి బ్యాట్ ఒక్కసారిగా మూగపోయింది. దాదాపు కోహ్లి బ్యాట్ నుంచి సెంచరీ వచ్చి మూడేళ్లు దాటిపోయింది. ఇక కోహ్లి పని అయిపోయింది అన్న తరుణంలో బౌన్స్ బ్యాక్ అయిన తీరు అద్భుతమనే చెప్పాలి. ఆసియా కప్‌లో అఫ్గానిస్తాన్‌పై సెంచరీతో మెరిసినప్పటికి చిన్న జట్టు కదా ఇది మాములే అనుకున్నారు. కానీ కోహ్లి కెరీర్ ఇక్కడి నుంచి మరో మలుపు తీసుకుంది. తాను ఫామ్‌లోకి వచ్చానంటే నమ్మనివాళ్లు నమ్మే పరిస్థితి తీసుకొచ్చాడు కోహ్లి. అందుకు సాక్ష్యం టి20 వరల్డ్‌కప్ 2022. ఈసారి కప్ గెలవడానికే ఆడుతున్నాడా అన్నట్లుగా కోహ్లి ఇన్నింగ్స్‌లు సాగుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రపంచకప్‌లో టీమిండియా తరపున లీడింగ్ రన్‌స్కోరర్‌గా ఉన్న కోహ్లి విలువ గురించి చెప్పడానికి పాకిస్థాన్ మీద ఆడిన ఒక్క ఇన్నింగ్స్ చాలు. 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి.. కష్టాల్లో పడ్డ టీమిండియాకు ఒంటిచేత్తో విజయాలు అందించిన అసలు సిసలు వారియర్ కోహ్లి. హారిస్ రవూఫ్ బౌలింగ్ లో ఆఖర్లో కొట్టిన రెండు సిక్సర్లు ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. నరాలు తెగే టెన్షన్ లో కూడా ఎంతో కూల్ గా టీమిండియాకు విజయం అందించడం వన్ అండ్ ఓన్లీ విరాట్ కోహ్లీకే సాధ్యమవుతుంది. ఇక, ప్రపంచ క్రికెట్ చరిత్రలో రికార్డుల రారాజు. భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ సాధించిన రికార్డులను బద్దలు కొట్టేవారు ఎవరైనా ఉన్నారా అంటే ప్రపంచంలో ఉన్న ఏ క్రికెట్ అభిమాని నోటి నుంచి అయినా వచ్చే ఒకే పేరు విరాట్ కోహ్లి. ఇలాంటి క్రికెటర్ తమ దగ్గర ఉండాలని క్రికెట్ ఆడే ప్రతీ దేశం కలలు కంటుంది. అంతర్జాతీయ క్రికెట్లో 24 వేలకు పైగా పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, రెండేళ్ల క్రితం దాకా ఏదో సరదాకి సెంచరీలు బాదుతున్నట్టుగా శతకాలు బాదుతూ పోయాడు. వన్డేల్లో 43, టెస్టుల్లో 27 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, ఆసియా కప్‌లో ఆఫ్ఘాన్‌పై టీ20 సెంచరీ బాది... మొత్తంగా 71 అంతర్జాతీయ శతకాలు బాదాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న క్రికెటర్‌గా నిలిచాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 8 వేలు, 9000, 10,000, 11 వేల మైలురాయిని అందుకున్న క్రికెటర్ కూడా విరాట్ కోహ్లీయే. 175 ఇన్నింగ్స్‌ల్లో 8 వేల పరుగులు పూర్తిచేసుకున్న కోహ్లీ, 222 ఇన్నింగ్స్‌లో 11 వేల మైలురాయిని అందుకున్నాడు. ఈ దశాబ్ద కాలంలో 20 వేలకు పైగా పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా సరికొత్త చరిత్ర లిఖించాడు విరాట్ కోహ్లీ. ఈ ఫీట్‌తో ఐసీసీ ‘దశాబ్దపు క్రికెటర్’గా అవార్డు గెలిచాడు... 2016 ఐపీఎల్ సీజన్లో ఏకంగా 973 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఐదు సీజన్లుగా ఈ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది. Hobart saw one of the great ODI centuries back in 2012 as Virat Kohli - who turns 3️⃣4️⃣ today - produced a truly remarkable innings 🤯 pic.twitter.com/CJBKdnEop0 — cricket.com.au (@cricketcomau) November 5, 2022 ✅ The sixth-highest run-scorer in international cricket ✅ 71 internationals 💯s, joint-second with Ricky Ponting ✅ India's most successful Test captain ✅ Most runs in T20Is and T20 World Cups #OnThisDay A happy 34th birthday to Virat Kohli, a modern batting giant ✨🎉 pic.twitter.com/bYW3q4zGr2 — ESPNcricinfo (@ESPNcricinfo) November 5, 2022 Happy Birthday Virat Kohli on the big screen.#ViratKohli𓃵 #HappyBirthdayViratKohli pic.twitter.com/jIFxMNslSe — Virat Kohli Fan Club (@Trend_VKohli) November 4, 2022 చదవండి: కోహ్లి కెరీర్లో ముచ్చటగా ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు.. -
అమలా పాల్ బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
పుట్టినరోజున హార్దిక్ పాండ్యా ఎమోషనల్..
టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఇవాళ(అక్టోబర్ 11న) 29వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. కాగా ఆస్ట్రేలియా వేదికగా మరికొద్ది రోజుల్లో టి20 ప్రపంచకప్ ఆరంభం కానుంది. టీమిండియాతో కలిసి పాండ్యా ఆస్ట్రేలియాకు వెళ్లిన సంగతి తెలిసిందే. సోమవారం వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విషయం పక్కనబెడితే పుట్టినరోజునాడే హార్దిక్ పాండ్యా ఎమెషనల్ అయ్యాడు. అందుకు కారణం తన కొడుకు అగస్త్యను మిస్ అవడమేనట. బర్త్‌డే వేడుకలు ఫ్యామిలీ సమక్షంలో జరగనందుకు కాస్త బాధ ఉందని.. అయితే దేశం కోసం ఆడుతున్నాం కాబట్టి ఇవన్నీ పక్కనబెట్టేస్తానని పేర్కొన్నాడు. కాగా ట్విటర్ వేదికగా తన కొడుకు అగస్త్యతో ఉన్న అనుబంధాన్ని హార్దిక్ వీడియో రూపంలో షేర్ చేసుకున్నాడు. ''నా పుట్టినరోజున అగస్త్యను చాలా మిస్సవుతున్నా.. వాడు నా జీవితంలోకి రావడమే పెద్ద గిఫ్ట్'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక టి20 ప్రపంచకప్‌లో అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది.టీమిండియా నిఖార్సయిన ఆల్‌రౌండర్‌గా ఎదిగిన పాండ్యా..టి20 ప్రపంచకప్‌లో కీలకపాత్ర పోషించనున్నాడు. జట్టులో ఐదో బౌలర్ రోల్‌తో పాటు చివర్లో దినేష్కార్తీక్తో కలిసి మ్యాచ్‌ను ఫినిష్ చేసే బాధ్యత హార్దిక్ పాండ్యాపైన ఉంది. వెన్నునొప్పి, ఫేలవ ఫామ్‌తో టీమిండియాలో స్థానం కోల్పోయిన పాండ్యా సర్జరీ తర్వాత ఐపీఎల్ 2022లో రీఎంట్రీ ఇచ్చాడు. కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్ వ్యవహరించి తొలి సీజన్లోనే ఆ జట్టును ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపాడు. కెప్టెన్‌గా గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా నడిపించడంతో పాటు ఆల్‌రౌండర్‌గానూ రాణించాడు. Missing my boy a little bit more on my birthday ❤️ The best gift I've received 😘🥰🤗 pic.twitter.com/So6ddl4d4q — hardik pandya (@hardikpandya7) October 11, 2022 -
'ఇంజనీర్లు చాలా మంది ఉన్నారు.. ఫాస్ట్ బౌలర్ అవ్వు'
టీమిండియాలోకి చాలా మంది ఫాస్ట్ బౌలర్లు వచ్చి వెళ్లారు. కొందరు తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటే.. కొంతమంది మాత్రం ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. క్రికెట్‌ను అమితంగా అభిమానించే మన దేశంలో టాప్ క్లాస్ బౌలర్లుగా వెలుగొందిన వారిలో స్పిన్నర్లే ఎక్కువ. స్పిన్నర్లు ఎంత ప్రభావం చూపించినప్పటికి ఒక తరానికి ఒక్కో ఫాస్ట్ బౌలర్ భారత్ పేస్ దళాన్ని నడిపించారు. 1970,80వ దశకంలో కపిల్ దేవ్ లాంటి దిగ్గజ ఆల్‌రౌండర్.. ఇక 90వ దశకంలో జగవల్ శ్రీనాథ్, వెంకటేశ్ ప్రసాద్ లాంటి పేసర్లు టీమిండియాను నడిపించారు. ఇక మిలీనియం ఆరంభంలో టీమిండియాలోకి కొత్త బౌలర్ వచ్చాడు. మొదట్లో పెద్దగా రాణించకపోయినప్పటికి గంగూలీ అండతో వరుసగా అవకాశాలు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత దాదాపు దశాబ్దంన్నర కాలం పాటు టీమిండియా బౌలింగ్‌లో పెద్దన్న పాత్ర పోషించాడు. అతనే టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్. క్రికెట్‌పై ఉన్న అభిరుచి అతన్ని ఇంజనీర్ నుంచి క్రికెటర్‌గా మార్చింది. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన మాజీ లెఫ్టార్మ్ పేసర్, ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని జట్టు 2011 వన్డే వరల్డ్‌కప్ ఛాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. యువతకు రోల్ మోడల్, ఫాస్ట్ బౌలర్ 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో తనదైన ముద్ర వేశాడు. భారత అత్యుత్తమ బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకున్న ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్. ఇవాళ(అక్టోబర్ 8న) తన 44వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఇంజనీర్ నుంచి క్రికెటర్‌గా.. జహీర్ ఖాన్ క్రికెటర్ గా మారిన కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. జహీర్ 1978 అక్టోబర్ 8న మహారాష్ట్రలోని శ్రీరాంపూర్‌లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. మహారాష్ట్రలోని ఒక చిన్న పట్టణానికి చెందిన అతను టీమిండియాలో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకడు. తన ప్రారంభ విద్యను శ్రీరాంపూర్‌లోని హింద్ సేవా మండల్ న్యూ మరాఠీ ప్రాథమిక పాఠశాలలో.. ఆ తర్వాత కేజే సోమయ్య సెకండరీ పాఠశాలలో చదివాడు. తదనంతరం జహీర్ మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. జహీర్‌కు క్రికెట్‌పై ఉన్న మక్కువ చూసి అతని తండ్రి ఫాస్ట్ బౌలర్‌గా మారమని సలహా ఇచ్చాడు. ''దేశంలో చాలా మంది ఇంజనీర్లు ఉన్నారు.. నువ్వు ఫాస్ట్ బౌలర్‌గా తయారయ్యి టీమిండియాకు సేవలందించు అని జహీర్ తండ్రి పేర్కొన్నాడు. తండ్రి మాటలను ఆదర్శంగా తీసుకున్న జహీర్ తర్వాత వెనుదిరిగి చూడలేదు. జహీర్ 'జకాస్' అయ్యాడు.. జహీర్ ఖాన్‌ను క్రికెటర్‌గా తయారు చేయాలనే ఉద్దేశంతో అతని తండ్రి ముంబైకి తీసుకొచ్చాడు. ఇక్కడే జహీర్ ఖాన్ 'జాక్' పేరుతో క్రికెట్ కెరీర్ ప్రారంభించాడు. జింఖానా క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో జహీర్ ఏడు వికెట్లు తీసి వార్తల్లో నిలిచాడు. ఇక్కడే జహీర్ ఖాన్ MRF పేస్ ఫౌండేషన్‌కు చెందిన టీఏ శేఖర్ దృష్టిలో పడ్డాడు. తన వెంట జహీర్‌ను చెన్నైకి తీసుకెళ్లాడు. జహీర్ ఫస్ట్ క్లాస్, ఆపై అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టగలిగాడు. 2011 ప్రపంచ కప్ హీరోగా.. అలాగే, 28 ఏళ్ల తర్వాత భారత జట్టు వన్డే ప్రపంచకప్‌ను గెలవడానికి జహీర్ ఖాన్ కూడా ప్రధాన కారణం. 2011 ప్రపంచకప్‌లో టీమిండియాను ఛాంపియన్‌గా నిలబెట్టడంలో జహీర్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు. ఆ ప్రపంచకప్‌లో 21 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచకప్ చరిత్రలో జహీర్ పేరిట మొత్తం 44 వికెట్లు నమోదయ్యాయి. అంతర్జాతీయ క్రికెట్లో జహీర్ 610 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో 311 వికెట్లు..వన్డేల్లో 282 వికెట్లు పడగొట్టిన జహీర్ 17 టి20లు ఆడి 17 వికెట్లు తీశాడు. ✅ The second-highest wicket-taker in international cricket among Indian pace bowlers ✅ India's joint-highest wicket-taker in ODI World Cups#OnThisDay A happy 44th birthday to Zaheer Khan, the pace spearhead who starred in 🇮🇳's 2011 World Cup triumph 🥳 — ESPNcricinfo (@ESPNcricinfo) October 8, 2022 3⃣0⃣9⃣ international games 👍 6⃣1⃣0⃣ international wickets 👌 2⃣0⃣1⃣1⃣ World Cup-winner 🏆 Birthday wishes to the former #TeamIndia speedster @ImZaheer. 🎂 👏 pic.twitter.com/a2ta0LtgWg — BCCI (@BCCI) October 8, 2022 Celebrating Zaheer Khan's birthday 🎊 He was the joint-highest wicket-taker in the 2011 @cricketworldcup, picking up 21 in nine matches at 18.76 👏 WATCH his every wicket from the tournament 📽️ #BowlersMonth pic.twitter.com/Xifpd8UYna — ICC (@ICC) October 7, 2020 -
సూర్యకుమార్లో మనకు తెలియని రొమాంటిక్ యాంగిల్..
టీమిండియాలో సూర్యకుమార్ ప్రస్తుతం ఒక సంచలనం. లేటు వయసులో జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పటికి తనదైన ఆటతీరుతో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. సూర్యకుమార్ షాట్లు కచ్చితంగా ఉంటాయి. ఎంత కచ్చితంగా అంటే.. టైమింగ్‌తో అతను కొట్టే షాట్లు బౌండరీ లేదా సిక్సర్ వెళుతుంటాయి. రాబోయే టి20 ప్రపంచకప్‌లో టీమిండియాలో సూర్యకుమార్‌ది కీలకపాత్ర అని చెప్పడంలో సందేహం లేదు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతూ వెలుగులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఇవాళ(సెప్టెంబర్ 14) 32వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. సూర్య క్రికెట్ కెరీర్ గురించి ఎలాగూ అవగాహన ఉంటుంది. అందుకే సూర్య వ్యక్తిగత జీవితంతో పాటు అతనిలోని రొమాంటిక్ యాంగిల్ గురించి తెలుసుకుందాం. -సాక్షి, వెబ్‌డెస్క్ సూర్య కెరీర్లో ఎదగడానికి అతిపెద్ద కారణం తన భార్య దేవిషా శెట్టి అని ప్రతీసారి పేర్కొంటాడు. ఇక సూర్యకుమార్ లవ్ జర్నీ తన 20 ఏళ్ల వయసులోనే మొదలైంది. సూర్య కంటే దేవిషా మూడేళ్లు చిన్నది. 12వ తరగతి తర్వాత ముంబైలో సూర్య చదివిన కాలేజీలో దేవిషా కూడా అడ్మిషన్ తీసుకుంది. కాలేజ్ ఫంక్షన్లో తొలిసారిగా దేవిషా డ్యాన్స్‌ని చూసిన సూర్య ఆమెను ఇష్టపడ్డాడు. అప్పటికి దేవిషా వయసు 17 ఏళ్లు మాత్రమే. క్రమంగా వీరి స్నేహం ప్రేమగా మారింది. అప్పటికి సూర్య ఐపీఎల్లో తనదైన ముద్ర వేశాడు. ఐదేళ్ల తర్వాత పెద్దల సమక్షంలో 2016లో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి దేవిషా సూర్యకు అండగా నిలబడుతూ ప్రతీ విషయంలో అతన్ని ఉత్సాహపరుస్తూ వచ్చింది. తాను టీమిండియాలోకి రావడానికి దేవిషా కూడా కారణమని సూర్యకుమార్ కొంతకాలం క్రితం స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆట, ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెట్టడానికి వ్యక్తిగత జీవితంలోనూ ఒకరు తోడు ఉండాలని సూర్యకుమార్ కోరుకున్నాడు. అంతేకాదు సూర్యలో రొమాంటిక్ యాంగిల్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. అతని ఛాతీపై భార్య పేరు పచ్చబొట్టులా రాసిపెట్టుకున్నాడు. దేవిషా తనతో ఉన్నా..లేకున్నా.. చాతిపై తన పేరు చూసినప్పుడల్లా మనసుకు దగ్గరగా ఉంటుందన్నాడు. ఇక దేవిషా ఒక సామాజిక కార్యకర్త(Social Activist). 2013 నుంచి 2015 వరకు దేవిషా ఎన్జీవోలో పనిచేశారు. అంతేకాదు దేవిషా స్వంతంగా డ్యాన్స్ స్కూల్‌ను కూడా నడిపింది. ఇక తన భర్త సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా దేవిషా శెట్టి శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేసింది. ''20 ఏళ్ల కుర్రాడి నుంచి అనుభవజ్ఞుడైన, పరిణతి చెందిన వ్యక్తిగా ఎదగడం నేను చూశాను. నేను నిన్ను అప్పుడు ఎంత ప్రేమించానో.. ఇప్పటికీ అంతే ప్రేమిస్తున్నాను. నీ ప్రేమను పొందినందుకు చాలా కృతజ్ఞతలు. నువ్వే నా ప్రపంచం. కష్ట సమయాల్లో అండగా నిలబడ్డావు. నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను'' అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చింది. సూర్యకుమార్ క్రికెట్ కెరీర్ విశేషాలు, రికార్డులు ►మార్చి 14, 2021లో ఇంగ్లండ్‌తో టి20 మ్యాచ్ ద్వారా టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే ఆ సిరీస్‌లో సూర్యకుమార్‌కు నాలుగో మ్యాచ్ వరకు అవకాశం రాలేదు. ►ఆడిన తొలి మ్యాచ్‌లో తొలి బంతినే సూర్యకుమార్ బౌండరీగా మలిచాడు. టి20 క్రికెట్‌ను ఇలా బౌండరీతో మొదలుపెట్టిన తొలి క్రికెటర్ సూర్యకుమార్. ►జూలై 2021లో శ్రీలంకతో తొలి వన్డే ఆడిన సూర్యకుమార్ మెయిడెన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ►ఇక జూలై 2022లో ఇంగ్లండ్‌తో జరిగిన టి20 మ్యాచ్‌లో శతకం బాదిన సూర్యకుమార్. 55 బంతుల్లోనే 117 పరుగులు చేసిన సూర్యకుమార్‌కు అంతర్జాతీయ క్రికెట్లో ఇదే తొలి శతకం. ►టి20 క్రికెట్లో టీమిండియా తరపున సెంచరీ బాదిన ఐదో క్రికెటర్‌గా సూర్యకుమార్ నిలిచాడు. అంతేకాదు నాలుగు.. ఆ తర్వాత స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ బాదిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. ►సూర్యకుమార్ ఇప్పటివరకు టీమిండియా తరపున 13 వన్డేల్లో 340 పరుగులు, 28 టి20ల్లో 811 పరుగులు సాధించాడు View this post on Instagram A post shared by Devisha Suryakumar Yadav (@devishashetty_) -
'భౌతికంగా మాత్రమే దూరం'.. హ్యాపీ బర్త్‌డే
ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్.. లెజెండరీ షేన్ వార్న్ భౌతికంగా దూరమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో థాయ్‌లాండ్‌లోని తన విల్లాలో గుండెపోటుతో మరణించిన వార్న్ క్రీడాలోకాన్ని కంటతడి పెట్టించాడు. అతను భౌతికంగా లేకపోయినా..వార్న్ జ్ఞాపకాలు మాత్రం చిరకాలం మిగిలిపోనున్నాయి. కాగా ఇవాళ(సెప్టెంబర్ 13) దివంగత స్పిన్నర్ షేన్ వార్న్ పుట్టినరోజు. 53వ పుట్టినరోజు జరుపుకుంటున్న వార్న్‌కు ప్రత్యేక నివాళి. కాగా వార్న్ పుట్టినరోజు సందర్భంగా అతని ట్విటర్లో ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతని ట్విటర్ నుంచి వచ్చిన మెసేజ్ అందరిని ఆకట్టుకుంటుంది.'' భౌతికంగా దూరమైన మీరిచ్చిన వారసత్వం ముఖ్యమైన వాటిపై గొప్ప దృక్పథాన్ని అందిస్తుంది. ఒక వ్యక్తి జీవితం గొప్పతనాన్ని సూచిస్తుంది. జీవితంలో మీరేం సాధించారన్నది అక్కడి ప్రజలు, ప్రదేశాలపై స్పష్టమైన ప్రభావం చూపిస్తుంది. షేన్ వారసత్వం ఎన్నటికి బతికే ఉంటుంది.. హ్యాపీ బర్త్‌డే షేన్ వార్న్.. మీరెప్పుడు మా గుండెల్లో పదిలంగా ఉంటారు.'' అంటూ ట్వీట్ చేశారు. ఇక షేన్ వార్న్ 1992లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తన 15 ఏళ్ల కెరీర్లో వార్న్.. 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. సమకాలీన క్రికెట్లో వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా షేన్ వార్న్ నిలిచాడు. తొలి స్థానంలో లంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఉన్న సంగతి తెలిసిందే. A legacy gives you a perspective on what's important. It is about the richness of an individual's life, including what they accomplished and the impact they had on people and places. Shane’s Legacy will live on. Happy birthday - always in our hearts 🤍🤍🤍 pic.twitter.com/qL5NPIZnUk — Shane Warne (@ShaneWarne) September 12, 2022 చదవండి : FIFA-23 Ratings: మెస్సీ,చదవండి రొనాల్డోలకు ఊహించని షాక్.. నాకసలు ఈ జాబ్ అవసరమే లేదు.. కానీ ఇప్పుడు -
పుట్టినరోజున అదరగొట్టాడు.. నైంటీస్ ఫోబియా మాత్రం వదల్లేదు
టీమిండియా యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ ఇవాళ(గురువారం) 23వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఆసియాకప్‌లో ఆడుతున్న టీమిండియా జట్టుకు ఎంపిక కాని గిల్ కౌంటీల్లో ఆడుతూ బిజీగా ఉన్నాడు. కాగా పుట్టినరోజునాడే గిల్ తన డెబ్యూ కౌంటీ మ్యాచ్‌లో అదరగొట్టాడు. కౌంటి డివిజన్-1లో గ్లామోర్గాన్ తరపున ఆడుతున్న గిల్ వోర్సెస్టర్‌షైర్‌పై 92 పరుగులు సాధించాడు. అయితే 8 పరుగుల తేడాతో తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. కాగా గిల్‌కు నెర్వస్ నైంటీస్ ఫోబియా ఉంది. ఇటీవలి కాలంలో గిల్ 90ల్లో చాలాసార్లు ఔటయ్యాడు. ఈ మధ్య జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో గిల్ తొలిసారి నైంటీస్ ఫోబియాను అధిగమించి సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తాజాగా మాత్రం మరోసారి 90ల్లోనే ఔటయ్యి నిరాశపరిచాడు. కాగా గిల్ 148 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 92 పరుగులు చేయగా.. వికెట్ కీపర్ కూక్ 51 నాటౌట్, ఎడ్వార్డ్ బైరోమ్ 67 పరుగులు చేశాడు. ఈ ముగ్గురు మినహా మిగతవారు విఫలం కావడంతో గ్లామోర్గాన్ తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులకు ఆలౌటై ఫాలోఆన్‌లో పడింది. కాగా వోర్సెస్టర్షైర్ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 454 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. రోడ్రిక్ 172 పరుగులు నాటౌట్ అజేయ సెంచరీతో మెరవగా.. బర్నార్డ్ 75, జాక్ లీచ్ 87, ఎడ్ పొలాక్ 54 పరుగులు చేశారు. ఇక ఫాలోఆన్ ఆడుతున్న గ్లామోర్గాన్ వర్షంతో ఆట నిలిపివేసే సమయానికి వికెట్ నష్టపోకుండా ఐదు పరుగులు చేసింది. గ్లామోర్గాన్ ఇంకా 154 పరుగులు వెనుకబడి ఉంది. చదవండి: మ్యాచ్‌ను శాసించిన సిక్సర్ల కోసం బ్యాట్‌ను అప్పుగా.. ఆఫ్ఘన్ బౌలర్‌ను బ్యాట్‌తో కొట్టబోయిన పాక్ బ్యాటర్.. వైరల్ వీడియో -
వైరల్‌గా మారిన నిఖత్ జరీన్ చర్య.. ఏం జరిగింది?
భారత మహిళా బాక్సర్.. తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్ కామన్వెల్త్ గేమ్స్ 2022లో కనీస కాంస్య పతకం ఖాయం చేసుకుంది. మహిళల బాక్సింగ్ 50 కేజీల లైట్ ఫ్లైవెయిట్ విభాగంలో బుధవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్ బౌట్లో 5–0తో హెలెన్ జోన్స్ (వేల్స్)పై గెలిచి సెమీస్‌కు ప్రవేశించింది. ఈ క్రమంలో మ్యాచ్ గెలిచిన అనంతరం నిఖత్ జరీన్ చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. బుధవారం నిఖత్ జరీన్ తల్లి పర్వీన్ సుల్తానా పుట్టినరోజు. తల్లి పుట్టినరోజు నాడే క్వార్టర్స్ మ్యాచ్ గెలిచి కనీసం కాంస్య పతకం ఖరారు చేయడంతో నిఖత్ మొహం సంతోషంతో వెలిగిపోయింది. రింగ్ నుంచి కిందకు దిగగానే.. ''హ్యాపీ బర్త్‌డే అమ్మీ.. ఐ లవ్ యూ.. అల్లా నిన్ను సంతోషంగా ఉంచాలి'' అంటూ గట్టిగా అరిచింది. ఈ విజయాన్ని పర్వీనా సుల్తానాకు అంకితం చేసిన నిఖత్ జరీన్ తన తల్లిపై ఉన్న ప్రేమను ఈ విధంగా చూపించింది. ఇక నిఖత్ జరీన్‌తో పాటు మరో తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్(57 కేజీలు) కూడా సెమీస్‌లోకి ప్రవేశించాడు. వీరితో పాటు హరియాణా అమ్మాయి నీతూ (48 కేజీలు) క్వార్టర్ ఫైనల్స్‌లో నికోల్ క్లయిడ్ (నార్తర్న్ ఐర్లాండ్)ను ఓడించింది. అయితే కచ్చితంగా పతకం తెస్తుందని ఆశించిన లవ్లీనా బొర్హంగైన్ మాత్రం నిరాశపరిచింది. మిడిల్ వెయిట్ క్వార్టర్ఫైనల్లో వేల్స్‌కు చెందిన రోసీ ఎక్లెస్ చేతిలో 3-2తో ఓడిపోయింది. మరో బాక్సర్ ఆశిష్ కుమార్(80 కేజీలు) ఇంగ్లండ్‌కు చెందిన ఆరోన్ బోవెన్ చేతిలో 4-1తో ఓడి క్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. The beautiful thing by @nikhat_zareen after winning QF.. "Happy Birthday ammi, Allah aapko khush rakhe" ❤️😍 #B2022 #boxing #NikhatZareen #CommonwealthGames2022 #CWG2022 #TeamIndia @WeAreTeamIndia @Media_SAI pic.twitter.com/lqp4fVkhoX — Sagar 🕊️ (@imperfect_ocean) August 3, 2022 చదవండి: CWG 2022: హైజంప్‌లో భారత్‌కు కాంస్యం.. తొలి అథ్లెట్‌గా రికార్డు Suryakumar Yadav: 'సూర్యుడి'లా వెలిగిపోతున్నాడు.. ఆపడం కష్టమే -
హ్యాపీ బర్త్‌డే: పార్టీ సాంగ్ వచ్చేసింది!
లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం "హ్యాపీ బర్త్ డే". ఈ సినిమాలో నరేష్ ఆగస్త్య, సత్య, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు నిర్మించారు. జూలై 8న ప్రపంచవ్యాప్తంగా "హ్యాపీ బర్త్ డే" సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రతి కంటెంట్, రివీల్ చేసిన ప్రతి క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్గా ఉంటూ ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల దర్శకుడు రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేసిన ట్రైలర్‌కు సైతం మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓన్లీ లీగల్ పార్టీ సాంగ్ ఆఫ్ ద ఇయర్ అంటూ జోష్ ఫుల్ పాటను విడుదల చేశారు. ఈ పాటకు కాళభైరవ క్యాచీ ట్యూన్ ఇవ్వగా, దామినీ భట్ల పాడారు. కిట్టూ విస్సాప్రగడ సాహిత్యాన్ని అందించారు. ఈ పాటకు లావణ్య త్రిపాఠీ డాన్స్ స్టెప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చదవండి: పిల్లల్ని కనడం గురించి సద్గురును అడిగిన ఉపాసన, ఆయన సమాధానమేంటంటే? హీరో విశాల్‌కు గాయాలు.. నిలిచిపోయిన సినిమా షూటింగ్ -
అందుకే ‘హ్యాపీ బర్త్‌డే’ అని టైటిల్ పెట్టాం: రితేష్ రానా
‘ప్రస్తుతం మన సమాజంలో గన్స్ లీగల్ కాదు. అందరి దగ్గర గన్స్ ఉండటం కష్టం. అందుకే ఒక ఫేక్ వరల్డ్ క్రియేట్ చేద్దామనే ఆలోచన వచ్చింది. సర్రియల్ కామెడీ జోనర్లో ‘హ్యాపీ బర్త్‌డే’ మూవీ ఉంటుంది. కథ మొత్తం లాజికల్‌గానే ఉంటుంది. కానీ కథ జరిగే ప్రపంచం మాత్రం ఊహాజనితంగా ఉంటుంది’ అని దర్శకుడు రితేష్ రానా అన్నారు. మత్తువదలరా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’. స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించారు. క్లాప్ ఎంటర్ టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి(చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ చిత్రం జులై 8న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా రితేష్ రానా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ట్రైలర్ చూసిన చాలా మందికి అర్ధం కాలేదనే మాట వినిపిస్తుంది ? ఆసక్తికరంగా ఉండాలి కథ అర్ధం కాకూడదనే ఉద్దేశంతోనే ట్రైలర్ కట్ చేశాం. ఈ కథ ఎలాంటి ప్రపంచంలో జరుగుతుందనేది చెప్పి, పాత్రలని పరిచయం చేశాం. కథ ఏమిటనేది సినిమా చూస్తే అర్ధమౌతుంది. 'మత్తువదలరా' టెక్నికల్ టీమ్ నే ‘హ్యాపీ బర్త్ డే’లో కొనసాగించడానికి కారణం ? టెక్నికల్ టీమ్ అంతా పదేళ్ళుగా ప్రయాణిస్తున్నాం. అదే టీమ ఉంటే ఒక సౌకర్యం ఉంటుంది. ఒకరిని ఒకరం అర్ధం చేసుకుంటాం. టీమ్‌లో మంచి సింక్ ఉన్నపుడు బెస్ట్ అవుట్ పుట్ వస్తుందని నమ్ముతాను. ఇలాంటి సినిమాలు ఇది వరకు వచ్చాయా ? ఏదైనా ప్రేరణ ఉందా ? ఇలాంటి జోనర్ సినిమా రాలేదు. స్క్రీన్ ప్లే మాత్రం నాన్ లీనియర్ గా చేశాం. క్వెంటిన్ టరాన్టినో 'ఫుల్ప్ ఫిక్షన్' తరహాలో స్క్రీన్ ప్లే వుంటుంది. కథ చాప్టర్ వైజ్ వెళుతుంటుంది. 'మత్తువదలరా'లో చేసిన నరేష్, సత్య, వెన్నెల కిషోర్ .. హ్యాపీ బర్త్ డే లో తీసుకోవడానికి కారణం ? మా అందరి మధ్య మంచి సింక్ కుదిరింది. అలాగే ఈ పాత్రలకు వారే యాప్ట్. గన్స్ మీద కథ చేశారు కదా .. ఎన్ని రకాల గన్స్ వాడారు ? దాదాపు అన్ని రకాల గన్స్ వాడాం. సెల్ ఫోన్స్ ఎలా అయితే కలర్స్ లో దొరుకుతున్నాయో అలా కలర్ ఫుల్ గా గన్స్ ఉండాలనే ఆలోచన తో డిఫరెంట్ కలర్స్ లో గన్స్ తయారు చేశాం. రెంట్ లో వచ్చే గన్స్ అన్నీ దాదాపుగా వాడేశాం. ట్రైలర్ లో రాజశేఖర్ పోస్టర్ చూపించడానికి కారణం ? రాజశేఖర్ గారి సినిమా పేరు ఆయుధం. సినిమాలో రైతు బజార్ లా గన్ బజార్ ని మినిస్టర్ పెడతారు. గల్లీగల్లీకి గన్ బజార్ ఉంటుంది. ఆయుధం సేల్ అని కొంచెం ఫన్నీగా ఉండేలా పెట్టాం. లావణ్య త్రిపాఠి ని ఎంపిక చేయడానికి కారణం ? లావణ్య త్రిపాఠి ఇప్పటివరకు ఇలాంటి సినిమా చేయలేదు. ఆమె బయట చాలా జోవియల్ గా ఉంటారు. ఒక టీవీ షో లో తనని చూసి ఈ క్యారెక్టర్ రాశాను. ఈ పాత్ర ఆమెకు కొత్తగా ఉండటంతో పాటు సరిగ్గా నప్పింది. ఈ కథని లావణ్య త్రిపాఠి లీడ్ చేస్తారు.మిగతా పాత్రలన్నీ ముఖ్యమే. ఇలాంటి కథలు ఓటీటీకి బావుంటాయా ? థియేటర్ కా ? థియేటర్ ఎక్సపిరియన్స్ కి బాగుంటాయి. ఈ సినిమా థియేటర్ కోసమే తీశాం. 300 వందల మంది కలసి నవ్వుకోవడంలో ఓ కిక్ వుంటుంది. తర్వాత ఓటీటీలో కూడా వర్క్ అవుతుంది. మత్తువదలరా లో ఒక కొత్త తరహా కామెడీ చూపించారు ? ఇందులో ఎలాంటి కొత్తదనం ఉంటుంది ? హ్యాపీ బర్త్ డే చాప్టర్ వైజ్ ఉంటుంది. కామెడీలో ఉన్న జోనర్స్ అన్నీ ఒకొక్క చాప్టర్ లో టచ్ చేశాం. ఏడు చాప్టర్లు ఉంటే.. విజువల్ కామెడీ, వ్యంగ్యం, పేరడీ, ఇలా ఒకొక్క చాప్టర్ లో ఒక్కో తరహా కామెడీ ప్రయత్నించాం. మ్యూజిక్ కి ఎంత ప్రాధాన్యత ఉంది ? చాలా ప్రాధన్యత ఉంది. సినిమా చాలా క్రేజీ గా తీశాం. మ్యూజిక్ డబుల్ క్రేజీ గా ఇచ్చారు కాల భైరవ. పాన్ తెలుగు సినిమా అన్నారు కదా ? పాన్ ఇండియా పై సెటైరా ? సెటైర్ కాదండీ. ప్రమోషన్స్ లో సరదాగా నవ్వుకోవడానికి అలా పెట్టాం. సినిమా ప్రపంచ వ్యాప్తంగా తెలుగులో రిలీజ్ అవుతుందని చెప్పడానికి అలా సరదాగా పాన్ తెలుగు సినిమా అన్నాం. కామెడీ అన్ని చోట్ల వర్క్ అవుట్ అవుతుంది కదా .. మిగతా భాషల్లో ఎందుకు ప్రయత్నించలేదు.? కొన్ని నటులని బట్టి ఉంటుంది. సత్య, వెన్నెల కిషోర్ మనకి బాగా తెలిసిన నటులు. హిందీలో ఎలా ఉంటుందో తెలీదు. తెలుగు అనుకునే ఈ సినిమా చేశాను. చాలా పాత్రలు ఉన్నపుడు కన్ఫ్యూజన్ ఉంటుంది కదా .. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేశారు ? ఎక్కువ పాత్రలు ఉన్నపుడు కాస్త కన్ఫ్యూజన్ వచ్చే మాట వాస్తవమే. స్క్రీన్ ప్లే నాన్ లీనియర్ గా ఉండటంలో కూడా ఇది వస్తుంది. అయితే సినిమా చూసినప్పుడు మాత్రం ఎలాంటి కన్ఫ్యూజన్ వుండదు. ఇది చాలా టిపికల్ స్క్రీన్ ప్లే. ఇందులో చాలా పాత్రలు ఉన్నాయి కదా ఎవరు ఎక్కువగా హైలెట్ అవుతారని భావిస్తున్నారు ? అందరూ హైలెట్ అవుతారు. అందరికీ సమాన ప్రాధన్యత ఉంటుంది. అయితే లావణ్యని ఇప్పటివరకూ ఇలాంటి పాత్రలలో చూడలేదు కాబట్టి ఆమె పాత్ర ఎక్కువగా ఆకట్టుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నా. ఆమెకు మంచి ప్రశంసలు దక్కుతాయని అనుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే టైటిల్ గురించి ? ఇందులో లావణ్య గారి పేరు హ్యాపీ. ఆమె బర్త్ డే రోజు కథలో కీలక అంశాలు జరుగుతాయి కాబట్టి హ్యాపీ బర్త్ డే అని పెట్టాం. డిఫరెంట్ జోనర్స్ ఎంచుకోవడానికి కారణం ? మత్తువదలరా లిమిటెడ్ బడ్జెట్ లో చేసి ఒక ఎంట్రీ కార్డ్ గా నన్ను నేను నిరూపించుకోవడానికి చేశా. ఇది విజయం సాధించింది. నాకు ఎప్పుడూ కొత్తగా రాయాలనే ఉంటుంది. హ్యాపీ బర్త్ డే కూడా డిఫరెంట్ కథ. నిర్మాతలకు చాలా నచ్చింది. ప్రయోగాత్మక చిత్రాలు చేస్తారా ? కమర్షియల్ సినిమాలు చేసే ఆలోచన ఉందా ? హ్యాపీ బర్త్ డే కూడా కమర్షియల్ సినిమానే. గన్స్ ఫైట్స్ పాటలు అన్నీ ఉన్నాయి( నవ్వుతూ). అయితే ఒక ఫార్ములా కాకుండా కొంచెం వైవిధ్యమైన ప్రజంటేషన్ ఉంటుంది. మత్తువదలరా విజయం తర్వాత చాలా అవకాశాలు వచ్చుంటాయి కదా.. మళ్ళీ మైత్రీ మూవీ మేకర్స్ తోనే చేయడానికి కారణం ? మైత్రీ మూవీ మేకర్స్ తో పని చేయడం చాలా సౌకర్యంగా వుంటుంది. నా స్టయిల్ వాళ్లకి తెలుసు. సినిమాపై మంచి ప్యాషన్ వున్న నిర్మాతలు. కొత్త సినిమాలు గురించి ? రెండు కథలు లాక్ అయ్యాయి. ఇవి కూడా చాలా కొత్తగా ఉంటాయి. ఏది ముందు సెట్స్ పైకి తీసుకెళ్ళాలో ఇంకా డిసైడ్ కాలేదు. -
లావణ్యా త్రిపాఠి ‘హ్యాపీ బర్త్ డే’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
అలాంటి సినిమాలను ప్రేక్షకులు వదులుకోరు: రాజమౌళి
‘‘ఈ మధ్య ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడంలేదు అంటున్నారు. కానీ నా అభిప్రాయం ప్రకారం యూనిట్ మనసు పెట్టి కష్టపడి చేసిన ఏ సినిమాని కూడా ప్రేక్షకులు వదులుకోరు.. అలా కష్టపడాలని సూచిస్తున్నాను. ‘హ్యాపీ బర్త్ డే’ చిత్రానికి ఆ ప్రయత్నం జరిగిందని ఆశిస్తున్నాను’’ అని డైరెక్టర్ రాజమౌళి అన్నారు. లావణ్యా త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘హ్యాపీ బర్త్ డే. ‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వం వహించారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా జూలై 8న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని రాజమౌళి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘హ్యాపీ బర్త్‌డే’ ట్రైలర్ బ్లాక్‌బస్టర్‌గా ఉంది. కామెడీ, థ్రిల్లర్.. రెండింటినీ కలిపి చేయడం కష్టం. కానీ, రితేష్ వాటిని బాగా తీశాడని తెలుస్తోంది’’ అన్నారు. ‘‘మత్తు వదలరా’ కంటే ‘హ్యాపీ బర్త్‌డే’లో డబుల్ ఫన్, డబుల్ యాక్షన్, డబుల్ థ్రిల్ ఉంటుంది’’ అన్నారు రితేష్ రానా. ‘‘ఇందులో నా పాత్ర కొత్తగా ఉంటుంది’’ అన్నారు లావణ్యా త్రిపాఠి. ‘‘జాతి రత్నాలు’ని కుటుంబంతో కలిసి ఎలా ఎంజాయ్ చేశారో మా ‘హ్యాపీ బర్త్‌డే’ని కూడా అలాగే ఆస్వాదిస్తారు’’ అన్నారు వై. రవిశంకర్. -
రాజమౌళి చేతుల మీదుగా ‘హ్యాపీ బర్త్‌డే’ ట్రైలర్
హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘హ్యాపీ బర్త్ డే’. ఈ మూవీకి ‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వం వహించారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ వై. సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించారు. ఈ చిత్రం విడుదల జులై 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా హ్యాపీ బర్త్‌డే ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. దర్శకు ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా బుధవారం ట్రైలర్ లాంచ్ అయ్యింది. కాగా థ్రిల్లింగ్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. సరికొత్త పాత్రలు, విభిన్న కథా నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం తూపాకీల చూట్టు తిరగనుందని తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. -
చిన్న వయసులోనే వింత రోగం.. ఫుట్‌బాల్ ఆడొద్దన్నారు; కట్‌చేస్తే
ప్రస్తుత ఫుట్‌బాల్ అనగానే గుర్తుకువచ్చేది ఇద్దరు. ఒకరు అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ.. పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో. సమకాలీనంలో ఈ ఇద్దరు ఎవరికి వారే గొప్ప ఆటగాళ్లు. ఇద్దరిలో ఎవరు గ్రేటెస్ట్ ఆల్ ఆఫ్ టైమ్(GOAT) అని అడిగితే మాత్రం చెప్పడం కాస్త కష్టమే. ఎందుకంటే మెస్సీకి ఎంత అభిమాన గణం ఉంటుందో.. అంతే అభిమానం రొనాల్డోకు ఉంటుంది. ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయం పక్కనబెడితే.. ఇవాళ అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ 35వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. మెస్సీ సాధించిన రికార్డులు.. ట్రోపీలు.. రివార్డులు లెక్కలేనన్ని. వాటి గురించి ఇది వరకు చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. మరి మెస్సీ గురించి మనకు తెలియని ఒక ఐదు ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. మెస్సీ ఆడిన తొలి ఫుట్‌బాల్ క్లబ్.. మెస్సీని ఆరాధించే ఏ అభిమాని అయినా సరే అతను ఆడిన తొలి ఫుట్‌బాల్ క్లబ్ న్యూవెల్స్ ఓల్డ్ బాయ్స్(ఎన్‌వోబీ) క్లబ్ అని ఇట్టే చెబుతారు. కానీ మెస్సీ ఆడిన తొలి ఫుట్‌బాల్ క్లబ్ అది కాదు. ఎందుకంటే ఏ ఆటగాడైనా సరే.. అందరూ ఆరాధించే స్థాయికి చేరుకున్నాడంటే మొదటి భీజం గట్టిగా ఉండాలి. ఆ విషయంలో మెస్సీ సరైన అడుగు వేశాడు. ఐదేళ్ల వయసులోనే ఫుట్‌బాల్‌పై మమకారం పెంచుకున్న మెస్సీ ఆడిన తొలి ఫుట్‌బాల్ క్లబ్ ఏంటో తెలుసా.. గ్రండోలీ క్లబ్. అర్జెంటీనాలో ఉన్న ఈ చిన్న ఫుట్‌బాల్ క్లబ్‌ను నడిపింది స్వయంగా మెస్సీ తండ్రినే కావడం విశేషం. అలా చిన్న వయసులోనే మెస్సీ ఇంట్లో నుంచే మంచి ప్రోత్సాహం లభించింది. 1992-95 వరకు తండ్రి క్లబ్‌కే ఆడిన మెస్సీ ఆ తర్వాత న్యువెల్స్ ఓల్డ్ బాయ్స్(ఎన్‌వోబీ) క్లబ్‌కు మారి పూర్తి స్థాయి ఫుట్‌బాలర్‌గా కెరీర్‌ను ఆరంభించాడు. అంతుపట్టని రోగం.. బార్సిలోనా అండగా మెస్సీకి 11 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు.. గ్రోత్ హార్మోన్ లోపం (GHD) ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో మెస్సీ జీవితంలో ఫుట్‌బాల్ ఆటగాడు కాలేడని వైద్యులు ప్రకటించారు. అయితే మెస్సీకి చికిత్స చేయించేందుకు అప్పట్లోనే నెలకు 900 డాలర్లు ఖర్చు అయ్యేది. మెస్సీ కుటుంబానికి ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే కావడంతో మెస్సీ చికిత్సకు కష్టంగా మారింది. దీంతో మెస్సీ తండ్రితో ఉన్న అనుబంధం కారణంగా బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్ రంగంలోకి దిగింది. మెస్సీ కుటుంబానికి అండగా నిలబడిన బార్సిలోనా మెస్సీతో పాటు కుటుంబాన్ని మొత్తం స్పెయిన్‌కు తరలించి మెస్సీకి చికిత్స చేయించడం విశేషం. అలా 11 ఏళ్ల వయసులోనే మెస్సీ బార్సిలోనాకు రుణపడిపోయాడు. ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు బార్సిలోనా క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. పేపర్ నాప్కిన్పై తొలి ఒప్పంద సంతకం 2000 సంవత్సరంలో గ్రోత్ హార్మోన్ లోపం(GHD) చికిత్స కోసం మెస్సీని బార్సిలోనా క్లబ్ తమ వెంట తీసుకెళ్లింది. అంతేగాక మెస్సీని క్లబ్‌లోకి తీసుకుంటున్నట్లు చెప్పినప్పటికి ఎలాంటి అధికారిక కాంట్రాక్టును అందజేయలేదు. అయితే అప్పటికే బార్సిలోనా స్కౌట్ కార్లెస్ రెక్సాచ్ ఆటగాళ్ల శిక్షణ కోసం అర్జెంటీనాలో రొసారియోలో ఉన్నారు. అక్కడే తొలిసారి మెస్సీని చూసిన కార్లెస్ అతని నైపుణ్యానికి ఫిదా అయ్యాడు. బార్సిలోనాతో ఎలాంటి కాంట్రాక్ట్ లేదని తెలియడంతో వెంటనే ఒక కాగితంపై ఒప్పంద పత్రాన్ని రాసి అందించాడు. దీనిని సంతోషంగా అంగీకరించిన మెస్సీ అతని కుటుంబంతో స్పెయిన్‌కు వెళ్లే ముందు ఒప్పంద పత్రంపై సంతకం చేశాడు. ఇది అప్పట్లో వివాదానికి దారి తీసినప్పటికి కొన్నిరోజుల్లోనే బార్సిలోనా మెస్సీతో అధికారిక ఒప్పందం చేసుకుంది. మెస్సీ కొట్టిన తొలి హ్యాట్రిక్ మెస్సీ ఇన్నేళ్ల కెరీర్లో ఎన్నోసార్లు హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేశాడు. మరి మెస్సీ మొదటిసారి హ్యాట్రిక్ గోల్ నమోదు చేసింది ఎప్పుడో తెలుసా.? 19 ఏళ్ల వయసులో ఎల్ క్లాసియో తరపున రియల్ మాడ్రిడ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ మూడు గోల్స్‌తో మెరిశాడు. మెస్సీ కొట్టిన హ్యాట్రిక్ గోల్స్‌తో మ్యాచ్ 3-3తో డ్రాగా ముగియడం విశేషం. విచిత్రమైన డెబ్యూ.. ఏ ఆటగాడైనా తన అరంగేట్రంలో అదరగొట్టాలని భావించడం సహజం. కానీ మెస్సీ విషయంలో కాస్త భిన్నం. 2005లో అర్జెంటీనా తరపున హంగేరీతో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేశాడు. అది కూడా ఒక సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా. అయితే తొలి మ్యాచ్‌లోనే మెస్సీకి వింత అనుభవం ఎదురైంది. హంగేరీ ఆటగాడు మెస్సీ జెర్సీని పట్టుకొని లాగడంతో .. మెస్సీ మోచేతి సదరు ఆటగాడికి బలంగా తాకింది. దీంతో రిఫరీ మెస్సీకి రెడ్‌కార్డ్ చూపించాడు. కేవలం 47 సెకన్ల పాటు మాత్రమే గ్రౌండ్లో ఉన్న మెస్సీ అనూహ్య రీతిలో మైదానం వీడాల్సి వచ్చింది. G⚽AL OF THE DAY 🎂 Happy birthday, Leo pic.twitter.com/yYLeTjw3Va — FC Barcelona (@FCBarcelona) June 24, 2022 -
లావణ్య త్రిపాఠి హ్యాపీ బర్త్‌డే నుంచి న్యూలుక్ అవుట్
లావణ్యా త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘హ్యాపీ బర్త్ డే’. రితేష్ రానా దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు నిర్మించిన చిత్రం ఇది. జూలై 15న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో హ్యాపీ 340 అనే పాత్రలో లావణ్యా త్రిపాఠి కనిపిస్తారని చిత్రయూనిట్ వెల్లడించి, కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ‘‘లావణ్య పాత్ర ఎవరూ ఊహించని విధంగా ట్విస్టులతో, వినోదాత్మకంగా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం కాలభైరవ అందిస్తున్నారు. The most happening beauty @Itslavanya as the 'Happy' of the #HappyBirthday party 😍 In Cinemas from July 15th 💥💥 - https://t.co/f4LAy5Du5P#HBDMovie #HBDMovieOnJuly15 @RiteshRana @vennelakishore @nareshagastya #Satya @eyrahul @kaalabhairava7 @sureshsarangam @ClapEntrtmnt pic.twitter.com/bOrvTVgoEh — Mythri Movie Makers (@MythriOfficial) June 21, 2022 -
'కిల్లర్' మిల్లర్ అనగానే ఆ ఎపిక్ ఎంట్రీ గుర్తుకురావడం ఖాయం
సౌతాఫ్రికా విధ్వంసకర ఆటగాడు డేవిడ్ మిల్లర్ ఇవాళ(జూన్ 10న) 33వ పుట్టిరోజు జరుపుకుంటున్నాడు. కిల్లర్ మిల్లర్‌గా గుర్తింపు పొందిన ఈ విధ్వంసకర బ్యాటర్ లేటు వయసులో అదరగొడుతున్నాడు. అయితే మిల్లర్ అనగానే గుర్తుకువచ్చేది 2015 వన్డే వరల్డ్‌కప్‌లో అతనిచ్చిన ఎపిక్ ఎంట్రీ అభిమానుల కళ్ల ముందు కదలాడుతుంది. ఆ వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఒక మ్యాచ్‌లో బ్యాటింగ్ రావడానికి సిద్ధమైన మిల్లర్ స్ట్రెయిట్‌గా కాకుండా బౌండీరీ లైన్‌పై నుంచి డైవ్ చేస్తూ గ్రౌండ్లోకి అడుగుపెట్టడం ఆసక్తి కలిగించింది. దీనికి సంబంధించిన ఫోటో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మిల్లర్‌ను డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్‌తో పోలుస్తూ.. మిల్లర్‌లో ఈరోజు క్రికెటర్ కాకుండా రెజ్లింగ్ స్టార్ కనిపిస్తున్నాడు అంటూ కామెంట్స్ చేశారు. అయితే మిల్లర్ ఇలా ఎందుకు చేశాడా అన్నది తెలియనప్పటికి.. బహుశా తొందరగా గ్రౌండ్లో అడుగుపెట్టాలనే ఉద్దేశంతో ఇలా చేసి ఉంటాడని క్రికెట్ కామెంటేటర్స్ సహా అభిమానులు అప్పట్లో చెవులు కొరుక్కున్నారు. ఇప్పటికి మిల్లర్ అనగానే టక్కున గుర్తుకువచ్చేది ఆ ఎపిక్ ఎంట్రీనే. ఇక మిల్లర్ అంతర్జాతీయ క్రికెట్లో చాలాకాలం క్రితమే(2010లో) ఎంట్రీ ఇచ్చినప్పటికి మొదట్లో అవకాశాలు ఎక్కువగా రాలేదు. దానికి కారణం లేకపోలేదు. మిల్లర్ జట్టులోకి వచ్చే సమయానికి దక్షిణాఫ్రికాలో చాలా మంది సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన అతను వెలుగులోకి రావడానికి ఐదేళ్లు పట్టింది. అది 2015 వన్డే వరల్డ్ కప్. ఆ వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా సెమీఫైనల్‌కు చేరడంలో మిల్లర్ పాత్ర చాలా కీలకమనే చెప్పొచ్చు. ఆ వరల్డ్‌కప్‌లో మిల్లర్ 324 పరుగులు సాధించాడు. కాగా 2015 ప్రపంచకప్‌లో ఒక మ్యాచ్‌లో మిల్లర్, జేపీ డుమినితో కలిసి ఐదో వికెట్‌కు 256 పరుగులు జోడించాడు. వన్డే చరిత్రలో ఐదో వికెట్‌కు అత్యధిక పరుగులు జోడించిన జంటగా మిల్లర్, డుమినీ పేరిట ఉన్న రికార్డు ఇప్పటికి చెక్కు చెదరలేదు. ఆ తర్వాత రెగ్యులర్ సభ్యుడిగా ప్రమోషన్ పొందిన మిల్లర్ ప్రస్తుతం సౌతాఫ్రికా బ్యాటింగ్‌లో కీలక ఆటగాడిగా మారాడు. ఇక గురువారం రాత్రి టీమిండియాతో జరిగిన టి20 మ్యాచ్‌లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. భారీ లక్ష్యం కళ్ల ముందు కనబడుతున్నా.. ఏ మాత్రం బెదరకుండా డుసెన్‌తో కలిసి జట్టును గెలిపించాడు. అంతకముందు ఐపీఎల్ 2022 సీజన్లో గుజరాత్ టైటాన్స్ కప్ గెలవడంలోనూ మిల్లర్‌ది కీలకపాత్రే. 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మిల్లర్ సౌతాఫ్రికా తరపున 143 వన్డేల్లో 3503 పరుగులు, 96 టి20ల్లో 1850 పరుగులు సాధించాడు. చదవండి: ఐపీఎల్లో దుమ్ము లేపాడు.. ఇక్కడా అదరగొట్టాడు! మొత్తంగా 235 క్యాచ్‌లు! -
లావణ్య త్రిపాఠీ 'హ్యాపీ బర్త్‌డే'.. ఇంటింటికీ గన్ను, ఎదురు లేని ఫన్ను..
'అందాల రాక్షసి' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది బ్యూటిఫుల్ లావణ్య త్రిపాఠీ. గతేడాది 'చావు కబురు చల్లగా' సినిమాతో అలరించిన లావణ్య ప్రస్తుతం 'హ్యాపీ బర్త్‌డే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మత్తు వదలరా ఫేమ్ రితేష్ రాణా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ బ్లాక్ కామెడీ థ్రిల్లర్‌గా అలరించనుంది. ఇందులో నరేశ్ అగస్త్య హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. టీజర్ ఆద్యంతం ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా ఉంది. ఇంటింటికి గన్ను.. ఎదురులేని ఫన్ను.. వంటి పలు డైలాగ్‌లు నవ్వు తెప్పించేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మూవీ జూలై 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై చెర్రీ, హేమలత పెదమల్లు సంయుక్తంగా నిర్మించారు. చదవండి: నయనతారతో పెళ్లిపై స్పందించిన విఘ్నేష్ శివన్.. ఒక్క ఏడాదిలో ఏకంగా 20 సినిమాలు ఒప్పుకున్న స్టార్ హీరో ! -
ఫుట్‌బాలర్ కావాల్సిన వ్యక్తి.. క్లేకోర్టు రారాజు ఎలా అయ్యాడు
టెన్నిస్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు.. ఆటలో అతనికి ఎదురులేదు.. కోర్టులో అతను బరిలోకి దిగాడంటే ప్రత్యర్థులకు హడల్.. అందరూ అతన్ని క్లేకోర్టు రారాజుగా అభివర్ణిస్తారు. టెన్నిస్ ఓపెన్ శకం మొదలైన తర్వాత అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు కొల్లగొట్టిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ సాధించిన ఆల్‌టైమ్ గ్రేట్ జాబితా తీస్తే అందులోనూ అగ్రస్థానం అతనిదే. తన తరంలోనే పుట్టిన మరో ఇద్దరు గ్రెటేస్ట్ ఆటగాళ్లను దాటి మరీ.. మరో గ్రాండ్‌స్లామ్ దక్కించుకోవడం కోసం పరుగులు తీస్తున్నాడు. ఈ పాటికే మీకు అర్థమయి ఉంటుంది ఆ వ్యక్తి ఎవరో.. ది గ్రేట్ రాఫెల్ నాదల్. నాదల్ ఇవాళ 36వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఫుట్‌బాలర్ కావాల్సిన వ్యక్తి ఈరోజు టెన్నిస్ ప్రపంచాన్ని రారాజులా ఏలుతున్నాడు. హ్యాపీ బర్త్‌డే నాదల్.. పవర్‌గేమ్‌కు పెట్టింది పేరు రాఫెల్ నాదల్. ఫుట్‌బాలర్ కావాల్సిన నాదల్ తన అంకుల్ ప్రోత్సాహంతో రాకెట్ చేతబట్టాడు.. టెన్నిస్ ప్రపంచాన్ని శాసిస్తున్నాడు. స్పెయిన్‌లోని మానకోర్లో అనా మారియా, సెబాస్టియన్ నాదల్ దంపతులకు 1986 జూన్ 3న రాఫెల్ నాదల్ జన్మించాడు. నాదల్ బాబాయిలు ఇద్దరు(మిగ్యూల్ నాదల్, టోనీ నాదల్) ఫుట్‌బాల్ ఆటలో పేరు సంపాదించారు. తొలుత నాదల్‌ను కూడా ఫుట్‌బాలర్‌గానే చూడాలనుకున్నారు. కానీ నాదల్ చిన్న బాబాయి టోనీ నాదల్‌ను మూడేళ్ల వయసులోనే ప్రతిభను గుర్తించాడు. తమలా ఫుట్‌బాలర్ కాకుండా టెన్నిస్ బ్యాట్ చేతపడితే ఎలా ఉంటుందని ఆలోచించాడు. టోనీ నాదల్.. క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉండేవాడు. నాదల్ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా బాబాయితోనే గడిపేవాడు. ప్రతీరోజు ఎర్రమట్టిలో గంటల తరబడి నాదల్ చేత ప్రాక్టీస్ చేయించేవాడు. అతని కోసం ఎర్రమట్టిని అత్యంత కఠిన పరిస్థితులను సృష్టించి మరీ నాదల్కు శిక్షణ ఇచ్చేవాడు. నాదల్ ఆ శిక్షణ తట్టుకోలేక ఒక సందర్భంలో తన తల్లికి ఫిర్యాదు చేశాడు. కానీ బాబాయి టోనీ మాత్రం నాదల్‌ను టెన్నిస్ రారాజులా చూడాలనుకుంటున్నానని నాదల్ తల్లికి ముందే చెప్పాడు. ఆమె కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. చిన్ననాటి నుంచే ఎర్రమట్టిలో కఠోర సాధన చేశాడు గనుకనే నాదల్ ఇవాళ క్లేకోర్టుకు రారాజు అయ్యాడు. ఒక రకంగా నాదల్ టెన్నిస్ కెరీర్‌కు బీజం పడింది ఇక్కడే. బాబాయి కఠిన శిక్షణలో అండర్-12 టైటిల్ సాధించేశాడు. ఆ తర్వాత 14 ఏళ్లకే స్పానిష్ జూనియర్ సర్క్యూట్లో రఫాకు మంచి పేరు వచ్చింది. ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో అప్పటికే టెన్నిస్‌లో టాప్ ఆటగాడిగా ఉన్న కార్లోస్ మోయాను ఓడించి సంచలనం సృష్టించాడు రాఫెల్ నాదల్. అప్పటికి నాదల్ వయస్సు 14 ఏళ్లే. ఈ సంచలనం అక్కడితో ఆగలేదు. 2001లో ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారుడిగా నాదల్ కెరీర్‌ను ఆరంభించాడు. ఆ మరుసటి ఏడాది జరిగిన వింబుల్డన్‌లో సెమీఫైనల్ చేరి అందరి దృష్టిని ఆకర్షించాడు. 18 ఏళ్ల వయసులో డేవిస్ కప్‌లో అప్పటి వరల్డ్ నెంబర్-2 ఆండ్రీ అగస్సీని ఓడించి ఔరా అనిపించాడు. అక్కడి నుంచి నాదల్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. తన ఆటను మాత్రం అంతే పట్టుదలతో కొసాగించాడు.. కొనసాగిస్తున్నాడు. ఇక తన కాలంలోనే మరో టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్‌కు ధీటుగా మారాడు. 2005 నుంచి రోజర్ ఫెదరర్‌కు ప్రధాన ప్రత్యర్థిగా మారిన నాదల్ 2006 నుంచి 2009లోపూ ఐదు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో ఓడించి సంచలనం సృష్టించాడు. ఆటను ఎంత ప్రేమించాడో.. కుటంబాన్ని అంతే.. ఆటను ఎంత ప్రేమించాడో కుటుంబాన్ని అంతే ప్రేమించాడు నాదల్. తల్లిదండ్రులంటే అమితంగా ఇష్టపడే నాదల్కు 2009లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మనస్పర్థల కారణంగా నాదల్ తల్లిదండ్రులు విడిపోయారు. ఇది నాదల్‌ను మానసికంగానూ.. కెరీర్ పరంగానూ చాలా దెబ్బ తీసింది. ఎంతలా అంటే ఫ్రెంచ్ ఓపెన్‌లో ఓటమి ఎరుగని రారాజుగా వెలుగొందుతున్న నాదల్కు తొలి ఓటమి అదే సంవత్సరం వచ్చింది. ఆ ఏడాది ఫైనల్లో రోజర్ ఫెదరర్ నాదల్‌ను ఓడించి విజేతగా అవతరించాడు. అయితే ఈ భాద నాదల్‌ను ఎంతోకాలం ఆపలేకపోయింది. గోడకు కొట్టిన బంతిలా.. 2010లో మళ్లీ ఫుంజుకున్న నాదల్ ఏకంగా మూడు గ్రాండ్‌స్లామ్‌లను కొల్లగొట్టి పూర్వ వైభవం సాధించాడు. ఆటలో చాంపియన్‌గా నిలిచిన నాదల్కు అదే ఏడాది విడిపోయిన తల్లిదండ్రులు మళ్లీ కలుసుకోవడం మరింత సంతోషాన్నిచ్చింది. ఆ తర్వాత కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదురైనప్పటికి అంతా సాఫీగానే సాగింది. అయితే గత నాలుగేళ్లలో వయసు మీద పడడం.. ఆటలో ఏకాగ్రత తగ్గడం.. గాయాలు వేదించడంతో .. నాదల్ పని అయిపోయిందని అంతా భావించారు. దీనికి తోడూ రోజర్ ఫెదరర్, జొకోవిచ్‌లు ఆటలో దూసుకుపోతున్నారు. వీటన్నింటికి నాదల్ ఒకే ఒక్క గ్రాండ్‌స్లామ్‌తో సమాధానమిచ్చాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ డానిల్ మెద్వెదెవ్‌తో జరిగిన సుధీర్ఘ పోరులో నాదల్ ఓటమి అంచుల వరకు వెళ్లి విజేతగా నిలిచాడు. అలా కెరీర్లో 21వ గ్రాండ్‌స్లామ్ అందుకొని ఓపెన్ శకంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇక తనకు అచ్చొచ్చిన రోలాండ్ గారోస్(ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ) నాదల్ దూసుకెళుతున్నాడు. 36వ పుట్టిరోజు జరుపుకుంటున్న రోజునే అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో సెమీ ఫైనల్లో తలపడుతున్నాడు. 22వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన నాదల్కు ఆల్ ది బెస్ట్ చెబుతూ ముగిద్దాం. ముగించేముందు నాదల్కు మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు.. నాదల్ గురించి మనకు తెలియని కొన్ని ముఖ్య విషయాలు ►నాదల్ 2019, అక్టోబర్ 19న మారియా ఫ్రాన్సియా పెరెల్లోతో వివాహం జరిగింది. ►నాదల్ రెండు చేతులతో ఆడగలడు. అతను ఫోర్ హ్యాండ్ షాట్‌కు ఎడమ చేతిని వాడతాడు. రెండు చేతులతో టూహ్యాండెడ్ ఫోర్షాట్ కూడా ఆడగల సామర్థ్యం ఉంది. ►రాఫెల్ నాదల్కు చీకటంటే చచ్చేంత భయం. నిద్రపోతున్న సమయంలో ఒక లైటు లేదా టీవీ స్క్రీన్ వెలుగుతూనే ఉంటుంది. ►ఫ్రెంచ్ ఓపెన్ ఆడే సమయంలో నాదల్ లాకర్ నెంబర్ 159 మాత్రమే తీసుకుంటాడు. ►ప్రతీ మ్యాచ్‌కు ముందు చన్నీటితో స్నానం చేయడం నాదల్కు అలవాటు ►నాదల్ ఏ గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకున్న నోటితో కొరకడం అలవాటుగా చేసుకున్నాడు. ఇలా ఎందుకు చేస్తున్నానో తనకు తెలియదని.. ఒకసారి కొరకడం అలవాటయ్యాకా దానికి మానలేకపోయానని ఒక ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు. ►టెన్నిస్ కోర్టులో నాదల్ తాగే వాటర్ బాటిల్స్ వరుస క్రమంలో ఉంటేనే తాగుతాడు. అలా లేకుంటే వాటిని సరిచేసి గానీ నీళ్లు తాగడు. -
దినేశ్ కార్తిక్.. ఫెయిల్యూర్ మ్యారేజ్ టూ సక్సెస్ఫుల్ లవ్‌స్టోరీ
టీమిండియా వెటరన్ క్రికెటర్.. ఆర్సీబీ స్టార్ ఆటగాడు దినేశ్ కార్తిక్ ఇవాళ(జూన్ 1న) 37వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. టీమిండియాలోకి(2004) చాలాకాలం క్రితమే ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఎంఎస్ ధోని హయాంలో కార్తిక్ ఆడడం అతని దురదృష్టం అని చెప్పొచ్చు. దాదాపు ధోని, దినేశ్ కార్తిక్‌లు టీమిండియాలోకి ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు. అయితే వికెట్ కీపర్‌గా.. బ్యాట్స్‌మన్‌గా.. టీమిండియా కెప్టెన్‌గా అసమాన రీతిలో వెలిగిపోయిన ధోనికి వెనకాల కార్తిక్ చీకటిలో మిగిలిపోయాడు. మధ్య మధ్యలో కొన్ని అవకాశాలు వచ్చినప్పటికి పెద్దగా రాణించలేకపోయాడు. అలా అని కార్తిక్ ఆటతీరును తీసిపారేయల్సినంతగా ఎప్పుడు అనిపించలేదు. ధోని నీడలోనే ఎక్కువకాలం ఆడిన దినేశ్ కార్తిక్ కెరీర్లో హైలైట్‌గా నిలిచింది మాత్రం 2018 నిదహాస్ ట్రోపీ. ట్రై సిరీస్ ఫార్మాట్లో జరిగిన టోర్నీకి రెగ్యులర్ వికెట్ కీపర్ ధోని దూరంగా ఉన్నాడు. దీంతో కార్తిక్‌కు తుది జట్టులో అవకాశం వచ్చింది. కాగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి అంచున నిలిచిన టీమిండియాను తన నాకౌట్ ఇన్నింగ్స్‌తో గెలిపించడమే గాక టైటిల్ అందించాడు. 2 ఓవర్లలో 39 పరుగులు చేయాల్సిన దశలో కార్తిక్ 8 బంతుల్లోనే 29 పరుగులు బాదాడు. చివరి బంతికి ఐదు పరుగులు అవసరమైన దశలో కార్తిక్ భారీ సిక్సర్ కొట్టి బంగ్లాదేశ్ ఆటగాళ్ల కలను నెరవేరకుండా చేశాడు. ఓవరాల్‌గా చూసుకుంటే 2004లో అరంగేట్రం చేసిన దినేశ్ కార్తిక్ టీమిండియా తరపున 26 టెస్టులు, 94 వన్డేలు, 38 టి20లు ఆడాడు. ఇటీవలే ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తరపున సూపర్ ఫినిషర్‌గా కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఐపీఎల్ 2022 సీజన్లో దినేశ్ కార్తిక్ 16 మ్యాచ్‌లాడి 330 పరుగులు సాధించాడు. చాలా మ్యాచ్‌ల్లో ఆఖరున వచ్చిన కార్తిక్ ఎవరు ఊహించని రీతిలో సూపర్ ఫినిషర్‌గా మారాడు. 37 ఏళ్ల వయసులోనూ అదరగొట్టే స్ట్రైక్‌రేట్‌తో మెరిసిన కార్తిక్‌ను సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ అవార్డు వరించింది. ఇక జూన్ 9 నుంచి సౌతాఫ్రికాతో జరగనున్న టి20 సిరీస్‌కు ఎంపికైన కార్తిక్ రాణించాలని కోరుకుంటూ.. ''హ్యాపీ బర్త్‌డే దినేశ్ కార్తిక్'' వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు క్రికెట్ కెరీర్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్న దినేశ్ కార్తిక్ వ్యక్తిగత జీవితంలోనూ అదే ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. ఒక ఫెయిల్యూర్ మ్యారేజ్ నుంచి సక్సెస్ఫుల్ లవ్‌స్టోరీ వరకు కార్తిక్ జర్నీ ఆసక్తికరంగా ఉంటుంది. 2007లో నికితా వంజరను వివాహం చేసుకున్నాడు. అయితే ఆమెతో కార్తిక్ బంధం కొన్నాళ్లు మాత్రమే కొనసాగింది. మరో టీమిండియా మాసీ క్రికెటర్ మురళీ విజయ్‌తో నిఖితాకు ఉన్న లవ్ అఫైర్ కార్తిక్‌ను డైవర్స్ తీసుకునేలా చేసింది. 2012లో నికితా నుంచి విడాకులు తీసుకున్న కార్తిక్ జీవితంలోకి భారత స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ ఎంట్రీ ఇచ్చింది. 2013లో వీరిద్దరి మధ్య ఆసక్తికర రీతిలో ప్రేమ చిగురించింది. ఆ సంవత్సరం స్క్వాష్ క్రీడలో మరింత పదును పెంచుకునేందుకు దీపికా పల్లికల్ ఇంగ్లండ్‌లోని లీడ్స్‌కు వచ్చింది. అదే సమయంలో దినేశ్ కార్తిక్ కూడా టీమిండియాతో కలిసి టెస్టు మ్యాచ్ ఆడేందుకు లీడ్స్‌కు వచ్చాడు. అక్కడ తొలిసారి దీపికను చూసిన కార్తిక్ తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడు. ఆమెపై ఇష్టంతో ట్రైనింగ్ సెంటర్‌కు వచ్చి స్క్వాష్ గేమ్ ఆడేవాడు. అలా ప్రేమ బంధంలో మునిగిపోయిన ఈ జంట 2015లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాగా ఇటీవలే దినేశ్ కార్తిక్ దంపతులు కవలలకు జన్మనిచ్చారు. ఇద్దరు కవలలకు తల్లిదండ్రుల పేర్లు కలిసి వచ్చేలా కబీర్ పల్లికల్ కార్తిక్, జియాన్ పల్లికల్ కార్తిక్ అని పేర్లు పెట్టారు. ప్రస్తుతం కార్తిక్, దీపికా పల్లికల్ మోస్ట్ లవబుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. చదవండి: Dinesh Karthik: టీమిండియాలోకి డీకే.. రీ ఎంట్రీపై ఆసక్తికర ట్వీట్ -
జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్ ఫొటోలు
-
ఆయన గొంతులో ఏదో మ్యాజిక్...మరేదో మాయ!
సిద్ శ్రీరామ్.. ఈ పేరు వింటే చాలు సినీ సంగీతాభిమానులు అద్భుతమైన సంగీత లోకం లోకి వెళ్లిపోతారు. అద్భుతమైన గొంతు, అంతకు మించిన శాస్త్రీయ పరిజ్ఞానం సిద్ శ్రీరామ్‌ను ఈ డికేడ్ సింగర్‌గా మార్చివేసింది. పొద్దున్నే సిద్ శ్రీరామ్ పాట వింటే చాలు.. ఆ పరిమళం, మోహం ఆ రోజంతా వెంటాడుతుంది. ఎన్ని సార్లు విన్నా కొత్తగా అనిపిస్తుంది..దటీజ్ వెర్సటైల్ సింగర్ సిద్ శ్రీరామ్ మ్యాజిక్. సిద్ శ్రీరామ్ మెలోడియస్గా, రొమాంటిక్‌గా ఒక పాట పాడితే చాలు ఆ సినిమా హిట్ గ్యారంటీ అన్న రేంజ్లో సిద్ హవా నడుస్తోంది. శ్రీరామ్ తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. తండ్రి శ్రీరాం వ్యాపారవేత్త. తల్లి లత సంగీతం టీచర్. ఇంట్లోనే సంగీత నేపథ్యం ఉండటంతో సహజంగానే సిద్ కు సంగీతం ఆసక్తి ఏర్పడింది. తొలి గురువు అమ్మ ద్వారా కర్ణాటక సంగీతంలో మరింత రాణించాడు. తల్లిదండ్రులతో కలసి కాలిఫోర్నియాకు వెళ్లిన సిద్ బెర్క్లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌లో చేరాడు. మ్యూజిక్ ప్రొడక్షన్, ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు. కర్ణాటక కచేరీలను కూడా నిర్వహించేవాడు. సిద్ చెల్లెలు పల్లవి శ్రీరాం భరతనాట్య కళాకారిణి కావడం విశేషం 2013లో ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ స్వరపరచిన కదల్ కోసం పాడిన అడియే పాటతో వెలుగులోకి వచ్చాడు సిద్ శ్రీరామ్. ఆ తరువాత 2015లో ఐ మూవీలోని "ఎన్నోడు నీ ఇరుంతాల్ " సాంగ్‌తో మరింత పాపులర్ అయ్యాడు. ఈ పాటకు ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్‌గా ఫిలింఫేర్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ క్రమంలో హుషారు మూవీలోని ఉండిపోరాదే , నిన్ను కోరి సినిమాలో అడిగా అడిగా, డియర్ కామ్రేడ్ కడలల్లె వేచె కనులే, ఇంకా పడి పడి లేచే మనుసు, శశి మూవీలోని ఒకే ఒక లోకం నువ్వే, ఇంకా రోబో 2.0, ఏబీసీడీ, మైల్స్ ఆఫ్ లవ్ లాంటి పలు మూవీస్‌లో రొమాంటిక్ ట్రాక్‌లతో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. ముఖ్యంగా గీత గోవిందం సినిమాలో "ఇంకేం ఇంకేం ఇంకేం కావాలె" అంటూ టాలీవుడ్లో సంచలనం క్రియేట్ చేశాడు. గోపీ సుందర్ స్వరపర్చిన ఈ పాట ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును సంపాదించిపెట్టింది. ఇక వరుస ఆఫర్లతో సినీ సంగీతాభిమానులను తన గాత్రంతో మెస్మరైజ్ చేశాడు. టాక్సీవాలా, ఇష్క్ తదితర మూవీల్లో పాటలతో అలరించాడు. సిద్ శ్రీరామ్ పాటలన్నీ రిపీట్ మోడ్‌లో వినాల్సిందే. అయితే ఇప్పటి వరకూ శ్రీరామ్ పాడినవన్నీ మెలోడీయస్ గీతాలే. భారతీయ సంగీతంతో పాటు పాప్ మ్యూజిక్ లోనూ ప్రవేశం ఉన్న సిధ్ శ్రీరామ్ ఫస్ట్ టైమ్ ఓ ఫోక్ సాంగ్ పాడాడు. అలాంటి వారందరినీ ఆశ్చర్యపరుస్తూ ‘నల్లమల’ చిత్రంలో ‘‘ఏమున్నావే పిల్లా ఏమున్నావే’’ అంటూ సాగే అందమైన జానపద గీతాన్ని అంతే అందంగా ఆలపించి ఆశ్చర్యపరిచాడు. ఇక స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ అల వైకుంఠపురంలోని సామజ వర గమనా ప్రపంచ వ్యాప్తంగా సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు. లేటెస్ట్ హిట్ సర్కారు వారి పాట మూవీలోని కళావతి సాంగ్ కూడా మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ సినీ నేపథ్య సంగీతంలో తనదైన మార్క్ తో దూసుకుపోతున్నాడు సిద్ శ్రీరామ్ . -
కొత్తగా మారిపోయా!
నమిత ఫోన్ మంగళవారం ఫుల్ బిజీ. ఎందుకంటే మంగళవారం (మే 10) ఆమె బర్త్ డే. ఈ సందర్భంగా ‘హ్యాపీ బర్త్ డే’ చెప్పేందుకు బంధువులు, అభిమానులు ఫోన్ చేసి ఉండొచ్చు అనుకుంటున్నారా? అయితే ‘హ్యాపీ బర్త్ డే’తో పాటు ‘కంగ్రాట్స్’ చెప్పిన ఫోన్ కాల్సే ఎక్కువగా ఉన్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే... తాను తల్లి కాబోతున్న విషయాన్ని తన బర్త్ డే సందర్భంగా నమిత ఇన్‌స్టా అకౌంట్ ద్వారా వెల్లడించి, కొత్త ఫోటోలను షేర్ చేశారు. దాంతో ‘కంగ్రాట్స్...నమిత’ అని ఇటు సినీ సెలబ్రిటీలు అటు అభిమానులు ఆమెకు సందేశాలు పంపడం, ఫోన్‌కాల్స్ చేయడం వంటివి చేశారు. ‘‘నా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవగానే నేను మారిపోయాను. నేను నీ కోసం (పుట్టబోయే బిడ్డ గురించి...) ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ప్రస్తుతం కొత్త అనుభూతిని ఆస్వాదిస్తున్నాను’’ అంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చారు నమిత. 2017లో వ్యాపారవేత్త వీరేంద్రతో నమిత వివాహం జరిగిన విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న నమిత ‘సొంతం’, ‘జెమిని’, ‘సింహా’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. -
నేచురల్ బ్యూటీ సాయిపల్లవి బర్త్‌డే స్పెషల్ ఫొటోలు
-
హ్యాపీ బర్త్‌డే రౌడీ బాయ్ స్పెషల్ ఫొటోలు
-
జూలైలో లావణ్య త్రిపాఠి ‘హ్యాపీ బర్త్‌డే’
లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’. రితేష్ రానా దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 15న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ‘‘ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేసే అంశాలు, యాక్షన్‌తో హిలేరియస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. నరేష్ ఆగస్త్య, సత్య, వెన్నెల కిశోర్, గుండు సుదర్శన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానినికి సంగీతం: కాలభైరవ, కెమెరా: సురేష్ సారంగం. You are all invited to the laugh riot 😆 The #HappyBirthday party begins in theatres from July 15, 2022. 🎉#HBDMovie #HBDMovieOnJuly15@Itslavanya @RiteshRana #NareshAgastya @vennelakishore #Satya @kaalabhairava7 @sureshsarangam @ClapEntrtmnt @MythriOfficial pic.twitter.com/0ar1b49o3R — LAVANYA (@Itslavanya) May 5, 2022 -
హ్యాపీ బర్త్‌డే సామ్: డేర్ & డాషింగే కాదు బ్యూటీఫుల్ కూడా! (ఫొటోలు)
-
హ్యాపీ బర్త్‌డే మాస్టర్ బ్లాస్టర్.. లగ్జరీ విల్లా, ఆసక్తికర విషయాలు
భారత క్రికెట్ దిగ్గజం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇవాళ(ఏప్రిల్ 24) 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. 1973 ఏప్రిల్ 24న జన్మించిన సచిన్ టెండూల్కర్ 16 ఏట అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దాదాపు 24 ఏళ్ల పాటు సచిన్ తన బ్యాటింగ్‌తో క్రికెట్‌ను శాసించాడనే చెప్పొచ్చు. ఈ క్రమంలో అతడు సాధించిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. సెంచరీలతో పాటు వన్డే, టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ఘనత సచిన్ సొంతం. వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ అందుకున్న ఆటగాడిగాను సరికొత్త చరిత్ర సృష్టించాడు. సచిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. అతను సాధించిన రికార్డుల గురించి కాకుండా కాస్త కొత్తగా సచిన్ నివాసముంటున్న లగ్జరీ విల్లా గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ►సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం ముంబైలోని బాంద్రా ప్రాంతంలో విశాలమైన విల్లాలో తన కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్నాడు . 2007లో రూ.39 కోట్లు పెట్టి పాత విల్లాను కొనుగోలు చేసిన సచిన్.. దాదాపు రూ. వంద కోట్లతో కొత్త పద్దతిలో లగ్జరీ విల్లాను నిర్మించాడు. ►బాంద్రాలోని పెర్రీ రోడ్లో ఉన్న ఈ విల్లా అరేబియన్ సముద్రానికి దగ్గరలో ఉంది. ఇదే ప్రాంతంలో సెలబ్రిటీస్, సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులు నివాసం ఉంటున్నారు. ►సచిన్ లగ్జరీ విల్లా దాదాపు ఆరువేల స్క్వేర్ఫీట్స్లో ఉంటుంది. బంగ్లా మొత్తం మూడు ఫ్లోర్స్‌లో ఉండగా.. రెండు బేస్మెంట్స్, ఒక టెర్రస్ ఉంటుంది. విశాలమైన గెస్ట్ రూమ్స్‌తో పాటు టాప్ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ►సచిన్‌కు కార్లంటే ఎంత పిచ్చి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లోయర్ బేస్మెంట్లో ఒకేసారి 40-50 కార్లను పార్క్ చేసేలా వీలు ఉంటుంది. ఇక అప్పర్ బేస్మెంట్లో సెకండరీ కిచెన్, సర్వెంట్ క్వార్టర్స్, సెక్యూరిటీకి సంబంధించిన మాస్టర్ సర్వెలియన్స్ ఉంటాయి. ►కాగా సచిన్ తాను నివాసముంటున్న ఇంటికి రూ. 100 కోట్లతో ఇన్సూరెన్స్ చేయించడం విశేషం. ఆ పాలసీలో ఉగ్రవాద దాడులు, యాక్ట్ ఆఫ్ గాడ్(భూకంపాలు), బాంబ్ బ్లాస్ట్ తదితర వాటికి ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా రూపొందించారు. ►సచిన్ ఉంటున్న విల్లా మెయిన్ లివింగ్ రూమ్ దాదాపు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. రూమ్ నిండా వైట్ అండ్ బ్రౌన్ కాంబినేషన్‌తో కూడిన కలర్స్ ఎక్కువగా కనిపిస్తాయి. -
హ్యాపీ బర్త్ డే మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్
-
నేచురల్ స్టార్ నాని ..అనుకోకుండా ఒక హీరో
నేచురల్ స్టార్, అనుకోకుండా హీరో అయిపోయి అభిమానుల మనసు దోచుకున్న సైలెంట్ కిల్లర్ టాలీవుడ్ స్టార్హీరో నాని. నిన్నా మొన్నటి ఈ మిడిల్ క్లాస్ అబ్బాయి తాజాగా శ్యామ సింగరాయ్‌గా సూపర్‌డూపర్ హిట్ కొట్టి టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ఆరంభించి హీరోగా అష్టాచెమ్మా ఆడి, భలేభలే మగాడివోయ్ అనిపించుకున్న నానీ కేరియర్ గ్రాఫ్‌పై ఒక లుక్కేద్దాం. Happy Birthday Natural Star Nani: 1984, ఫిబ్రవరి 24 కృష్ణాజిల్లా చల్లపల్లిలో పుట్టాడు ఘంటా నవీన్‌బాబు అలియాస్ నానీ. రెడియో జాకీగా ఆకట్టుకున్న నానీ సిని ఇండస్ట్రీపై ఉన్న ఆసక్తితో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. శ్రీను వైట్ల, బాపు వంటి డైరెక్టర్ల వద్ద సహాయదర్శకుడిగా కరియర్ ఆరంభించి అనుకోకుండా హీరోగా అవతరించాడు. విలక్షణమైన నటన, విభిన్నమైన మూవీలు, డిఫరెంట్ స్టైల్‌తో నాచురల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. టాలీవుడ్లో టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్ నాని. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అష్టా చమ్మా’ సినిమాలో అవసరాల శ్రీనివాస రావుతో కలిసి ప్రేక్షకులను అలరించాడు. మొదటి సినిమాతోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని వరుస ఆఫర్లను దక్కించుకున్నాడు. దాదాపు ప్రతీసినిమా ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తపడ్డాడు. భీమిలీ కబడ్డీ జట్టు, అలా మొదలైంది, పిల్ల జమిందార్ మూవీలు కమర్షియల్‌గాను సక్సెస్ అయ్యాయి. 2012లో ఎటో వెళ్లిపోయింది మనసు మూవీతో ఉత్తమనటుడుగా నంది అవార్డు అందుకున్నాడు.ఽ ఇక దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో నాని కరియర్లో 2015 సంవత్సరంలో కీలక మైలురాయి అని చెప్పు కోవచ్చు. “ఎవడే సుబ్రహ్మణ్యం, జెండాపై కపిరాజు” ‘భలే భలే మగాడివోయ్’ చిత్రాలతో తన రేంజ్‌ను మరింత పెంచుకున్నాడు. 2017 వరకు మిడిల్ క్లాస్ అబ్బాయిని అంటూ వరుసగా ఎనిమిది విజయాలను అందుకున్నాడు. నిర్మాతగా మారిన నాని 2014లో డీ ఫర్ దోపిడీ, ఆ! అనే చిత్రాన్ని నిర్మించి నిర్మాతగా కూడా విజయాన్ని సొంతం చేసుకున్నాడు. 2018 లో కింగ్ నాగార్జున అక్కినేని గారితో దేవదాస్ సినిమాలో కలిసి నటించి ప్రశంసలందుకున్నాడు.అయితే 2018 ఏప్రిల్ లో వచ్చిన కృష్ణార్జున యుద్ధం, 2019లో విడుదలైన జెర్సీ హిట్ టాక్ సాధించినా, ఆ తరువాత 'గ్యాంగ్ లీడర్' మూవీ నిరాశనే మిగిల్చింది. కరోనా, లాక్డౌన్ కారణంగా ఓటీటీలోనే విడుదలైన వీ, టక్ జగదీష్' మూవీలు కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. రియాల్టీ షో బిగ్ బాస్-2 కి సీజన్ కి వ్యాఖ్యాతగా మంచి మార్కులు కొట్టేశాడు. తాజాగా శ్యామ్‌గా భారీ హిట్ కొట్టాడు నాని. జెంటిల్‌మ్యాన్ తరువాత డ్యుయల్ రోల్ పోషించిన ‘శ్యామ్ సింగరాయ్’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమేకాదు, భారీ వసూళ్లను కూడా రాబట్టింది. పునర్జన్మ, పీరియాడిక్ లవ్ స్టోరీతో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ మూవీమంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. -
కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ కి హ్యాపీ బర్త్ డే..!!
-
#HBDShrutiHaasan : శృతి హాసన్ బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
హ్యాపీ బర్త్ డే సీఎం జగన్
-
లావణ్య త్రిపాఠికి బర్త్‌డే సర్ప్రైజ్
Happy Birthday Movie Full Details: ‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో క్లాప్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్లో ఇటీవల ఓ చిత్రం ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రముఖ కథానాయిక లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రానికి ‘హ్యాపీ బర్త్‌డే’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. బుధవారం(డిసెంబర్ 15) హీరోయిన్ లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్‌ని చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. నరేష్ ఆగస్త్య, వెన్నెల కిషోర్, సత్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో లావణ్య త్రిపాఠి మిషన్ గన్ పట్టుకుని ఫైరింగ్ చేస్తోంది. చిత్ర టైటిల్ చుట్టూ గన్స్ చూపిస్తూ.. పక్కన ‘నో గన్, నో ఎంట్రీ’ అనే క్యాప్షన్ చూస్తుంటే ఇది ఏ తరహా చిత్రమో ఇట్టే అర్థమవుతోంది. టోటల్‌గా ఫస్ట్ లుక్‌తోనే ప్రేక్షకులకి మంచి పార్టీ రెడీ అవుతుందనేలా పోస్టర్ని డిజైన్ చేశారు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ఈ చిత్రం ఏకధాటిగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘మా హీరోయిన్ లావణ్య త్రిపాఠికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమె బర్త్‌డే రోజే.. ‘హ్యాపీ బర్త్‌డే’ టైటిల్‌ను, ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. రీసెంట్‌గానే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాం. ఈ చిత్రంతో దర్శకుడు రితేష్ రానా ప్రేక్షకులను హిలేరియస్‌గా ఎంటర్టైన్ చేయబోతున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. మంచి తారాగణం కుదిరింది. టెక్నికల్‌గానూ హై స్టాండర్డ్స్‌లో ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు కాలభైరవ సంగీతం, సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు..’’ అని తెలిపారు. -
చిరుతవేగం.. పూరి జగన్నాథ్ సొంతం పుట్టినరోజు స్పెషల్ ఫోటోలు
-
Happy Birthday Mahesh Babu: మహేశ్... సరిలేరు నీకెవ్వరు
-
గంగూలీ అలా చేసి ఉండకపోతేనా..
ఫుట్‌బాల్ మీద మమకారం ఉన్నప్పటికీ.. అన్నతో పడ్డ పోటీలో చివరికి అతనే పైచేయి సాధించాడు. అగ్రెస్సివ్ బ్యాట్స్‌మ్యాన్‌గా, యువ జట్టును సమర్థవంతంగా నడిపించిన సారథిగా దశాబ్దంపైగా టీమిండియాకు మరిచిపోలేని విజయాలెన్నింటినో అందించాడు సౌరవ్ ఛండీదాస్ గంగూలీ అలియాస్ దాదా. ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న గంగూలీకి ఇవాళ 49వ పుట్టినరోజు.. వెబ్‌డెస్క్: పరిమిత ఓవర్లలోనే కాదు.. టెస్ట్‌ల్లోనూ రికార్డ్ స్ట్రయిక్ రేటుతో పరుగుల వరద పారించాడు సౌరవ్ గంగూలీ. హీరో హోండా బ్యాట్(చాలా మ్యాచ్‌లు ఈ బ్యాట్‌తోనే ఆడాడు)తో ముందుకొచ్చి స్పిన్నర్ల బంతిని బౌండరీ అవతల పడేయడం, స్క్వేర్, ఫ్రంట్ ఫుట్, కవర్ షాట్లతో క్రీడాభిమానులందరినీ ఉర్రూతలూగించేవాడు. ఆయనది ఎడమ చేతి వాటం. అయితేనేం ఆఫ్ సైడ్‌లో అదిరిపోయే షాట్లతో ‘గాఢ్ ఆఫ్ ది ఆఫ్‌సైడ్ క్రికెట్’ ట్యాగ్‌లైన్ దక్కించుకున్నాడు సౌరవ్ గంగూలీ. ఫియర్లెస్ బ్యాట్స్‌మన్‌గా.. దేశీవాళీ టోర్నీల్లో రాణించిన దాదా కెరీర్.. 1992లో విండీస్ మ్యాచ్‌తో మొదలైంది. కానీ, టీం కోసం కూల్ డ్రింక్స్ బాటిళ్లు మోయలేనంటూ వాదించి వేటుకు గురయ్యాడనే ఒక ప్రచారం ఇప్పటికీ వినిపిస్తుంటుంది(ఆ ప్రచారాన్ని దాదా కొట్టిపడేస్తుంటాడు). 1993-94, 94-95, 95-96 సీజన్లలో రంజీ, దులీప్ ట్రోఫీల్లో రాణించాడు గంగూలీ. ఆ పర్ఫార్మెన్స్ అతన్ని ఇంగ్లండ్ టూర్‌కి ఎంపిక చేయించింది. ఆ టూర్లో ఒకే ఒక్క వన్డే ఆడి.. డ్రెస్సింగ్ రూంకే పరిమితమయ్యాడు. అయితే సిద్ధూ వివాదాస్పద నిషష్క్రమణ తర్వాత ఆ ప్లేస్‌లో గంగూలీ టెస్ట్ మ్యాచ్‌లకు ఆడాడు. లార్డ్స్‌లో డెబ్యూలోనే గంగూలీ బాదిన శతకం ఒక తీపి గుర్తుగా ఉండిపోయింది. ఆ తర్వాత ఫియర్లెస్ బ్యాట్స్‌మ్యాన్‌గా గంగూలీ శకం నిర్విరామంగా కొనసాగింది. సచిన్, ద్రవిడ్, లక్క్ష్మణ్లాంటి సీనియర్లతో భాగస్వామిగా పరుగులు రాబట్టాడు గంగూలీ. కెప్టెన్‌గా భేష్, ఆటగాడిగా.. ఆటగాడిగా అద్భుత ప్రదర్శన గంగూలీకి పగ్గాలు అప్పజెప్పేలా చేసింది. అయితే కెప్టెన్‌గా సమర్థతను నిరూపించుకున్న గంగూలీ.. ఆటగాడిగా మాత్రం మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. ఇక కోచ్‌గా గ్రెగ్ ఛాపెల్ ఎంట్రీ.. వివాదాలతో దాదా ఆట తీరు దాదాపుగా మసకబారిపోయింది. చివరికి.. పూర్ ప్లేయర్‌గా కెప్టెన్సీకి.. ఆపై ఆటకు దూరం కావాల్సి వచ్చింది. అయితే కెప్టెన్‌గా గంగూలీ తీసుకున్న కొన్ని సొంత నిర్ణయాలు మాత్రం.. టీమిండియా స్థితిగతుల్ని మలుపు తిప్పాయనే చెప్పొచ్చు. ద్రవిడ్ ప్లేస్‌లో లక్క్ష్మణ్.. అయితే 2001 ఈడెన్ గార్డెన్ టెస్ట్‌లో ఫాలో ఆన్‌తో గడ్డు స్థితి ఉన్న టైంలో ద్రవిడ్‌కు బదులు లక్క్ష్మణ్ను నెంబర్ 3 పొజిషన్లో పంపడంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ, ఆ నిర్ణయం ఎలాంటి క్లాసిక్ విక్టరీని అందించిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. 281 పరుగులతో లక్క్ష్మణ్ రాణించగా. చివరిరోజు బంతితో మ్యాచ్‌ను మలుపు తిప్పి అద్భుత విజయాన్ని అందించాడు హర్భజన్. తద్వారా కంగారుల పదహారు వరుస టెస్ట్ విజయాల పరంపరకు బ్రేక్ వేసింది గంగూలీ నేతృత్వంలోని టీమిండియా. ఈ విజయమే ఒకరకంగా తన కెరీర్‌ను నిలబెట్టిందని చాలాసార్లు గుర్తు చేసుకుంటాడు దాదా. ఇక వీరేంద్ర సెహ్వాగ్‌కు విధ్వంసకర బ్యాట్స్‌మ్యాన్‌గా గుర్తింపు ఉందన్నది తెలిసిందే. కానీ, తొలినాళ్లలో ఆరో నెంబర్ పొజిషన్లో బ్యాటింగ్ చేసేవాడు వీరూ. అంతెందుకు సౌతాఫ్రికా టెస్ట్ డెబ్యూలోనూ ఆరో నెంబర్ పొజిషన్లో బ్యాటింగ్సెంచరీ బాదాడు. అయితే డ్యాషింగ్ ఓపెనర్ అవసరమన్న ఉద్దేశంతో అప్పటి నుంచి వీరూని ఓపెనింగ్‌లో దించడం స్టార్ట్ చేశాడు గంగూలీ. ద్రవిడ్ వికెట్ కీపర్‌గా.. గంగూలీ బ్యాట్స్‌మ్యాన్ మాత్రమే కాదు.. అప్పుడప్పుడు మీడియం పేస్ బౌలింగ్‌తో అలరించేవాడు కూడా. ఇక నయన్ మోంగియా శకం ముగిశాక.. టీమిండియాకు ఫిక్స్డ్ వికెట్ కీపర్ సమస్య ఎదురైంది. ఆ టైంలో ఎందరినో కీపర్లుగా మార్చాడు గంగూలీ. కానీ, చివరాఖరికి ద్రవిడ్‌ను ఒప్పించి.. వికెట్ల వెనుకాల కూడా వాల్‌గా నిలబెట్టాడు. అంతేకాదు 2002-2004 మధ్య ద్రవిడ్‌ను 5 నెంబర్ పొజిషన్లో పంపి.. వన్డేలోనూ మంచి ఫలితాలను రాబట్టాడు గంగూలీ. చివరికి ధోనీని 3 స్థానంలో పంపడం, ఆ స్థానంలోనే వైజాగ్ వన్డేలో 148 పరుగులు బాదడం ఎవరూ మరచిపోలేరు. పెద్దన్నగా.. యువ టీంలో విజయపు కాంక్ష 2000 సంవత్సరం నుంచి మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు క్రికెట్‌ను కమ్మేశాయి. అలాంటి కష్ట కాలంలో టీమిండియాను బలోపేతం చేసి.. జట్టుకు వైభవం తెచ్చింది దాదానే. ముఖ్యంగా యువ ఆటగాళ్లను ప్రోత్సహించి విజయ కాంక్షను రగిలించి ‘పెద్దన్నయ్య’(దాదా)గా నిలిచాడు. వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, ఎంఎస్ ధోనీ.. ఇలా దాదా నాయకత్వంలో పేరు తెచ్చుకున్న వాళ్లే. అంతేకాదు యువ టీంలో విదేశీ గడ్డ ఓటమి అనే భయాన్ని పొగొట్టి.. సమర్థవంతంగా జట్టును నడిపించిన ఘనత కూడా దాదాదే. -
అమ్మ ఒడిలోని ఈ చిన్నారి ఎవరో తెలుసా?
కొత్తగా ఆలోచించడం అందరికి సాధ్యం కాకపోవచ్చు. కానీ, కొత్త ఆలోచనలతో అనుకున్నది సాధించడం కొందరికే సాధ్యం. ఆ కొందరిలో ఒక్కడే ఎలన్ మస్క్. వింత ఆలోచనల పుట్ట, మొండి మేధావి, ముక్కుసూటి మనిషిగా పేరున్న ఎలన్ మస్క్ 50వ పుట్టినరోజు ఇవాళ. పైన అమ్మ ఒడిలో ఒదిగిన ఆ చిన్నారి కూడా ఎలన్ మస్కే. వెబ్‌డెస్క్: ఎలన్ మస్క్ కన్నతల్లి మయే మస్క్ ఆ ఫొటోను షేర్ చేసింది. కొడుక్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. యాభై ఏళ్ల క్రితం అదొక అద్భుతమైన రోజని, తనలో సంతోషాన్ని నింపాడని చెబుతూ.. ప్రేమగా ట్విటర్లో పోస్ట్ చేసిందామె. పైగా ట్విటర్లో ట్రెండ్ అవుతున్న #HappyBirthdayElonMusk ట్యాగ్‌ను సైతం జత చేసింది. తల్లి పంచిన గుర్తుకు.. సింపుల్‌గా హార్ట్ సింబల్‌తో బదులిచ్చాడు మస్క్. పోయినవారం ఆమె మస్క్, అతని సోదరుడితో ఉన్న ఫొటోని ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు మస్క్ చిన్నప్పటి ఫొటోను షేర్ చేయగా.. ఆయన అభిమానులు మురిసిపోయారు. Happy birthday @elonmusk 🎂🎉 Thank you for this wonderful day 50 years ago. You have brought me great joy. Lots of love ❤️❤️❤️ #HappyBirthdayElonMusk now trending 🙌🙏 pic.twitter.com/xro3QwQD1z — Maye Musk (@mayemusk) June 28, 2021 పన్నెండేళ్లకే.. టెస్లా, స్పేస్ ఎక్స్, ది బోరింగ్ కంపెనీలకు హెడ్‌గా న్యూరాలింక్ లాంటి అరుదైన ప్రయోగాలతో ప్రపంచానికి పరిచయమైన మేధావి ఎలన్ మస్క్. ఒక్క ట్వీట్‌తో కోట్లకు కోట్లకు ముంచెత్తడం, అదే టైంలో ఒకే ట్వీట్‌తో సంపాదించడం అతనికి తేలికైన పని. అంతేకాదు బిట్‌కాయిన్ తలరాతను డిసైడ్ చేస్తూ.. డిజిటల్ కరెన్సీ మార్కెట్‌ను శాసిస్తుంటాడు కూడా. 1971, జూన్ 28న ప్రిటోరియా (దక్షిణాఫ్రికా)లో పుట్టాడు ఎలన్ మస్క్. తండ్రి ఎర్రోల్ ఇంజినీర్. తల్లి మయే మస్క్ మోడల్. వ్యక్తిగత విభేధాలతో మస్క్‌కి తొమ్మిదేళ్లున్నప్పుడు విడిపోయారు. ఆ తర్వాత తండ్రి దగ్గరే పెరిగాడు మస్క్(తాను జీవితంలో చేసిన అతిపెద్ద పొరపాటు తండ్రి దగ్గర ఉండడమే అని ఎందుకనో తరచూ చెప్తుంటాడు మస్క్). పన్నెండేళ్లకే వీడియో గేమ్‌ను తయారు చేసిన మస్క్.. దక్షిణాఫ్రికాలో ఉంటే సైన్యంలో చేరాల్సి వస్తుందన్న భయంతో కెనడాలోని తల్లి దగ్గరకు వెళ్లాడు. ఆ తర్వాత ఒంటారియో క్వీన్స్ యూనివర్సిటీ, పెన్సిల్వేనియా యూనివర్సిటీల నుంచి నుంచి బ్యాచ్‌లర్ ఆఫ్ సైన్స్, ఆర్ట్స్ కోర్సులు పూర్తి చేసుకుని.. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ కోసం ప్రయత్నించాడు. కానీ, రెండో రోజుకే దానిని వదిలేశాడు. నెట్‌స్కేప్‌లో ఉద్యోగాన్ని వదులుకుని సోదరుడితో కలిసి జిప్2 అనే వెబ్ సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించాడు. అది అతన్ని మిలియనీర్‌ను చేసింది. ఆపై బ్యాంకింగ్ సర్వీస్ సంస్థను పేపాల్‌కు అమ్మేసి.. ఏకంగా దానికి సీఈవో అయ్యాడు. ఆకాశంలో ఆలోచనలు మస్క్ ఆలోచనలన్నీ కొత్తగానే ఉంటాయి. అందుకే తిక్క మేధావి అని ఆప్యాయంగా పిలుచుకుంటారు అతని అభిమానులు. బ్యాంకింగ్ సర్వీస్, స్పేస్ ట్రావెల్ కంపెనీ, ఎలక్రి్టకల్ వెహికిల్స్, అండర్‌గ్రౌండ్ టన్నెల్స్, జంతువుల తలలో చిప్‌లతో కంట్రోల్ చేయడం.. ఇలాంటి పనులు అతని క్రేజ్‌ను మరింత పెంచాయి. మార్స్‌పై మొక్కలు పెంచాలన్న ఆలోచన నుంచి.. మస్క్ బుర్రలో స్పేస్ ఎక్స్ ఆలోచనకు బీజం పడింది. స్పేస్ టెక్నాలజీ కోసం అమెరికా సాయం కాకుండా.. రష్యా సాయం తీసుకోవాలని ప్రయత్నించి ఘోరంగా అవమాన పడ్డాడు. కలల సామ్రాజ్యం స్పేస్ ఎక్స్ సంస్థ అందుకు ప్రతీకారంగానే స్పేస్ ఎక్స్‌ను స్థాపించి.. 2008లో ఫాల్కన్ లాంఛ్ ద్వారా స్పేస్ఎక్స్ తొలి సక్సెస్ చవిచూశాడు. రాబోయే రోజుల్లో ఎలక్రి్టక్ వెహికిల్స్‌కే భవిష్యత్తు ఉంటుందని నమ్మి.. 2004లో టెస్లాను లీడ్ చేయడం ప్రారంభించాడు. అండర్ గ్రౌండ్ టన్నెల్స్ ద్వారా రవాణా, అత్యంత వేగంగా ప్రయాణం, డ్రైవర్‌లెస్ కార్లు, గాల్లో ఎగిరే కార్లు, ఇక జంతువుల బ్రెయిన్లలో చిప్‌లు జొప్పించి.. ప్రయోగాలు. ఇలా మస్క్ మైండ్‌లో ఉండే ఆలోచనలు ఒక్కొక్కటి కార్యరూపం దాలుస్తూ వస్తున్నాయి. టెస్లా సీఈవో హోదాలో.. విమర్శలు.. వివాదాలు బహిరంగంగానే గంజాయి పీల్చే ఎలన్ మస్క్‌కు విమర్శలు, వివాదాలు కొత్తేంకాదు. ఎన్నో కేసులు ఎదుర్కొన్నాడు. పరువు నష్టం దావాల కింద మూల్యం చెల్లించుకున్నాడు. ఒకానొక టైంలో సొంత కంపెనీలపై సెటైరిక్ ట్వీట్లు వేసి.. ఊహించలేని నష్టాన్ని తెస్తుంటాడు. అయినప్పటికీ కంపెనీని సమర్థవంతంగా నడిపిస్తుండడం, జనాల్లో అతనికి ఉన్న క్రేజ్, మేజర్ వాటా తదితర కారణాల వల్ల అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. పెళ్లిళ్లు.. డేటింగ్లు మస్క్ వ్యక్తిగత జీవితం కూడా ఆగం ఆగమే. గతంలో పలువురితో డేటింగ్ చేసిన మస్క్.. కెనడియన్ రచయిత జస్టిన్ విల్సన్‌ను 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు. ఎనిమిదేళ్లకు ఆమెకు విడాకులిచ్చి.. బ్రిటిష్ నటి టలులాహ్ రిలేను వివాహం చేసుకున్నాడు. 2012లో రిలేకు విడాకులిచ్చి. ఆ మరుసటి ఏడాది మళ్లీ పెళ్లి చేసుకోవడం విశేషం. చివరికి 2016 రిలేకు విడాకులిచ్చేసి సెలబ్రిటీలతో డేటింగ్ చేశాడు. 2018 నుంచి కెనెడియన్ సింగర్ గ్రిమ్స్‌తో డేటింగ్లో ఉన్నాడు మస్క్. పుట్టిన కొడుక్కి కూడా అర్థంకానీ రితీలో X AE A-XII అనే విచిత్రమైన పేరు పెట్టుకున్నాడు. సింగర్ గ్రిమ్స్‌తో ఓ ఈవెంట్లో.. ఇక మస్క్ డేటింగ్ లిస్ట్చాలా పెద్దదే. అందులో హాలీవుడ్ నటి అంబర్ హెర్డ్ కూడా ఉంది. మస్క్ వెండి, బుల్లితెరలపైనా సందడి చేశాడు. ఐరన్ మ్యాన్ 2, వై హిమ్, మెన్ ఇన్ బ్లాక్:ఇంటర్నేషనల్‌తో పాటు ది సింప్సన్, ది బిగ్‌బ్యాంగ్ థియరీ, సౌత్‌పార్క్, రిక్ అండ్ మోర్టీ, శాటర్డే నైట్ లైవ్ లాంటి టీవీ కార్యక్రమాలతోనూ రేసింగ్ ఎక్స్టింగ్షన్, వెన్నెర్ హెర్గోజ్ లాంటి డాక్యుమెంటరీలతోనూ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఎలన్ మస్క్ ఆస్తుల విలువ సుమారు 165 బిలియన్ల డాలర్లుగా అంచనా. ఐరన్‌మ్యాన్ 2 సినిమాలో ఓ సీన్లో.. కన్నతల్లితో మయేతో ఎలన్ ఎలన్ మస్క్.. ఇంజినీర్ మేధావా? లేక సైంటిస్టా లేదంటే కాల జ్ఞానినా? ఇలాంటి డౌట్లు చాలామందికే ఉన్నాయి. కానీ, ఇప్పటివరకైతే కృత్రిమ మేధస్సునే నమ్ముకున్న మొండి మేధావి అని మాత్రం చెప్పొచ్చు. చదవండి: మస్క్ చిలిపితనం.. పోర్న్ కాయిన్లకు మహర్దశ -
అచ్చ తెలుగు అమ్మాయి నటి అంజలి పుట్టినరోజు స్పెషల్ ఫోటోలు
-
‘రీతు వర్మ’ బర్త్ డే స్పెషల్ ఫోటోలు మీకోసం...
-
లావణ్య త్రిపాఠి బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
‘నాడు పవార్‌కు దక్కని ప్రధాని పదవి’
ముంబై: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ (79)కు శనివారం పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్ నేత రాహుల్ ఆయనకు పుట్టిన రోజులు శుభాకాంక్షలు తెలిపారు. 1990వ దశకంలో పవార్‌కు ప్రధానమంత్రి పదవి రెండుసార్లు అందినట్టే అంది దక్కకుండా పోయిందని ఎన్సీపీ నేత ప్రపుల్ పటేల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కొన్ని పత్రికల్లో ప్రత్యేక వ్యాసాలు రాశారు. కాంగ్రెస్‌లోని దర్బార్ రాజకీయాల వల్లే పవార్ ప్రధాని కాలేకపోయారని వెల్లడించారు. పవార్ తమ పార్టీకి విధేయుడు కాదని పేరు వెల్లడించడానికి ఇష్టపడని కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. దీనిపై శివసేన సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ స్పందించారు. ప్రతిభ లేని కొందరు వ్యక్తులకు పవార్ అంటే భయమని, ఆందుకే ప్రధాని పదవి దక్కకుండా చేశారని విమర్శించారు. -
‘ఉప్పెన’ హీరోయిన్ కృతి శెట్టి బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
రమ్యకృష్ణ బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
హ్యాపీ బర్త్ డే.. యూ ర్యాట్
మిన్స్క్: ‘యూ ర్యాట్’ అని తిడితే ముద్దుగానో, అల్లారు ముద్దుగానో తిట్టినట్లుగా ఉండొచ్చు. విద్యావంతుల తిట్టు ఇది. పైకి సాఫ్ట్ గా ఉన్నా, అర్ధం విపరీతమైనది. అందుకే కుక్క అన్నా, నక్క అన్నా రాని కోపం.. బయటి దేశాల వారికి ఎలుక అంటే వస్తుంది. ‘ర్యాట్’ అంటే.. దూరంగా పెట్టవలసిన (హేట్‌ఫుల్) మనిషి అని. ఇంతవరకు నయం. అబద్ధాలకోరు అని, ద్రోహి అని, దొంగ అని, డబుల్–క్రాసర్ (మోసగాడు) అని.. ఇన్ని మీనింగులున్నాయి పాపం ఎలుక పేరు మీద! అశుభ్రంగా ఉండి, వ్యాధుల్ని వ్యాపింపజేస్తుందని కావచ్చు. ఏమైనా.. ‘నీదసలు మానవ జన్మేనా’ అని తిట్టినప్పుడు కూడా రాని కోపం, ‘నువ్వో ఎలుక’ అంటే వచ్చేస్తుంది పాశ్చాత్యులకు! మొన్న ఆదివారం బేలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ ల్యుకాషేంకో బర్త్ డే. 66 లో కి వచ్చారు. అయితే ఆయన తన పుట్టినరోజును జరుపుకునే విధంగా ఏమీ అక్కడి పరిస్థితులు లేవు. (కూతురి కష్టాన్ని నవ్వులపాలు చేసిన తల్లి) కొన్నాళ్లుగా ఆ దేశ పౌరులు కరోనాను కూడా లెక్క చేయకుండా వేలాదిగా వీధుల్లోకి వచ్చి అధ్యక్షుడికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారు. నిన్న ఆ నిరసన వ్యకిగత దూషణ వరకు వెళ్లింది. ‘హ్యాపీ బర్త్ డే.. యూ ర్యాట్’ అని నినాద స్వరంతో అలెగ్జాండర్కి శుభాకాంక్షలు తెలిపారు. బేలారస్ మన బెనారస్లా అనిపిస్తుంది. ఐరోపాలోనే ఒక దేశం అది. ఆగస్టు 9న అక్కడ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. మళ్లీ అలెగ్జాండరే గెలిచారు. రిగ్గింగ్ చేసి గెలిచాడని ఆందోళనకారుల ఆరోపణ. ఆయన్ని ర్యాట్ అన్నవాళ్లలో 125 మందిని పోలీసులు వెంటబెట్టుకెళ్లారు. ఇరవై ఆరేళ్లుగా అలెగ్జాండరే ఆ దేశానికి అధ్యక్షుడు. -
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘అతిలోక సుందరి’ శ్రీదేవి ఫోటోలు
-
Trisha Birthday : త్రిష కృష్ణన్ బర్త్‌డే స్పెషల్ ఫొటోలు
-
స్టార్ హీరోయిన్ కాజోల్ బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
హీరో సోనూ సూద్ బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
కైకాల సత్యనారాయణ బర్త్‌డే స్పెషల్ రేర్ ఫోటోలు
-
ఉపాసన పుట్టిన రోజు స్పెషల్
-
ఉదయ్ కిరణ్: అభిమానుల ‘మనసంతా నువ్వే’
-
లేడీ సూపర్‌స్టార్ బర్త్‌డే స్పెషల్: రేర్ పిక్స్
-
S.V. కృష్ణారెడ్డి బర్త్ డే స్పెషల్..
-
శ్రుతి హాసన్ బర్త్ డే డ్యాన్స్ చుశారా..!
నటి శ్రుతి హాసన్ తన పుట్టిన రోజును లండన్‌లో మంగళవారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన స్నేహితులతో కలిసి లండన్ రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా జనవరి 28న శ్రుతి బర్త్ డే. తన స్నేహితులతో కలిసి లండన్‌లో బర్త్ డే సెలబ్రేషన్స్‌ను జరుపుకున్నారు. ఈ క్రమంలో రోడ్లపై డాన్స్ చేస్తున్న ఫొటోలను, వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘నా హ్యాపీ బర్త్ డే డాన్స్.. ఈ రోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను. అందుకే ఈ డాన్స్‌లు’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. అదేవిధంగా తన పుట్టిన రోజున శుభాకాంక్షలు తెలిపిన కుటుంబ సభ్యులకు, సన్నీహితులకు, తన ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇక పుట్టినరోజు సందర్భంగా శ్రుతి వెబ్‌సైట్‌ను కూడా మొదలు పెడుతున్నట్లు వెల్లడించారు. View this post on Instagram My happy birthday dance 💃🏻 today I feel loved and thankful and happy and blessed! I’m such a lucky girl ❤️ so to celebrate here’s a dweeby dance 😁 Thankyou to everyone for your wishes and love and especially to my incredible online family who even started my website for me today !! My dearest friends in London with whom I can have a quiet and lovely birthday and my family and friends back home waiting for me. This year has been life changing in many ways and I’m so thankful for the phase of life I’m in !! I’m doing everything I ever wanted to in the way that I wanted to do it! I’m grateful for my work and the different type of work I do and I’m thankful for my support systems and the love they give me. I know now that though it takes time and sometimes the effort seems too much .. the life you want and the life you see in your mind is always yours to take and yours to make ! So this happy dance is from the inside ... not so graceful but fully real and 100 percent crazy 😜 A post shared by @ shrutzhaasan on Jan 28, 2020 at 8:04am PST కాగా హాలీవుడ్ యానిమేటెడ్ చిత్రం ఫ్రోజెన్ 2 తమిళ రీమెక్కు శ్రుతి హాసన్ డబ్బింగ్ చెప్పడమే కాకుండా ఈ సినిమాలో మూడు పాటలు కూడా పాడారు. ఇప్పటికే ఆమె నటిగా, గాయనిగా, నిర్మాతగా, సంగీత దర్శకురాలిగా, వ్యాఖ్యాతగా తనలోని విభిన్న కోణాలతో అభిమానులను మెప్పించారు. కాగా ప్రస్తుతం శ్రుతి తమిళంలో ‘లాబామ్’, తెలుగులో రాబోయే ఓ కొత్త సినిమాలో నటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం తన మ్యుజిక్ కెరీర్‌పై దృష్టి పెట్టిన ఆమె గతంతో లండన్‌లో జరిగిన ఓ మ్యూజిక్ కన్సర్ట్‌లో పాటలు పాడారు. -
లవర్ కోసం తుంటరి పని..
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని ప్రసిద్ధ జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ వెబ్సైట్లో‘హ్యాపి బర్త్ డే పూజ’ అనే పేరు ప్రత్యక్షమైంది. ఎవరో ఆకతాయి తన ప్రేమ శుభాకాంక్షలు తెలపడానికి వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి ఈ తుంటరి పనికి పాల్పడ్డాడు. కాగా, ఈ ఈ ఘటనపై ట్విట్టర్లో జోకులు పేలాయి. పూజ అనే అమ్మాయి చాలా అదృష్టవంతురాలని కొందరు స్పందిస్తే, మరికొందరు తన ప్రేమను చాటుకోవటానికి ఇదే దొరికిందా అంటూ ఆ ప్రేమదాసును కడిగి పారేశారు. జామియా యూనివర్శిటీ అధికారులు మాత్రం దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. వెబ్‌సైట్‌ను తిరిగి తమ ఆధీనంలోకి తీసుకున్న విశ్వవిద్యాలయ అధికారుల బృందం తిరిగి కార్యకలాపాలను ప్రారంభించింది. ఇది చాలా పెద్ద సమస్యని, ప్రభుత్వ ఆధీనంలోని ఒక సంస్థ వెబ్‌సైట్‌ను ఆకతాయి పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకోవటం, సామాజిక మాధ్యమ రంగంలో ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. -
నిజామాబాద్ అందగాడికి హ్యాపీ బర్త్ డే..
మార్చి 30 టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ బర్త్ డే. తొలిసినిమా జయంతో హిట్కొట్టడమే కాదు, ఉత్తమ నూతన తెలుగు నటుడుగా దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ నుఅందుకున్న నితిన్ దిల్, సై, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే లాంటి యూత్‌పుల్ , ప్రేమకథా చిత్రాలతో యూత్ స్టార్ ఇమేజ్ కొట్టేశాడు. అనంతరం అ.. ఆ అనే ఫామిలీ ఎంటర్ టైనర్ హిట్‌కొట్టి ఫ్యామిలీ హీరోగా పేరుకొట్టేశాడు.. వరుస సినిమాలతో హ్యాపీ మూడ్‌లో ఉన్న నితిన్‌కు హ్యపీ బర్తడే విషెస్ సందేశాలు ట్విట్టర్ లో మొదలయ్యాయి. ఈ ఏడాది వరసగా మూడు సినిమాలకు సైన్ చేసిన నితిన్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. హను రాఘవపూడితో చేస్తున్న మూవీ ఇప్పటికే షూటింగ్ లో ఉంది. ఈ చిత్రానికి లై అనే టైటిల్ ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ నటుడు వెన్నెల కిషోర్ ఈ ఫోటోను పోస్ట్ చేసిన నితిన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశాడు. మరి మనం కూడా ఈ నిజామాబాద్ అందగాడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేద్దాం. కెరీర్ లో మరిన్నివిజయాలను సొంతం చేసుకోవాలని కోరుకుంటూ.. ఎ వెరీ హ్యాపీ బర్తడే టూ యూ.. రాహుల్.. సారీ..నితిన్.. మరోవైపు 14 రీల్స్ ఎంటర్టైన్ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ఫస్ట్ లుక్ ను ఈ రోజు రిలీజ్ చేయనున్నట్టు ఉగాది సందర్భంగా నితిన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా గత ఏడాది నితిన్ పుట్టిన రోజు సందర్భంగా టాలీవుడ్ క్వీన్ సమంత చేసిన అల్లరి గుర్తుందా. త్వరలోనే పెళ్లి చేసుకోబోయే నితిన్‌కి హ్యాపీ బర్త్ డే అంటూ ట్వీట్ చేయడం హాట్ టాపిక్ అయింది. Touchdown U.S.A for a 70day long schedule here for @hanurpudi n @14reelsofficial film..1st look on 30th march.. HAPPY UGADI friends.. pic.twitter.com/ZQdaGKLYln — nithiin (@actor_nithiin) March 29, 2017 Nithiin gariki janma dina shubhakankshalu -
వాట్సప్ ఎలా పుట్టిందో తెలుసా..!
వాషింగ్టన్: పండుగ ఏదైనా.. సందర్భం ఏదైనా.. శుభాకాంక్షలు తెలపడానికి మనం తరచుగా ఉపయోగించే మాధ్యమం సోషల్ మీడియా. గతంలో ఫేస్ బుక్ సంచలనాలు సృష్టించగా... ప్రస్తుతం దాని స్థానాన్ని వాట్సప్ ఆక్రమిస్తోంది. అసలు ఈ వాట్సప్ యాప్ ఎలా వచ్చింది.. దాని రూపకర్తలు ఎవరు, దానిని ఎప్పుడు తయారు చేశారు, దాని పుట్టిన రోజు ఎప్పుడో మీకు తెలుసా..? వాట్సప్ నేటితో సరిగ్గా ఎనిమిదేళ్లు పూర్తిచేసుకుంది. యాహూకు చెందిన ఇద్దరు ఉద్యోగులు బ్రియాన్ యాక్షన్, జాన్కౌన్ లు ఈ యాప్ రూపకల్పనకు పునాది వేశారు. యాహూ కంపెనీ నుంచి బయటకు వచ్చిన బ్రియాన్, జాన్ లు ఫేస్బుక్లో ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. దాంతో వీళ్లు మరో స్నేహితుడు అలెక్స్ ఫిష్మాన్ తో కలిసి 2009 ఫిబ్రవరి 24న వాట్సప్ సంస్థను స్థాపించారు. మొదట్లో కొన్నాళ్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా మరికొందరు మిత్రుల రెండున్నర లక్షల సీడింగ్ ఫండ్ పెట్టుబడులతో బీటా యాప్‌ను వృద్ధి చేశారు. ఎన్నో పరీక్షలు జరిపిన అనంతరం 2009 నవంబర్‌లో వాట్సప్, ఆపిల్ స్టోర్‌లో విడుదలైంది. అదే ఏడాది డిసెంబర్లో ఫొటోలు పంపుకొనే అవకాశం కల్పించింది. బ్రియాన్ యాక్షన్, జాన్కౌన్లకు ఉద్యోగాన్ని నిరాకరించిన అదే ఫేస్బుక్ కంపెనీ 2014 ఫిబ్రవరి 19న 19బిలియన్ అమెరికన్ డాలర్లకు వాట్సప్‌ను కొనుగోలు చేసింది. ప్రస్తుతం ప్రపంచంలో ఫొటోలు, వీడియోలు, సందేశాలు పంపించడానికి అత్యధికంగా ఉపయోగించే యాప్స్ లో వాట్సప్ ఒకటి. -
ఉపాసన కలిసిన హ్యాపియ్యస్ట్ అండ్ స్వీటెస్ట్ సోల్?
హైదరాబాద్: పుట్టినరోజు జరుపుకుంటున్న టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నాకు ప్రముఖ హీరోభార్య అందంగా శుభాకాంక్షలు తెలిపారు. టాలీవుడ్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని ట్విట్టర్ ద్వారా ‘అవంతిక’కు పుట్టిన రోజు సందర్భంగా అభినందనలు తెలియజేశారు. తాను కలుసుకున్న మంచి మనసున్న మనుషుల్లో ఆమె కూడా ఒకరని పేర్కొన్నారు. 'హేపీయ్యస్ట్ అండ్ స్వీటెస్ట్ సోల్స్ ' అంటూ ట్వీట్ చేశారు. దీంతోపాటూ ఒక మిక్కీ మౌస్ తో తమన్నా ఫోటోనుకూడా పోస్ట్ చేసారు ఉపాసన. కాగా మహా రాష్ట్ర లో సింది కుటుంబం లో జన్మించిన తమన్నా సినీ కరియర్ లో ఎన్నో మైలురాళ్లు ఉన్నప్పటికీ బాహుబలి సినిమా విజయంతో గ్లామర్ తారగా మరో మెట్టు అధిగమించింది. అంది వచ్చిన అవకాశాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్... Happy birthday to one of the happiest & sweetest souls I've ever met. -
ఆ ఆరు గంటల్లో ఏం జరిగింది?
సాయంత్రం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో ఓ బర్త్‌డే పార్టీ జరుగుతుంది. ఆ పార్టీలో చోటు చేసుకునే సంఘటనలేంటి? ఆ తర్వాత ఏం జరిగింది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’. చెన్నమనేని శ్రీధర్, జ్యోతీసేథ్, సంజన, శ్రవణ్ ప్రధాన పాత్రల్లో పల్లెల వీరారెడ్డి (చేగువేరా) దర్శకత్వంలో శ్రీనందన్ మూవీస్ పతాకంపై మహేశ్ కల్లే నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘పుట్టినరోజు వేడుక నేపథ్యంలో ఒకే ఇంట్లో సాగే కథ ఇది. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందింది. గ్రాఫిక్స్ హైలెట్‌గా నిలుస్తాయి’’ అని చెప్పారు. ‘‘కథ, కథనాలు ఆసక్తిగా ఉంటాయి. వైజాగ్, హైదరాబాద్‌లో మేజర్ పార్ట్ షూటింగ్ జరిపాం. కీలక సన్నివేశాలు విదేశాల్లో చిత్రీకరించాం. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. త్వరలో పాటలు విడుదల చేస్తాం. జులైలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని నిర్మాత మహేశ్ తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: వాసిరెడ్డి సత్యానంద్, సంగీతం: సంతోష్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కోటేశ్వరరావు. -
క్రికెట్ దేవుడికి శుభాకాంక్షల వెల్లువ
ముంబయి: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌కు ట్విట్టర్లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. క్రికెట్ సహచరులు, అభిమానులు, ప్రపంచ సెలబ్రిటీలు, బాలీవుడ్ నటులు, వ్యాపార దిగ్గజాలు తదితరుల విషెస్‌తో ట్విట్టర్ పులకించి పోయింది. ఆదివారం మాస్టర్ బ్లాస్టర్‌కు పలువురు 43వ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. క్రికెట్‌కు సచిన్ టెండూల్కర్ గుడ్‌బై చెప్పి దాదాపు మూడేళ్లు గడిచినా ఆయనకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని మరోసారి తెలిసింది. ఆయన రిటైర్మంట్ ప్రకటించిన రోజు ఇచ్చిన సందేశాత్మక ప్రసంగంలో క్రికెట్ అభిమానులకే కాకుండా ప్రతిఒక్కరినీ కట్టిపడేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ 'పుట్టిన రోజు శుభాకాంక్షలు సచిన్.. నీవు మా అందరిని గర్వపడేలా చేశావు' అంటూ ట్వీట్ చేశాడు. ఇక 'క్రికెట్ దేవుడు సచిన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. దేశానికి అసలైన హీరో.. రియల్ జెమ్ నువ్వే' అంటూ యువరాజ్ ట్వీట్ చేశాడు. వీరితోపాటు సురేశ్ రైనా, శిఖర్ ధవన్, అనిల్ కుంబ్లే, అనురాగ్ ఠాకూర్, మహ్మద్ కైఫ్, ధర్మేంద్ర ప్రదాన్, ప్రతుల్ పటేల్ తదితరులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. T 2235 - Happy birthday Sachin .. you make us so proud .. pic.twitter.com/7F97tlSXyf — Amitabh Bachchan (@SrBachchan) 23 April 2016 Many happy returns of the day to god of cricket a humble man and a true gem ! The hero of our nation @sachin_rt God bless you master ! -
హాయ్... హ్యాపీ బర్త్ డే..!
ఆరిలోవ : హ్యాపీ బర్త్ డే ఎవరికనుకుంటున్నారా? ఇంకెవరికి ఈ బుజ్జి తెల్లపులులకే...! ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి పుట్టినరోజు జరుపుకోవడం సాధారణమైన విషయం. కొందరైతే తమ ఇంట్లో పెంచుకొనే కుక్క పిల్లలకు సైతం పుట్టిన రోజు పండగ జరుపుతారు. మరి వన్యప్రాణులకు పుట్టినరోజు వేడుకలు ఎవరు జరుపుతారు? తెలుసుకోవాలంటే...! బుధవారం జూ పార్కుకు వెళ్లండి. అక్కడ తెల్ల పులులకు జూ అధికారులు పుట్టినరోజు వేడుక చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే... జూలో శిరీష్(తండ్రి), కుమారి(తల్లి) అనే పేర్లుగల తెల్ల పులులు 12 ఏళ్లగా ఉన్నాయి. కుమారి 2010 మార్చిలో ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. వాటిలో పుట్టిన వెంటనే రెండు మరణించినా మిగిలిన మూడు ఆరోగ్యంగా ఉన్నాయి. వాటిలో రెండింటిని రెండేళ్ల క్రితం జీబ్రాలను ఇక్కడ తీసుకొచ్చినందుకు బదులుగా మలేసియా జూకి తరలించారు. మరోసారి కుమారి (తెల్లపులి) 2012 మార్చి 16న నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. వాటిలో మూడు ఆడవి, ఒకటి మగది ఉన్నాయి. జూ అధికారులు వాటికి విజయ్, సోనా, బేతని, సావిత్రి అని పేర్లు పెట్టారు. వాటిలో సావిత్రిని ఖఢ్గమృగం తీసుకొచ్చిందుకు బదులుగా కాన్పూర్ తరలించారు. మిగిలిన మూడింటికి ఐదేళ్లు పూర్తి కావడంతో జూ అధికారులు జూలో వాటి ఎన్‌క్లోజర్ ఆవరణలో బుధవారం పుట్టినరోజు వేడుక జరపనున్నారు. వినడానికి వింతగా ఉన్నా జూ అధికారులు మాత్రం మొదటిసారిగా జంతువులకు పుట్టినరోజు పండగ చేయడం విశేషం. అయితే మనం జన్మదినోత్సవాలు జరుపుకొని విందూ వినోదాలు పెట్టినట్లు అక్కడ భోజనాలూ..అవీ ఉండవండోయ్.. సరదాగా చూసి రావడానికైతే వెళ్లండి.. గిఫ్టులూ.. అవీ.. తీసుకెళ్లక్కరలేదండోయ్.. -
ప్రియతమ నేతకు ప్రేమతో...
తమ ప్రియతమ నేత, సీఎం కేసీఆర్‌కు బుధవారం మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రికి, ఆయన సతీమణికి పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే సీఎం కూడా మేయర్ దంపతులకు పట్టువస్త్రాలు బహూకరించారు. -సాక్షి, సిటీబ్యూరో -
బర్త్ డే విషెస్...
లోటస్‌పాండ్‌లో సోమవారం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న సాక్షి ఫైనాన్స అండ్ అడ్మిన్ డెరైక్టర్ వైఈపీ రెడ్డి, ఏడీవీటీ అండ్ మార్కెటింగ్ డెరైక్టర్ కేఆర్పీ రెడ్డి, ఆపరేషన్స విభాగం డెరైక్టర్ పీవీకే ప్రసాద్, కార్పొరేట్ కమ్యూనికేషన్స డెరైక్టర్ రాణిరెడ్డి, ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తి -
అందాల రాశి.. కొన్ని నిజాలు
మెరిసే అందమైన కళ్లు ఆమె సొంతం. ఆమె అలా చిరునవ్వు నవ్విందంటే వెయ్యి వాల్టుల వెలుగు. దశాబ్దాల తరబడి వేలాదిమంది రసజ్ఞుల గుండెల్లో గూడు కట్టుకున్న కలల రాణి. బ్యూటి విత్ టాలెంట్‌కు ఆమె నిలువెత్తు నిదర్శనం...ఆమే హాలీవుడ్ నటీమణి జూలియా రాబర్ట్స్. అక్టోబర్ 28 ఆమె పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఆమెకు అభినందన నీరాజనాలు పలుకుతున్నారు. ఈ సందర్భంగా ఆస్కార అవార్డు విజేత, అందాలరాశి జూలీకి సంబంధించిన కొన్ని ముచ్చట్లు.. 1967 అక్టోబర్ 28న లౌ బ్రాడ్మస్,వాల్టర్ గ్రాడీ రాబర్ట్స్ దంపతులకు జూలియా రాబర్ట్స్ జన్మించింది. తల్లిదండ్రులు ఇద్దరూ నటులే బహుశా వారి వారసత్వమే జూలీకి వరంగా లభించినట్టుంది. జూలియాకు ఆరు భాషల్లో ప్రావీణ్యం వుంది. ఇంగ్లీషు, జర్మనీ, స్వీడిష్, ఐరిష్, స్కాటిష్ , వెల్స్ భాషలు ఆమెకు తెలుసు. అన్నట్టు జూలియాకి క్లారినెట్ వాయించడంలో ప్రవేశం వుంది. స్కూలుస్థాయి సంగీత ట్రూపులో ఆమె పనిచేసింది. దీంతోపాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజాన్ని అభ్యసించినా ఇప్పటికీ జర్నలిజం డిగ్రీని మాత్రం చేయలేకపోయింది. నటిగా హాలీవుడ్ లో స్థిరపడకముందు ఆమె స్థానిక టెలివిజన్ షోలో పనిచేసింది. 1986-88 లో ప్రసారమైన ఒక క్రైమ్ స్టోరీ సీరియల్లో తొలిసారిగా మేకప్ వేసుకుంది. అన్నట్టు కుట్లు అల్లికలంటే ఎక్కువ మక్కువ వున్న జూలియా పశువుల డాక్టర్ కావాలని కలలు కందట. 1987లో తన పందొమ్మిదేళ్ల వయసులో 35 ఏళ్ల లియామ్ నీసన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఓ ఏడాదికే ఇద్దరూ విడిపోయారు. ఆ తరువాత 2002 జూలైలో కెమెరామెన్ డానియల్ మోడెర్ను పెళ్లాడింది. బ్రూస్ లీ ఒక్కరే ఈ వివాహానికి అతిథి. ది మెక్సికన్ చిత్రీకరణ సమయంలో చూపులు కలిసి ఒక్కటైన వారిద్దరూ ఒక సంవత్సరం తర్వాత విడాకులు తీసుకున్నారు. తిరిగి జూలై 4, 2002న రాబర్ట్స్‌ను జూలియా వివాహం చేసుకుంది. 2004లో వారికి కవలలు కూతురు హాజెల్ ప్యాట్రిసియా మరియు కొడుకు ఫిన్నాయిస్ జన్మించారు. వారి మూడవ బిడ్డ, కొడుకు హెన్రీ డెనియల్ మోడెర్ లాస్ ఏంజిల్స్‌లో జూన్ 18, 2007న జన్మించాడు. బల్గేరియా తవ్వకాల్లో బయల్పడిన 9000 సంవత్సరానికి చెందిన ఒక స్కెలిటెన్ కు పురాతత్వ శాస్త్రవేత్తలు జూలియా రాబర్స్ట్ పేరుపెట్టారు. తాను హిందూ మతాన్ని ఆచరిస్తానని స్వయంగా జూలియా ఒక సందర్బంగా తెలిపింది. హాలీవుడ్లోఅత్యధిక పారితోషికం తీసుకున్న తొలి నటీమణి జూలియా. ఇరిన్ బ్రాకో విక్ సినిమాకు గాను ఆమె 20 మిలియన్ల యూఎస్ డాలర్ల పారితోషికాన్ని అందుకుంది. ఈ సినిమానే ఆమెకు అత్యంత ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును సాధించి పెట్టింది. వీటితో పాటు ఆమెకు లెక్కకుమించిన అవార్డులు, రివార్డులు.. ఆమె కెరియర్లో మైలురాళ్లుగా మిగిలాయి. రాబర్ట్స్, యూఎన్‌ఐసీఈఎఫ్, ఇతర స్వచ్ఛంద సంస్థలకు సమయంతో పాటు నిధులను వెచ్చిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. -
డీఎస్‌కు కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు
- కుటుంబ సమేతంగా డీఎస్ ఇంటికి వెళ్లిన సీఎం సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్)కు సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం 67వ పుట్టిన రోజు జరుపుకొన్న డీఎస్ ఇంటికి సీఎం కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలసి వె ళ్లారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ స్వయంగా డీఎస్‌తో పుట్టిన రోజు కేక్ కట్ చేయించారు. సీఎం వెంట రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ఉన్నారు. సీఎం కుటుంబ సభ్యులంతా డీఎస్ ఇచ్చిన విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరునేతలు కొద్ది సేపు వివిధ అంశాలపై చర్చించినట్లు డీఎస్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. -
సెప్టెంబర్ 17 హ్యాపీ బర్త్ డే
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు రవిచంద్రన్ అశ్విన్ (క్రికెటర్), ప్రియా ఆనంద్ (నటి) ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 7. ఇది మోక్షకారకుడు, ఆధ్యాత్మిక వేత్త అయిన కేతుగ్రహానికి సంబంధించి నది కావడం వల్ల ఈ సంవత్సరం వీరు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. మంచి సలహాదారుగా పేరు గడిస్తారు. కుటుంబ పరంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అయితే ఆధ్యాత్మికతతో సంసార జీవితం నుంచి దూరంగా వెళ్లడం వల్ల కొన్ని చిక్కులు ఏర్పడవచ్చు. అందువల్ల వీలయినంత వరకు జీవిత భాగస్వామితో అన్యోన్యంగా గడపడం మంచిది. వీరు పుట్టిన తేదీ 17 శనికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల పనులు కొంచెం ఆలస్యంగా జరుగుతాయి. అయితే ఉద్యోగంలో, వ్యాపారంలో స్థిరత్వాన్ని పొందుతారు. మనోబలం పెరుగుతుంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మేనేజిమెంట్ రంగంలో రాణిస్తారు. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు ఉత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకొస్తుంది. ఐ.ఎ.ఎస్‌లు తదితర అధికారులకు ప్రమోషన్లు లభిస్తాయి. లక్కీ డేస్: 1,3,8,9; లక్కీ కలర్స్: ఎల్లో, గోల్డెన్, బ్లూ, బ్లాక్; లక్కీ డేస్: గురు, శుక్ర, శనివారాలు. సూచనలు: గణపతి ఆరాధన, శనికి తైలాభిషేకం, శివునికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం, అనాథలకు అన్నదానం చేయడం, వృద్ధులను ఆదరించడం. మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. -
హ్యాపీ బర్త్ డే- 31-05-15
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: భానుచందర్ (నటుడు), బ్రూక్ షీల్డ్స్(హాలీవుడ్ నటి) ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 8. ఈ సంవత్సరం వీరికి అత్యంత ప్రభావవంతమైన సంవత్సరంగా చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఎంతోకాలంగా పరిశ్రమలు స్థాపించాలను కుంటున్న వారి కల నెరవేరుతుంది. నష్టాల్లో ఉన్న సంస్థలు లాభాల బాట పడతాయి. అయితే రాహుప్రభావం వల్ల కొన్ని గుర్తు తెలియని అనారోగ్యాలు పీడించవచ్చు. ఎం.బి.ఎ, ఎంసిఎ చేయాలనుకుంటున్న వారి కోరిక తీరుతుంది. లీగల్ సర్వీసులలో ఉన్న వారికి మంచి పేరుతోబాటు ఆదాయం కూడా లభిస్తుంది. అయితే గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకోకూడదన్నట్లు... వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడం అవసరం. లేదంటే చాలా సమయం, డబ్బు వృథా అవుతాయి. లక్కీ నంబర్స్: 4,5,6,8; లక్కీ కలర్స్: వయొలెట్, పర్పుల్, గోల్డెన్; లక్కీ డేస్: బుధ, శుక్ర, శని, ఆదివారాలు సూచనలు: ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. అనాథలకు అన్నదానం, ఆవులకు, నల్లకుక్కలకు ఆహారం తినిపించాలి. శనికి తైలాభిషేకం, శివుడికి అభిషేకం జరిపించాలి. - డాక్టర్ మహమ్మద్ దావూద్, సంఖ్య, జ్యోతిష శాస్త్ర నిపుణులు -
హ్యాపీ బర్త్ డే- 30-05-15
ఈరోజు మీతో పాటు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు: పరేష్ రావల్ (నటుడు), కె.ఎస్.రవికుమార్ (దర్శకుడు) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 7. వీరు ఈ సంవత్సరమంతా ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. విదే శాలలో చదువుకోసం, ఉద్యోగాలకోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు ఇది మంచి సమయం. వేదపండితులకు, గురువులకు, న్యూమరాలజిస్టులకు, జ్యోతిష్యులకు మంచి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. దీర్ఘకాలికంగా బాధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి బయట పడతారు. భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి సంభాషణలలో సంయమనం పాటించడం మంచిది. మీ మాటకు విశేష ఆదరణ లభిస్తుంది. ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి తగ్గి, ఆధ్యాత్మిక తపై అనురక్తి పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ఆచితూచి వ్యవహరించడం అవసరం. లక్కీ నంబర్స్: 1, 2, 3,7 లక్కీ కలర్స్: ఎల్లో, వైట్, సిల్వర్, గ్రే లక్కీ డేస్: ఆది, సోమ, గురువారాలు సూచనలు: గురువులను, పండితులను గౌరవించాలి. వేదపాఠశాలలకు, మదరసాలకు ఆర్థిక సాయం అందించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, దక్షి ణామూర్తిని ఆరాధించాలి. - డాక్టర్ మహమ్మద్ దావూద్, సంఖ్య, జ్యోతిష శాస్త్ర నిపుణులు -
హ్యాపీ బర్త్ డే- 29-05-15
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: పంకజ్ కపూర్ (ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు), సుబ్రతాసేన్ (బెంగాలీ దర్శకుడు) ఈ రోజు పుట్టిన రోజుజరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 6. వీరికి ఈ సంవత్సరం కొద్దిపాటి ఒడుదొడుకులు ఉన్నప్పటికీ, అంతిమంగా మంచి ఫలితాలే ఉంటాయి కాబట్టి ఆందోళన పడనక్కరలేదు. అవివాహితులకు వివాహమవుతుంది. మనస్పర్ధలతో దూరంగా ఉన్న దంపతులు తిరిగి కలుస్తారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. చిన్ననాటి బంధువులు, స్నేహితులతో బంధం బలపడుతుంది. విలాస వస్తువులు కొంటారు. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ, ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించకపోతే అప్పులు తప్పవు. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. సినిమా, మీడియా రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. అవార్డులు, రివార్డులు లభిస్తాయి. వ్యాపారులు మంచి లాభాలు కళ్లజూస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. లక్కీ నంబర్లు: 2,6,7,9, లక్కీ కలర్స్: వైట్, బ్లూ, సిల్వర్, రెడ్, లక్కీ డేస్: సోమ, బుధ, శుక్రవారాలు సూచనలు: నవగ్రహాలకు అభిషేకం, భృగుపాశుపత హోమం చేయించుకోవడం, గోవులకు దాణా తినిపించడం, వితంతు సోదరీమణులను ఆదుకోవడం - డాక్టర్ మహమ్మద్ దావూద్, సంఖ్య, జ్యోతిష శాస్త్ర నిపుణులు